For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనస్సును ప్రశాంతంగా ఉంచే 15 సూపర్ ఫుడ్స్

By Super
|

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. నిద్రలేమి, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, పార్టీ కల్చర్స్, ఒత్తిడి వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది.

ఇలా మద్యలో వచ్చే అనేక రకాలా అనారోగ్యసమస్యలను ఎదుర్కోవాలంటే , వాటిని ముఖ్య కారణాలు కనుగొని జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. మీరు తీసుకొనే ఆహారం,మీరు అనుకొన్నదాని కంటే చాలా గొప్పగా ప్రభావం చూపెడుతాయి అన్న విషయం మీకు తెలుసా?ఇక్కడ కొన్ని ఆహారాలను లిస్ట్ చేయబడి ఇస్తున్నాం.

ఈ టాప్ 15 ఆహారాలు మీరు తీసుకోవడం వల్ల ప్రశాంతమైన మనస్సు మరియు ఒత్తిడి తగ్గించుకోవడానికి సహాయపడుతాయి.

పైన ఇచ్చిన ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అలసట, ఒత్తిడిలకు దూరంగా ఉండొచ్చు.ఇంకా మీ శరీరంలో టాక్సిన్స్ ను తొలగించుకోవడానికి ఈ ఆహారాలతో పాటు ప్రతి రోజూ తగినంత నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా సంతోషంగా ఉండవచ్చు.

చాక్లెట్:

చాక్లెట్:

చాక్లెట్స్ అంటానే ఏది పడితే అవి తినేయడం కాదు. చాక్లెట్స్ లో డార్క్ చాక్లెట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో ఉండే anandamine అనే కంటెంట్ ద్వారా మెదడు విశ్రాంతి మరియు ఒత్తిడి లేకుండా మెదడులోని డోపమైన్ లెవల్స్ ను పెంచుతుంది.

నట్స్:

నట్స్:

నట్స్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఈ ఖనిజం మన శరీరంలో లోపిస్తే అలసట మరియు ఆందోళనకు గురికావల్సి వస్తుంది. అందువల్ల , ఒక గుప్పెడు నట్స్ తినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

గ్రీన్ లీఫ్స్:

గ్రీన్ లీఫ్స్:

ఆకుకరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దాంతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచే మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. సరైన విటమిన్లు విటమిన్ ఎ మరియు విటమిన్ సి అదే విధంగా విటమిన్ సి కూడాఆరోగ్యకరమై ఆహారం తీసుకొనేలా చేస్తుంది.

పాస్తా:

పాస్తా:

మెగ్నీషియం అధికంగా ఉండే మొత్తం ధాన్యంతో తయారుచేస్తారు. మెగ్నీషయం లోపం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మెగ్నీషియం అధికంగా ఉండే పాస్తాను తీసుకోవడం ఉత్తమం.

బ్రెడ్:

బ్రెడ్:

పాస్తాలాగే బ్రెడ్ కూడా అదే ప్రభావాన్ని చూపిస్తుంది . మెగ్నిషియం లోపంను తగ్గించుకోవడానికి మీ బ్రేక్ ఫాస్ట్ లో ధాన్యంతో తయారుచేసిన బ్రెడ్ టోస్టర్ లేదా సాండ్విచ్ లాను తీసుకోవడం వల్ల రోజంతా ఒత్తిడి లేకుండా గడపవచ్చు.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

ఇది ఒక రుచికరమైన పండు, అంతే కాదు ఇవి పుష్కలమైనటువంటి యాంటీఆక్సిడెంట్స్, కలిగి ఉండటం వల్ల ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతాయి.

బాదం:

బాదం:

బాదంలో ఉండే అద్బుతమైన జింక్ ఖనిజం మరియు విటమిన్ బి12 వల్ల ఈ స్ట్రెస్ రిలీఫ్ జాబితాలో చేర్చబడింది. ఈ పోషకాలు మీ మనస్సు సమతుల్యస్థితి నిర్వహించడానికి మరియు ఆందోళను దరంగా ఉంచడానికి సహాయడపతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అది మానవ మనస్సును ఒక ప్రశాంతంగా ఉంచేందుకు ప్రభావం కలిగి ఉంటుంది. నిజానికి ఇది చాలా ఎఫెక్టివ్ గా ప్రభావం చూపెడుతుంది.

చేపలు:

చేపలు:

చేపల్లో సాల్మన్ మరియు మేకరెల్ రకాల చేపల్లో ఒమేగా 3ఫయాటీఆసిడ్స్ పుష్కలంగా ఉండి , బ్రెయిన్ కు అవసరం అయ్యే సెలీనియం మరియు ట్రిప్టోఫాన్ ను అంధించడం వల్ల బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది .

ఓట్స్:

ఓట్స్:

మన శరీరానికి అవసరమయ్యే సెరోటోనిన్ స్థాయిలను మెరుగుపర్చేందుకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు మైండును ప్రశాంతంగా ఉంచడానికి ఓట్స్ తినడం ఒక గొప్ప మార్గం.

పాలు:

పాలు:

ఆశ్యర్యపోయారా మళ్ళీ? ఎందుకంటే, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి అవసరం అయ్యే సెరోటోనిన్ యొక్క ఏర్పటుకు పాలలోని ట్రిప్టోఫాన్ సహాయపడుతుంది.

బ్రొకోలి:

బ్రొకోలి:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఇది. ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ మీరు తీసుకోవడం వల్ల మీకు అవసరం అయ్యే పొటాషియం పొందవచ్చు . ఇది చాలా తక్కవ స్థాయి అలసట మరియు ఒత్తిడిని కలిగిస్తుంది.

కివిపండ్లు:

కివిపండ్లు:

కివిపండ్లలో ఉండి ట్రిప్టోఫాన్ సెరోటిన్ గా మార్చేందుకు సహాయపడుతుంది. అందువల్ల అలసట మరియు ఆందోలన తగ్గించుకోవచ్చు . ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండవచ్చు.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో ఫైబర్ తక్కువ, అరటిపండ్లు గ్యాస్ ను తగ్గిస్తుంది.దాంతో ప్రశాంతగా మరియు ఒత్తిడి లేకుండా గడపడానికి ఇవి బాగా సహాయపడుతాయి.

రైస్:

రైస్:

రైస్ లో ఉండే ఒక కార్బోహైడ్రేట్ మనస్సును ప్రశాంతంగా ఉండేలా ప్రభావితం చేస్తుంది. బియ్యం ఇంకా సులభంగా జీర్ణమవుతుంది మరియు కొవ్వు తక్కువగా ఉంటుంది.

English summary

15 Foods For A Calmer Mind

Did you know that what you eat can greatly affect the way you think and feel? Here are the top 15 foods that help you develop a calmer mind and deal with stress better
Desktop Bottom Promotion