For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీలో ఎనర్జీ తగ్గిపోవడానికి 10 ప్రధాన కారణాలు

By Super
|

సాధారణంగా ఏదైన అనారోగ్యం చేసినప్పుడు శక్తిలేకుండా ఉండటం అనేది సహాజం. అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోయి, లేదా నిద్రలేమి వల్ల కూడా ఎనర్జీ లేని అనుభూతిని పొందుతుంటారు కొందరు. మీరు బాగా నిద్రించినప్పటికీ మరియు మీరు చూడటానికి ఆరోగ్యంగా కనిపించినప్పటీకి శక్తి (ఎనర్జీ)లేనట్లు కనిస్తున్నారా?

ఎల్లప్పుడూ అలసట మరియు విసుగు చెందడం, శక్తి(ఎనర్జీ)లేకున్నట్లు అనిపించడం ఈ లక్షణాలకు కొన్ని సందర్భాల్లో ప్రధాన కారణాలు తెలుసుకోలేము. అయితే అలా ఒక్కసారిగా అలసట మరియు విసుగు పొందడానికి ఈ క్రింది లక్షణాలు కూడా కారణం కావచ్చు. కాబట్టి శక్తి లేకపోవడానికి ప్రధాన కారణం తెలుసుకొన్నట్లైతే తప్పనిసరిగా చికిత్స లేదా నివారణ పద్దతులను పాటించవచ్చు.

మరి మీకు శక్తిలేకుండా చేసే ఆ అపరాధి లక్షణాలేంటో ఒక సారి చూద్దాం...

నిద్రించే ముందు ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించడం:

నిద్రించే ముందు ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించడం:

ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, కంప్యూటర్, టీ.వీ చూడటం లేదా వీడియో గేమ్స్ ఆడటం వంటివి నిద్రించడానికి ముందు చేయడం వల్ల మీరు అలసటకు గురికాక తప్పదు. దాంతో విసుగు, ఒత్తిడి ఎక్కువౌతాయి. బ్లడ్ ప్రెజర్ పెరగడం వల్ల మీరు సరిగా నిద్రపోలేరు మరియు గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల నిద్ర పట్టనివ్వదు. కాబట్టి, నిద్రించడానికి కనీసం మూడు గంటల ముందు ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగించడానికి ముందు దూరంగా ఉండాలి.

పోషకారలేమి(పూర్ డైట్)

పోషకారలేమి(పూర్ డైట్)

కొన్ని క్యాలరీలను తగ్గించుకోవడం వల్ల మీరు కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవచ్చు. కానీ, శరీరానికి సరిపడ పోషకాహారం తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన శక్తి ప్రవాహానికి (శక్తి కోల్పోవడానికి)కారణం అవుతుంది. ఇది పూర్తిగా డైట్ వల్లే జరుగుతుంది. మన తీసుకొనే ఆహారంలో రిఫైండ్ షుగర్స్ మరియు కార్బోహైడ్రేట్స్ వల్ల మీ శరీరంలో నిల్వఉండి. మిమ్మల్ని అలసటకు గురిచేస్తాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలకు బదులుగా , మీరు రోజులో సమతుల్య ఆహారం తీసుకోవాలి. అందులో ముఖ్యంగా తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్, లీన్ ప్రోటీన్స్, మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మీ రోజంతా మీ శరీరానికి కావల్సిన ఫ్లూయిడ్స్ అందుతాయి. అంటే మూడు పూటల భోజనం మరియు, ప్లస్ పుష్టికరమైన స్నాక్స్ !

బ్లూగా అనిపిస్తోందా?

బ్లూగా అనిపిస్తోందా?

డిప్రెషన్ వల్ల చెప్పలేని అలసట, ఆకలి లేకపోవడం, మరియు ప్రతికూల భావాలు మీలో ఉండవచ్చు. ఇవన్నీ కూడా శక్తిలేకపోవడానికి దోహదపడుతాయి. శరీరంలో శక్తి తగ్గినప్పుడు మాటలోనూ, చూపులోనూ కొద్దిగా తేడా కనిపిస్తుంది. చూపు బ్లర్ గా, బ్లూగా అనిపిస్తుంది. డిప్రెషన్ తో బాధపడే వారు డాక్టర్ ను సంప్రదించి, ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రత్నించాలి. మరియు వ్యాయామాల ద్వారా శక్తిని పొందడానికి ప్రయత్నించాలి. అలాగే డాక్టర్ కౌన్సిలింగ్ ద్వారా కొన్ని మెడికేషన్స్ ను వాడమని సూచిస్తారు.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ( UTI)లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ( UTI)లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్

సాధరణంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపస్తుంటుంది. ఇటీవల మీరు కనుక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురిఅయినట్లైతే, తాత్కాలికంగా ఉన్నట్లైతే పర్వాలే. కానీ, సమస్య ఇప్పటీకి అలాగే ఉంటే, మీరు తీవ్రమైన అలసట ఫీలింగ్ ను కలిగి ఉంటారు. వెంటనే డాక్టర్ ను సంప్రదించి ఈ సమస్య నుండి బయటపడటానికి నిర్ధారించుకోండి.

నిద్రలేమి( స్లీప్ ఆప్నియా)

నిద్రలేమి( స్లీప్ ఆప్నియా)

రాత్రిల్లో మీర గాఢ నిద్రపోతున్నారని మీకు అనిపించినా, కొన్ని సందర్భాల్లో మీరు నిద్రపోరు. మీరు నిద్రలేమితో బాధపడుతుంటారు, ఈ పరిస్థితుల్లో మీరు శాస్వపీల్చుకోడం కొన్ని సందర్భాల్లో తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది మీ నిద్రకు అంతరాయం కలిగిస్తోందన్న విషయం మీకు కూడా తెలియదు. కాబట్టీ, మీతో ఉన్న మీ పాట్నర్ ను అడిగి తెలుసుకోండి, నిద్రించేటప్పుడు శ్వాసతీసుకోవడం కష్టంగా అనిపిస్తోందా లేదా గురకపెడుతూ నిద్రిస్తున్నానా అని అడిగితెలుసుకోవాలి.? అలా అయితే , అది , మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి, అలాగే ధూమపానం కూడా నివారించాలి లేదా డాక్టర్ ను సంప్రదించండి.

థైరాయిడ్ సమస్యలు

థైరాయిడ్ సమస్యలు

హైపోథైరాయిడిజం, ఇది ఒక underactive థైరాయిడ్ , ఈ థైరాయిడ్ గ్రంథుల యొక్క ప్రధాన పని జీవక్రియలను క్రమబద్దం చేయడం( లేదా మీరు తీసుకొనే ఆహారంను శక్తిగా మార్చుతుంది.) హైపోథైరాయిడ్ ఉన్నవారు జీవక్రియలకు అంతరాయ కలిగితస్తుంది, దాంతో మీలో శక్తిని తగ్గించేస్తుంది మరియు ఫలితంగా బరుతు తగ్గుతారు. మీరు థైరాయిడ్ సమస్య ఉన్నట్లు అనుమానిస్తుంటే కనుక, మీ శరీరంలో హార్మోన్ల స్థాయిలను కనుక్కోవడానికి మీరు వైద్యుడిని సంప్రధించండి.

మీరు రక్తహీనత కలిగి ఉన్నా

మీరు రక్తహీనత కలిగి ఉన్నా

రక్తహీనత వల్ల కూడా శక్తిలేకుండా ఉండటాకి కారణం కావచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య రుతుక్రమ సమయంలో అధికంగా రక్తస్రావం అవ్వడంతో రక్తంలోని ఐరన్ లోపంకు కారణమవుతుంది. ఫలితంగా బ్లెడ్ సెల్ కౌంట్ తగ్గిపోతుంది. మరియు మీకు రెడ్ బ్లడ్ సెల్స్ చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే మీ శరీరంలోని అన్ని అవయావలకు మరియు కణజాలలకు ఎర్రరక్త కణాలు ఆక్సిజన్ మరియు శక్తిని తీసుకెళుతుంది. రక్తహీనత ఎదుర్కోవడానికి మీ రెగ్యులర్ డైట్ లో ఐరన్ రిచ్ ఫుడ్స్, అంటే సెష్ ఫిష్, బీన్స్, త్రునధాన్యాలు, సెరెల్స్ మరియు బీఫ్ మరియు లివర్ వంటివి చేర్చుకోవాలి.

మధుమేహ వ్యాధి

మధుమేహ వ్యాధి

మధుమేమ వ్యాధి ప్రారంభదశల్లో ఉన్నట్లైతే, చాలా మంది వారికి తెలియకుండానే డయాబెటిస్ తో బాధపడుతుంటారు . డయాబెటిస్ కు ప్రధాన కారణం మీ రక్తప్రవాహంలో ఇన్సులిన్ అధికంగా ఉండటం దానివల్ల ఇది ఇన్సులిన్ సెల్స్ శోషణ వల్ల అదనపు చక్కెరలకు కారణం అవుతుంది. ఈ మొత్తం వ్యవస్థ అలసటకు కారణమౌతుంది . మీరు డయాబెటిస్ కలిగిన కుటుంబ చరిత్ర కలిగిన లేదా అధిక బరువు ఉన్నా, వెంటనే డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

చాలా కాఫిన్

చాలా కాఫిన్

కాఫీలోని కెఫిన్, కేఫినేటెడ్ టీలు, సోడా, ఎనర్జీ డ్రింక్స్, కొన్ని వైద్యపరమైన మందులు మరియు చాక్లెట్స్ వల్ల మీరు త్వరగా నిద్రపట్టకుండా చేస్తుంది. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. చివరికి అలసటకు గురికావల్సి వస్తుంది . కాబట్టీ ఎక్కువ మెత్తంలో కెఫిన్ తీసుకుంటే ఈ రోజో చెక్ పెట్టండి

డీహైడ్రేషన్ (నిర్జలీకరణము)

డీహైడ్రేషన్ (నిర్జలీకరణము)

మీరు అలసట చెంది ఉంటే చాలా సాధారణ మరియు తక్షణ పరిష్కారము నీరు త్రాగాల్సి ఉంటుంది. డీహైడ్రేషన్ కూడా ఎనర్జీని తగ్గించడానికి ప్రధాణ కారణాలలో ఒకటి. మీ శరీరానికి తగినంత నీరు అందకపోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురికావల్సి వస్తుంది. యూరిన్ డార్క్ ఎల్లో కలర్ లో ఉంటే మీరు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నట్లు గ్రహించాలి అందుకు మీరు ఎక్కువగా నీరు తీసుకోవాలి.

English summary

10 Reasons Why You Have No Energy


 Are you drained of all energy even though you’ve been sleeping well and appear to be in good health? Being tired all the time is frustrating—especially when there’s no explanation for your energy drain. Luckily, one of the following ten simple reasons might be the culprit of your fatigue.
Desktop Bottom Promotion