పోపుధినుసు కాదు...ఆరోగ్య దివ్యఔషధ ధినుసు..!

Posted By:
Subscribe to Boldsky

ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటి లవంగాలు. లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు. ఒక్కసారి మీ వంటింట్లోని పోపులపెట్టెలోకి చూడండి...కనిపించాయా నల్లని పూమొగ్గలు... అవేనండీ లవంగాలు. అద్భుత ఔషధ సుగంధద్రవ్యాలు! విచ్చీవిచ్చని పూమొగ్గలే లవంగాలు. అందుకే మనం వీటిని ముద్దుగా లవంగమొగ్గలనీ పిలుస్తుంటాం. ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు.

తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారతాయి. భారత్‌, చైనాల్లో రెండు వేల సంవత్సరాలనుంచీ దీన్ని వంటల్లో వాడుతున్నారు. మాంసాహార వంటలే కాదు, మసాలా ఘాటు తగలాలంటే శాకాహార వంటల్లోనూ లవంగమొగ్గ పడాల్సిందే. లేకుంటే కిక్కే రాదంటారు మసాలాప్రియులు. ఇది శృంగారప్రేరితం కూడానట. పరిమళాలు, సాంబ్రాణి కడ్డీల్లోనూ వీటి వాడకం ఎక్కువే. వీటిలో మంచి సువాస మాద్రమే కాదు.. విలువైన పోషకాలు ఉన్నాయి. ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మంగనీష్, విటమిన్ లు... ఎ,సి , ఉంటాయి. మరి ఇన్ని పోషకాలు, ఔషదగుణాలున్న లవంగాలు ఆరోగ్య పరంగా ఏవిధంగా ఉపయోగపడుతాయో చూద్దాం....

Health Benefits Of Clove

1. లవంగాల నుంచి నూనె తీయనివి ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
2. జలుబు- దగ్గు: గొంతునొప్పి, జలుబులను తగ్గించేందుకు లవంగాల కషాయం దివ్యౌషధంగా పనిచేస్తుంది.
3. కఫం-పిత్తం: ఎవరైనా కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు మటుమాయమౌతాయి.
4. దప్పిక: ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగ పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది.
5. జీర్ణశక్తికి: జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తీసుకోండి. మీ శరీరంలోని జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
6. లవంగాలు సేవిస్తే ఆకలి బాగా వేస్తుంది. వీటి వలన జీర్ణక్రియకు అవసరమైన రసాలు ఉదరంలో ఊరుతాయంటున్నారు వైద్యులు.
7. పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగమొగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది. లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది.
8. లవంగాలు తెల్ల రక్త కణాలను పెంపొదిస్తుంది. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో ఉన్నాయి.
9. ఇది వ్యాధి నిరోధక శక్తిగా కూడా ఉపయోగపడుతుంది.
10. ఎలాంటి చర్మ వ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేసేస్తాయి. దీనిని చందనంతోపాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులు మటుమాయమంటున్నారు వైద్యులు.
11. లవంగాలను చైనీయులు వెక్కిళ్ల నివారణా ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేగాకుండా వీటితో తామర లాంటి చర్మ సంబంధ వ్యాధులు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు బాగా తగ్గుతాయని వారు చెబుతుంటారు. లవంగ నూనెను పొట్టుపై రాస్తే జీర్ణ సంబంధ సమస్యలు దూరమవు తాయని మనదేశీయులు భావిస్తారు. పంటినొప్పిని నివారించటంలోనూ లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి.
12. ఉబ్బసం, నులిపురుగులను తగ్గించేగుణం కూడా వీటికి మెండుగా ఉంది. వాంతి అవుతుందని అనిపిస్తుంటే.. నాలుగు చుక్కల లవంగ నూనెను ఓ గ్లాసు నీటిలో వేసి పుక్కిలిస్తే వాంతులు రావు. అలసటను, రుమాటిక్‌ నొప్పులను తగ్గించ టంలో కూడా లవంగాలు బాగా తోడ్పడతాయి.
13. పాలలో లవంగం పొడి, ఉప్పు కలిపి నుదుటమీద ప్యాక్ వేసినచో తలనొప్పి తగ్గుతుంది.
14. దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణము ఉన్నందున శరీరము లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
15. రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక మాయమవుతుందట.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Health Benefits Of Clove |కిక్కిచ్చే మొగ్గలు...ఆరోగ్య ప్రయోజనాలు...

Clove is popular spice that is used for adding aroma to a dish. The unopened pink flower of the clove tree is dried and then used as a spice. Apart from adding a flavour to the gravy, this super food has many health benefits. In Ayurverda, clove is considered as a medicine with healing properties. You can have a small clove to cure a sore throat or fight common cold. Well, there are many other health and healing benefits of this superfood. Find out some amazing health benefits of clove and its healing properties.
Story first published: Saturday, December 22, 2012, 13:59 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter