For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రాభంగం కలిగించే 10 హైక్యాలరీ ఫుడ్స్ కు చెక్ పెట్టండి

By Super Admin
|

సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల కూడా సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. అంతే కాదు చాలా మంది నిద్రపోవడానికి నిద్రమాత్రలు వేసుకుంటారు అది ఆరోగ్యానికి మంచిది కాదు.

ఫాస్ట్ గా ఫ్యాట్ ను కరిగించే ఫన్నీ ఐడియాస్!ఫాస్ట్ గా ఫ్యాట్ ను కరిగించే ఫన్నీ ఐడియాస్!

నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. ఉదయం నిద్రలేవగాని కడుపు ఉబ్బరం, మలబద్దకం, గ్యాస్, అజీర్ణం, యాసిడి రిఫ్లెక్షన్, విరేచనాలు ఇలాంటివి మరికొన్ని జీర్ణక్రియ సమస్యలు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. కొవ్వు పదార్ధాలు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఇవి కడుపును అసౌకర్యంగా ఉంచుతాయి.

ముఖ్యంగా రాత్రిళ్ళు తీసుకొనే కొన్ని ఆహారాలు నిద్రలేకుండా చేస్తాయి. ఉదాహరణకు ఉదయం నిద్రలలేవగానే యాసిడ్ రిఫ్లెక్షన్ గురైతే, రాత్రిళ్లో కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడాలకు దూరంగా ఉండాలి. అదే విధంగా అజీర్తి సమస్యలు గమనించినట్లైతే, రాత్రిళ్లో హార్డ్ గా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉదా: పచ్చి ఉల్లిపాయలు, చిదిమిన బంగాళదుంపలు వంటి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలు రాత్రిళ్ళో తినడం మానేయాలి. మరి రాత్రిల్లో తీనకూడని కొన్ని అధిక క్యాలరీ ఫుడ్స్ లిస్ట్ క్రింది విధంగా ఉన్నాయి...

నిద్రించే ముందు మీరు ఖచ్చితంగా తినకూడని 10 హై క్యాలరీ ఫుడ్స్

1. పాస్తా:

1. పాస్తా:

ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన పాస్తా పిండితో కూడినటువంటి ఆహారం. ఒక రకమైనటువంటి నిశితమైన ధాన్యంతో తయారు చేయబడిన పాస్తా తినడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకొని, నిద్రకు అంతరాయ్యం కలిగిస్తుంది. కాబట్టి నిద్రించే ముందు వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

2. పిజ్జా:

2. పిజ్జా:

పెద్దగా జ్యూసిగా, రుచికరమైన పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వీటిని పగలు తింటే జీర్ణం అవ్వడానికి సరిపడా సమయం ఉంటుంది. అదే రాత్రుల్లో తీసుకుంటే, నిద్రించే సమయంలో అవయవాలన్ని చాలా నిధానంగా పనిచేయడం వల్ల జీర్ణక్రియకు కూడా నిధానం అవుతుంది. దాంతో తిన్న ఆహారం అరగక కొవ్వుగా మారుతుంది . పిజ్జా చాలా జిడ్డుగా ఉంటుంది. నూనెలతో తయారు చేయడం వల్ల గుండెల్లో ప్రమాదం పెరుగుతుంది. దాంతో హార్ట్ బర్న్ కు కారణం అవుతుంది.

3. షుగర్ క్యాండీస్:

3. షుగర్ క్యాండీస్:

ఈ ప్రపంచంలో క్యాండీస్ అంటే ఇష్టపడని వారు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిందే. ఎవరైనా సరే ఏదో ఒక వయస్సులో వీటిని టేస్ట్ చూసే ఉంటారు. అంతే కాదు, ఇప్పటీకి వీటి మీద మక్కువ ఏమాత్రం తగ్గదు. అయితే బరువు తగ్గించుకోవాలనుకొనే డైటర్స్ మాత్రం వీటికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది. ఇవి రాత్రి సమయంలో తినడం వల్ల అలసటకు గురిచేస్తుంది. మీకు ప్రశాంతంగా మరియు పీస్ ఫుల్ గా నిద్రించాలంటే, జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం నివారించి ఓట్ మీల్, లేదా తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవాలి.

4. రెడ్ మీట్:

4. రెడ్ మీట్:

రాత్రి సమయంలో మాంసాహారాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. అయితే పూర్తిగా నిలిపివేయడం కంటే ఈ ప్రోటీన్ ఫుడ్ ను తగిన మోతదాలో తీసుకోవడం మంచిది. అది కూడా లేట్ నైట్ కాకుండా త్వరగా తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం తీసుకొన్న తర్వాత వేడి నీళ్ళు లేదా వేడి పాలను త్రాగి నిద్రించడం వల్ల అటు జీర్ణశక్తికి ఇటు మీ గాఢ నిద్రకు ఎటువంటి భంగం కలగదు.

5. చాక్లెట్స్ :

5. చాక్లెట్స్ :

చాక్లెట్స్ లో ప్యాట్స్, కెఫిన్ మరియు కోకా అధికంగా ఉండటం వల్ల ఎసిడిటి సమస్యను తీవ్రతరం చేస్తాయి. డిన్నర్ తర్వాత కొన్ని డిజర్ట్స్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రుల్లో చాక్లెట్స్ కు దూరంగా ఉండాలి. లేదంటే మీకు నిద్రలేకుండా చేస్తుంది.

6. వెజిటేబుల్స్:

6. వెజిటేబుల్స్:

కూరగాయలు రుచికరమైనవి, న్యూట్రీషియన్ డైట్ ఫుడ్స్, కానీ రాత్రిల్లో నిద్రించే ముందు తీసుకోవడం అంత మంచిది కాదు, చాలా సింపుల్ కారణం : వెజిటేబల్స్ లోని ఉల్లిపాయ, బ్రొకోలీ లేదా క్యాబేజ్ వంటి అధిక మొత్తంలో కరగని ఫైబర్ ఉంటుంది. వీటి అరుగుదలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. పగలు కంటే రాత్రిల్లో ఫైబర్ ఫుడ్స్ అరగడం చాలా కష్టం, దాంతో జీర్ణ వ్యవస్థ చాలా నిదానంగా జరిగి అపానవాయువు ఏర్పడటానికి కారణం అవుతుంది.

7. మద్యం/కార్బోనేటెడ్ డ్రింక్స్:

7. మద్యం/కార్బోనేటెడ్ డ్రింక్స్:

చాలా మంది రాత్రి సమయంలో మద్యపానం సేవించడం వల్ల మంచి నిద్ర పడుతుందనుకుంటారు కానీ అది తప్పు. మద్యం నిద్రకు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండి, ఎక్కువ సార్లు రెస్ట్ రూమ్ కు పోయేలా చేసి నిద్రకు భంగం కలిగిస్తుంది. అతిగా మద్యపానం, నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి నిద్రించే ముందు మితంగా తీసుకోవడం మంచిది.

కాఫీ, టీ, కోలా డ్రింక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌, సోడా, తదితరాలను మానేయాలి. ఇవి ఆన్నాశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్‌ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. ఫలితంగా నిద్రలేమి. కాబట్టి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది.

8. చీజ్ బర్గర్స్:

8. చీజ్ బర్గర్స్:

ఇతర ఫ్యాటీ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్, చీజ్ బర్గర్స్ వంటి ఆహారాలను నింద్రించే ముందు తప్పనిసరిగా నివారించాలి. ఎందుకంటే అవి కడుపులో నేచురల్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి హార్ట్ బర్న్ కు దారితీస్తుంది.

9. చిల్లీ సాస్/టమోటో సాస్:

9. చిల్లీ సాస్/టమోటో సాస్:

చిల్లీ సాస్ కొన్నిమసాలా దినుసులతో చేర్చినప్పుడు చాలా ఆరోగ్యం మరియు ఉపయోగకరం. కానీ అలాగే వేటితోనూ కలపకుండా సపరేట్ గా తీసుకోవడం చాలా ప్రమాధకరం. ఈ హై క్యాలరీ ఫుడ్ ప్రోటీనులు మరియు స్లో బర్నింగ్ కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటుంది. టమోటో సాస్ యాసిడ్ రిఫ్లెక్షన్ కు కారణం అవుతుంది మరియు జీర్ణక్రియను నిధానం చేస్తుంది . పిజ్జా చీజ్ తో నింపి ఉంటుంది మరియు టమోటో సాస్ కూడా. కాబట్టి రాత్రుల్లో దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్.సిడిటి ఉన్నవారు టమోటోలను పూర్తిగా మానేయమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. సాధారణంగా టమోటో జ్యూసీగా ఉండి ఎసిడిటికి కారణం అవుతుంది. దాంతో ఛాతీలో మంట పుడుతుంది. నిద్రలేమికి కారణం అవుతుంది

10. ఫ్రైడ్ ఫుడ్/స్నాక్స్ అండ్ చిప్స్:

10. ఫ్రైడ్ ఫుడ్/స్నాక్స్ అండ్ చిప్స్:

ఫ్రైడ్ ఫుడ్స్ రాత్రిళ్లో తినకూడదు. వీటిని హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు మరియు ట్రాన్స్ కొవ్వు థమనులను పాడుచేస్తాయి. జీర్ణం అవ్వడానికి కూడా కష్టం అవుతుంది. దాంతో నిద్రలేకుండా చేస్తుంది.

English summary

10 High Calorie Foods You Should Never Eat Before Going To Bed

We all know that going to bed on a full stomach is a big no. After a hard day at work or school, our body needs a break from performing the functions it performs on a daily basis, and your digestive system should be no exception to this.
Desktop Bottom Promotion