For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్జిమా(తామర)కి ఇంట్లో చేయగలిగిన12 సులభమైన నివారణ మార్గాలు...

|

ఎక్జిమా(తామర) అనేది చర్మానికి సంభందించిన ఒక వ్యాది.దీని వల్ల చర్మం పొడిబారడం, పొలుసులుగా రాలడం, మచ్చలు పడటం, దురద పెట్టటం జరుగుతుంది. ఎక్జిమా(తామర) అనేది అలర్జీల వల్ల వస్తుంది. చల్లని వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. చర్మంపై ఎక్కడైనా రావచ్చు. ఎక్కువగా తొడల మద్య వస్తుంది. చంకల్లో, పొట్టకు, చేతులకు, కాళ్ళకు రావచ్చు. కొంత మందికి ముఖం మీద, మెడ మీద వచ్చే అవకాశం కూడా ఉంది.చిన్న పిల్లల్లో ఎక్కువగా తల మీద రావటం వల్ల వెంట్రుకలు రాలి పోవటం, చీము గడ్డలుగా మారటం వంటివి జరుగుతాయి. స్త్రీ, పురుషులలో ఎవరికైనా రావచ్చు. లైంగికంగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. జననేద్రియాల మీద కూడా వస్తుంది. డయాబెటిస్, బిగుతు వస్త్రాలు ధరించటం, గర్భ నిరోద మందులు వాడటం వంటి వాటి వల్ల ఈ వ్యాది రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే కొబ్బరి నూనె, కర్పూరం పొడి, చందనం పొడి, వేప ఆకులు, పసుపు, బొప్పాయి, జాజికాయ, బాదం, స్ట్రాబెర్రీ, క్యారట్, మామిడి కాయ, పుదీనా మొదలగు వాటిని ఉపయోగించి నివారణ చేయవచ్చు.

లక్షణాలు:
దురద కలిగి చిన్న చిన్న పోక్కులతో ఎర్రగా ఉంటాయి. తల మీద అయితే దురద ఉండి, పొట్టు రేగుతు వెంట్రుకలు రాలిపోతాయి. భార్య భర్తల్లో ఒకరికి ఉంటె మరొకరికి వచ్చే అవకాసం ఉంది.

జాగ్రత్తలు:
1. స్నానం చేసిన తర్వాత ఒళ్ళంతా శుభ్రంగా తుడుచుకోవాలి.
2. తడిగా ఉండే డ్రాయర్లు,బనియన్లు ఎట్టి పరిస్తితిలోనూ వాడకూడదు.
3. డయాబెటిస్ ఉన్నవారు దానిని కంట్రోల్లో ఉంచుకోవాలి.
4. ఉదయం వేసుకున్న బట్టలు సాయంత్రం వరకు అలానే ఉంచుకోకుండా బట్టలు మార్చాలి.
5. స్త్రీలు నడుము చుట్టూ, రొమ్ములు క్రింద తడి లేకుండా చూసుకోవాలి.
6. ఇంట్లో ఒకరికి ఉంటె మరొకరికి వ్యాప్తి చెందకుండా బట్టలు, టవల్, సబ్బులను కొంత కాలం వేరుగా ఉంచాలి.
7. ఎప్పుడు సాక్స్ వేసుకొనే వారికీ కాలి వ్రేళ్ళ మద్య పాదాలకు వచ్చే అవకాసం ఉన్నది.

ఇంట్లో చేయగలిగిన 12 సులభమైన నివారణ మార్గాలు:

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

కొబ్బరి నూనె: చర్మము మృదువుగా ఉండటానికి మరియు దురద తగ్గించడానికి ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను పూయాలి.

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

కర్పూరం: ఒక స్పూన్ కర్పూరం పొడి మరియు ఒక స్పూన్ చందనం పొడి తీసుకొని రెండింటిని కలిపి పేస్ట్ చేసి ఆ ప్రాంతంలో పూయాలి.

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

సన్ బాత్: ఎక్జిమా(తామర) కు ఇంట్లో చేయగలిగిన నివారణ మార్గాల్లో సన్ బాత్ ఉత్తమమైనది. ఎందుకంటే సూర్యుని రేడియేషన్ వల్ల బ్యాక్టీరియా చనిపోయే అవకాశం కూడా ఉంది.

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

బొప్పాయి: బొప్పాయి విత్తనాలను గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ను ఆ ప్రాంతంలో రాస్తే దురద లక్షణాలు తగ్గుతాయి.

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

జాజికాయ: జాజికాయకు కొంచెం నీరు కలిపి పేస్ట్ చేసి ఆ ప్రాంతంలో రాయటం వల్ల కొంత ఉపసమనం కలుగుతుంది.

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

ఆరెంజ్: సిట్రస్ పండ్లలో అధికంగా సి విటమిన్ ఉంటుంది. విటమిన్లు C మరియు E లను రోజు వారి ఆహారంలో తీసుకోవాలి.

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

స్ట్రాబెర్రీ: 3 లేదా 4 స్ట్రాబెర్రీలను పేస్ట్ చేసి చర్మంపై రాసి ఒక నూలు వస్త్రాముతో కవర్ చేయాలి.

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

మట్టి తో ప్యాక్: తామర ప్రభావం తగ్గటానికి చర్మం మీద ఒక తేలికపాటి మడ్ ప్యాక్ ను వేయాలి.

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

క్యారెట్: క్యారట్ రసం కూడా తామర చికిత్సకు బాగా ఉపయోగపడుతుంది. క్యారట్ రసం ను చర్మంపై పూయాలి, మరియు పుదీనా ఆకులను పేస్ట్ చేసి చర్మం ప్రభావిత ప్రాంతంలో రాయటం వల్ల తామర చికిత్సకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

మామిడి: మరో అద్భుతమైన సహజమైన నివారణి మామిడి గుజ్జు. మామిడి కాయ పై తొక్క తీసి గుజ్జుగా చేసి నీటిలో మరిగించాలి. ఆ ప్రాంతంలో మరిగించిన ఈ గుజ్జును 10 రోజుల పాటు రాయాలి.

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

కోల్డ్ క్రీమ్: ఈ రోజుల్లో తామరకి కోల్డ్ వాటర్ కంప్రెషన్ చికిత్స అత్యంత ప్రయోజనకరమైన నివారణ మార్గంగా ఉన్నది.

ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

వేపఆకు: వేప ఆకులు మరియు పసుపు లను కలిపి పేస్ట్ చేసి ఆ ప్రాంతంలో పూయాలి. పసుపు శక్తివంతమైన సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది.అందువల్ల గ్లాస్ లో సగం నీరు తీసుకోని అర స్పూన్ పసుపు వేసి రోజు త్రాగాలి,మరియు అర లీటర్ నీటిలో 4 స్పూన్ ల పసుపు వేసి బాగా మరిగించి ఆ తర్వాత చల్లార్చి ఆ నీటితో ఆ ప్రాంతాన్ని కడగాలి.

English summary

12 best and easy Home remedies for eczema | ఎక్జిమా(తామర)కి 12 సులభమైన నివారణ చిట్కాలు

The term eczema is broadly applied to a range of persistent skin conditions. These include dryness and recurring skin rashes that are characterized by one or more of these symptoms: redness, skin edema (swelling), itching and dryness, crusting, flaking, blistering, cracking, oozing, or bleeding. Areas of temporary skin discoloration may appear and are sometimes due to healed injuries.
Story first published: Saturday, February 2, 2013, 15:43 [IST]
Desktop Bottom Promotion