For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి(స్ట్రెస్ )తగ్గించుకోండి...!

|

మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురికాక తప్పదు. అందుకు ఈ చెడు అలవాట్ల వల్ల మీ ఒత్తిడి మరింత పెంచుకొంటున్నారు. స్ట్రెస్ (ఒత్తిడి)అనేది సైలెంట్ కిల్లర్. ఇది మీ జీవితంలోని మీకు తెలియకుండానే ప్రవేశిస్తుంది, అంతే కాదు ఇది మీలో అలజడి సృష్టిస్తుంది. అంతే కాదు మీకు ఏమాత్రం తెలియనియ్యకుండానే మీ ఆరోగ్యాన్ని కొంతైనా కాదు..కాదు..చాలానే నాశనం చేస్తుంది. చాలా తరచుగా ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. చాలా చిన్న సమస్యలకే అధికంగా ఒత్తిడికి గురివౌతుంటారు. దీన్ని మనం స్ట్రెస్ అని చెప్పవచ్చు. అయితే స్ట్రెస్ కు సంబంధించిన సంకేతాలు(సిమ్టమ్స్) చాలా సింపులాగా తీసేసేంత చిన్నది కాదు. ఎందుకంటే ఒత్తిడి మెల్లిగా ప్రారంభమైన నిశ్శబ్దంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది.

కాబట్టి, స్ట్రెకు కారణం అయ్యే సంకేతాలను మిస్ చేయకండి. వాటిని మీరు గమనించే ఉంటారు, మీరు ఒత్తిడికి సంబంధించిన స్పష్టమైన లక్షణాలు ఖచ్చితంగా మిస్ చేసుకోకూడదు. ఒక వేళ ప్రస్తుతానికి చిన్న సమస్యగా మీరు ఈ ఒత్తిడిని విస్మరిస్తే, దాని ప్రభావం ముందుముందు చాలా ప్రభావాలు ఎదుర్కోవల్సి వస్తుంది.

ఒత్తిడి అందరికీ ఒకేలా ఉండదు. అది ఒక్కొక్కరిలో ఒక్కో రూపంలో బయటపడొచ్చు. ఈ ఒత్తిడి లక్షణాలు మనిషికీ మనిషికీ మారిపోతుంటాయి. ఒత్తిడి(స్ట్రెస్) లక్షణాలు ఒక పనిచేసేవారిలో మాత్రే వస్తుందనుకుంటే పొరపాటే. మీరు ఇంట్లో ఉన్నాకూడా, స్ట్రెస్ లక్షణాలు కనిపిస్తాయి. అదీ ఒక్కరే ఉండటం వల్ల ఒత్తిడి లక్షణాలు ఇంకా వృద్ధి చెందుతాయి. కాబట్టి స్ట్రెస్ కు ఎవరూ మినహా కాదాని గుర్తించాలి. అయితే ఒత్తిడినితో బాధపడుతున్నారన్న విషయాన్ని ఎలా తెలుసుకొనేది? అంటే అందుకు క్రింది సంకేతాలు మీరు తీవ్రంగా జబ్బుపడక ముందే ఈ లక్షణాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఒత్తిడి తగ్గించుకోవడానికి కొన్ని ఆహారజాగ్రత్తలు పాటించడంతో పాటు చెడు అలవాట్లను దూరం చేసుకోండి . ముందుగా ఒత్తిడికి కారణం అయ్యే కొన్ని చెడు అలవాట్లను గుర్తించండి.

10 చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి తగ్గించుకోండి...!

నిద్రసమయం: ఒత్తిడి నిద్రలేవడంతోనే మొదలవుతుంది. మీరు నిద్రలేవడం ఆలస్యం అయితే . సాధారణంగా ఉదయం సమయంలో మీరు ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడి ఉంటారు . దాంతో లేట్ వర్క్, లేట్ గా ఆఫీస్ కు వెళ్ళడం, ఆసమయంలో బ్రేక్ ఫాస్ట్ చెయ్యకపోవడం.ఈ కారణాలన్నికూడా మీరు ఒత్తిడికి గురికావడానికి కారణం అవుతాయి. కాబట్టి త్వరగా నిద్రపోయి, త్వరగా నిద్రలేవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

10 చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి తగ్గించుకోండి...!

టీవీలకు అతుక్కుపోవడం: టీవి ముందర కూర్చొని గంట తరబడీ టీవీ చూడటం వల్ల మనస్సు విశ్రాంతి పొందుతాం అనుకుంటారు. అయితే ఆ సమయంలో తీసుకొనే అనవసరం స్నాక్స్ పొటాటో చిప్స్, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ మీకు తెలియకుండానే మీలో ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ఈ చెడు అలవాటుకు టాటా చెప్పి బయట చల్లని వాతావరణంలో రెండు రౌండ్స్ వేసి రండి.

10 చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి తగ్గించుకోండి...!

పొగత్రాగడం: చాలా మంది అనుకుంటా సిగరెట్ త్రాగడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చని. అయితే స్మోకింగ్ వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది దాంతో మీకు తెలియకుండానే ఒత్తిడికి గురి అవుతారు.

10 చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి తగ్గించుకోండి...!

విరామం లేకుండా పనిచేయడం: ఇలా చేయడం మీ పనితనానికి మరియు మీ సామర్థ్యానికి మెచ్చుకోలు. అయితే పనిచేయడానికి కూడా ఒక పద్దతి ఉండాలి. మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి పనిచేసే సమయాల్లో మద్యమద్యలో విరామం తీసుకోవడం చాలా అవసరం. లేదంటే స్ట్రెస్ కు గురికావల్సి వస్తుంది.

10 చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి తగ్గించుకోండి...!

ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. మనం సరైన సమయంలో ఆహారం తీసుకోకుండా సమయం దొరికినప్పుడు తీసుకోవడం లేదా టైమ్ టు టైమ్ తినకపోవడం వల్ల ఒత్తిడి పెరగుతుంది. మరియు బోజనం సమయంలో పిజ్జా, బర్గర్స్ తో సరిపెట్టడం మానేస్తే ఒత్తిడినితగ్గించుకోవచ్చు. మీ బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.

10 చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి తగ్గించుకోండి...!

ఒత్తిడి వల్ల ఇతరును ఇబ్బంది పెట్టడం: మీ ఒత్తిడి కారణంగా మీ ఇంట్లో వారి మీద విరుచుకు పడటం వల్ల మీకు కొంత ఉపశమనం కలగవచ్చు అనుకుంటారు. కానీ అది జరగనిపని, అనవసరంగా మీ ఇంట్లో వారి మనస్సులో కూడా మీ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి ఒత్తిడి నుండి దూరం కావడానికి ప్రయత్నించండి.

10 చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి తగ్గించుకోండి...!

ఎప్పుడూ తింటుండం: చాలా మంది వారికి నచ్చిన ఆహారాలును స్నాక్స్ తినడం వల్ల కొంత రిలీఫ్ చిక్కుతుందనుకుంటారు. కానీ ఎంత మాత్రం నిజం కాదు. వీటి వల్ల ఒత్తిడి దాంతో ఊబకాయం వస్తుంది తప్పు ఒత్తిడి తగ్గదు. కాబట్టి, ఇటువంటి ఆహారాలకు ముగింపు పలకండి ఒత్తిడిని తగ్గించుకోండి.

10 చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి తగ్గించుకోండి...!

వ్యాయం చేయకపోవడం: వ్యాయమం అనేది ప్రతి ఒక్కరికి అవసంర. జీవితంలో సంతోషంగా ఆరోగ్యంగా గడపడానికి ఇది ఒక మంచి మార్గం. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఓ దివ్య మార్గం. రన్నింగ్, జాగింగ్, వ్యాయామం చేయడం , బ్రీతింగ్ వంటివి ఓత్తిడి తగ్గిస్తాయి.

10 చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి తగ్గించుకోండి...!

విశ్రాంతి : మీ ఆరోగ్యం పట్ల కొంత సమయం వెచ్చించి తగు జాగ్రత్తలతో విశ్రాంతి తీసుకొన్నట్లైతే ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మీకు సమయంలేనప్పుడు స్పాలకు వెళ్ళి బాడీ మసాజ్ చేయించుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

10 చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి తగ్గించుకోండి...!

నిద్రలేమి: రోజులో కనీసం 7-8గంట నిద్ర అవసరం. కానీ చాలా మంది ఈ సమయం కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి పెరగడానికి కారణం అవుతుంది. ఒత్తిడి వల్ల అలసట, తలనొప్పి, ఇవన్నీ కూడా మీరు మరింత ఒత్తిడికి గురి అవ్వడానికి కారణం అవుతాయి. కాబట్టి మీ ఒత్తిడి గల ఈ పది బ్యాడ్ హ్యాబిట్స్ ను స్వస్తి పలికి ఒత్తిడి నుండి బయటపడండి.ఆరోగ్యాని పది రెట్లు పెంపొందించుకోండి

English summary

10 Bad Habits That Increase Stress Levels | ఈ చెడు అలవాట్లకు స్వస్తి పలకండి..ఒత్తిడి(స్ట్రెస్ )తగ్గించుకోండి...!

Most often we hear about habits that are stress induced. As in, these are bad habits we develop because our stress levels are always high. For example, the habit of cursing without any concrete reason shows that you are very stressed.
Story first published: Saturday, May 18, 2013, 15:45 [IST]
Desktop Bottom Promotion