ప్రయాణం హాయిగా సాగాలంటే..కమ్మటి చిరుతిండ్లు ఉండాల్సిందే...

Posted by:
Published: Tuesday, September 18, 2012, 8:51 [IST]
 

సాధారణంగా ప్రయాణంలో చాలా మంది వాంతులు చేసుకొంటుంటారు. అందువల్ల ప్రయాణం చేసే వారు ఇతర రోజుల్లో సాధారణంగా తీసుకొని ఆహారం కంటే ప్రయాణంలో చాలా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ప్రయాణం చేసే వారికి కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిని తీసుకోవడం వల్ల ప్రయాణంలో కలిగే వికారాన్ని తగ్గిస్తుంది. అలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి ప్రయాణంలో మీరు తీసుకోవలసిన ఆహారాలు కొన్నింటిని మీకు అందిస్తున్నాం. అవేంటో చూడండి...

ప్రయాణం హాయిగా సాగాలంటే..కమ్మటి చిరుతిండ్లు ఉండాల్సిందే...

1. బేక్ (కాల్చినటువంటి)చేసినటువంటి పదార్థాలు: మీరు ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవల్సి ఆహారాల్లో ఒక ఉత్తమమైన ఆహారంగా బిస్కెట్లను తీసుకోవచ్చు. వీటని ఆయిల్ సహాయం లేకుండానే తయారు చేయబడి ఉంటాయి. అందులోనూ వీటిని తినడం ద్వారా అతి త్వరగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్రీమ్ లేనటువంటి బిస్కెట్ ప్యాకెట్ ను తీసుకెళ్ళండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దాంతో ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది కలగదు. బేక్ చేసినటువంటి కేకులను కూడా ప్రయాణంలో తీసుకోవడం ఆరోగ్యరమైన ఆహారమే...

2. న్యూట్రిషియన్ బార్స్: ఆరోగ్యానికి ఉపయోగపడే పాలు, మరియు ఓట్స్ తో తయారు చేసినటువంటి హెల్తీ ఫుడ్స్ న్యూట్రిషియన్ బార్స్ ఇప్పుడు మార్కెట్లో విరివిగాలభ్యం అవుతున్నాయి. అంతే కాదు వాటిలో పుష్కలంగా న్యూట్రిషియన్స్ కలిగి ఉంటాయి. ప్రయాణంలో వాటిని తినడం వల్ల రోజంతా మీకు కావలసిన క్యాలరీలను అందిస్తుంది. కాబట్టి అటువంటి పౌష్టికవిలువలు కలిగినటువంటి న్యూట్రిషియన్ బార్స్ ను బ్యాగ్ లో వేసుకోవడం మరీ మంచిది. ప్రయాణంలో ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు వెంటనే ఓ న్యూట్రిషియన్ బార్ ను తినేయొచ్చు...

3. వెజిటేబుల్స్: మీరు చాలా తక్కువ సమయం ప్రయాణం చేయదలచుకొన్నప్పుడు వెజిటేబుల్స్ తో తయారు చేసినటువంటి సలాడ్స్ ను తీసుకెళ్ళడం ఆరోగ్యానికి చాలా మంచిది. టమోటో, కీరదోస వంటి వాటితో తయారు చేసి ఆరోగ్యానికి మరింత మంచిది. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలను అందించడమే కాదు కడుపు నిండుగా ఉండేట్లు అనిపిస్తుంది. అంతే కాదు ఇవి లోక్యాలరీస్ ను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రయాణ సమయంలో వీటిని తీసుకోవడం వల్ల బరువును తగ్గించే డైయట్ తీసుకొన్నట్లై అనిపిస్తుంది.

4. డ్రై ఫ్రూట్స్: ప్రయాణంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కంటే మరే ఇతర ఆరోగ్యకరమైన ఆహారం ఉండదేమో . డ్రైఫ్రూట్స్ ను తినడం వల్ల శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. వీటిని తీసుకెళ్ళడం పెద్ద కష్టమైన పని కాదు లేదా ప్లాస్టిక్ బ్యాగ్ లేదా చిన్న లంచ్ బాక్స్ లో ఈజీగా మోసుకెళ్ళొచ్చు. డ్రై ఫ్రూట్స్ లో బాదం, జీడిపప్పు, ఖర్జూరం వంటివి తీసుకోవడం మంచిది.

5. చాక్లెట్స్: ప్రయాణంలో తీసుకోవల్సిన చిరుతిండ్లలో మరో ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఫుడ్ చాక్లెట్స్. ఇవి తినడం వల్ల శక్తిని అందిచడమే కాదు యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల మనస్సును ఉత్తేజపరుస్తుంది. అలసట తెలియనీయదు. జీర్ణం కూడా అతి త్వరగా అవుతుంది.

కాబట్టి ప్రయాణ సమయంలో వీటన్నింటినీ తీసుకెళ్ళాల్సిన పనిలేదు. వీటిలో ఏ ఒక్క ఐటమ్ తీసుకెళ్ళినా సరిపోతుంది. అవి మీ ప్రయాణాన్ని ఆరోగ్యకరంగా, మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

English summary

Foods To Carry While Travelling | ప్రయాణంలో తీసుకెళ్ళాల్సిన ఆరోగ్యకరమైన చిరుతిండ్లు

Many people have the problem of nausea while travelling. This is why they have a problem to eat a normal course of meal as they have on the other days. There are certain healthy foods that you can carry while you are travelling. They will reduce your nausea to a great extent. Such foods are also very easy to digest. So, here are some healthy food ideas for your travel.
Write Comments

Subscribe Newsletter
Boldsky ఈ స్టోర్‍