For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతి తక్కువ తినడానికి 13 వినూత్న మార్గాలు...!

By Super
|

మనలో చాలామంది ఆహారప్రియులు ఉన్నారు మరియు వీళ్ళు తినటానికే జీవిస్తుంటారు. కాని ఒక ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవన విధానానికి 'నియంత్రణ' అనే ఒక కీలక పదం గుర్తుంచుకోవాలి. మేము మీకు మీరే "తక్కువ తినండి" అని హెచ్చరించుకునే 13 వినూత్న మార్గాలను తెలియచేస్తున్నాం.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

ప్రేయసి / ప్రియుడి వేట : మీరు మంచి అందమైనవారుగా అవతలవారికి కనపడాలంటే, మీరు ఇంకా ఒంటరిగా ఉండి అవతలివారిని ఆకర్షించాలంటే, మీకు మీరు తక్కువ ఆహారం తీసుకోవాలని హెచ్చరిక చేసుకోండి. ఇలా చేయటంవలన మిమ్మలిని మీరు ఈ అనారోగ్యపు అలవాటు నుండి చాలా సులభంగా మరియు చాలా ధృఢంగా కాపాడుకోగలుగుతారు.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

ఆసక్తిలేని ఆహారం: మీరు చాలా తరుచుగా అసాధారణ గంటలలో ఆకలిగా అనుభూతి పొందుతున్నప్పుడు, ప్రపంచంలోని అన్నిరకాల చికాకు కలిగించే ఆహారాన్ని గురించి ఆలోచించండి. అప్పుడు మీకు తినాలనే కోరిక కన్నా వేరే పని మీద ధ్యాస కలుగుతుంది.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

రాత్రుళ్ళు అమితంగా తినటం తగ్గించుకోవటం : చలనచిత్ర అభిమానులు వారి ఇష్టమైన చలన చిత్రాన్నిటెలివిజన్ లో 250వ సారి చూసేవారికి నిస్సందేహంగా ఒక అనారోగ్య అల్పాహారం అలవాటు కలిగి ఉంటారు. ఇది తగ్గించుకోవటానికి ఆ సమయంలో వారి గర్ల్ /బాయ్ ఫ్రెండ్ తో గాని ముచ్చట్లాడుతే, ఈ అలవాటు మానుకోవొచ్చు.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

వీడియోలు : కొన్నిసార్లు మీరు అనేక విషయాల గురించి ఆలోచించటం మీకు ఏ మాత్రం సహాయపడదు. మీకు ఏది అవసరమౌతుందో దాని గురించి చూడండి. ఉదాహరణకు బొద్దింకలు, పురుగులు మరియు ఏదైనా మీకు నచ్చని ఆహారాలను తింటున్న వారి వీడియోలను చూడండి. మీకు ఖచ్చితంగా కొంతకాలం పాటు ఏమీ తినడానికి కోరిక కలగదు.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

సూప్ మొదట : మీరు భోజనం ముందు ఒక గ్లాసు నీరు గాని లేదా ఒక చిన్న గిన్నెడు సూప్ గాని, మీరు ఏది ఇష్టపడతారో దానిని తీసుకోండి. దీనివలన మీరు తీసుకునే ఆహార పరిమాణం తగ్గుతుంది. మీరు తీసుకునే ద్రవపదార్ధం పాక్షికంగా మీ కడుపు నిండినట్లుగా అనుభూతి కలిగిస్తుంది.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

ట్రంప్ కార్డు మామ్ అని పిలుస్తారు: మీ అమ్మ మీకు మంచి అందమైన అమ్మాయితో సంబంధం కలుపుకోవాలి అనుకుంటే, ఆమెను రోజులో మీకు ఆహారాన్నిసరిఅయిన పాళ్ళలో నెయ్యి లేదా వెన్నతో గాని చిన్నచిన్న దఫాలుగా ఇవ్వమని చెప్పండి. ఆమె నిర్ణయం తీసుకుంటే మీరు తీసుకునే ఆహారం ఆటోమేటిక్ గా తగ్గుతుంది.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

చూయింగ్ గమ్ నమలండి : మీరు ఆహారాన్ని తీసుకోవటం నియంత్రించటానికి చ్యూయింగ్ గంను తీసి కొంతసమయం నమలండి. మీ దృష్టి వెంటనే ఇతర విషయాల మీదకు మళ్ళుతుంది.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

సరి అయిన సహచరులను ఎంచుకోవడం: మీ ఇష్టాయిష్టాలు, అలవాట్లు మీరు ప్రతిరోజూ సంచరించే మనుషుల మీద ఆధారపడిఉంటుంది. మీకు ఆకలిగా అనిపించినప్పుడు మీతో ఆడవారిని తోడు తీసుకెళ్ళండి. వారు తీసుకునే ఆహారాన్ని చూసి మీరు కూడా తక్కువగా భోంచేస్తారు.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

ఒక ఖరీదైన డైటీషియన్ ను కలవండి : మీరు ఒక క్రమపద్ధతిని అనుసరించాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ఒక ఖరీదైన ఆహారవైద్యుడిని కలుస్తారు. మీరు వారికి చెల్లించిన ఫీజు మీకు అనుసరించవలసిన పద్ధతిని గుర్తు చేస్తుంది, లేదంటే మీరు చెల్లించిన ఫీజు బూడిదలో పోసినట్లు అవుతుంది.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

కత్తులు-చెంచాలు మాని/చేతులకు పని ఇవ్వండి : ఎవరైతే చేతులతో ఆహారాన్ని తీసుకోవటం ఇష్టపడతారో, వారు ఫోర్క్, కత్తి, చెంచా లేదా చాప్ స్టిక్లు ఉపయోగించి ఆహారాన్ని తీసుకుంటే చాలా తక్కువగా తింటారని అధ్యయనాలు చెపుతున్నాయి. దీనినిబట్టి ఆహారాన్ని చేతులు ఉపయోగించి తీసుకోవటం కంటే ఫోర్క్, కత్తి, చెంచా లేదా చాప్ స్టిక్లు ఉపయోగించి తీసుకోవటం మంచిది.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

ముదురు రంగుల ప్లేట్లు : రంగుయొక్క ప్రభావం, శక్తి మనం తీసుకునే ఆహారం మీద ఉంటుంది, కాబట్టి మీరు నలుపు లేదా నీలం ప్లేట్ లో ఆహారం తీసుకోవటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వలన మీకు వేగంగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

ప్రోటీన్లు ఉన్న పాక్ : ప్రోటీన్లు, ఆహారం తీసుకోవటం మరియు ఆకలి నియంత్రించటంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాయని అధ్యయనాలలో తేలింది. క్రమం తప్పకుండా ప్రోటీన్ తీసుకునే ప్రజలలో గణనీయమైన బరువు తగ్గుదల కనిపించింది. ప్రోటీన్లు తీసుకున్నందువల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి ఎక్కువగా ఉంటుంది ఎందువల్లంటే ఇది జీర్ణం అవాలంటే ఎక్కువ సమయం పడుతుంది. మీరు భోజనం మరియు స్నాక్స్ లో ప్రోటీన్లు తీసుకోకుంటే, తీవ్రమైన ఆకలి మిమ్మలిని అధికంగా ఆహారాన్ని తీసుకోవటానికి ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోండి.

తక్కువ తినడానికి 13 వినూత్న పద్దతులు..!

ఉపాహారం తినండి : రోజులో ఉపాహారం చాలా ముఖ్యమైనదని చెపుతారు. ఎవరైతే ఉపాహారాన్ని క్రమంగా తీసుకుంటారో వారిలో తక్కువ BMI (బాడి మాస్ ఇండెక్స్) ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి మరియు అల్పాహారం దాటవేసే వ్యక్తుల కంటే వీరు ప్రతి రోజు తక్కువ మొత్తంలో కేలరీలు పొందుతారు.


English summary

13 Innovative Ways To Eat Less | అతి తక్కువ తినడానికి 13 వినూత్న మార్గాలు...!

Most of us are hardcore foodies and definitely live to eat! But moderation is a key word for a healthy and happy lifestyle. We bring to you 13 innovative ways of telling yourself, “Hey! Eat Less”.
Desktop Bottom Promotion