For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకుకూరల్లోని 13 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

|

పచ్చని ఆకు కూరలను మీ ఆహారం నుండి ఎప్పుడూ మినహాయించరాదు. ప్రతిరోజూ వాటిని తినాల్సిందే. శుభ్రం చేయటం, తరగటం, వండటం కష్టమని వాటిని మానరాదు. ఆకుకూరలు అతి చౌకగా లభించే అన్ని పోషక విలువలుగల ఆహా రం. అనేక రకాల ఆకుకూరలు మనకు లభ్యమవుతున్నాయి. తోట కూర, కొయ్యతోటకూర, అవిశాకు, బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరి వేపాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూరను ఎక్కువగా వాడాలి. ఆయాకాలంలో చౌకగా దొరికే ఆకు కూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది. ఉదా పుదీనా పచ్చడి, గోంగూర పప్పు, పెసర పప్పు, పాలకూర, కరివేపాకు పొడి, ఆకుకూర పకోడి, బచ్చలి-బజ్జి మొదలైనవి. ఆకుకూరలు మంచి పౌష్టికకరమైన ఆహారం. వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది.

మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో.... శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ,ధూళి మనఆరోగ్యానికి హాని కలిగించ వచ్చు. ఇలా పలు రకాల ఆకుకూరలు వండేముందు కాస్త ఉప్పువేసిన మంచి నీటిలొ ముంచితే వాటిపై ఉండే క్రిమికీటకాలు, గుడ్లు, నాశనమవుతాయి.

ఇవి తొందరగా నలిగే గుణం ఉండ టం వల్ల సలాడ్‌, సూపులుగా, చట్నీలుగా తీసుకోవచ్చు. ముఖ్యంగాఆకు కూర లు వండే సమ యంలోమూతలు పెట్టి వండండి. వీలైనంతవరకు ప్రెజర్‌ కుక్కర్‌లోనే వండేందుకు యత్నిస్తే... వాటిలోనిపోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడక పెట్టాక ఆందులోనీటిని పారేయకండి. కాస్తనిమ్మరసం, ఉప్పు,కలిపి సూప్‌గా తీసు కుంటే ఆరోగ్యానికి మంచిది. ఇంతే కాదు, ఆకుకూరల్లోని మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి:

లోక్యాలరీ:

లోక్యాలరీ:

డైటర్స్ కోసం ఆకుకూరాలు ఒక అద్భుతమైన ఆహారం. వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్స్ మరియు చాలా తక్కువగా బ్లడ్ గ్లూకోజ్ లు కలిగి ఉంటాయి. కాబట్టి, మీరు బరువు తగ్గాలనుకుంటే ఏమాత్రం సంకోచించకుడా ఆకుకూరలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

విటిమన్లు అధికం:

విటిమన్లు అధికం:

ఆకుకూరల్లో విటిమిన్ ఎ, కె మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది మరియు శాస్వ సంబంధిత సమస్యలను, యూరినరీ మరియు పేగు సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

ఫైబర్ అధికం:

ఫైబర్ అధికం:

ఒక కప్పు ఆకూరలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని మీ దరిదాపుల్లో చేరనివ్వదు. మలబద్దకం నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి ఆకుకూరలు. ఆకుకూరల్లో డైటరీ ఫైబర్ ఫుష్కలంగా ఉండీ మీ జీవక్రియను శుభ్రం చేస్తుంది.

యాంటీఆక్సిడెంట్స్:

యాంటీఆక్సిడెంట్స్:

ఆకుకూరలు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆకుకూరల్లోని విటమిన్స్ మరియు మినిరల్స్ హైబ్లడ్ ప్రెజర్ ను నివారించడానికి మరియు ఇతర సమస్యను నిరోధించడానికి బాగా సహాయపడుతాయి.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

ఆకుకూరల్లోని అనేక ఫ్లేవనాయిడ్, ఫైటోన్యూట్రియంట్స్ కు ఇవి చాలా అవసరం. ఇవి యాంటీక్యాన్సర్ గుణాలను కలిగి ఉండి ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

ఆకుకూరల్లోని మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచేదుకు బాగా సహాయపడుతుంది. అలాగే ఆకుకూరల్లోని ఫొల్లెట్, కార్డియో వాస్కులర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

ఆకుకూరల్లోని కెరోటినాయిడ్స్ మనకు తెలిసిన ల్యూటిన్ మీ జీవక్రియల్లో కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది. అయితే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ప్రతి రోజూ ఒక కప్పు ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

చర్మం సంరక్షణకు:

చర్మం సంరక్షణకు:

ఆకు కూరలలో కెరోటిన్‌ అనే పదార్ధం సమృద్ధిగా ఉం టుంది. శరీరంలో కెరోటిన్‌ విటమిన్‌ ‘ఎ'గా మారుతుం ది. విటమిన్‌ ‘ఎ' చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు వీటిలో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ స్కిన్ మాయిశ్చరైజ్ గా అద్భుతంగా పనిచేస్తాయి. మొటిమలు, మచ్చలు, రాషెస్ వంటి అనేక చర్మ సమస్యలతో పోరాడటానికి సహాయపడుతాయి.

కంటి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది:

కంటి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది:

కళ్ళకు సరైన చూపును ఇస్తూ రేచీకటి రాకుండ కాపా డుతుంది. ఆకుకూరల్లోని ల్యూటిన్ కళ్ళకు రక్షణగా ఉండి కాంట్రాక్ట్ మరియు ఏజ్ రిలేటెడ్ కళ్ళ సమస్యను నివారిస్తుంది.

ఆరోగ్యకరమైన నరాల కోసం:

ఆరోగ్యకరమైన నరాల కోసం:

ఆకుకూరల్లో సెలీనియం, నియసిన్ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యకరమైన మెదడుమరియు నరాల

ఆరోగ్యంను కాపాడుతుంది.

బోలు ఎముకల వ్యాధి:

బోలు ఎముకల వ్యాధి:

ఉడికించిన ఒక కప్పు ఆకుకూరల్లో 100శాతం ఆడిఎ విటమిన్ కె , ఇవి కీళ్ళనొప్పులకు నిరోధిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మరియు బలానికి బాగా సహాయపడుతుంది.

కీళ్ళనొప్పులను నివారిస్తుంది:

కీళ్ళనొప్పులను నివారిస్తుంది:

ఆకుకూరలు కీళ్ళనొప్పులను మరియు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఆకుకూరల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళనొప్పలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

రక్తహీనతను తగ్గిస్తుంది:

రక్తహీనతను తగ్గిస్తుంది:

ఆకు కూరలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. రక్త పుష్టి కి ఇనుము చాలా అవసరం. గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, 5 సంలలోపు పిల్లలకు ఇనుము అవసరము ఎక్కువగా ఉంటుంది. తోటకూర, శనగ కూర, బొబ్బెర్ల ఆకులు, బచ్చలి, ఆవాకులు, పొనగంటి మొదలైనవి వాటిలో ఇనుము ఎక్కువగా లభిస్తుంది.

English summary

13 Amazing Health Benefits Of Spinach

Spinach is a wonder leaf which can cure half of your health problems. By including a small amount of spinach in your daily diet, you can reap huge health benefits. Most people, especially kids are not too fond of having these green leafy vegetable on their plates.
Story first published: Thursday, October 24, 2013, 17:55 [IST]
Desktop Bottom Promotion