For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెదడుకు హానీ కలిగించే చెడు అలవాట్లు

|

జ్ఞాపకశక్తికి ఆధారం మన మెదడు. మేధావికైనా, సామాన్యడికైనా ఉండే మెదడు బరువు1450 గ్రాములు. మెదడును వినియోగించుకునే విధానం మీదే వ్యక్తి ప్రతిభ, జ్ఞాపకశక్తి ఆధారపడి ఉంటుంది. మెదడు నుండి శరీరంలోని వివిధ అవయవాలకు నాడులు కలుపబడి ఉంటాయి. ఇవన్నీ ఒకదానితో మరొకటి సుమారు 20 వేల అనుసంధానాలు కలిగి ఉంటాయి.పెద్ద టెలిఫోన్‌ ఎక్చేంజిలో వైర్ల నెట్‌వర్క్‌ మాదిరిగా మెదడు పనిచేస్తుంది. అందుకే కోట్లాది సమాచార యూనిట్లను ఏకకాలంలో గ్రహించి విశ్లేషించగలుగుతుంది.

మానవుని మెదడు జ్ఝానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం. మెదడు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని మీకందరికీ తెలిసే ఉంటుంది. మెదడు చెప్పినవిధంగానే మన శరీరం నడుచుకుంటుంది. కాబట్టి మెదడు చురుగ్గా ఉన్నంత కాలం మన శరీరం చురుకుగా ఉంటుంది. వయస్సుతో మెదడుకు సంబంధంలేదు.

మెదడు చురుగ్గా ఉండాలి, దాంతో మన ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని బ్రెయిన్ డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. అందుకు కొన్ని చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. మెదడు ఏదైనా ఒక భాగం సమస్యాత్మకంగా ఉన్నప్పుడు, అప్పుడు నిస్సందేహంగా మొత్తం శరీర ఉనికి మరియు అన్ని చర్యలు సమస్యాత్మకంగా మారుతాయి. కాబట్టి మన మెదడు మీద మనకు శ్రద్దఉండాలి. మెదడుకు ఎటువంటి హానీ కలగకుండా చూసుకొన్నప్పుడే మన శరీరంలో అన్ని అవయవాలు క్రమంగా పనిచేస్తాయి. అప్పుడే మనం అరోగ్యంగా ఉండగలం. మరి మెదడు ఆరోగ్యం ఉండాలంటే కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం.

బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బ్రెయిన్ కు బ్రేకే....

స్మోకింగ్: పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా హానికరమే. పొగ త్రాగడం వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఇది వివిధరకాలుగా మెదడు సంకోచాలకు కారణమవుతుంది మరియు అల్జీమర్ వ్యాధికి దారితీయవచ్చు.

బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బ్రెయిన్ కు బ్రేకే....

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం: ఉదయం అల్పాహారం తీసుకోని వారు ఆరోజు వారి శరీరం అతి తక్కువ రక్తచక్కెర స్థాయి పొందుతుంది. అది మెదడు క్షీణత కారణమవుతుంది. మెదడుకు సరైన మోతాదులో పోషకాలు అందక మెదడు పనిచేసే శక్తి తగ్గుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ కు ఇది కూడా ఒక కారణం.

బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బ్రెయిన్ కు బ్రేకే....

అతిగా తినడం: అతిగా తినడం వల్ల మెదడు యొక్క ధమనులను పెరగడంతో మానసిక శక్తి తగ్గుదలకు దారితీస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బ్రెయిన్ కు బ్రేకే....

ఎక్కువగా చక్కెర వినియోగం: ఎక్కువగా చక్కెర తీసుకోవడం వల్ల పోషకాహారలోపం ఏర్పడుతుంది. దానివల్ల ప్రోటీన్లు మరియు పోషకాలను పీల్చుకొనే అంతరాయం కలుగుతుంది. మరియు మెదడు అభివృద్ధిపై ప్రభావితం చూపుతుంది.

బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బ్రెయిన్ కు బ్రేకే....

కాలుష్యం: మన శరీరంలో మెదడు అతి పెద్ద ఆక్సిజన్ వినయోగదారుగా ఉంది. కలుషిత గాలి పీల్చడం వల్ల మెదడు ఆక్సిజన్ సరఫరా తగ్గి, దాంతో మెదడు సామర్థ్యం తగ్గుతుంది.

బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బ్రెయిన్ కు బ్రేకే....

డిప్రైవేషన్ స్లీప్: నిద్ర మన మెదడుకు విశ్రాంతి కలిగిస్తుంది. అయితే అతిగా నిద్రపోవడం వల్ల మెదడు కణాల పనిచేయక చురుకుదనం తగ్గి, బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వచ్చు.

బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బ్రెయిన్ కు బ్రేకే....

అనారోగ్యం: అనారోగ్య సమయంలో ఎక్కువగా పనిచేయడం లేదా చదడం వంటి వాటివల్ల్ మెదడు మీద ప్రభావం చూపించడంతో పాటు మెదడుకు నష్టం కలిగే అవకాశం ఉంది.

బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బ్రెయిన్ కు బ్రేకే....

ఆలోచించడం: ఆలోచించడం మెదడుకు పదను పెట్టడం లాంటిది, ఆలోచించక పోవడం వల్ల మెదడు సంకోచానికి కారణం కావచ్చు.

English summary

10 Brain Damaging Habits... | బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బ్రెయిన్ కు బ్రేకే....

The brain is the control center of a human hence it’s important to avoid any habits that could lead to brain damage. If any part of the brain are problematic, then arguably the whole existence and all the activities will be problematic. Therefore, it is not an exaggeration if we must love our brains. How?! It’s easy, in order to avoid brain damage just avoid the following bad habits.
Story first published: Saturday, February 23, 2013, 17:09 [IST]
Desktop Bottom Promotion