For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ ఏ ప్రాధాన్యత తెలుసుకోండి..ఆరోగ్యంగా జీవించండి..!

|

హెల్తీ బ్యాలెన్స్ డైట్ ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం తగినన్ని న్యూట్రిషియన్స్ మరియు విటమిన్స్ కలిగిఉన్నప్పుడు మంచి ఆరోగ్యం మరియు మంచి సౌందర్యం సొంతం అవుతుంది. హెల్తీ స్కిన్ కలిగి ఉంటేనే అది ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుపుతుంది. స్కిన్ హెల్త్ ను పెంపొందించుకోవాలంటే, విటమిన్ ఏ చాలా ముఖ్యం మరియు విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తప్పనిసరిగా మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.

ఇన్ఫ్లమేటర్ స్కిన్ కండిషన్ అంటే మొటమలు, మచ్చల నివారించే రెటినాయిడ్ డ్రగ్స్ లోలాగే ‘విటమిన్ ఏ'అనేక గుణాలు ఉన్నాయి. కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ పుష్కలంగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ లో కనుగొనబడింది . ఇవి యాంటీఆక్సిడెంట్స్ ప్రభావాన్ని కలిగిస్తాయి మరియు మీ చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడానికి, శరీర సామర్ధ్యాన్ని పెంచడానికి బాగా సహాయపడుతాయి. విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ టాక్సిన్స్ వల్ల ఏర్పడ్డ డ్యామేజ్ను తొలగిస్తుంది మరియు వయస్సు మీద పడకుండా నిరోధిస్తుంది.

కళ్ళు మరియు చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఏ బాగా సహాయపడుతుంది. రెటినాయిడ్స్ కొల్లాజెన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతాయి. ఈ కొల్లాజెన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, ముడతలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతే కాదు ఇంకా కణాలను రీ బిల్డ్ చేస్తుంది. అంతే కాదు గాయాలను మాన్పుతుంది మరయు స్కార్స్(ఛారల)ను నయం చేస్తుంది. ఇంకా ‘విటమిన్ ఏ' సెల్ గ్రోత్ ను రెగ్యులేట్ చేస్తుది. ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం మనిషి చార్మింగ్ కనబడేలా చేస్తాయి. చార్మింగ్ గా కనబడాలనుకోవడం చాలా మంది డ్రీమ్ కూడా. గ్లోయింగ్ స్కిన్ కలిగి ఉండటం డ్రీమ్ అయితే మీ విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని వ్యత్యాసాన్ని మీరే గమనించండి...

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

క్యారెట్స్: క్యారెట్స్ లో విటమిన ఏ పుష్కలం. పచ్చిక్యారెట్స్ ను తినడం వల్ల లేదా క్యారెట్ జ్యూసులను త్రాగడం వల్ల మీ చర్మ ఆరోగ్యంతో పాటు కంటి ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది.100mg పచ్చిక్యారెట్ లో 836mcg విటమిన్ ఏ కలిగి ఉన్నది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో ఇది తప్పకుండా చేర్చేసుకోండి.

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

అనిమల్ లివర్: ఈ అనిమల్ లివర్ లో అధిక శాతంలో విటమిన్ ఏ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. బీఫ్, పోర్క్, టర్కీ లేదా ఫిష్ లు 100mgతీసుకుంటే 6500mcg విటమిన్ ఏ అందిస్తుంది. అనిమల్ ఫుడ్స్ లో ఉండే విటమిన్ ఏ శరీరంలో త్వరగా కలిసిపోతుంది. కాబట్టి అనిమల్ లివర్ ను కూడా మీ శరీరంలో చేర్చుకోవడం అవసరమే.

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

స్వీట్ పొటాటో: స్వీట్ పొటాటోలో అత్యధికంగా విటమిన్ ఎ ఉంటుంది. అంతే కాదు స్వీట్ పొటాటోలు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండి శరీరంలోనికి చేరగానే విటమిన్ ఏ గా మారుతుంది.

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

గ్రీన్ లీఫ్స్: మీ ఆరోగ్యకరమైన చర్మానకి విటమిన్ ఏ పుష్కలంగా ఉన్నావిటమిన్ ఏ రిచ్ ఫుడ్ ఆకుకూరల్లో పుష్కలంగా లభ్యం అవుతున్నాయి. మీ స్కిన్ హెల్తీ డైట్ లో ఈ ఆకు కూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి .

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

చీజ్: చీజ్ మరియు ఇతర డైరీ ఉత్పత్తుల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మఆరోగ్యాన్ని ఇంప్రూ చేస్తుంది. డైలీ డైయట్ లో డైరీప్రొడక్ట్స్ ను చేర్చడం వల్ల చర్మం ఆరోగ్యంగా .. అందంగా ఉంటుంది.

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

కర్బూజ: విటమిన్ ఏ పుష్కలంగా ఉండే మరో అద్భుతమైన ఆహారం ఇది. పెద్దలు ప్రతి రోజూ ఒక్క కర్బూజ తినడం వల్ల వారి శరీరానికి కావల్సిన వంద శాతం విటమిన్ ఏ అందుతుంది. మరి కర్బూజాను తిని, ఎక్స్ ట్రా గ్లోయింగ్ స్కిన్ పొందండి.

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

గుడ్లు: గుడ్డులో కూడా విటమిన్ ఏ పుష్కలంగా ఉండే అద్భుతమైన సోర్స్. చర్మ ఆరోగ్యానికి ఓ సామర్థ్యం ఉన్న ఆహారం ఇది. ముఖ్యంగా విటమిన్ ఎ గుడ్డులోని పచ్చసొనలో పుష్కలంగా ఉంటుంది.

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

అవొకాడో: హెల్తీ ఫ్యాట్స్ కు ఇది అవొకాడో మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇది శరీరంలో అతితేలికగా కలిసిపోతుంది . అవొకాడోను పచ్చిగా లేదా జ్యూసుల తీసుకోవడం వల్ల చర్మఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలిగిస్తుంది.

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

సాల్మన్: సీఫుడ్స్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉండే సాల్మన్ చేపలు. వీటిలో ప్రోటీనులు కూడా అధికమే. సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో సాల్మన్ ఫిష్ ను చేర్చుకోవాలి.

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

బొప్పాయి: బొప్పాయిలో విటమిన్ ఏ పుష్కలం. అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారీనుండి కాపాడేందుకు ఈ విటమిన్ ఏ బాగా సహాయపడుతుంది అంతే కాదు చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది.

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

బ్రొకోలి: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఒకటైన బ్రొకోలీ 100mgలో 31mcg విటమిన్ ఏ లభ్యం అవుతుంది. ఇది చర్మాన్ని వ్యాకోచింపచేసి చర్మ మీద ముడుతలు ఏర్పడకుండా కాపాడుతుంది. మంచి ఫలితాల కోసం పచ్చి బ్రొకోలీని తీసుకోవడం మంచిది.

ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

మామిడి: మామిడిని అన్ని పండ్లకి రారాజు అంటారు. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా అవసరమైన విటమిన్స్ ఉంటాయి. మామిడి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

English summary

12 Vitamin A Rich Foods | ఆరోగ్యానికి అత్యవసరం విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్..!

A healthy balanced diet is essential to ensure that your body is getting all the necessary vitamins and nutrients for a healthy and beautiful skin. Healthy skin is an indication of overall well-being. If you want to improve skin health, then Vitamin A is very important and must be included in your diet.
 
 Mango Mango is considered as the king of all fruits as it is the richest source of all essential vitamins including Vitamin A. Mango is effective in keeping your skin healthy.
Story first published: Wednesday, March 27, 2013, 11:15 [IST]
Desktop Bottom Promotion