For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ సమస్యను అధిగమించే 12 హెల్తీ ఫుడ్స్...!

|

ప్రస్తుత కాలం మారుతున్న జీవన శైలీ, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటి థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అవి హైపోథైరాయిడ్ (అండరాక్టివ్ థైరాయిడ్)మరియు హైపర్ థైరాయిడిజం(ఓవరాక్టివ్ థైరాయిడ్). ప్రస్తుతం ఇది కామన్ హెల్త్ ప్రాబ్లెమ్ గా మారింది. చాలా మందికి ఆ లక్షణాలు బయటపడే వరకూ వారి థైరాయిడ్ ఉందని కనుక్కోలేరు. ఎక్కువగా ఒత్తిడికి గురి కావడం, నిరాశ, ఆకలి లేకపోవడం, మలబద్ధకం, అలసట, బరువులో హెచ్చుతగ్గుల తేడాలు లేదా తక్కువ శరీర శక్తి వంటి రుగ్మతల యొక్క తీవ్రమైన లక్షణాలు ఎదురైతే తప్ప థైరాయిడ్ ను గుర్తించలేరు.

థైరాయిడ్ గ్రంథి కేవలం వాయిస్ బాక్స్ క్రింద ఉంటుంది. ఇది గొంతు బాగానికి ఇరువైపులా రెండు అంగుళాల పొడవు గ్రంథి. ఇది శరీరం యొక్క జీవక్రియ మరియు కాల్షియం సంతులనం నియంత్రిస్తుంది. చాలా మంది ఈ సమస్యతో (థైరాయిడ్ గ్రంధి అతిక్రియ లేదా హైపోథైరాయిడిజం) బాధపడుతున్నారు. ఈ సమస్యకు వైద్యపరంగా చికిత్స్ ఉంది. అయితే హైపోథైరాయిడిజంను సహజపద్దతుల ద్వారా నివారించుకోవడానికి లేదా ఈ సమస్య తలెత్తకుండా ఉండటానికి మీ ఆహారంలో కొన్ని థైరాయిడ్ ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చి థైరాయిడ్ కు మీరే సొంతంగా థైరాయిడ్ చికిత్స చేసుకోవచ్చు.

ఉదాహరణకు, తృణధాన్యాలు, కొవ్వు చేప మరియు పాల ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలతో థైరాయిడ్ సమస్యను నివారించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు ఉన్నాయి. అదేవిధంగా, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల హైపర్ థైరాయిడిజంను సహజంగానే నివారించుకోవచు.

మరి మీకు థైరాయిడ్ రాకుండా ఉండాలన్నా లేదా ఉన్న థైరాయిడ్ సమస్యను నివారించుకోవాలన్నా కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు, మీ డైలీ డైయట్ లో చేర్చుకోవాలి. మరి థైరాయిడ్ కు ఉపయోగపడే ఆహారాలేంటో ఒక సారి చూద్దాం...

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

స్ట్రాబెర్రీ: మీరు ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో సరైన మోతాదులో ఐయోడిన్ ఉన్నట్లైతే థైరాయిడ్ ను నయం చేసుకోవచ్చు. అందుకు స్ట్రాబెర్రీలు బాగా సహాయపడుతాయి. ఇవి థైరాయిడ్, జీవక్రియ నిర్వహించడానికి హానీకలిగించే వాటిని తొలగించడానికి సహాయపడుతుంది మరియు పెరుగుదలను మరియు అభివృద్ధి మెరుగుపరుస్తుంది. కాబట్టి, అయోడిన్ అధికంగా ఉండే ఆహారాలు స్ట్రాబెర్రీలు, బంగాళాదుంపలు, పాల ఉత్పత్తులు, పెరుగు మరియు నెవీ బీన్స్ చిక్కుళ్ళు వంటి ఆహారాలు ప్రతి రోజూ మీరు తినే డైయట్ లిస్ట్ లో చేర్చుకోవాలి.

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

మష్రుమ్: థైరాయిడ్ లోపానికి కారణాలలో ఒకటి శరీరంలో సెలీనియం తగ్గుద. లేదా సెలీనియం హీనతకు గురికావడం. మృదువైన పుట్టగొడుగులలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది.

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

వెల్లుల్లి: సెలీనియం పుష్కలంగా ఉండే మరో ఘాటైన ఆహారం వెల్లుల్లి. ఇది థైరాయిడ్ కు ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు, మధుమేహగ్రస్తులకు మరియు హార్ట్ పేషంట్స్ కు కూడా ఆరోగ్యకరమే.

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

ఆకు కూరలు: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్స్, ప్రోటీనులు, మినిరల్స్ మరియు ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.శరీర జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి.

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

రెడ్ మీట్: ఇది మరొక ఐరన్ రిచ్ ఫుడ్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు లోఫ్యాట్ రెడ్ మీట్ ను తీసుకోవడం చాలా అవసరం.

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

గుడ్డు: పౌల్ట్రీ మరియు డైరీ ప్రొడక్ట్స్ రెండూనూ థైరాయిడ్ కు చాలా ఆరోగ్యకరం. ఇందులో క్యాల్షియం అధికంగా ఉండటమే కాదు, ఐరన్ మరియు ఐయోడిన్ లు గొప్ప మూలం.

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

గోధుమలు: హోల్ గ్రెయిన్ బ్రౌన్ రైస్, ఓట్ మీల్ మరియు బార్లీ వంటి వాటిలో విటమిన్ బి మరియు న్యూట్రిషియన్స్ అధికంగా ఉండి జీవక్రియలు క్రమంగా జరిగేందుకు బాగా సహాయపడుతాయి. అంతే కాదు ఇవి థైరాయిడ్ గ్రంధుల నుండి థైరాయిడ్ హార్మోనులను స్రవించేలా ప్రేరేపిస్తాయి.

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

బ్రొకోలి: ఈ ఆకుపచ్చని క్యాలీఫ్లవర్ టైపులో ఉండే ఈ ఆకుపచ్చని గ్రీన్ లీఫీ వెజిటేబుల్ థైరాయిడ్ పనితీరుకు హాని కలిగించే పదార్థాన్ని తగ్గిస్తుంది.

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

బీఫ్ లివర్: ఆరోగ్యానికి సహాయపడే విటమిన్ బి12 మరియు సెలీనియం పుష్కలంగా ఉన్నాయి.కాబట్టి వీటిని డైలీ డయట్ లో చేర్చుకోవడం వల్ల సెలీనియం లోపం సమతుల్యం అవుతుంది.

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

టమోటో: టమోటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు. ఇంకా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఇనుము శోషణను పెంచుతుంది.

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె లో అత్యవసర కొవ్వు ఆమ్లాలు త్వరగా శక్తి మార్చబడుతుంది మరియు థైరాయిడ్ పనితీరును నియంత్రిస్తుంది.

థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

ఓస్ట్రెస్: కాపర్ రిచ్ సీఫుడ్ ఆరోగ్యవంతమైనది మరియు థైరాయిడ్ డైయట్లో దీన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. థైరాయిడ్ పనితీరును నియంత్రిస్తుంది. మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

English summary

12 Healthy Foods For A Thyroid Diet | థైరాయిడ్ సమస్యను నివారించే 12 హెల్తీ ఫుడ్స్...!

Hypothyroidism (underactive thyroid) and hyperthyroidism (overactive thyroid) are two types of thyroid. Also known as thyroid, it is a common health disorder. Many people do not realise about it unless they suffer from acute symptoms of the disorder like depression, lack of appetite, constipation, fatigue, weight fluctuations or low body energy.
Story first published: Monday, February 25, 2013, 16:03 [IST]
Desktop Bottom Promotion