For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్ సైడర్ వెనిగార్ వల్ల శరీరానికి 10 ప్రయోజనాలు!

By Super
|

ఆపిల్ సైడర్ వెనిగర్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. దీన్ని పులియబెట్టిన ఆపిల్స్ నుండి తయారు చేస్తారు. ఆపిల్ సైడర్ వెనిగార్ ను కొన్ని వేల సంవత్సరాలను ముందు నుండే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే, కొన్ని రకాల సైనసిటిస్, జ్వరం, మరియు ఫ్లూ వంటి వివిధ వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లను నివారించడంలో మంచి ప్రయోజనకారిగా ఉంది. ఆపిల్ సైడర్ వెనిగార్ ను ప్రతి రోజూ త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరగుపరుచుటకు మరియు కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు అంటే డిప్రెషన్, అలసట, కీళ్ళనొప్పులు నివారించడబడుతుంది. మరియు రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో ఆపిల్ సైడర్ వెనిగార్ సహాయపడుతుంది.

వివిధ రకాల వ్యాధుల చికిత్స కోసం కొన్ని వేల సంవత్సరాల నుండి ఆపిల్ సైడర్ వెనిగార్ ను వాడుతున్నారు. హిప్ప్రోకేటీస్(Hipprocates), ఆధునిక వైద్యంకు తండ్రి, 400BCకాలం నుండినే జులుబు మరియు ఫ్లూ వంటి జబ్బుల నివారణకు ఆపిల్ సైడర్ వెనిగార్ ను తేనెతో కల్పి ఇవ్వవొచ్చని సిఫారస్ చేశారు. అప్పటి నుండి, వివిధ రకాల వ్యాధులను నివారించడం కోసం ఈ యాపిల్ సైడర్ వెనిగార్ ను ఉపయోగించడం కొనసాగించారు. ఇంకా రొమన్స్ మరియు జపనీస్ సమురాయ్ యోధులు కూడా ఆరోగ్యం, బలం మరియు శక్తి కోసం ఆపిల్ సైడర్ వెనిగార్ ను ఉపయోగించారు .

ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క పోషక విలువలు: ఆపిల్ సైడర్ వెనిగార్ యొక్క పుల్లని రుచి శుభ్రపరిచే లక్షణాలను మరియు యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంది. యాపిల్ సైడర్ వెనిగార్ లో ఎసిటిక్ యాసిడ్ కలిగి ఉంది. ఇది హానికరమైన బ్యాక్టీరియాను మరియు ప్రేగులోని ఫంగస్ ను నిరోధించడానికి సహాయపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ లోఉన్న పెక్టిన్, ఇదినీటిలో కరిగే ఫైబర్ జీర్ణనాళము నుండి నీటిని, కొవ్వు, విషాన్ని మరియు కొలెస్ట్రాల్ ను గ్రహించి, బయటకు నెట్టివేయబడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క ఉపయోగం: ఆపిల్ సైడర్ వెనిగార్ తో చాలా ఉపయోగాలున్నాయి: అవి, ఆపిల్ సైడర్ వెనిగార్ లో ఒక బలమైన ప్రక్షాళన గుణాలను కలిగి ఉంది. మరియు అనేక వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగార్ పెద్దప్రేగు మరియు జీర్ణాశయాన్ని శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.

ఆపిల్ సైడర్ వినెగార్ కూడా రక్తపోటు తక్కువ చేయడానికి మరియు కొలెస్ట్రాల్ తగ్గించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరియు శరీరంలో చెడు కొవ్వును మరియు వ్యర్థాలను, విషాలను శరీరం నుండి బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగార్ తో మరొక ఉపయోగం చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు మొటిమలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగార్ లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి, జలుబు, సైనటీస్, మరియు ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడుతుంది.

ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

గ్లూకోజ్ తగ్గిస్తుంది:

ఆపిల్ సైడర్ వినెగార్ లో ఉన్న ఎసిటిక్ యాసిడ్, పిండిపదార్థాల జీర్ణాక్రియ వేగాన్ని తగ్గిస్తుంది, ఫలితంగా రక్తప్రవాహంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

ఆపిల్ సైడర్ వినెగార్ లో ఉన్న పెక్టిన్ , శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. కొందరు వ్యక్తుల్లో ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే పెక్టిన్ అలెర్జీని కలిగించవచ్చు. అటువంటి వారు దీనికి దూరంగా ఉండటమే మంచిది.

మినిరల్స్ (ఖనిజాలు) కలిగి ఉంటుంది:

పొటాషియం, మెగ్నీషియం మరియు ఇతర ఖనిజాలు ఆపిల్ వినెగార్ పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం శరీరంలోని నీటిని సంతులనం చేస్తుంది. మరియు ఒక ఆరోగ్యకరమైన గుండె లయ నిర్వహిస్తుంది. మెగ్నీషియం, ఎంజైమ్ ల కార్యకలాపాలకు ఉత్ప్రేరంగా ఉండి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. మరియు శరీరంలో ఎముకలకు కావల్సిన కాల్షియంను చేరవేయడానికి సహాయపడుతుంది.

ఆస్టియో ఆర్థరైటిస్ కు సహాయపడుతుంది:

ఆస్టియో ఆర్థరైటిస్ శరీరం లో యాసిడ్ క్రిస్టల్ పెరగడానికి కారణంఅవుతుంది, మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ దీన్ని కనబడనీయకుండా చేసి శరీరం యొక్క pH బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఇటువంటి కేసులకు ఇప్పటికి వరకూ ఎటువంటి గణనీయమైన శాస్త్రీయ ఆధారం లేదు. కానీ డాక్టర్ జార్విస్ జాబితాలో అతని సంరక్షణలో కొందరు పేషంట్స్ ఆస్టియో ఆర్థరైటిస్ నుండి విజయవంతంగా కోలుకోవడం జరిగింది.

యాంటీ ఆక్సిడెంట్ కార్యాచరణ:

ఆపిల్ సైడర్ వినెగార్ బీటాకెరోటిన్ కలిగి ఉండి, ఇది మాయో క్లినిక్ ప్రకారం యాంటిఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ నుండి డ్యామేజ్ కాకుండా ప్రతిపక్షకారినిగా ఉంటుంది. మరియు మీ నిరోధక వ్యవస్థ పెంచడానికి సహాయపడుతుంది.

యాంటీఫంగల్(శిలీంద్ర నివారకములు):

చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ మలాసెజియా పొట్టును, ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క యాంటీ ఫంగల్ లక్షణాలు ద్వారా తరిమికొడుతుంది. 50 శాతం నీరు మరియు 50 శాతం ఆపిల్ సైడర్ వినెగార్ మిక్స్ చేసి తలకు, జుట్టుకు అప్లై చేయాలి. తర్వాత ఇది బాగా ఎండేదాకా ఉండి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

యాంటీ ఇఫ్లమేటరీ(శోథ నిరోధక):

ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క యాంటీఇంఫ్లమేటరీ(శోథ నిరోధక) లక్షణాలు అధిక వేడిమి, సూర్యరశ్మి వల్ల కమిలిన చర్మానికి ఉపశమనం కలిగించడం కోసం దీన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. దీన్ని సలాడ్స్ తో కలిపి తీసుకొన్నా లేదా అలాగే తాగినా కూడా అంతర్గతంగా జీర్ణవాహికలోని ఇన్ల్ఫమేషన్ కూడా తగ్గిస్తుంది.

బరువు తగ్గించడానికి:

ఇన్సులిన్ కొవ్వుగా నిల్వ చేయడానికి చక్కెర దర్శకత్వం కాదు. రక్తంలో చక్కెర స్థాయిలను సంతులనం చేయడానికి ఆపిల్ సైడర్ వెనిగార్ సహాయం పడుతుంది. మరియు ఇది బరువు తగ్గిస్తుంది.

స్కిన్ టోనర్:

ఆపిల్ సైడర్ వినెగార్ రక్తస్రావ నివారిణిగా ఉంది, ఇది ముఖ్యంగా ముఖం మరియు మెడ మీద, చర్మాననిక టోనింగ్ గా సహాయపడుతుంది. దీన్ని కళ్ళలోకి పడనియ్యకుండా జాగ్రత్తపడాలి. లేదంటే ఇది చికాకు కలిగిస్తుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ రెమెడీ:

డౌచ్ (పిచికారీ)కి ఆపిల్ సైడర్ వినెగార్ 2 టేబుల్ స్పూన్లు జోడించడం ద్వారా మహిళల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. అయితే ఈ రెమెడీ అందరు మహిళలకు అనుకూలంగా స్పందించదు. మరియు ఇది జాగ్రత్తగా తీసుకోవాలి.

ఆపిల్ సైడర్ వినెగార్ ను ఎంత మోతాదు తీసుకోవాలి?

ఆపిల్ సైడర్ వినెగార్ ప్రతి రోజు తీసుకోవచ్చు. ప్రతి రోజూ రెండు నుండి నాలుగు టేబుల్ స్సూన్ల ఆపిల్ సైడర్ వినెగార్ తీసుకోవడం వల్ల జీవకళ మరియు ఆరోగ్య మెరుగుపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగార్ ను ఉదయంపూట తీసుకుంటే , శరీరాన్ని శుభ్రపరచడానికి శక్తివంతమైన ప్రభావం కలిగి ఉంటుంది.

బరువు తగ్గించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ను మీరు ఉపయోగించాలనుకుంటే, ఒక గ్లాసు నీళ్ళలో మూడు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకొని బాగా మిక్స్ చేసి, తాగాలి. ఇలా ఒక రోజులో మూడు సార్లు తాగినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. మరింత మెరుగైన ఫలితం కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ ను నిమ్మరసం, తేనె కలిపిన నీటిలో వేసి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

English summary

10 Health Benefits Of Apple Cider Vinegar For Your Body

Apple cider vinegar is a brown liquid made ​​from fermented apples. Apple cider vinegar has been used since thousands of years ago because of the benefits that can cure various diseases and infections, such as sinusitis, fever, and flu. Drinking apple cider vinegar every day will help improve digestion and cure many chronic illnesses, such as depression, fatigue, arthritis, and can lower blood pressure and cholesterol levels.
Desktop Bottom Promotion