For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నజబ్బుల నుండి ప్రాణాంతక వ్యాధులను నివారించే వరకూ ‘‘మునక్కాయ’’ దివ్వ ఔషధం!

|

ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు, తాజాగా ఉండే గ్రీన్ వెజిటేబుల్స్ మరియు పండ్ల కంటే మరోకటి మంచి ఆరోగ్యానికి సహకరించవు. ప్రస్తుత జీవన శైలిలో వీటన్నింటిని చాలా అలక్ష్యంచేస్తున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ షెడ్యుల్ తో వారు ఇంటి ఆహారం కంటే, జంక్ ఫుడ్ మీద ఎక్కువగా ఆధారపడటానికి మొగ్గుచూపుతున్నారు. దాంతో శరీరానికి అవసరం అయ్యే అనేక ప్రోటీనులు, మిటమినులు లోపంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకు అన్ని రకాల కూరగాయలను రెగ్యులర్ గా తీసుకొంటున్నారా లేదా అని ట్రాక్ చేయడం చాలా కష్టం. సీజనల్ గా అందుబాటులో ఉండే వెజిటేబుల్స్, మునగకాడలను మన ఇండియాలో విరివిగా ఉపయోగపడుతున్నాయి.

దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. మునగ కాయలతోపాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది.

నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. -విటమిన్‌ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్‌ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్సియం - 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి.

ఆయుర్వేద వైద్య విధానంలో ఈ మునగ కాయలు, ఆకులు, పువ్వులు, కాండం అన్నిటిలోనూ, ఔషధగుణాలు అధికంగా ఉండడం చేత అధికంగా ఉపయోగిస్తున్నారు.
మరి మునగకాడలోని ఆరోగ్యప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం...

హై ఓలిక్ కంటెంట్:

హై ఓలిక్ కంటెంట్:

మన శరీరానికి అవసరం అయ్యే మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సంబంధించిన హై ఓలిక్ యాసిడ్ ను కలిగి ఉంటాయి.

విటమిన్ సి లెవల్స్ :

విటమిన్ సి లెవల్స్ :

మునగ కాడలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి వల్లే మునగకాడ యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది అనేక ఇన్ఫెక్షన్స్ తో పోరాడే లక్షణాలను కలిగి ఉంటాయి . ముఖ్యంగా సీజనల్ కోల్డ్. ఒక వేళ ముక్కుదిబ్బడ, మరియు చెవులు మూసుకుపోడం జరిగితే మునగకాడలను బాగా ఉడికించి ఆనీటిని ఆవిరిగా మీల్చాలి. ఇది ఉపశనం కలిగించడంతో పాటు వ్యాధినిరోధకతతో పోరాడుతుంది మరియు ఆస్తమా వంటి అనేక శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

మినిరల్ బ్యాగ్:

మినిరల్ బ్యాగ్:

ముగకాడలో అనేక పోషకాంశాలు ఉన్నాయి. ప్రతి రోజూ మన శరీరానికి అవసరం అయ్యే క్యాల్షియం పుష్కలంగా అంధించి, ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. మరియు మునగాకాడలోని ఐరన్ రక్తహీనత లేకుండా కాపాడుతుంది. ఇంకా ఇందులో మెగ్నీషియం, సెలీనియం, మ్యాంగనీస్ వంటివి ఆరోగ్యానికి సహాయపడేవి పుష్కలంగా ఉన్నాయి.

లైంగిక సామర్థ్యానికి:

లైంగిక సామర్థ్యానికి:

అన్నిటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంగస్తంభన సమర్థవంతంగా లేనివారు... మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది.

గర్భిణీ స్త్రీకి:

గర్భిణీ స్త్రీకి:

గర్భిణీ మహిళలకు కూడా మునగ నుండి మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వారి డైలీ డయట్ లో చేర్చుకోవడం వల్ల, గర్భాధారణ సమయంలో నిస్సత్తువ, వామిటింగ్, తలతిరగడం వంటివాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు ప్రసవ నొప్పులు చాలా సులభంగా వచ్చేలా చేస్తుంది. పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ ను తగ్గిస్తుంది. అంతే కాదు ప్రసవం తర్వాత బిడ్డకు సరిపడా పాలు పడాలంటే మునగాకును తరచూ తింటుండాలి. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ మునగ కాయలు, ఆకులు, పువ్వులు, కాండం అన్నిటిలోనూ, ఔషధగుణాలు అధికంగా ఉండడం చేత అధికంగా ఉపయోగిస్తున్నారు.

విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది:

విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది:

విత్తనాలు మరియు మునగఆకులు విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ బి6, నియాసిన్, రెబో ఫ్లేవిన్ మరియు ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి . ఈ విటన్లు అన్నీ కూడా మీ జర్ణవ్యవస్థకు సహాయపడే విధంగా ఉన్నాయి. ఇవి తిన్న ఆహారంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్నువిచ్చిన్నం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డయోరియా, డైసెంట్రీ, జాండీస్, కలర్ వంటి వాటికి మంచి విరుగుడు.

ఏజింగ్:

ఏజింగ్:

మునగకాడలో విటమిన్ ఎ ను, వయస్సు తగ్గించే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ లలో ఉపయోగిస్తున్నారు. రెగ్యులర్ గా మునగకాడలను మరియు మునగ ఆకును తీసుకోవడం వల్ల మీరు చాలా డబ్బును సేవ్ చేయవచ్చు. అనారోగ్యాలనేవి మీ ధరిచేరవు . మరియు ఇది మంచి కంటి చూపుకు మరయు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

రక్తాన్ని శుద్ది చేయడానికి:

రక్తాన్ని శుద్ది చేయడానికి:

రక్తం శుభ్రతకు మునగాకు బాగా పనిచేస్తుంది. దీని రసాన్ని ప్రతి రోజూ లేదా వారంలో రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీర అవయవాలకు రక్త సరఫరా బాగా ఉంటుంది. మునగకాడలు లేదా మునగాకు రసాన్ని సూప్ లా తీసుకుంటే, రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటు, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. అంతే కాదు ఇది ఒక మంచి యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది.

యూరినరీ ఇన్ఫెక్షన్:

యూరినరీ ఇన్ఫెక్షన్:

మునగకాయ మూత్రాన్ని పరిశుద్ధం చేసి, అతి వేడివలన మూత్రనాళపు మంట, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

కీళ్ళనొప్పులకు:

కీళ్ళనొప్పులకు:

కీళ్ళ నొప్పులకు: మునగకాయ రసం, కీళ్లనొప్పుల నివారణకు ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి మరియు క్యాల్షియం అందుకు బాగా దోహదం చేస్తుంది. మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

అధిక బరువు:

అధిక బరువు:

అధిక బరువు ఉన్నవారు ఎండబెట్టిన మునగాకుపొడిని తేనెతో కలిపి చెంచా చొప్పున ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

నెలసరి సమస్యలకు:

నెలసరి సమస్యలకు:

నెలసరి సక్రమంగా రానివారు, కాల్సియం తగ్గినవారు చిన్న కప్పు పాలకు పెద్ద చెంచా మునగాకు రసం కలిపి రోజు తీసుకోవాలి.

English summary

12Health Benefits Of Drumsticks

When it comes to taking care of health, nothing does it better than green vegetables and fruits. In current lifestyle, all of these go neglected. People get so much busy with their daily schedule that all they get to munch on is junk food.
Desktop Bottom Promotion