For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలనొప్పికి మాత్ర మింగితే..ఇక ఆరోగ్యానికి అంతే సంగతులు...!

|

తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక మాత్ర మింగి ఊరుకుండిపోతాం. అయితే ఆ మాత్రప్రభావం కొంత సమయం మాత్రమే ఉంటుంది. తర్వాత తిరిగి అదే విధంగా తలనొప్పి ప్రారంభం అవుతుంది. పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు, జలుబు, జ్వరం, అనారోగ్యం ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. తలనొప్పితో బాధపడే వారిలో అధికం స్త్రీలే. అందుకు ముఖ్య కారణం అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పనిభారం. తలనొప్పి వల్ల ఏ పని సరిగ్గా చేయలేక, ఎవరికి చెప్పుకోలేక అంతర్గతంగా మథనపడి, మానసిక వ్యాధులకు గురి అవుతున్నారు. తలనొప్పికి కారణాలేవైనా వాటి నివారణకు సత్వర చికిత్స చేయించుకోవాలి. లేకుంటే కొన్ని రకాల తలనొప్పులు రోగికి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదముంది.

తలనొప్పికొ తక్షణ ఉపశమనం పొందడానికి ఏదో ఒక మాత్రను మ్రింగడం మంచిది కాదు. మాత్రలు ఎక్కువగా మ్రింగితే అనేక ఇబ్బందులు కలుగుతాయి. మాత్రలకు బదులు తలనొప్పి తగ్గించే కొన్ని ఆహారాలను తినడం వల్ల కూడా తలనొప్పిని పూర్తిగా నివారించుకోవచ్చు. మీరు తినే ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకొంటే సరిపోతుంది. సాధారణ తలనొప్పి అయితే అది మనమే తగ్గించుకోవచ్చు. సాధారణ తలనొప్పికి ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోవడం కంటే ఇంట్లో సాధారణంగా లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించి తలనొప్పి గుడ్ బై చెప్పడమేతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ముందు తలనొప్పి వచ్చినప్పుడు ఈ క్రింది ఆహారాలు తిని తలనొప్పిని దూరం చేసుకోండి.

తలనొప్పికి మాత్ర మింగితే ఇక..అంతే సంగతులు..!

బంగాళదుంప: వేయించిన పొటాటోను తీసుకోవడం వల్ల కొంత వరకూ తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ త్రాగడం వల్ల ఎక్కువ సార్లు యూరిన్ పోవల్సి వస్తుంది. దాంతో శరీరం డీహైడ్రేషన్ చెంది, పొటాషియంను కోల్పోతుంది. తలనొప్పికి ఇది కూడా ఒక కారణమే. కాబట్టి పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు బంగాలదుంపలు తినడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. బంగాళదుంపతో పాటు అరటి పండులో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది.

తలనొప్పికి మాత్ర మింగితే ఇక..అంతే సంగతులు..!

పుచ్చకాయ: తలనొప్పికి ప్రధాన కారణం డీహైడ్రేషన్. కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు మాత్రలు మ్రింగడానికి బదులు వాటర్ ఎక్కువగా ఉన్న(పుచ్చకాయ) ఆహారాలు తీసుకోవడం మంచిది. వాటర్ పుష్కలంగా ఉన్న పండ్లు మరియు కూరగాయాలు చాలానే ఉన్నాయి. వాటర్ మాత్రమే కాదు శరీరానికి కావల్సిన పోషకాంశాలు మెగ్నీషియం తలనొప్పికి విరుద్దంగా పనిచేసే వాటిని తీసుకోవడం మంచిది.

తలనొప్పికి మాత్ర మింగితే ఇక..అంతే సంగతులు..!

కాఫీ: అవును, కాఫీ. ఔషధ గుణాలున్న బ్రౌన్ కాఫీ మనం తరచూ తీసుకుంటుంటాం. చాలా రకాల తలనొప్పి నివారణ మాత్రలో కెఫిన్ ఉంటుంది. అందుకే అవి మింగినప్పుడు తక్షణ ఉపశమనం ఇస్తుంది. మద్యం తీసుకోవడం వల్ల అది మన శరీరం మరియు తలలోని రక్త నాళాలు విస్తరణ చేస్తుంది. కాఫీ వాటిని కృంగిపోయేలా చేసేందుకు వ్యతిరేకంగా పని చేస్తుంది. దాంతో తలనొప్పి తగ్గిస్తుంది. అయితే ఎక్కువగా కాఫీ త్రాగకూడదు. తలనొప్పి ఉన్నప్పుడ ఒక కప్పు కాఫీ త్రాగడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఎక్కువ కాఫీ త్రాగడం వల్ల శరీరం తిరిగి డీహైడ్రేషన్ కు గురై, యూరిన్ ఎక్కువగా వెళ్ళవలసి వస్తుంది. దాంతో తిరిగి తలనొప్పి మొదలవుతుంది. కాబట్టి మితంగా త్రాగడం మంచిది.

తలనొప్పికి మాత్ర మింగితే ఇక..అంతే సంగతులు..!

తృణధాన్యాలు: ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గడం వల్ల కూడా తరచూ తలనొప్పికి కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో పియంఎస్ తలనొప్పి శరీరంలోని కొన్ని ఖనిజాలు, మెగ్నీషియం లోపం వల్ల కూడా తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పీచుఅధికంగా ఉన్న తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలతో తయారు చేసే రొట్టెలు, బియ్యం, గోధుమ వంటివి ఎక్కువగా తీసుకొంటుండాలి. ప్రస్తుతకాంలో ఇవి మంచి ఆహార పదార్ధాలు.

తలనొప్పికి మాత్ర మింగితే ఇక..అంతే సంగతులు..!

బాదాం: కొన్ని అద్యయనాల ప్రకారం బాదంలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు విడుదల చేసి తలనొప్పి రాకుండా శరానికి రక్షణ కల్పిస్తుంది. మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారిలో, మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారంతీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. మెగ్నీషియం పొందడానికి, బాదం, అరటి, అవోకాడో, తృణధాన్యాలు, బియ్యం వంటివి మీ డైలీ డయట్ లో చేర్చుకోవడం మంచిది.

తలనొప్పికి మాత్ర మింగితే ఇక..అంతే సంగతులు..!

స్పైసీ సాల్సా: కొన్ని రకాలైన స్పైసీ వస్తువులు ఉదా: కారంగా ఉండే సాల్సా మరియు హాట్ పెప్పర్ వంటివి తలనొప్పి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. తలనొప్పికి కారణం ఏదైనా సరే ఈ స్పైసీ సాల్సా నొప్పిని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మసాల దినుసులు తలనొప్పికి కారణం అయ్యే బ్రీతింగ్ వేస్ ను తెరచుకొనేలా చేసి, తలనొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది

తలనొప్పికి మాత్ర మింగితే ఇక..అంతే సంగతులు..!

పెరుగు: మీరు తలనొప్పితో బాధపడుతున్నట్లు మీకు అనిపిస్తే, మీ శరీరానికి క్యాల్షియం అవసరం అని గ్రహించండి. మీ శరీరం చురుగ్గా పనిచేయడానికి తగినంత క్యాల్షియం అవసరం అని గ్రహించి, క్యాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే లోఫ్యాట్ గ్రీక్ యోగ్రట్ తినడం చాలా మంచిది.

తలనొప్పికి మాత్ర మింగితే ఇక..అంతే సంగతులు..!

నువ్వులు: చిన్న నువ్వు గింజలు మహిళల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తికి బాగా సహాయం పడుతుంది. దాంతో మైగ్రేన్ తలనొప్పిని నిరోధించవచ్చు. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది అది తలనొప్పి నివారించడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా రక్తప్రసరణకు సహాయపడుతుంది. ఇంకా ఇందులో మెగ్నీషయం కూడా పుష్కలం.

తలనొప్పికి మాత్ర మింగితే ఇక..అంతే సంగతులు..!

గ్రీన్ లీఫ్స్: ఆకుకూరలు తరచూ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. కాబట్టి తలనొప్పితో బాధపడుతున్నప్పుడు, ఆకుకూరతో తయారు చేసిన ఏదైనా సలాడ్ ను తినడం మంచిది.

తలనొప్పికి మాత్ర మింగితే ఇక..అంతే సంగతులు..!

అల్లం: అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది ..ఇది మంచి ఔషధంగా కూడా పని చేస్తుంది. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది. ఇది చాలా అద్భుతమైన ఆహార పదార్థం. అల్లం తరచూ తీసుకోవడం వల్ల, తలనొప్పి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, దగ్గు కారణంగా తలనొప్పి రావడం సహజం. ఈ సమస్యలు నివారించడానికి అల్లం తప్పకుండా బాగా పనిచేస్తుంది. కాబట్టి అల్లం మీ ఆహారంలో ఏదో ఒకరకంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తలనొప్పి రాకుండా జాగ్రత్తపడండి.

English summary

10 Good Foods That Will Help Your Headaches! | తలనొప్పికి మాత్ర మింగితే ఇక..అంతే సంగతులు..!

Those who suffer from frequent headaches no very well that they are incredibly hard to ignore. They ruin everything, from a good time out to reading a book, it's hard to enjoy yourself doing anything when your head is throbbing so bad you feel nauseated.
Desktop Bottom Promotion