For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొంతు నొప్పికి తక్షణ ఉపశమనాలు!

By B N Sharma
|

Easiest Instant Remedies For Throat Infection
వేసవి అయినా, చలికాలమైనా సాధారణంగా అందరిని బాధించేది గొంతు నొప్పి సమస్య. ఈ వ్యాధి వైరల్ లేదా బాక్టీరియల్ ఏదైనప్పటికి గొంతు మంట, నొప్పులకు దోవతీస్తుంది. ఒక్కోక్కపుడు శరీరానికి చేసిన వేడి లేదా జలుబులు కూడా దీనికి దోహదం చేస్తాయి. గొంతు నొప్పిని అతి త్వరగా తగ్గించేసుకోవాలంటే -

1. గొంతుతో వేడి నీటిని పుక్కిలి పట్టండి. నీటిలో కొద్దిపాటి ఉప్పు వేస్తే మరింత సమర్ధవంతంగా పని చేస్తుంది. తర్వాత వేడి చాయ్ తాగేస్తే చాయ్ లో వున్న ఔషధ గుణాలు మంటను వెంటనే తగ్గించేస్తాయి.

2. ఒక స్పూను తాజా అల్లపు రసం, కొంచెం తేనె కలిపి ఖాళీ కడుపుతో ఉదయంపూట తీసుకోండి. ఈఔషదం చక్కగా పని చేసి గొంతునొప్పి మాయం అవుతుంది.

3. మిరియాలు పొడి కలిపిన వేడినీరు గొంతుతో పుక్కిలి పడితే గొంతు మంటను తగ్గిస్తుంది.

4. మిరియపు పడి నమలటం లేదా కొద్దిగా నీటితో కలిపి మింగటంచేస్తే కూడా తగ్గిపోతుంది.

5. ఒక్కొక్కపుడు చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే కూడా ఎంతో రిలీఫ్ కలుగుతుంది.

6. ఒక్కోక్కపుడు చెవులలో కాటన్ పీసు లు పెట్టుకుంటే కూడా గొంతు నొప్పి తగ్గే అవకాశం వుంది. ఈ చర్య శరీర ఉష్నోగ్రతను పెంచి చల్లటి గాలి సర్కులేషన్ ని శరీరంలో తగ్గిస్తుంది.

చెప్పబడిన పరిష్కారాలు సామాన్యంగా వున్నప్పటికి చాలామందికి మంచి ఫలితాలనిచ్చాయి. ఇవి ఆచరించటం తేలికే కనుక ప్రయత్నించి లబ్ది పొందండి.

English summary

Easiest Instant Remedies For Throat Infection | గొంతు నొప్పికి తక్షణ ఉపశమనాలు!

Sometimes taking bath with very hot water can also reduce the irritating feeling. If the infection is caused due to the cold condition of the body then hot water is the best solution.
Story first published:Monday, August 29, 2011, 15:29 [IST]
Desktop Bottom Promotion