For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మద్యం మత్తులో యువత..నేటి సరదాలే రేపటి విషాదాలు..!

|

ఒకప్పుడు అనైతికమనుకున్నది ఇప్పుడు నాగరికతకు చిహ్నమైపోయిం ది. చాటు మాటుగా ‘తాగే' వ్యవహారం ఇప్పుడు బహిరంగ వేడుక అయ్యింది. కొన్నేళ్లుగా.. యువతలో పెరుగుతున్న మద్యం వాడకం పై సమాజమంతా బెంబేపూత్తుతోంది. మద్యపానం తీసుకోవడంతో ఆరోగ్య పాడవుతుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినప్పటికీ చాలామంది మద్యపానం తీసుకోవండ మానలేకపోతున్నారు. మద్యపానం తీసుకోవడంతో కాలేయం పాడైపోతుంది. దీంతోపాటు అధిక బరువు ఉండటం చేత వీటి ప్రభావం ముఖ్యంగా కాలేయంపై పడుతుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపినట్లు బ్రిటీష్ మెడికల్ జర్నల్ పేర్కొంది.

మనం అతి ఎక్కువగా ఏదైనా తీసుకుంటే అది మన శరీరానికి హాని చేస్తుంది.అలాగే ఆల్కహాల్ ను కూడా తీసుకొంటే హాని చేస్తుంది.ఒక వ్యక్తి దైనందిన జీవితంలో ఆల్కహాల్ ను తీసుకుంటు ఉంటె,అది శరీరంలో హానికరమైన ప్రభావాలను చూపుతుంది.శరీరంలో ఈ హానికరమైన ప్రభావాలను గురించి మరింత సమాచారం తెలుసుకుందాము.

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల సాధారణంగా రక్తంలో కొవ్వు పదార్ధం మరియు శరీరం యొక్క రక్తపోటు పెరుగుతుంది.రక్తపోటు ఎక్కువగా ఉంటే, అది గుండెను ప్రభావితం చేస్తుంది.అంతే కాకుండా ఇది శరీరం యొక్క మంచి కొలెస్ట్రాల్ స్థాయి మీద ప్రభావితం చేసి గుండె పోటు అపాయాలను పెంచుతుంది.

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

మూత్రపిండాల పనితీరు మీద ప్రభావం చూపుతుంది: ప్రతి రోజు ఆల్కహాల్ తీసుకోవటం వల్ల సాధారణంగా మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. ఈ ఆల్కహాల్ సాధారణంగా హార్మోన్ ల పనితీరు మీద ప్రభావితం చేసి, కొన్ని సమయాల్లో మూత్రపిండ వైఫల్యం కుడా సంభవించవచ్చు .

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

కాలేయం మీద ప్రభావం చూపుతుంది: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కాలేయం మీద ప్రభావం చూపుతుంది.ఆల్కహాల్ కాలేయంలో కొవ్వును పెరిగేలా చేస్తుంది.అందువల్ల కాలేయం పాడయ్యి ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది.

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

మధుమేహం: శరీరం యొక్క రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం యొక్క రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఈ పరిస్థితి మధుమేహంనకు కారణమవుతుంది.రక్తంలో చక్కెర స్థాయి అధిక స్థాయిలో ఉంటె నరాల నాశనానికి కారణమవుతుంది.అధిక మద్యపానం శాశ్వతంగా నరాల హానిని కూడా కలిగించవచ్చు.

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ వాహిక యొక్క అంతర్గత పూతకు నష్టం కలిగించి,తద్వారా జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది.ఇది పొట్టలో పుండ్లు, పొట్టకు సంబంధించిన పూతలు మరియు పెద్దప్రేగు కాన్సర్ లకు దారితీస్తుంది.

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

సంతానలేమి: జననేంద్రియ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది: ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల శరీరం యొక్క జననేంద్రియ వ్యవస్థ నాశనానికి కారణం అవుతుంది. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల పరోక్షంగా మహిళలు మరియు పురుషులు లో సంతాన ప్రాప్తి లేకుండా చేస్తుంది. అలాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కూడా వస్తుంది.

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

మెదడు: మెదడు యొక్క సాధారణ కార్యాచరణక మీద ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ వల్ల ప్రత్యక్షంగా కంటి చూపును మరియు జ్ఞాపకశక్తి కోల్పోవడం సంభవిస్తుంది.మెదడు యొక్క నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.అధిక మద్యపానం అసందర్భ సంభాషణ మరియు బలహీనమైన ప్రవర్తనకు కారణమవుతుంది.ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచన సామర్థ్యం మీద కూడా ప్రభావితం చేస్తుంది.

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

బరువు: బరువు మీద ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ శరీర బరువుకు మంచిది కాదు.ప్రతి రోజు మద్యం సేవించడం ద్వారా అధిక కేలరీలు తీసుకోవటం వల్ల స్థూలకాయం వంటి సమస్యకు కారణమవుతుంది.ఈ కారణంగా బరువులో హెచ్చుతగ్గులు వస్తాయి.

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

చర్మం: చర్మం మీద ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ ప్రభావం శరీరంనకే పరిమితం కాలేదు,చర్మానికి కూడా హాని చేస్తుంది.ఆల్కాహాల్ వాడకం వల్ల కళ్ళ క్రింద నల్లని వలయాలు మరియు ఉబ్బినట్లు ఉంటాయి.ఇది మహిళల్లో వృద్ధాప్యం యొక్క ప్రారంభ సంకేతాలకు కారణమవుతుంది.

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

రక్తహీనత: మద్యపానీయాలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది. రక్తం గడ్డ కట్టే గుణంలో లోపం ఏర్పడుతుంది.

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

లెైంగిక వాంఛ: పరుషుల్లో మద్యపానం వల్ల లెైంగిక వాంఛ తగ్గిపోతుంది. నపుంసత్వం ఏర్ప డుతుంది. ముఖం మీద వెంట్రుకలు తగ్గి ఆడంగి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలున్నపుడు తాగుడు మరింత పెరిగి, వారి పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. తాగుడు పూర్తిగా మానడమే దీనికి విరుగుడు.

నేటి సరదాలే రేపటి మరణమృదంగాలు..!

క్యాన్సర్‌:ఆల్కహాలిసమ్‌ వల్ల జీర్ణావయవాలలో నోరు, గొంతు, కంఠనాళం, కడుపు, శ్వాసావయవాలు, క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యే ప్రమాదముంది. కాలేయం క్యాన్సర్‌కు మద్యపానానికి దగ్గరి సంబం ధం ఉంది.తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలే కాక, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. తాగు డుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గి పోతుంది.

ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండటానికి ఆల్కహాల్ ను పరిమితంగా తీసుకోవాలి.

English summary

12 Harmful Effects of Alcohol | నేటి సరదాలే రేపటి విషాదాలు..!

Too much of anything is going to harm the body. Same thing can happen with alcohol. If a person consumes alcohol on a daily basis, then it will have harmful effects on the body. Read on to know more about these harmful effects on the body.
Desktop Bottom Promotion