For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో వేడి పుట్టించే ఈ ఆహారాలకు సమ్మర్ లో బ్రేక్ వేయండి..!

|

ప్రస్తుతం వేసవి కాలం..ఏప్రిల్ ముసిగింద మేలోనూ ఎండలు భగభగ మండుతున్నాయి. వంట్లో ఉన్న నీరంత చెమట రూపంలో బయటకు నెట్టవేయబడుతుంది. దాంతో నీరసం మొదలవుతుంది. ఆకలి..దప్పిక అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ఏమి తినాలినిపించదు. అయితే ఏదో కొత్తరకం వంటలు.. వివిధ రకాల జ్యూసుల మీద మనస్సు మళ్ళుతుంది. అయితే ఈ వేసవి కాలంలో అన్ని ఆహారాలు అంత ఆరోగ్యకరమైనవి కావు. ఆల్రెడీ వాతావరణం వేడిగా ఉండటం వల్ల మన శరీరంలో కూడా అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి శరీరాన్ని చల్లబరిచే ఆహారాలనే ఎక్కువగా తీసుకోవాలి. వేడి పుట్టించి ఆరోగ్యానికి హాని చేసే కొన్ని ఆహారాలకు ఈ వేసవి కాలంలో దూరంగా ఉండటమే మంచిది.

అధిక వేడి వల్ల శరీరం అధిక ఒత్తిడికి గురిఅవుతుంది. దాంతో చిరాకుతో పాటు, ఏకాగ్రత లోపించటం, అలసట మరియు నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఈ సీజన్ లో తీసుకొనే ఆహారాలు మరియు పానీయాల మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఖచ్ఛితంగా కొన్ని ఆహారాలను ఈ సమ్మర్ లో తీసుకోవడానికి బ్రేక్ ఇవ్వాలి..ఇవ్వడంతో పాటు వాటి స్థానంలో సమ్మర్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. అందుకు మీకో సలహా ఏంటంటే అధికంగా నీరు తీసుకోవాలి. అధికంగా నీరువున్న ఆహారాలు(కీరదోస, పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి బోండా)వంటివి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని రకాల పండ్లు కూడా అధిక శాతం నీరు కలిగి ఉంటాయి.

కాబట్టి వేసవిలో కొన్ని ప్రత్యేకమైన పండ్లను తీసుకోవడం కూడా ముఖ్యం. అవి మీ శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఒక్క చల్లదనం మాత్రమే కాదు..మీ శరీరంలోని వేడిని తొలగించి ఆరోగ్యాన్ని మరింగ మెరుగుపరుస్తుంది. ఇంతకు ముందు కథనాల్లో వేసవి కాలంలో తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రుడ్స్ మరియు ఫ్రూట్స్ గురించి తెలుసుకున్నాము...మరి సమ్మర్ లో తినకూడని కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. మరి మనల్ని ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలంటే ఈ ఆహారాలకు ఖచ్చింతా దూరంగా ఉండాలి. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

వేసవిలో ఖచ్చితంగా తినకూడని ఈ 10 ఆహారాలు...!

అధిక మసాలాలు:ప్రస్తుం మనకు చాలా ఆహారాలు స్పైసీగా అందుబాటులో ఉన్నాయి. వేసవి వెళ్ళే వరకూ కొన్ని రకాల స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండటమే మేలు. ఉదా: పచ్చిమిర్చి, అల్లం, మిరియాలు, జీలకర్ర చెక్క వంటి మసాలా దినుసులు శరీరంలో వేడి పుట్టిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

వేసవిలో ఖచ్చితంగా తినకూడని ఈ 10 ఆహారాలు...!

మాంసాహారాలు: చాలా రకాల మాంసాహారాలు రెడ్ మీట్, గుడ్లు, రొయ్యలు, ఎండ్రకాయలు, చికెన్ వంటివి శరీరంలో అధిక వేడిని పుట్టించడానికి కారణం అవుతాయి. కాబట్టీ ఈ సమ్మర్ లో సాధ్యమైనతం వరకూ వీటికి అవాయిడ్ చేయడం మంచిది. శరీరంలో వేడి మాత్రమే కాదు ఇవి మీ జీర్ణక్రియనే అస్థవ్యస్థం చేస్తాయి లేదా డీహైడ్రేషన్ కు గురి చేస్తాయి.

వేసవిలో ఖచ్చితంగా తినకూడని ఈ 10 ఆహారాలు...!

చపాతీ: చపాతీ..రోటీలను గోధుమ పిండితో తయారు చేస్తారు. ఈ ఆహారంలో దేశంలో చాలా ప్రదేశాల్లో ఇది ప్రధాన ఆహారం. అయితే ఇది అంత త్వరగా జీర్ణం అయ్యే ఆహారం కాకపోవడం వల్ల..జీర్ణం అయ్యే సమయంలో అధిక సమయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పుట్టిస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మేలు.

వేసవిలో ఖచ్చితంగా తినకూడని ఈ 10 ఆహారాలు...!

రోస్ట్ లేదా ఫ్రై చేసిన ఆహారాలు: రోస్ట్ చేసినవి అంటే తందూరి ఐటమ్స్ ఇలాంటివి దేశంలో బాగా పాపులర్ అయినటువంటి ఆహారాలు. అయితే ఇవి శరీరంలో వేడి పుట్టించడంలో మొదటి స్థానంలో ఉంటాయి. అంతే కాదు గ్యాస్ట్రిక్ సమస్యలకు గురిచేస్తాయి. కాబట్టి వీటిని సమ్మర్ లో తినకపోవడమే మంచిది.

వేసవిలో ఖచ్చితంగా తినకూడని ఈ 10 ఆహారాలు...!

మామిడి పండ్లు: వేసవి కాలం అంటేనే ఎక్కువగా ఆకర్షించేవి మామిడి పండ్లు. అయితే నిజానికి ఇవి శరీరాన్ని వేడి కలిగిస్తాయి. అధికంగా మామిడి పండ్లను తినడం వల్ల వేడి గుళ్లలు ముఖ్యం పిల్లల్లో మరియు టీనేజర్స్ అధికంగా కనబడుతాయి. కాబట్టి సాధ్య అయినంత వరకూ తక్కువగా తినడం మంచిది.

వేసవిలో ఖచ్చితంగా తినకూడని ఈ 10 ఆహారాలు...!

డైరీ ప్రొడక్ట్స్: మీరు ప్రతి రోజూ తీసుకొనే డైరీ ప్రొడక్ట్స్ (పాలు, చీజ్, పెరుగు మొ..)తగ్గించుకోవడం మేలు. ఈ ఆహారాలు వేడి పుట్టించే ఆహారాలు. కాబట్టి వీటిని మతంగా తీసుకోవడం లేదా వేరే పద్దతుల్లో (మిల్క్ షేక్స్, మజ్జిగ )తీసుకోవడం మంచిది.

వేసవిలో ఖచ్చితంగా తినకూడని ఈ 10 ఆహారాలు...!

ఆయిలీ మరియు జంక్ ఫుడ్స్: బర్గర్స్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రై మరియు ఇతర ఆయిల్ ఫుడ్స్ వంటివి మీ జీర్ణ వ్యవస్థను స్థంభింపచేసి ఫుడ్ పాయిజన్ అయ్యేందుకు కారణం అవుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మేలు.

వేసవిలో ఖచ్చితంగా తినకూడని ఈ 10 ఆహారాలు...!

ఐస్ క్రీమ్స్-కోల్డ్ డ్రింక్స్: రెండూ ఐస్ క్రీములు మరియు చల్లటి పానియాల రెండూ వేడి చేసే పదార్థాలే. ఇవి వేడిని తగ్గించడానికి బదులు మీ కడుపులో మంట లేదా వేడి కలిగిస్తాయి.

వేసవిలో ఖచ్చితంగా తినకూడని ఈ 10 ఆహారాలు...!

టీ మరియు కాఫీ: టీ మరియు కాఫీ రెండూ శరీరానికి వేడి పుట్టించేవే..కాబట్టి వేసవిలో వీటికి దూరంగా ఉండటమే మంచిది.

వేసవిలో ఖచ్చితంగా తినకూడని ఈ 10 ఆహారాలు...!

డ్రై ఫ్రూట్స్ ను తగ్గించాలి: డ్రై ఫ్రూట్స్ ను హెల్తీ ఫుడ్స్. అయినా కూడా ఇవి ఎక్కువ వేడిని కలిగిస్తాయి. కాబట్టి వీటిని తక్కువగా తీసుకోవాలని సలహా.

English summary

10 Foods To Avoid This Summer | శరీరంలో వేడి పుట్టించే ఈ ఆహారాలకు సమ్మర్ లో బ్రేక్ వేయండి..!

It's already end of April and the Indian summer is turning out to be as hot as ever. As mercury levels are on a steep climb, staying fit is going to be your primary concern. It is already too hot and any food that generates further heat inside your body is better to be avoided during the summer months.
Desktop Bottom Promotion