For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఎంపిక చేసుకొనే 10 వరస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్

|

మనలో చాలా మందికి అల్పాహారం యొక్క విశిష్టత తెలియదు. ఆరోగ్యకరమైన అల్పాహారం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. చాలా మంది సమయం కుదరకో లేకపోతే బరువు తగ్గాలన్న ఆలోచనతోనో అల్పాహారాన్ని మితంగా లేదా ప్రత్యేకించి శ్రద్ద తీసుకోకుండా అప్పటికప్పుడు తయారుచేసుకునే నూడుల్స్ వాటితో సరిపెట్టుకుంటున్నారు.

ఇటువంటి అనారోగ్యకరమైన అల్పాహార అలవాట్ల వల్ల ఎన్నో పాట్లు పడవలసి వస్తుంది. ఆరోగ్యంపై ఇవి దుష్ప్రభావం చూపిస్తాయి. కొలెస్టరాల్, గుండెకి సంబంధించిన వ్యాధులు, లైంగిక సమస్యలు ఇటువంటివి ఎన్నో తలెత్తుతాయి. ఈ క్రింద చాలా మంది తరచూ తీసుకొనే అయిదు రకాల పేలవమైన అల్పాహారం గురించి వివరించబడినది.

డోనట్ మరియు పేస్ట్రీ

డోనట్ మరియు పేస్ట్రీ

ఈ పదార్ధాలలో దాదాపు 300 నుండి 600 కేలరీలు ఉంటాయి. అయితే, ఇందులో మనం గమనించదగిన విషయం దాదాపు 50 నుండి 70 గ్రాముల వరకు ఉన్న చక్కర శాతం. అంత ఎక్కువ శాతం చక్కర కలిగి ఉండటం వల్ల మన శరీరం ఎక్కువ ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది. తద్వారా అనారోగ్యం తలెత్తే అవకాశం కలదు. అంతే కాకుండా, అల్పాహారం తీసుకున్న కొద్ది సేపటికే మళ్ళీ ఆకలి వేసే ప్రమాదం ఉంది. అందుచేత ఈ ఆహార పదార్ధం అయిదు రకాల పేలవమైన అల్పాహరాలలో ఒకటిగా పరిగణించబడినది.

తీపి ధాన్యాలు

తీపి ధాన్యాలు

శరీరం లో కి అవసరమైన పీచు పదార్ధాలకి అవసరమైనవిగా ఈ దాన్యాలని పరిగణించినా వీటిలో చక్కెర తో నిండిన వాటిని మినహాయించాలి. తీపి ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గే ప్రశ్నే లేకపోవడం తో పాటు మీ శక్తి ని త్వరగా ఖర్చు చేస్తుంది. ఒక వేళ మీరు దాన్యాలని ఎంచుకోవాలనుకుంటే, అందులో ఉండే పదార్ధాల పట్టిక ని ఒకసారి చూసి ఫైబర్ ఎక్కువగా ఉండి చక్కెర తక్కువగా ఉన్న వాటికే ప్రాధాన్యతనివ్వాలి.

ప్రోసెస్డ్ మాంసం

ప్రోసెస్డ్ మాంసం

బాకాన్, హామ్స్ మరియు సాసేజెస్ లు ఈ విభాగం లో కి వస్తాయి. వారాంతపు ఆహ్లాదం లో భాగం గా వీటిని పరిగణించడం అంటే గుండె సమస్యలకి దగ్గరగా వెళుతున్నట్లే. ఆరోగ్యకరమైన అల్పాహారానికి కావలసినవి మధ్యాహ్న భోజనం వరకు ఆకలి వేయకుండా కడుపు నిండుగా అనిపించే లీన్ ప్రోటీన్లు. చికెన్ అలాగే గుడ్లు ఈ లీన్ ప్రోటీన్లకు ఆధారం.

పాన్ కేక్స్

పాన్ కేక్స్

క్షమించాలి. ఈ పాన్ కేక్స్ కి బదులుగా ఎటువంటి ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన ఎంపిక లేదు. ఇవి గుడ్లు, వెన్న, చక్కెర మరియు పిండి యొక్క మిశ్రమం. కాబట్టి ఇవి ఆరోగ్యకరమైనవి కావు. వీటిలో ఇంకా టాపింగ్స్ విషయం సరే సరి. కేలరీలు రాకెట్ లా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి.

రెడీ టు డ్రింక్ జ్యూస్ లు

రెడీ టు డ్రింక్ జ్యూస్ లు

ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసినవి లేదా తాజా గా తయారు చేసే పండ్ల రసాలు అయితే తప్ప మిగతా చోట్ల అప్పటికప్పుడు రెడీ టు డ్రింక్ అని ప్రత్యేకించి దొరికేవి ఆరోగ్యకరమైనవి కావు. వీటిలో కేలరీలు ఎక్కువగా, ఫైబర్ తక్కువగా ఉంటుంది. పోషకాలు అస్సలు ఉండవు. ఫ్యాక్టరీ లో నుండి తయారు చేసే బాటిల్డ్ జ్యూస్ ల లో చక్కర ఎక్కువ శాతం ఉంటుంది. వీటి బదులు తాజా పండ్లని అల్పాహారం గా తీసుకోవడం ఉత్తమం.

ఫ్రెంచ్ టోస్ట్:

ఫ్రెంచ్ టోస్ట్:

ఫ్రెంచ్ టోస్ట్ చాలా అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్. కానీ అనారోగ్యకరమైనది. దీన్నిడీప్ ఫ్రై చేయడం వల్ల అవనవసరమైన క్యాలరీలను నిండి ఉంటుంది. అలాగే సాధారణంగా ఫ్రెంచ్ టోస్ట్ ను వైట్ బ్రెడ్ తో తయారు చేసి ఉంటారు. అది ఈస్ట్ మరియు ఎమ్టీ క్యాలరీలతో నిండి ఉంటుంది.

బర్గర్:

బర్గర్:

బర్గర్లతో ఉదయం అల్పాహారంతో కడుపు నింపుకోవడం బాగానే ఉంటుంది, కానీ అందులో చాలా తక్కువ న్యూట్రీషియన్ వ్యాల్యూస్ ఉంటాయి. మరియ ఖచ్చితంగా ఇవి ఫ్యాట్ ఎక్కువగా కలిగి ఉండి ఊబకాయానికి కారణం అవుతుంది.

ఫ్రైడ్ ఎగ్స్:

ఫ్రైడ్ ఎగ్స్:

గుడ్డు సాధారణంగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గానే తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు నూనెతో వేయిస్తారు అది ఎక్కువ కొలెస్ట్రాల్ మార్పు చెందుతుంది. కాబట్టి ఉడికించిన గుడ్డును తీసుకోండం బెటర్.

అన్నం:

అన్నం:

చాలా మంది ఉదయం అల్పాహారంగా అన్నం, అన్నంతో పాటు కర్రీ, దాల్స్ తింటుంటారు. అన్నంలో చాలా వరకూ పిండిపదర్ధాలు కలిగి ఉండటం వల్ల అవి మిమ్మల్ని బద్దకస్తులుగా మార్చుతుంది. దాంతో నిద్రకు కూడా కారణం అవుతుంది. ఇది బ్రేక్ ఫాస్ట్ గా చాలా హెవీ అవుతుంది. కాబట్టి సాధ్యం అయినంత వరకూ అన్నం బ్రేక్ ఫాస్ట్ లో చేర్చకుండా చూసుకోండి

ఇన్ స్టాంట్ నూడిల్స్:

ఇన్ స్టాంట్ నూడిల్స్:

ఉదయం చాలా మందికి ఆకలి వేస్తుంది. అదే సమయంలో తర్వాత తయారు చేసుకొని తినాలనించి అల్పాహారాలను ఇన్స్ స్టాంట్ నూడిల్స్ ను ఎంపిక చేసుకొని తింటారు. ఇందులో క్యాలరీలు జీరు మరియు సోడియం అధికం. కాబట్టి ఈ అనారోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ చాయిస్ ను అవాయిడ్ చేయండి.

English summary

10 worst breakfast options

Despite being the most important meal of the day, the concept of a healthy breakfast is seldom understood by men. Perhaps, because you are pressed for time in the morning, or you never seem to put on weight or believe that a little bit of 'adjustment' (read: instant noodles) in the morning won't make any difference.
Desktop Bottom Promotion