For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఔషధ విలువలున్న ఈ నూనెలు గురించి మీకు తెలుసా..!

|

నూనెలు ఇంటిలో చేసే వంటలో ముఖ్యమైనవే కాక, జీవిత ప్రమాణాలను పెంచే ఔషధ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. కాకపోతే మీ దగ్గరలోనే ఉన్న నిజాలను మాత్రం మీరు తెల్సుకోవడం ముఖ్యం. మీరు వంటగదిలో వాడే సామాగ్రిని చూడండి, అప్పుడు ఇటువంటి అద్భుతమైన, అత్యవసర 10 నూనెలతో మనం ఆరోగ్యకరంగా ఉండటం ఎంత సులభమో, ఎంత చవకైనదో మీరే అర్ధం చేసుకోవచ్చు.

ఆరోగ్యానికి మేలు చేసే 10 విలువైన నూనెలు

రోజ్ మేరీ నూనె

రోజ్ మేరీ నూనె శక్తిని పెంచే నూనె. ఇటువంటి నూనెలు మానవ మెదడు ఏకాగ్రతను, దృష్టిని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు తెల్పుతున్నాయి. ఇది మెదడు శక్తిని పెంచే ఒక శక్తి పానీయం. దీనిలో ఇనుము, కాల్షియం, విటమిన్ బి 6 సమృద్ధిగా ఉన్నాయి.

ఆరోగ్యానికి మేలు చేసే 10 విలువైన నూనెలు

ద్రాక్ష నూనె

ద్రాక్ష నూనె ప్రకృతిలోని ఉత్తమ యాంటిఆక్సిడెంట్ లలో ఒకటి. ఇది మూత్ర విసర్జక ప్రేరేపకమే కాక మూత్రం ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది. దీని ప్రత్యేక ప్రతిభ వలన ద్రాక్ష నూనె విషపదార్ధాలను మూత్రపిండాల నుండి తొలగించి దీనిని బలంగా, మరింత సమర్ధవంతంగా చేస్తుంది. ద్రాక్ష నూనెలో యాంటి బ్యాక్టీరియాల్, యాంటి వైరల్, యాంటి ఫంగల్ లక్షణాలు ఉన్నాయని కూడా అధ్యయనాలు తెల్పుతున్నాయి.

ఆరోగ్యానికి మేలు చేసే 10 విలువైన నూనెలు

తులసి నూనె

జలుబు, కఫానికి ఉన్న ఉత్తమ ప్రత్యామ్నాయ మందులలో తులసి నూనె ఒకటి. ఈ అద్భుతమైన సేకరణ ఒక బొట్టు కొనసాగే కఠిన కఫాన్ని, చెడు జలుబును అరికడ్తుంది. ఇటువంటి నూనెలో శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు కూడా ఉన్నాయి.

ఆరోగ్యానికి మేలు చేసే 10 విలువైన నూనెలు

క్లెరి సెజ్ నూనె

క్లెరి సేజ్ నూనె జీర్ణ సంబంధ సమస్యలకు సహాయకారిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో తయారయ్యే వాయువును తగ్గించడం వలన ఆహారం త్వరగా అరుగుతుంది. దీనిని సువాసనా చికిత్సలలో కూడా వాడవచ్చు. ఇది రుతుస్రావానికి సంబంధించిన ఒక రకమైన కండరాల పక్షవాతం నుండి కూడా స్త్రీలను రక్షిస్తుంది.

ఆరోగ్యానికి మేలు చేసే 10 విలువైన నూనెలు

వెనిలా నూనె

వెనిలా నూనె మరొక గొప్ప యాంటిఆక్సిడెంట్. ఇది క్యాన్సర్ చికిత్సలో కాక ఆందోళన, నిద్రలేమి వంటి మానసిక సమస్యల నుండి ఉపశమనానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రపంచ౦లొని అత్యంత అభిమానమైన రుచులలో ఒకటి కూడా. ఇది తియ్యగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.

ఆరోగ్యానికి మేలు చేసే 10 విలువైన నూనెలు

గులాబీ నూనె

మంచి కామోద్దీపన౦ అవడంతో బాటుగా , మానవ శరీరానికి గులాబీనూనెతో మంచి, గొప్ప ఉపయోగాలు ఉన్నాయి. ఈ అత్యవసర నూనె శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఆందోళన, ఒత్తిడి, భయాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాక శరీరానికి, మనసుకు కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

ఆరోగ్యానికి మేలు చేసే 10 విలువైన నూనెలు

లవంగ నూనె

లవంగ నూనె ప్రకృతిలోని అద్భుతాలలో ఒకటి. ప్రారంభంలో దీనిని దంత సమస్యలలో ఒక నొప్పినివారిణి, క్రిమినాశక౦గా ఉపయోగించే వారు. పన్ను నొప్పి, దంతక్షయ౦ వంటి పంటి సమస్యలలో ఇది ఒక ఇంటి వైద్యం. దీనిలో శరీరవ్యాధి నిరోధక వ్యవస్థను వృధ్ది చేసే ఇనుము, విటమిన్ ఏ, సి వంటివి సమృద్ధిగా ఉన్నాయి.

ఆరోగ్యానికి మేలు చేసే 10 విలువైన నూనెలు

మింట్ ఆయిల్

ఒక ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను వృద్ది చేసే సమర్ధత ఉన్నందున మిరియాల నూనెను సంప్రదాయ ప్రత్యామ్నాయ ఆహారపదార్ధ౦గా ఉపయోగించేవారు. ఇది ఉబ్బరం, అపానవాయువు, ఇతర రకాల ప్రేగు సమస్యల నుండి ఉపశమనం కల్గిస్తుంది. ఋతుస్రావం సంబంధ తిమ్మిరి, తలనొప్పులను తగ్గిస్తుంది. వెలుపల పూతగా వాడినట్టయితే ఇది దురదలను తగ్గిస్తుంది.

ఆరోగ్యానికి మేలు చేసే 10 విలువైన నూనెలు

లావెండర్ నూనె

లావెండర్ నూనెను దానిలోని చికిత్సాసామర్ధ్యాల వలన ఎన్నో ఏళ్ళ నుండి వాడు తున్నారు. దీని సహజ ప్రశాంత ప్రభావం వలన ఈ అత్యవసర నూనెను సువాసన చికిత్సల్లో ఉపశమనానికి ఉపయోగిస్తారు. యాంటి సెప్టిక్, నొప్పినివారిణి అయినందున చిన్న కాలిన గాయాలు, కీటకాల కుట్టడం వంటి వానిలో దీనిని వాడుతున్నారు.

ఆరోగ్యానికి మేలు చేసే 10 విలువైన నూనెలు

నిమ్మ నూనె

నిమ్మ నూనె అన్నింటికి ఉపయోగపడే అత్యంత గొప్ప ద్రవం. మంచే సువాసనతో బాటుగా శరీరాన్ని వ్యాధుల నుండి దూరంగా ఉంచే విటమిన్లు, లవణాలతో ఇది నిండి ఉంది. ఇది విషపదార్ధాల నుండి శరీరాన్ని శుభ్రపరిచి, శరీరాన్ని, మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. ఇతర అత్యవసర నూనెలు చేసే పని ఇది కూడా చేస్తుంది. ఇది అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఉత్తమ ఆయుధం.

English summary

10 Oils Needed to Stay Healthy | ఆరోగ్యానికి మేలు చేసే 10 విలువైన నూనెలు

Oil is not just significant in cooking purposes at home, but they have medicinal value that could prolong life. You only need to get through the facts, and it’s just within your reach.
Desktop Bottom Promotion