For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వింటర్ సీజన్ లో తినాల్సిన 12హెల్తీ సూపర్ ఫుడ్స్

|

సంవత్సరంలో ప్రతి మూడు, నాలుగు నెలకొకసారి సీజన్ మారుతుంటుంది. సీజన్ లో మార్పులను బట్టి, మన తీసుకొనే ఆహారాలను కూడా మార్పు చేసుకోవాలి. అప్పుడే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సీజనల్ ఫుడ్స్ లో విటమిన్స్, ప్రోటీనులు మరియు మినిరల్స్ అధికంగా ఉండి, ఈ సీజన్ లో మన శరీరం తట్టుకోగలిగే శక్తిని అంధిస్తాయి.

ఈ చలికాలో మన శరీరం చలికి, మరియు ఇతర ఇన్ఫెక్షన్స్ కు, జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటనికి మన శరీరం తట్టుకోగల శక్తిని అంధిచేవి, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఈ సీజన్ లో ఆపిల్స్, క్యారెట్స్ మరియు గుమ్మడి వంటివి బాగా సహాయపుడుతాయి.వీటిలో విటమిన్స్ మరియు ప్రోటీలు అధికంగా ఉండి, మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మన శరీరం తగినంత పోషకాలను పొందాలంటే వీటిని రెగ్యులర్ డైట్ లో తీసుకోవాలి. ఉదాహారణకు యాపిల్స్ చాలా ఆరోగ్యకరమైన పండు. ఇందులో విటమిన్స్, ప్రోటీనులు మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి . అందువల్ల, రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ అవసరం ఉండదని చెబుతుంటారు.

ఈ సీజనల్ ఆపిల్ చాలా పాపులర్ అయినటువంటి పండు. అంతే కాదు ఇది కడుపు నిండేలా చేస్తుంది మరియు లో క్యాలరీలను కలిగి ఉంటుంది. అలాగే ఈ సీజన్ లో అందుబాటులో ఉండే క్యారెట్స్ కూడా ఆరోగ్యాని చాలా మేలు చేస్తాయి. ఇది చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇటువంటి సూపర్ ఫుడ్స్ ను సీజన్ బట్టి మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఎంతో ఉత్తమం. సంవత్సర పొడవునా సీజనల్ ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ సీజన్ లో మీకు అందుబాటులో ఉండే తాజా సూపర్ ఫుడ్స్ తిని ఎంజాయ్ చేయవచ్చు . మరి ఈ సీజన్ లో మీకు అందుబాటులో ఉండే సూపర్ ఫుడ్స్ మరికొన్ని ఈ క్రింది స్లైడ్ లో చూసి, వాటి ప్రయోజనాలు తెలుసుకొని, మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి....

ఆపిల్స్:

ఆపిల్స్:

ఆపిల్స్ అనేక వ్యాధుల నుండి మరియు క్యాన్సర్ నుండి మన శరీరానికి రక్షణ కల్పిస్తుంది. ఈ సీజనల్ సూపర్ ఫుడ్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు ప్రోటీనలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కూడా మన శరీర ఆరోగ్యానికి చాలా అవసరం.

గుమ్మడి:

గుమ్మడి:

ఈ సీజన్ లో అందుబాటులో ఉండే మరో వెజిటేబుల్ గుమ్మడి. ఈ గుమ్మడి వెజిటేబుల్ లో విటమిన్ ఎ, ఫ్లెవనాయిడ్స్, ఫోలీఫినోలిక్ యాంటీఆక్సిడెట్స్ : కెరోటిన్, ల్యూటిన్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

బ్రజల్ స్ప్రాట్స్:

బ్రజల్ స్ప్రాట్స్:

ఈ క్రంచీ గ్రీన్ వెజిటేబుల్లో విటమిన్ సి మరియు విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు క్యాల్షియం మరియు ఫొల్లెట్ ను కూడా అధికంగా కలిగి ఉంటుంది. ఇవి మన శరీరం నిర్మాణానికి మరియు అభివృద్దికి చాలా అవసరం.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ఉపయోగించి అనేక రకాల వంటలను తయారుచేస్తారు. ఈ సూపర్ ఫుడ్ విటమిన్ సి, ఇ, బీటాకెరోటిన్, మ్యాంగనీస్, జింక్ మరియు ఫ్లెవనాయిడ్స్ కు పవర్ హౌస్ వంటిది.

క్యారెట్స్:

క్యారెట్స్:

బీటాకెరోటిన్ (యాంటీఆక్సిడెంట్స్)పుష్కలంగా ఉంటుంది. క్యారెట్ ఒక ప్రభావవంతమైన యాంటిసెప్టిక్, క్యాన్సర్ ను నివారించే ఒక పవర్ ఫుల్ మెడిసిన్ మరియు కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇంకా క్యారెట్ స్కిన్ మరియు హార్ట్ హెల్త్ కు చాలా గొప్పది.

కలె:

కలె:

కాలెలో విటమిన్ కె, సల్ఫర్, మరియు సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి . ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ చాలా తేలికగా జీర్ణం అవుతుంది. కాలేలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బరువు తగ్గించడంలో మరియు శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

చెస్ట్ నట్స్:

చెస్ట్ నట్స్:

ఈ హెల్తీ స్నాక్ లో విటమిన్ బి6 అధకింగా ఉంది. ఈ విటమిన్ మన శరీరానికి అవసరం అయ్యే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ముడుతలను తొలగిస్తుంది మరియు లంగ్ క్యాన్సర్ తో పోరాడుతుంది.

దానిమ్మ:

దానిమ్మ:

రెడ్ కలర్ జ్యూసీ ఫ్రూట్ ధమనులలో అభివృద్ధి చెందే ప్లేగును నిరోధిస్తుంది మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకుంటే గుండెజబ్బులను దూరంగా ఉంచుతుంది!

టర్నిప్ గ్రీన్స్:

టర్నిప్ గ్రీన్స్:

ఎర్రముల్లంగి దుంప లేదా పచ్చముల్లంగి దుంప . వీటిని సలాడ్స్ లో చేర్చుకోవచ్చు. వీటిలో విటమిన్ ఎ, ఐరన్, ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం మరియు ప్రోటీనులు అధికంగా ఉంటాయి.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

ఈ సీజన్ లో అందుబాటులో ఉండే ఈ గ్రీన్ లీఫ్ బెజిటేబుల్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందలో పొటాషియం అధికంగా ఉండి, నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది . అలాగే ఇందులో ఉండే మెగ్నీషయం మరియు క్యాల్సియం బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. అలాగే ఫైబర్ బరువు తగ్గించడం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు, సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైనా, ఏసీజన్ లో అయినా సరే ఉల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది . ఉల్లిపాయలో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి . ఇందులో ఉండే విటమిన్ సి అనేక ఇన్ఫెక్షన్స్ ను నయం చేసే లక్షణాలున్నాయి. కాబట్టి, పచ్చి ఉల్లిపాయలు తిని, చర్మ మరియు ఉదర సంబంధ ఇన్షెక్షన్స్ నుండి ఉపశమనం పొంది, ప్రీరాడికల్స్ ను తగ్గించుకోండి.

కాలీఫ్లవర్:

కాలీఫ్లవర్:

ఈ కాలీఫ్లవర్ వెజిటేబుల్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ నివారిస్తుంది మరియు బరువు తగ్గిస్తుంది. ఇవే కాకుండా, ఇందులో ఉండే విటమిన్ బి, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ గుండెకు చాలా మంచిది.

English summary

12 Healthy Superfoods To Have This Winter Season

Winter season is in. So, in this seasonal change, you should have foods that are healthy for the body. With the seasonal changes, seasonal fruits and vegetables come in the market. These healthy foods are rich in vitamins, proteins and minerals.
Story first published: Saturday, December 14, 2013, 13:34 [IST]
Desktop Bottom Promotion