For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జీర్ణశక్తిని సహజంగా మెరుగు పరచుకునే౦దుకు 10 ఉపాయాలు..!

|

జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. కృత్రిమంగా మానవుడు సృష్టించిన వాటికన్నా ప్రాకృతిక సృష్టే బాగుండడం ఈ ప్రక్రియకు ఒక మంచి ఉదాహరణ. ఆరోగ్య రక్షణకు వచ్చేసరికి. సంప్రదాయ మందులకన్నా చాలా రోగాలకు ప్రకృతి చిట్కాలు ఎందుకో బాగా పని చేస్తాయి. మంచి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం సహజ వనమూలికలతో తయారైన ఔషధాలు ఎన్ని ప్రయోజనాలు అందిస్తాయో ఇటీవలి వైద్య పరిశోధనలు తెలియచేశాయి.

మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు 10 ముఖ్యమైన మూలికలు, ప్రాకృతిక ఔషధాల జాబితా ఇదిగో :
మీరు పాటించాల్సిన 10 ప్రాకృతిక చిట్కాలు.

నేరేడు చెట్టు బెరడు

నేరేడు చెట్టు బెరడు

సరైన మోతాదులో నేరేడు బెరడు వాడితే మలబద్ధకం లాంటి ఇతర జీర్ణకోశ సమస్యలు నివారించవచ్చు. ఆసక్తికరంగా, మీరు దాన్ని వాడే ముందు ఏడాది పాటు దాన్ని ఎండబెడతారు లేకపోతె కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు.

అల్లం వేరు

అల్లం వేరు

జీర్ణకోశ కాన్సర్ కు ప్రధాన కారణమైన పెద్ద పేగు వాపు నివారించడానికి నిత్యం అల్లం వేరు వాడితే మంచిదని ఇప్పటికే పరిశోధనల్లో తేలింది. నిజానికి ఈ వాపు జీర్ణ కోశ కాన్సర్ రావడానికి కారణమౌతుంది. మీరు తాజా అల్లం వేరును౦చి రసం తీసి వాడవచ్చు, అల్లం టీ తాగవచ్చు లేదా మీరు తయారు చేసుకునే జ్యూసులు, స్మూతీల్లో సేంద్రియ అల్లం పొడిని కూడా వాడుకోవచ్చు.

సోపు గింజలు

సోపు గింజలు

మధ్యధరా సముద్ర తీరంలో దొరికే ఈ చిన్న గింజలు కడుపుబ్బరం నుంచి అజీర్తి, విరేచనాలు, మలబద్ధకం లాంటి చాలా జీర్ణకోశ సమస్యలను తీర్చగలవు. మీ ప్రేవుల ఆరోగ్యం కోసం ఈ సోపు గింజలు అజీర్తి వల్ల వచ్చే కడుపునెప్పిని నివారిస్తాయి.

సోపు గింజల వల్ల కలిగే అధ్బుత ప్రయోజనాలు తెలుసుకోవడానికి దీన్ని చదవండి.

త్రిఫల

త్రిఫల

ఆధునిక యుగంలోని ప్రాసెస్ చేసిన ఆహారాలు, అనారోగ్యకరమైన జీవనశైలుల వల్ల కలిగే సమస్యల నేపథ్యంలో గొప్ప నిర్విశీకరణ శక్తి కళ త్రిఫల చాలా ముఖ్యమైనది. మీ దినసరి ఆహారంలో త్రిఫల చేర్చుకోవడం వల్ల అనేక విషాలు, ప్రమాదకర పదార్ధాల నుంచి ప్రతిరోజూ మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

పుదీనాకు

పుదీనాకు

పుల్లటి రుచి గల పుదీనాకులు గ్యాస్ ను నివారించి మీ జీర్ణవ్యవస్థలో నెప్పులను తగ్గిస్తుంది.

తుమ్మ జిగురు

తుమ్మ జిగురు

మీ జీర్ణ వ్యవస్థను నిర్విశషీకరించి, పరిశుద్ధం చేయడానికి పనికి వచ్చే తుమ్మ జిగురు, మీ ప్రేవులు వదులై మలబద్ధకం రాకుండా చూస్తుంది. ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లాంటి చాలా సమస్యలు, వివిధ రకాల వాపులు రాకుండా చూస్తుంది కూడా.

బొప్పాయి

బొప్పాయి

ఆరోగ్యకరమైన ఈ పండు పపైన్ అనే జీర్ణ వ్యవస్థకు చెందిన ఎంజైమ్ కలిగి వుండి, ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి జీర్ణ వ్యవస్థ మీద భారం పడకుండా చూస్తుంది. మొత్తం మీద బొప్పాయి మీ ప్రేవులను సరైన స్థితిలో వుంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. బొప్పాయి పళ్ళను ఆస్వాదించండి లేదా మీ భోజనంతో పాటు బొప్పాయి లోని జీర్ణకారి ఎంజైమ్ లను వాడండి. అలాగే సూనాముఖీ ఆకులు, బొప్పాయి కలిస్తే వ్యర్ధాలను మెత్తపరిచి ద్రవాలు కదిలేందుకు దోహదం చేస్తాయి.

కలబంద

కలబంద

ఇటీవలే ప్రసిద్ది పొందిన ఈ అద్భుతమైన మొక్క అతి ముఖ్యమైన క్షారీకరణకు ఉపయోగపడుతుంది. జీర్ణ ద్రవాల క్షారీకరణకు, శ్లేష్మాన్ని, మలినాలను బయటకు నెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. సేంద్రియ కలబంద రసాన్ని తాగి దాని ప్రయోజనాలను ఆస్వాదించండి.

సిలియం ఊక

సిలియం ఊక

రోజుకు కేవల౦ 150 మిల్లీ గ్రాముల సిలియం ఊక తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇది జీర్ణ వ్యవస్థను నిర్విషీకరణ, పరిశుద్దీకరణ చేసి దాని ఆరోగ్యకరమైన పనితీరుకు దోహదం చేస్తుంది.

జారే అవిశాకు

జారే అవిశాకు

ఆహరం, మందులు లాంటి వాటి వల్ల మన జీర్ణ వ్యవస్థ లోపలి పొర ఒక్కోసారి దెబ్బతింటుంది. జారే అవిశాకు ఈ పొరకు రక్షణ ఇచ్చి అరుగుదల నుంచి కాపాడుతుంది.

English summary

10 Remedies to improve your digestion naturally | మీ జీర్ణశక్తిని సహజంగా మెరుగు పరచుకునే౦దుకు 10 ఉపాయాలు..!

Some things in life don’t ever change! The goodness of the natural creations over the synthetic manmade ways of life is perhaps the truest example of this great phenomenon.
Desktop Bottom Promotion