For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేహంలోని కల్మశాలను(మలినాలను)తొలగించే ఆహారాలు...!

|

కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే హానిని రిపెయిర్ చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొలాజెన్ ఉతపత్తి పెంచవచ్చు. ఫ్రీ రాడికల్స్ మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి యాంటిఆక్సిడెంట్ ప్రధానంగా శరీరాన్ని శుభ్రపచి, డిటాక్సి ఫై చేయడానికి చాలా సహాయపడుతుంది

మనకు తెలిసినంత వరకూ యాంటిఆక్సిడెంట్స్ ఆహారాలు చాలానే ఉన్నాయి. యాంటీయాక్సిడెంట్స్ అంటే కెరోటినాయిడ్స్, మెలాటినిన్, విటమిన్స్(ఎ, సి, ఇ)ఫోటోకెమికల్ (బీటా కెరోటిన్ మరియు లైకోపిన్) మరియు మినిరల్స్ అంటే సెలీనియం మరియు జింక్ వంటివి తీసుకోవడం వల్ల అవి శరీరంలో మనకు అనవసరంలేని ఫ్రీరాడికల్స్ గా మార్పు చెందుతాయి. ఇవి మల మూత్రాల ద్వారా విడుదలవుతాయి.

ఇక యాంటీఆక్సిడెంట్స్ చేసే మరో ప్రధాన పాత్ర సహజంగా చర్మ ఛాయను మార్చుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంద. కాబట్టి సహజసిద్దాంగా కొన్ని నేచురల్ ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ (క్యారెట్, స్వీట్ పొటాటో, అవొకాడో, దానిమ్మ, ద్రాక్ష, కివి, బెల్ల్ పెప్పర్ మరియు కిడ్నీ బీన్స్ వంటి వాటిలో ఈ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభ్యం అవుతాయి. అధికంగా యాంటీఆక్సిడెంట్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్రీరాడికల్స్ ను తొలగించడమే కాదు, చర్మాన్ని మంచి రంగులోనికి మార్చుతుంది.

ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను తొలగించడం మరియు చర్మాని శుభ్రపచడం కాకుండా మరో ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. అది సెల్యులార్ డ్యామేజ్ ను నిరోధించడానికి, టైప్ 2 డయాబెటిస్ ను వ్యతిరేకించడానికి, క్యాన్సర్ నిరోధించడానికి మరయు గుండె జబ్బులను అడ్డకోవడానికి ఉపయోగపడుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ రెగ్యులర్ ఆహారంతో పాటు ఈ యాంటీఆక్సిడెంట్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను తీసుకొని మీ ఆరోగ్యాన్ని అందమైన సౌందర్యాన్ని, చక్కటి శరీర ఆక్రుతిని పొందండి.... మరి ఆ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ మరియు వేజిటేబుల్స్ ఏంటో చూద్దాం..

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

దానిమ్మ: దానిమ్మ రుచికి మాత్రమే కాదు. దానిమ్మ గింజల్లో యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండి శరీరాన్ని శుభ్రపరుస్తుంది.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

ఆకుకూరలు: యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే మరో గ్రీన్ లీఫీ వెజిటేబుల్ పాలకూర. ఇది ల్యూటిన్, జియాక్సన్థిన్ (రెండూనూ కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్స్)ఇది న్యూరోడీజనరేటివ్ వ్యాధుల నుండి మెదుడును రక్షిస్తుంది.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

బ్రస్సెల్స్ స్ప్రార్ట్స్: ఇందులో ఫైటో కెమికల్స్ కాకుండా, డైయటరీ ఫైబర్, విటమిన్స్ మరియు మినిరల్స్ శరీరానికి అవసరమైన ఖనిజ సంపద పుష్కలంగా లభిస్తోంది.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

బీట్ రూట్: శరీరాన్ని ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచే విటమిన్లు, మినరల్స్, ప్రోటీనులు అధికంగా ఉండే అతిముఖ్యమైన కూరగాయలను తీసుకోవడం చాలా అవసరం. బీట్ రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కాబట్టి యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ను మీ ఆహారంలో తీసుకోవడం మర్చిపోకండి.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

బ్రొకోలి: మిగితా గ్రీన్ వెజిటేబుల్స్ లాగో బ్రొకోలిలో కూడా అధిక యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా అనేక వ్యాధులతో పోరాడే ఫోలీన్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

వెల్లుల్లి: వెల్లుల్లి యాంటిబయోటిక్ లక్షణాలు కలిగినదని మనందరికీ తెలిసిన విషయమే. అంతే కాదు ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఎ, బి, మరియు సి, సెలీనియం, ఐరన్, జింక్ మొదలగునవి ఫుష్కలంగా ఉండి. హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిస్తుంది.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

బెల్ పెప్పర్: బెల్ పెప్పర్ లో అధికంగా కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ సి(యాంటీఆక్సిడెంట్స్)పుష్కలంగా ఉంటాయి. రెడ్ మరియు ఎలో బెల్ పెప్పర్స్ ఆరోగ్యానికి మంచిది మరియు న్యూట్రిషియన్స్ పుష్కలం.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

కిడ్నీ బీన్స్: చాలా వరకూ అన్నిరకాల బీన్స్, బ్లాక్, రెడ్ మరియు పింటో అన్నిట్లోనూ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.ఇవి శరీరాన్ని శుభ్రపరచి డిటాక్సిఫై చేస్తుంది.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

బెర్రీస్: అన్ని రకాల బెర్రీస్ లోని ప్రోటీనులు, విటమినులు, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించే లక్షణాలను మాత్రమే కలిగి ఉండటం కాదు, శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

ఆరెంజ్: ఈ తియ్యని మరియు పుల్లని సిట్రస్ పండ్లు విటమిన్ ఎ, సి, ఫ్లెవనాయిడ్స్ మరియు బీటా కెరోటిన్స్ అధికంగా ఉంటాయి. శరీరాన్ని శుభ్రం చేసి, డిటాక్స్ చేస్తుంది.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

ఆపిల్స్: రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ సంప్రదించాల్సిన పనిలేదు. అది నిజం. ఆపిల్స్ లో ఫైటోన్యూట్రియంట్స్, ఫ్లెవనాయిడ్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ అది శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

అవొకాడో: అవొకాడోలో విటమిన్స్, ఎ, సి మరియు ఇ పుష్కలంగా ఉండి శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

కేలా: ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫోలీ ఫినాలిక్ ఫెవనాయిడ్స్ (యాంటీఆక్సిడెంట్స్)ఇవి క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది మరియు కార్డియో వాస్కులార్ వ్యాధులను నిరోధిస్తుంది.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

టమోటో: టమోటోలో యాంటీఆక్సిడెంట్స్ అధికం. ఇవి వ్యాధులతో పోరాడే లక్షణం కలిగి ఉంటుంది. టమోటో బరువు తగ్గిస్తుంది. కొవ్వును కరిగించే లక్షణాలు పుష్కలం.

శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

కివి: కివి మరో విటమిన్ సి అధికంగా ఉండే పండు, కివిలో యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలమే. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

English summary

15 Antioxidant Rich Fruits n Vegetables | శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్...

Antioxidants are the chemical compounds that acts as a natural detoxifier to cleanse the body. Free radicals (molecules with exposed free electrons) can damage the body. Antioxidants neutralists these molecules by donating one electron, thus preventing it from causing damage to the body. Free radicals in the body can be really harmful for the overall health. So, antioxidants play a vital role in cleansing the body and detoxifying it.
Story first published: Saturday, February 2, 2013, 14:42 [IST]
Desktop Bottom Promotion