For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలోని అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

|

పెద్ద పేగుకు వచ్చే ప్రధానమైన సవుస్య కోలన్ క్యాన్సర్. దీనిపై అందరికీ అవగాహన అవసరం. ఏటా ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల వుందిని బలితీసుకుంటున్న ఈ వ్యాధిని ముందే పసిగడితే నివారించడం పూర్తిగా సాధ్యం. అందరూ 50 ఏళ్లు దాటాక విసర్జక అలవాట్లలో ఏవైనా వూర్పులు కనిపించినప్పుడు వెంటనే పరీక్షలు చేయించినా, 50 ఏళ్ల వయుసు దాటాక ఏ లక్షణాలు కనిపించకపోయినా ప్రతి ఐదేళ్లకోసారి ‘ప్రివెంటివ్ స్క్రీనింగ్ కార్యక్రమం' కింద క్రవుం తప్పకుండా పరీక్షలు చేయించుకున్నా తప్పనిసరిగా నివారించతగ్గ వ్యాధే కోలన్ క్యాన్సర్. అందునా గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కోలన్ క్యాన్సర్ వచ్చిన కుటుంబ చరిత్ర ఉన్నా పరీక్షలు చేయించడం తప్పనిసరి.

కోలన్ క్యాన్సర్ లక్షణాలు: మలవిసర్జన సవుయుంలో రక్తం పడుతున్నా, మలబద్ధకం తీవ్రంగా ఉన్నా లేదా ఆగకుండా నీళ్లవిరేచనాలు అవుతున్నా, ఈ రెండు సవుస్యలూ ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నా, రక్తహీనత, కడుపులో నొప్పి, మలవిసర్జన తర్వాత కూడా ఇంకా అక్కడ కొంత మిగిలే ఉన్నట్లు అనిపించడం, బరువు తగ్గడం... ఈ లక్షణాలు అన్నీ లేదా వీటిల్లో కొన్ని కనిపించినప్పుడు డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.

పెద్ద ప్రేగును ప్రక్షాళన (శుభ్రం)చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. పెద్దప్రేగు శుభ్రపడటం వల్ల శరీరంలోని మలినాలు మరియు విషాలు శరీరం నుండి బయటకు స్రవించబడుతుంది. దాంతో డిటాక్సిఫికేషన్ వల్ల చర్మం అందం పెరుగుతుంది. పెద్దపేగు సరిగా పనిచేయనట్లైతే మీరు మలబద్ధకం మరియు జీర్ణ మరియు పొట్టకు సంబంధించిన రోగాల భారీన పడేలా చేస్తుంది. కాబట్టి పెద్దపేగు సక్రమంగా పనిచేయాలన్నా.. మలబద్దకం మరియు జీర్ణ సమస్యలను నివారించాలన్నా ఫైబర్ రిచ్ ఫుడ్స్ బాగా సహాయపడుతాయి. వీటితో పాటు కొన్ని కోలన్ క్లీనింగ్ రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

పీచు పదార్థాలతో ప్రివెన్షన్...

పెద్ద పేగులో వచ్చే మలబద్దకం వంటి చాలా సాధారణ సవుస్యలను మంచి ఆహారంతోనే నివారించవచ్చు. అంతేకాదు... ఇదే ఆహారంతో పెద్ద పేగుకు వచ్చే తీవ్రమైన సవుస్య అయిన క్యాన్సర్‌ లాంటి వాటినీ సవుర్థంగా నివారించవచ్చు. పెద్దపేగులో జీర్ణమైన ఆహారం తేలిగ్గా ముందుకు కదిలేందుకు ఉపయోగపడేది ఈ పీచు పదార్థాలే. పొట్టుతో ఉండే గోధుమ, ఓట్స్, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి వంటి తృణధాన్యాల్లో, రాజ్మా, శనగలు, పెసలు, సోయూబీన్ వంటి పప్పుధాన్యాల్లో (పల్సెస్), తొక్కతో పాటే తినదగ్గ తాజా పళ్లు, తాజా కూరగాయుల్లో ఈ పీచుపదార్థాలు ఎక్కువ.

రోజూ కనీసం 2, 3 లీటర్లకు తక్కువ కాకుండా నీళ్లు, ద్రవాహారం కూడా తీసుకుంటూ ఉంటే జీర్ణవుయ్యూక మిగిలిన వ్యర్థాలు తేలిగ్గా ముందుకు కదులుతూ ఉంటాయి. దీనికి శారీరక శ్రవు (ఫిజికల్ యూక్టివిటీ) కూడా తోడైతే ఈ పేగుల కదలిక (బవెల్ మూవ్‌మెంట్) చురుగ్గా ఉంటుంది. అందుకే పేగుల కదలికకు ఆహారం ఎంత అవసరమో, వ్యాయామమూ అంతే అవసరం. ఫలితంగా బాధాకరంగా ఉండే పైల్స్ మొదలుకొని క్యాన్సర్ వరకూ చాలా వ్యాధులను నివారించవచ్చు. అందుకే జీవనశైలి(లైఫ్‌స్టైల్)లో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లతోనే పెద్దపేగుకు వచ్చే చాలా సవుస్యలను సవుర్థంగా. మరి అటువంటి ఆహారాలేంటో ఒకసారి చూడండి..

అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

నిమ్మ: సిట్రస్ పండ్లు, ముఖ్యంగా నిమ్మ కోలన్ (పెద్ద ప్రేగును)శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేసి మరియు శుభ్రపరుస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.

అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

ఆకుకూరలు: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు కోలన్ (పెద్ద ప్రేగును)శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. డైజిస్టివ్ ట్రాక్ (జీర్ణ కోశాన్ని) శుభ్రంగా ఉంచడానికి సహాయపడతుంది.

అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

బ్రొకోలీ మెలకలు: ఇవి కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. బ్రోకలీ మొలకలు కూడా పెద్దప్రేగు detoxifies మరియు శుభ్రం ఉంచుతుంది.

అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

పండు రసం: పండ్ల రసం మీ రోజువారీ ఆహారంలో తప్పక చేర్చవలెను. వీటిలో ఫైబర్, ఎంజైమ్లు మరియు పెద్దప్రేగును శుభ్రం చేసే లవణాలు ఇవి డిటాక్సిఫై చేయడానికి మరియు శరీరంలోని(పెద్దప్రేగులోని) విషాన్ని బయటకు పంపే వ్యవస్థ ను కలిగి ఉంటుంది.

అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

వెల్లుల్లి: వెల్లుల్లి వాసన అంటే పడనివారు చాలా మందే ఉండవచ్చు. అయితే గుండె ఆరోగ్యాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది, అంతే కాదు పెద్దప్రేగు ను శుభ్రపరచేటటువంటి ఆహారాల్లో ఇది ఒకటి.

అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

చేపలు: చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు డైజెస్టివ్ ట్రాక్ ను శుభ్రం చేసే ఆయిల్స్ పెద్దప్రేగును శుభ్రం చేయడానికి సహాపడుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

అవొకాడో: అవొకాడోలో కూడా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికం. ఇవి కోలన్ ను శుభ్రం చేస్తుంది. మరియు జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది. ఓమేగా 3 ఫ్యాటీ ఆయిల్స్ పెద్ద ప్రేగు గోడకు ఒక లూబ్రికెంట్ వలే పనిచేస్తుంది. అన్ని ఆహారపు అణువులను మరియు వ్యర్థాలను మరియు విషాలను బయటకు విసర్జింపబడుతుంది.

అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

తృణధాన్యాలు: వీటిలో లోక్యాలరీస్, లో కొలెస్ట్రాల్ కలిగి మరియు సులభంగా జీర్ణ అవ్వడానికి సహాయపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

చిక్కుళ్ళు: లెగ్యూమ్ జాతికి చెందిన బఠాణి, పప్పులు, బీన్స్ వంటివి మూత్ర పిండాల మరియు జీర్ణక్రియ, పెద్దప్రేగు శుభ్రపరచడానికి సహాయపడుతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో చిక్కుళ్ళు కు ప్రాధాన్యత ఇవ్వాలి.

అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

గ్రీన్ టీ: లివర్ ను డిటాక్స్ చేస్తుంది. కాబట్టి గ్రీన్ టీ ని తప్పని సరిగా త్రాగాలి. గ్రీన్ టీ బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది.

English summary

10 Foods To Cleanse Colon | అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్

Colon is the last part found in the digestive system. It absorbs water, sodium and fat soluble vitamins. Colon cleansing is very important to promote a healthy digestive system and prevent colon cancer. Moreover, colon cleansing also protects you from cancer which affects the intestines.
Story first published: Thursday, April 18, 2013, 17:54 [IST]
Desktop Bottom Promotion