For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ హీట్ ను మాయం చేసే హెల్తీ చిట్కాలు...!

|

ఎండాకాలం వచ్చిందంటే చాలు.వేడికి తటుకోలేక మనకు వడ దెబ్బ తగులుతుంది. పసివాళ్ళు, ముసలివాళ్ళు,తాగుబోతులు దీనికి గురవుతారు.కొందరు చచ్చి పోతారు కూడా. మన శరీరంలో చాలా నీరుంటుంది,ఇది చెమటగా ఎండాకాలం బయటకు పోతుంది. కాబట్టి ఒంటిలో నీరు తగ్గి పోతుంది.చెమటతో పాటు ఉప్పు కూడా పోతుంది. అందుచేత శరీరంలో వేడి పెరుగుతుంది.ఒళ్ళు పట్టుకుంటే కాలి పోతుంటుంది.తెలివి తప్పి పడిపోతాం.దీనినే వడ దెబ్బ అంటారు.ఇది చాలా అపాయం. మొదట శరీరం వేడిని తగ్గించాలి.వడ దెబ్బ తగిలిన మనిషిని నీడలో పడుకోబెట్టాలి.ఒంటి మీద గుడ్డలు తీసేయాలి.మంచి నీళ్ళతో శరీరం బాగా తడపాలి.తడి గుడ్డతో మాటి మాటికి తుడవాలి.బాగా గాలి విసరాలి. వేడి తగ్గిందో లేదో నిమిష నిమిషానికి చూడాలి.తగ్గేదాకా తడిగుడ్డతో తుడవడం ఆపకూడదు.తెలివి వచ్చేదాకా ఏమీ తాగించ కూడదు. ఎండాకాలంలో మంచి నీళ్ళు బాగా తాగాలి.ఉప్పు కలిపిన గంజినీళ్ళు,నీరు,మజ్జిగ తాగితే మరీ మంచిది. ఎండకు కొందరికి బలహీనంగా ఉంటుంది.ఇలాంటివారు ఉప్పు,పంచదార కలిపిన నీరు తాగడం ఎంతో మంచిది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

వాటర్ మెలోన్(పుచ్చకాయ): పుచ్చకాయ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇది శరీరంలో వేడి తగ్గించడానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో అధికంగా నీరు ఉండి మిమ్మల్ని చల్లగా మరియు హైడ్రేట్ (శరీరాన్నితేమగా) ఉంచుతుంది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

కర్బూజ: మస్క్ మెలోన్: బాడీహీట్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే కర్బూజ. వేసవి కాలంలో మీ రెగ్యులర్ డైట్ లో ఈ కర్బూజను చేర్చుకోవడా ఉత్తమం.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

కీరదోసకాయ: ఈ సమ్మర్ ఫుడ్ లో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందించడంలో అద్భుతంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది . కాబట్టి ప్రతి రోజూ కీరదోసకాయ తిని శరీరంలోని వేడి నేచురల్ గా తగ్గించుకోండి.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

పుదీనా: శరీరాన్ని చల్లదనాన్ని చేకూర్చడానికి ఇంట్లో సాధారణంగా ఉపయోగించే ఒక మంచి హోం రెమడీ. పుదీనా ఆకులతో తయారు చేసే జ్యూసు శరీరంలో వేడిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో వేడి తగ్గించడానికి ఫర్ ఫెక్ట్ ఔషదం కూడా.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

రెడ్ రాడిష్(ఎర్ర ముల్లంగి): ఎర్రముల్లంగిలో నీటి శాతం పుష్కంగా ఉండటంతో పాటు ఇందులో విటమిన్ సి మరియు యాంటిఆక్సిడెంట్స్ అధికం ఉండి బాడీ హీట్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. ఇందులో ఇంకా వ్యాధినిరోధక లక్షణాలు కూడా మెండుగా ఉన్నాయి . ఇవి హీట్ స్ట్రెస్ తో పోరడటానికి ప్రభావంతగా పనిచేస్తుంది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

నువ్వులు: నువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆనీటిని వడగంటి త్రాగడం వల్ల బాడీ హీట్ తగ్గుతుంది.

పెద్ద జీలకర్ర:

పెద్ద జీలకర్ర:

పెద్ద జీలకర్ర:పెద్ద జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం ఆ నీటిని వడకంటి పరకడుపున త్రాగితో శరీరంలోని వేడి తొలగిపోతుంది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

దానిమ్మ: బాడీ హీట్ ను నేచురల్ గా తగ్గించడానికి మరియు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ప్రతి రోజూ ఒక గ్లాసు దానిమ్మ జ్యూసును త్రాగడం మంచిది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

గసగసాలు: నిద్రించే ముందు గుప్పెడు గసగసాలు కొద్దిగా నీరుతో పాటు తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. గసగసాలు తినడం వల్ల నిద్ర బాగా పట్టడంతో పాటు బాడీ టెంపరేచర్ ను నియంత్రిస్తుంది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

మెంతులు: వేడి తగ్గించడంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బెస్ట్ హోం రెమడీ. బాడీ హీట్ తో బాధపడేవారు. ప్రతి రోజూ కొన్ని మెంతులను తినడం మేలు.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

చల్లటి పాలు: శరీరంలో వేడి తగ్గించడానికి అత్యంత ప్రభావవంతంగా పనిచేసే వాటిలో చల్లటి పాలు మరియు నిమ్మరసం బాగా పనిచేస్తాయి . చల్లటి పాలలో కొద్దిగా తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం పరకడుపున త్రాగడం మంచిది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

నిమ్మరసం: వేసవిలో అందరూ తాగేది నిమ్మరసం. దీనిలో అధికశాతం 'సి' విటమిన్ వుంటుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. పల్చటి మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక చెంచాడు నిమ్మరసం పరగడుపున తాగితే పైత్యం తగ్గుతుంది. అరుగుదల కూడా బాగా ఉంటుంది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

అరటి దూట: శరీరంలో వేడిని తగ్గించడానికి అరటి దూట బాగా ఉపయోగపడుతుంది. అరటి దూటతో పెరుగు పచ్చడి, అరటిదూట, పెసరపప్పు కలిపి కూర తయారుచేసుకొని తింటే ఈ కాలంలో శరీరంలోని వేడి తగ్గుతుంది. అరటిదూట కిడ్నీలు సక్రమంగా పనిచేయడానికి కూడా సహకరిస్తుంది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

వెన్న తీసిన మజ్జిగ: వెన్న తీసిన మజ్జిగను ప్రతి రోజూ త్రాగడం వల్ల వేసవి తాపం తీర్చడంతో పాటు శరీరంలో వేడి మటుమాయం అవుతుంది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

తాజా పండ్ల రసాలు: వేసవి వేడిని తట్టుకోవడానికి చల్లని నీటిని తాగడంతోపాటు తాపాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని చేకూర్చే చల్లని పండ్ల రసాలపై దృష్టి మళ్ళిస్తే మంచిది. ఇన్‌స్టెంట్‌గా దొరికే కూల్‌డ్రింక్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకొని తాగడంకన్నా తాజా ఫలాల రసాన్ని తాగడం, తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తాపాన్ని తగ్గించుకోవచ్చు.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

ఆపిల్: ఆపిల్‌ను తొక్కలు తీయకుండా లోపలి గింజలను తీసివేసి ముక్కలుగా చేసి మెత్తగా గ్రైండ్‌చేసి దాంట్లో పాలు, పటికబెల్లం పొడివేసి ప్రిజ్‌లో పెట్టి తాగితే చలవచేస్తుంది. ఆపిల్‌లో ఇనుము, భాస్వరం, తగినన్ని ప్రొటీన్లు ఉంటాయి. అలాగే 'ఎ' విటమిన్ వుండటంవల్ల చర్మం కాంతివంతమవుతుంది. కళ్ళకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

క్యారెట్ జ్యూస్: క్యారెట్ జ్యూస్ కూడా శరీరానికి చాలా మంచిది. క్యారెట్లను మెత్తగా గ్రైండ్‌చేసి దాంట్లో పాలు, చక్కెర కలిపి జ్యూస్ చేసుకొని యాలుకల పొడి వేసుకొని వేసవిలో తాగితే శరీరానికి చల్లదన్నాన్ని ఇస్తుంది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

రాగి జావ: శరీరంలోని వేడిని హరించి, శరీరానికి పోషకాలను అందించేది రాగి జావ. కొన్ని నీళ్ళు మరిగించి దాంట్లో రాగులపిండిని చల్లటి నీళ్ళలో కలిపి వేసి వుడికించి జావ తయారుచేయాలి. చల్లారిన తరువాత దాంట్లో సరిపడ ఉప్పు, మజ్జిగ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

పెసర పప్పు: పెసరపప్పును రాత్రే గంజి చేసి అలాగే పెట్టేసి, ఉదయం నిద్రలేవగానే, పరకడుపు త్రాగడం వల్ల శరీరంలోని వేడి ఇట్టే మాయం అవుతుంది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

కొబ్బరి నీళ్ళు: బాడీ హీట్ ను తగ్గించుకోవడానికి కొబ్బరి నీళ్ళు త్రాగడం అత్యంత శ్రేయస్కరం. అంతే కాదు సమ్మర్ లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

అరటి పండు: బాగా పండిన అరటిపళ్ళు, ఫైబర్ వున్న పండ్లు, పండ్ల రసాలు రాత్రి భోజనం తర్వాత పడుకునే ముందు తింటే వేడిని హరించడమే కాక, మలబద్ధకం నివారించి శరీరానికి చలువ చేస్తుంది.

సాధారణంగా ప్రతి ఒక్తికి బాడీ(శరీరం)యొక్క ఉష్ణోగ్రత 98.6డిగ్రీలకు కొంచెం ఇటుఅటుగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వాతావరణంలో మార్పుల వల్ల కూడా సంభవిస్తుంది. శరీర ఉష్ణోగ్రత పడిపోవడం లేదా తగ్గడం లేదా పెరగడం వల్ల పలు ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి మన శరీర ఉష్ణోగ్రతను నిలకడాగా ఉంచుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రస్తుత రోజుల్లో బాడీ హీట్ చాలా మంది ఉన్న కామన్ హెల్త్ ప్రాబ్లెమ్ . బాడీ హీట్(శరీరంలో ఉష్ణోగ్రత)వల్ల కూడా హీట్ స్ట్రెస్ కు కారణం కావచ్చు . బాడీహీట్ దానంతట అదే తగ్గదు ఎందుకంటే శరీరంలోపల అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉదా : అంతర్గత అవయవాలకు నష్టం, వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, మైకం మరియు వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మితిమీరిన వేడి వాతావరణం, వేడిలో పనిచేయడం, వేడి కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా త్రాడం ఇవన్నీ కూడా బాడీ హీట్ కు ప్రధాన కారణాలు.

కాబట్టి శరీరాన్ని హైడ్రేట్ (తేమ)గా ఉంచుకోవడం చాలా అవసరం. అధికంగా నీరు త్రాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ (మలినాలు,విషాలను)తొలగించబడి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బాడీ హీట్ ను తగ్గించుకోవడానికి నీరు త్రాగడంతో పాటు, కొన్ని అదనంగా హెల్తీ మరియు కూలింగ్ ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. వేసవి కాలం మొదలైంది, బాడీ హీట్ ను తగ్గించుకోవడానికి ఇదొక మంచి సమయం. అందుకు ఇక్కడ బాడీ హీట్ తగ్గించే కొన్ని హెల్తీ ఫుడ్స్ . ఈ హెల్తీ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ సమ్మర్ డైట్ లో చేర్చేసుకొని ఆరోగ్యంగా ఉండండి...

English summary

12 Foods To Reduce Body Heat | బాడీ హీట్ ను తగ్గించే అద్భుత చిట్కాలు..!

The normal body temperature of an individual is 98.6 degrees which keeps varying with slight changes. This temperature is maintained irrespective of the weather. A drop or rise in the body temperature can bring in various health problems so, we have to make sure that the body's temperature is stagnant.
Desktop Bottom Promotion