For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ స్టాంట్ నూడుల్స్ ను నివారణకు 10 కారణాలు!

|

చైనా నుం డి దిగుమతి అయిన నూడుల్స్‌ కల్చర్‌ ఇప్పుడు మనదేశంలో ప్రతి గళ్లీలోనూ విస్తరించింది. వెస్టర్న్‌ కల్చర్‌ నుండి వచ్చిన పిజ్జా, బర్గర్‌లు సంపన్నులకు చాలా ఏళ్ళతరబడి నుండే సుపరిచితం.. ఇప్పుడు బర్గర్ల సంస్కృతి మధ్యతర గతి వర్గాలను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. వర్షాకాలం, శీతాకాలంలో.. ఈ తరహా ఆహారపదార్థాలకు విపరీతమైన క్రేజ్‌ లభిస్తుంది. నూడుల్స్‌ పట్ల నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నూడుల్స్‌కు మూలం చైనా. నూడుల్స్‌కు పెద్ద చరిత్రే ఉంది. రెండువేల నుంచి నాలుగువేల సంవత్సరాలకు పూర్వం నుంచే వీటి వాడకం ఉందని చరిత్రకారులు నిర్థారించారు. మన రాష్ట్రంలో మైదాను తడిపిండిగా మార్చి జంతికల గొట్టం మాదిరిగా ఉండే యం త్ర సహాయంతో నూడుల్స్‌ తయారుచేస్తారు. ఇవి కూడా జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో లభ్యమవుతున్నాయి.

ఈ రోజుల్లో నూడుల్స్ చాలా కామన్ అయిపోయింది. పిల్లలు, పెద్దలు కూడా తరచూ నూడుల్స్ చేసుకుని తింటున్నారు. కాని ఆ నూడుల్స్ అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. నేటి రోజులలో త్వరగా తయారయ్యే ఆహారాలు వచ్చేశాయి. వాటిలో అందరూ ఇష్టపడే నూడుల్స్ ఒకటి. పిల్లులు తిండి తినడానికి ఇష్టపడకుండా మారం చేస్తే చిటికెలో నూడిల్స్ తయారు చేసి ఇచ్చేస్తుంటారు.అలాగే కాలేజ్ స్టూడెంట్స్ మరియు ఉద్యోగస్తులు అతి త్వరగా..సులభంగా తయారైపోయే ఈ నూడిల్స్ కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాని ఈ రకమైన ఇన్ స్టాంట్ నూడుల్స్ ఆహారం అనారోగ్యకరం. ఇవి తయారు చేయబడి ప్యాక్ చేయబడి వుంటాయి. కనుక ఒక్కో సారి ఫుడ్ పాయిజనింగ్ లేదా పొట్టలో ఇన్ ఫెక్షన్ లకు అవకాశం వుంది.

ఎంత రుచికరంగా ఉన్నా పదే పదే తినాలనిపించే ఈ నూడుల్స్‌, పానీపూరీ, హాట్‌చాట్‌ల కారణంగా అనారోగ్యం ప్రబలే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరి స్తున్నారు. నూడుల్స్‌ తయారీ కి కావాల్సిన వెనిగర్‌, సోయాసాస్‌, గ్రీన్‌చిల్లీ సాస్‌, టమోటా సాస్‌లు వంటివి సైతం ఇక్కడే తయారు చేయడం పెరిగింది. ఫాస్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా తినడం వల్ల పిల్లల లేత జీర్ణకోశాలు పాడైపోతాయి. స్థూలకాయం కలుగుతుంది. పెద్దలలో ఎసిడిటీ, అల్సర్‌ పెరిగిపోతాయి. పోషక విలువలు శరీరానికి తగినంతగా అందక పోవడంతో పోషకాహారలోపం ఏర్పడుతుంది. నూడిల్స్ తయారీకి కలర్ఫుల్ రసాయనాల వాడకాన్ని తగ్గించి నూడుల్స్ ఆరోగ్యకర ఆహారంగా వుండాలంటే, వాటిలో ప్రొటీన్లు, మినరల్స్, పచ్చటి కూరలు, కేరట్లు, కేప్సికం, బీన్స్ వంటివి చేర్చాలి.

నూడుల్స్ తింటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..!

తగినన్ని పోషకాలు అందవు: నూడుల్స్ లో లాభం చేకూర్చే ప్రొటీన్లు లేదా మినరల్స్ వుండవు. కనుక దీనిని జంక్ ఫుడ్ గా భావించాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌లో కార్బోహైడ్రేట్‌లు ఎక్కువగా జీర్ణశక్తికి దోహదం చేస్తే ఫైబర్లు తక్కువగా ఉంటాయి. అంతేగాక కొవ్వు పదార్థాలు ఎక్కువగా, విటమిన్లు తక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరానికి పోషణను ఇవ్వవు.

నూడుల్స్ తింటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..!

క్యాన్సర్: ఫాస్ట్‌ఫుడ్స్‌లో ఉపయోగించే ముదురు ఎరుపు రంగు క్యాన్సర్‌ను కలిగిస్తుంది. ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడానికి అలాంటి రంగులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతే కాదు ఇన్ స్టాంట్ నూడుల్స్ లో క్యాన్సర్ కు కారణం అయ్యే స్టైరోఫోమ్ నిల్వ ఉంటుంది.

నూడుల్స్ తింటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..!

గర్భస్రావం: గర్భధరించన వారు చాలా మంది మహిళలు ఇన్ స్టాంట్ నూడుల్స్ తినడం వల్ల అనేక మందికి గర్భస్రావంతో బాధపడ్డారు. ఎందుకంటే ఇన్ స్టాంట్ నూడుల్స్ కడుపులో పెరిగే ఒక పిండం అభివృద్ధి మీద చెడు ప్రభావిత కలిగి ఉంటుంది.

నూడుల్స్ తింటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..!

జీవక్రియలను దెబ్బతీస్తుంది: దీర్ఘకాలం పాటు ఫాస్ట్‌ఫుడ్స్‌ తీసుకుంటే జీర్ణకోశానికి క్యాన్సర్‌ సోకడంతో పాటూ, బి.పి., షుగర్‌, గుండెపోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఫాస్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా తినడం వల్ల పిల్లల లేత జీర్ణకోశాలు పాడైపోతాయి. స్థూలకాయం కలుగుతుంది. పెద్దలలో ఎసిడిటీ, అల్సర్‌ పెరిగిపోతాయి. పోషక విలువలు శరీరానికి తగినంతగా అందక పోవడంతో పోషకాహారలోపం ఏర్పడుతుంది. 'సైక్లోమేట్స్‌'', ''డల్సిన్‌'' లాంటి కృత్రిమ రంగులను విషపూరితంగా భావించి పాశ్చాత్య దేశాల్లో వీటిని నిషేధించగా మన దేశంలో ఇంకా యథేచ్ఛగా ఉపయోగిస్తూనే ఉన్నారు.

నూడుల్స్ తింటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..!

ప్రొఫిలైన్ గ్లైకోల్: ఫాస్ట్‌ఫుడ్స్‌ను దీర్ఘకాలంపాటు నిల్వ ఉంచడానికి ఉపయోగించే ''మోనో సోడియం గ్లుటమేట్‌'' లాంటి ప్రిజర్వేటివ్‌లు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇన్ స్టాంట్ నూడుల్స్ లో ప్రొఫిలైన్ గ్లైకోల్ యాంటీ ఫ్రీజ్ వస్తువు ఉండటం వల్ల నూడుల్స్ ఎండిపోకుండా తాజాగా కనిబడుతాయి. ఇవి శరీరంలో చాలా సులభంగా కలిసిపోతాయి. దాంతో గుండె, కాలేయం, మరియు మూత్రపిండాల మీద ప్రభావాన్ని చూపెడుతుంది. జీవక్రియలను బలహీనపడేలా చేయడంలో రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది.

నూడుల్స్ తింటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..!

జీర్ణం: నూడుల్స్ తయారీ సరిలేనపుడు అవి తింటే జీర్ణక్రియ సాఫీగా సాగక పొట్ట గడబిడకు గురై అజీర్ణం ఏర్పడుతుంది. ఇన్ స్టాంట్ నూడుల్స్ జీర్ణ వ్యవస్థ మీద చాలా చెడు ప్రభాన్ని కలిగిస్తాయి.

నూడుల్స్ తింటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..!

ఊబకాయం: ఇన్ స్టాంట్ నూడుల్స్ ఊబకాయాన్ని పెంచడంలో ముందు స్థానంలో ఉంది. శరీరంలో నీటి శాతాన్ని తగ్గించే అధిక సోడియంతో పాటు చెడు ఫ్యాట్స్ కలిగి ఉండటం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. మీ రెగ్యులర్ డైట్ లో నూడుల్స్ తీసుకోవడం వల్ల అధిక బరువు పెరగడానికి దారితీస్తుంది.

నూడుల్స్ తింటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..!

మోనోసోడియం గ్లుటమేట్: - ఫాస్ట్‌ఫుడ్స్‌ను దీర్ఘకాలంపాటు నిల్వ ఉంచడానికి ఉపయోగించే ''మోనో సోడియం గ్లుటమేట్‌'' లాంటి ప్రిజర్వేటివ్‌లు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. 1-2శాతం మంది ఈ మోనోసోడియం గ్లుటమేట్ వల్ల అలెర్జీకి గురైనారు. దీని వల్ల కడుపులో మంట, చాతీలో మంటగా అనిపిస్తుంది. ఇంకా ఉదరంలో నొప్పి మరియు తలనొప్పికి కూడా దారితీస్తుంది.

నూడుల్స్ తింటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..!

సోడియం: నూడిల్స్ లో అధికంగా ఉప్పు ఉంటుంది. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ మరియు గుండె వ్యాధులు, స్టోర్ మరియు కిడ్నీ డ్యామేజ్, మలబద్దకం వంటి సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.

నూడుల్స్ తింటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..!

జంక్ ఫుడ్: ఇన్ స్టాంట్ నూడుల్స్ జంక్ ఫుడ్ గా భావించబడుతోంది వీటిలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ విటమిన్స్, మినిరల్స్ మరియు ఫైబర్ ఉండవు. ఇంకా వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్ మరియు ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటాయి. ఇది కెలోరీ సాంద్రతతో మీ ఆరోగ్యం మీద వ్యతి రేక ప్రభావాని అధికంగా చూపిస్తుంది.

English summary

10 Reasons To Avoid Instant Noodles

Noodles might seem like the ultimate food, especially to school children and college goers. Extremely easy to make and yummy to scarf down, noodles easily replace proper, healthy meals nowadays.
Desktop Bottom Promotion