For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నో ఫ్యాట్స్,కడుపు నిండుగా అనుభూతి చెందడానికి 10ట్రిక్స్

By Super
|

మీరు భోజనం ముగించిన తరువాత కూడా తృప్తి పడలేకపోతున్నారా లేక ఒక గంట తరువాత మీరు ఏదైనా చిరుతిండి లేదా అల్పాహారం తీసుకుంటున్నారా? సరే, మేము మీకు ఎలా భోజనం తృప్తిగా తిన్నామనే అనుభూతి చెందటానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నాము. కడుపు నిండా తిన్నామనే అనుభూతి చెందే ఆహారపదార్థాలు ఉన్నాయి కాని ఎలా,ఎప్పుడూ మరియు ఎక్కడ మీరు భోజనం తీసుకుంటున్నారు అనే అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆకలిలేక పోవడం మరియు సంతృప్తి అనే భావాలను కలిగించే మీ భోజనాల అలవాట్లను సరిచూచుకోవటానికి 10 మార్గాలను ఇస్తున్నాము.

సరళమైన ఆహారాన్ని తీసుకోండి

సాధారణంగా ఎవరితోనైన కలిసి భోజనం చేసేప్పుడు లేదా టి.వి. చూస్తూ తినేప్పుడు కావలిసినదానికన్నా ఎక్కువ ఆహారం తీసుకుంటారు ఎందువలనంటే మీ నోటినుండి యెంత ఆహారం వెళుతుందో కూడా పట్టించుకోరు. మీరు భోజనం చేస్తున్నప్పుడు దానిమీదే ధ్యాస ఉంచి తినటంవలన, మీకు త్వరగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. వేగవంతమైన సంగీతాన్ని కూడా నివారించండి, దీనివలన ఆ వేగంతోపాటు మీరు తినే వేగం కూడా పెరుగుతుంది. దీనివలన మీ ప్లేట్ త్వరగా ఖాళీ అయి, మరల నిమ్పుతుంటారు.

వాసనా చూడండి మరియు నమలండి

మీరు భోజనం చేస్తున్నప్పుడు మీ ఆహారాన్ని వాసన చూడండి దీనివలన మీకు భోజనం రుచి కూడా అర్థం అవుతుంది. రెండవది, నమలండి,నమలండి,నమలండి మరియు నమలండి. మెదడుకు 'ఇక చాలు'అనే సంకేతాలు పంపడానికి అవసరం అయిన హార్మోన్లు కొన్ని మీ నమలటం ద్వారా విడుదల అవుతాయి.

స్థూలమైన మరియు తడిగా ఉన్న ఆహారం తీసుకోండి

స్థూలమైన మరియు తడి నియమం వెనుక హేతుబద్ధత అందంగా సూటిగా ఉంటుంది; కేవలం ఆహారంలో ఎక్కువ గాలి మరియు నీటి మూలంగా మీకు త్వరగా ఆకలి తీరిన అనుభూతి కలుగుతుంది. అందువలన ఆహార మార్పిడి పరంగా, పెస్టీ బదులు కూరగాయల సూప్, క్రిస్ప్స్ స్థానంలో సాదా పాప్కార్న్ మరియు రైసిన్లు స్థానంలో ద్రాక్షలను తీసుకోండి.

కొవ్వు ఆహారం తీసుకున్న తరువాత ఆగండి

మీరు మీ భోజనం కొవ్వు పదార్ధం ఎక్కువగా ఉన్న ఆహారంతో తీసుకున్నప్పుడు మీకు కడుపు నిండిన అనుభూతి కలగాలంటే కొంత సమయం ఇవ్వండి. ఉదాహరణకి ఒక ప్రోటీన్ ఉన్న ఆహారం కన్నా, కొవ్వు ఆహారపదార్థం జీర్ణం కావటానికి సమయం పడుతుంది, అందువలన కొంత సమయం ఇవ్వండి.

చాలినంత నిద్ర పోండి

మీ శరీరం నిద్రావవస్థలో మరింత గ్రెలిన్ మరియు తక్కువ లెప్టిన్ ఉత్పత్తి చేసుకుంటుంది. ఇవి ఆకలిని నియంత్రించటంలో సహాయపడే హార్మోన్లను కలిగి ఉన్నాయి; గ్రెలిన్ కడుపులో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది మరియు మీ ఆకలి వేగవంతం చేస్తుంది, లెప్టిన్ వంటి హార్మోన్ ఆకలిని తగ్గిస్తుంది.

ఆర్ద్రీకరణ స్థితిని పొందండి

రోజులో ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి,కాని మనలో చాలామంది సరిపడా నీరు తీసుకోవటం లేదు మరియు దాని ఫలితంగా మనకు దాహం వేసినా కూడా, ఆకలిగా అనుభూతి చెందుతాము. భోజనానికి ముందు ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల నీరు త్రాగండి మరియు మీరు ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువగా తిన్నట్లుగా అనుభూతి చెందుతారు.

చిన్న ప్లేట్ లో తినండి

చాలా మంది భోజనానికి పెద్ద ప్లేట్ ను వాడుతారు,మరియు అందులో పెట్టుకున్న ఆహారం పూర్తి అయ్యేవరకు ,ఆ ప్లేట్ ఖాళీగా కనపదేవరకు తింటూనే ఉంటారు. ఖాళి ప్లేట్ కనపడితే గాని, మనకు కడుపు నిండిన అనుభూతి కలగదు. అందువలన, మీరు చిన్న ప్లేట్ ను భోజనానికి వాడాలి మరియు మీకు త్వరగా కడుపు నిండిన అనుభూతి త్వరగా కలుగుతుంది.

ముద్దలుగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోండి

మీరు ఆహారం తీసుకోవటంలో కొంత సమయం మరియు ప్రయత్నం చేస్తే మీ శరీరం ఆకలి తీరిన భావనను గుర్తించటానికి సమయం తీసుకుంటుంది. ఫిడ్డ్లి ఆహారాలకు ఉదాహరణలు; కాబ్ మీద ఉన్న మొక్కజొన్న, ఒక క్రంచి సలాడ్ లేదా ఎముకలతో ఉన్న చేపలు. ఇటువంటి ఆహారాన్ని తీసుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది మరియు మీకు త్వరగా కడుపు నిండిందన్న భావన కలుగుతుంది.

మీ భోజనానికి ముందు ఒక ఆపిల్ తీసుకోండి

ఆపిల్స్ త్వరగా కడుపు ఫుల్ అయింది అన్న భావనను కలిగిస్తాయి అని పరిశోధనలలో తేలింది. ఒక ఆపిల్ భోజనానికి ముందు తీసుకుంటే, మీరు తీసుకునే ఆహార పరిమాణం ఆ భోజనంలో తగ్గుతుంది. అందువలన, మీ రోజువారీ భోజనంలో ఒక ఆపిల్ ను చేర్చుకోమని సిఫారసు చేయటం జరిగింది. దీని వలన మీ భోజనంలో పండు లేదా కూరగాయల పాత్ర ఉంటుంది, కాని ఫైబర్ మీ కడుపు నిండిన అనుభూతిని కలిగించటంలో పాత్ర పోషిస్తుంది.

సహజంగా ఉండండి

ప్రకృతి సహజంగా లభించిన ఆహారాన్ని తీసుకోండి. సాధ్యమైనంత తయారుచేయబడిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. ఎందువలనంటే ఇవి ఎక్కువ కాలరీలు లేదా కిలోజౌళ్లు కొరుకుడు ఉంటాయి. ఏదిఏమైనా, పచ్చి పండ్లు మరియు కూరగాయలు నమలటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి మరియు మీ కడుపులో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి, అందువలన మీకు చాలాసమయం ఆకలి అనుభూతి కలగదు.

English summary

10 ways to feel full, not fat | నో ఫ్యాట్స్, కడుపు నిండుగా ఉంచే టిప్స్ అండ్ ట్రిక్స్!

Do you find that you never feel satisfied after a meal or just an hour or so later you are reaching for a snack to pick you up? Well, we're here to help with some feel-full strategies.
Desktop Bottom Promotion