For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాబేజ్ తింటే పొందే అత్యుత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

|

క్యాబేజీ బ్రాసికా జాతికి సంబంధించినది. ఇందులో బ్రొకోలీ, కాలీఫ్లవర్ బ్రసల్ స్ప్రార్ట్ కూడా చేర్చబడింది . ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు.

క్యాబేజిలో వివి ధ రకాలున్నాయి. వాటిలో ముఖ్యంగా రెడ్ మరియు గ్రీన్ క్యాబేజీ . వీటిని అలాగే పచ్చిగా తినవచ్చు లేదా ఉడికించి తినవచ్చు. దీని రుచి మాత్రం కొద్దిగా తీపిగా ఉంటుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్ (glucose tolarence) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది . ఇంకా క్యాబేజీలో విటమిన్స్ , ఐరన్ మరియు పొటాషియం మరియు తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల క్యాబేజ్ ను ఇటు సౌత్ అటు నార్త్ రెండు ప్రదేశాలలోనూ దీని వినియోగం ఎక్కువ. మరి ఇన్ని పోషక విలువలున్న క్యాబేజ్ నుండి ప్రయోజనాలు తెలుసుకోండి...


క్యాబేజ్ నుండి పొంద 10 ఆరోగ్యప్రయోజనాలు

క్యాన్సర్ ను నివారిస్తుంది:

క్యాన్సర్ ను నివారిస్తుంది:

కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా "పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్" ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ రావటం అరుదుగా సంభవిస్తుందనీ, అయితే క్యాబేజీతో దానికి చెక్ పెట్టవచ్చు

వ్యాధి నిరోధకతను పెంచుతుంది :

వ్యాధి నిరోధకతను పెంచుతుంది :

క్యాబేజిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల, శరీరంలో వ్యాధినిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతంలో సహాయపడటమే కాదు ఫ్రీరాడికల్స్ ను నుండి సహాయపడతుంది.

యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు:

యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు:

క్యాబేజ్ లో అమినో యాసిడ్స్ గొప్పగా ఉండటం వల్ల ఇది మంటను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

కంటి శుక్లం నష్టాన్ని తొలగిస్తుంది:

కంటి శుక్లం నష్టాన్ని తొలగిస్తుంది:

క్యాబేజ్ లోని బీటా కెరోటిన్ కంటెంట్ కళ్ళులోపల మచ్చల క్షీణత నివారణకు సహాయపడుతుంది మరియు కంటి శుక్లాలు రాకుండా దూరంగా ఉంచతుంది.

అల్జీమర్స్ వ్యాధి సంభావ్యత తగ్గిస్తుంది:

అల్జీమర్స్ వ్యాధి సంభావ్యత తగ్గిస్తుంది:

తాజా పరిశోధన ప్రకారం క్యాబేజీలో ముఖ్యంగా రెడ్ క్యాబేజీలో అల్జీమర్స్ నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు కనుగొనబడింది. ముక్యంగా ఈ సమస్యను నివారించే విటమిన్ కె ను రెడ్ క్యాబేజిలో విస్తృతంగా కనుగొనబడింది.

ఉదర సంబంధిత సమస్యలకు చికిత్సలా సహాయపడుతుంది:

ఉదర సంబంధిత సమస్యలకు చికిత్సలా సహాయపడుతుంది:

కడుపులో లేదా కడుపు పూతలను క్యాబేజీ వినియోగం ద్వారా నయం చేయబడుతాయి. క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్ లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉన్నాయి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

క్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. క్యాబేజ్ మొత్తాన్ని ఉడికించినా అందులో 33 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అందువల్ల క్యాబేజ్ సూప్ ను ఎంతైనా తగావచ్చు. ఎందుకంటే బరువు పెరిగే ప్రసక్తే లేదు కనుక.

మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది:

మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది:

క్యాబేజ్ లో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉన్నందువల్లే సరైన జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. అందువల్లే ఇది మలబద్దకం నుండి ఉపశమనం అంధించడంలో సహాయపడుతుంది.

చర్మ సంరక్షణకు:

చర్మ సంరక్షణకు:

క్యాబేజ్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . కాబట్టి, వృద్ధాప్య గుర్తులకు దారితీసే ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

గొంతు కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది:

గొంతు కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది:

క్యాబేజ్ లోని ల్యాక్టిక్ ఆమ్లం, గొంతు కండరాల నుంచి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని అలాగే తాగలేనివారు కాస్త పంచదార కలుపుకుంటే సరి.

పాలు బాగా పడుతాయి:

పాలు బాగా పడుతాయి:

పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి.

పొగతాగే వారికి :

పొగతాగే వారికి :

అదే విధంగా అతిగా పొగతాగే పొగరాయుళ్లను ఆ అలవాటునుంచి మాన్పించేందుకు నానా కష్టాలు పడేవారికి క్యాబేజీ సాయపడుతుంది. అయితే వారిని పూర్తిగా పొగతాగటం మాన్పించటం కాదుగానీ.. పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజీ తినాల్సిందే.

English summary

12 Best Benefits Of Cabbages

Cabbages are important members of the brassica family which also includes broccoli, cauliflower and brussel sprouts. These are large, round and leafy vegetables that are believed to have originated in the Eastern Mediterranean and Asia Minor.
Desktop Bottom Promotion