For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లివర్(కాలేయాన్ని)శుభ్రం చేసి, ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్...

|

కాలేయం మన శరీర జీవక్రియల్లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన ఉదరభాగంలో కుడివైపున ఉంటుంది. జబ్బు పడినా కూడా తనను తాను బాగు చేసుకోగలదు, శరీరానికి కావల్సిన శక్తిని తయారు చేయగలదు, జీర్ణక్షికియలో అత్యంత కీలకపాత్ర నిర్వర్తించే అవయవం, శరీరంలోని అతి పెద్ద గ్రంథి. మూడువంతుల వరకు పాడైపోయినా తిరిగి దానంతట అదే బాగుపడగలదు. పావువంతు అవయవం బావున్నా సరే తనని తాను తిరిగి నిర్మించుకోగలదు. అటువంటి అద్భుతమైన అవయవమే కాలేయం. శరీరంలో పెద్ద గ్రంథి మాత్రమే కాదు, బరువైన అవయవం కూడా కాలేయమే. తిరిగి ఏర్పడే అవకాశం ఉన్న అవయవం కూడా ఇదొక్కటే. దీని సుగుణాలే ఒక్కోసారి దానికి ప్రమాదకరంగా మారుతాయి. ఎందుకంటే పూర్తిగా పాడై పొయ్యే దాకా ఎటువంటి లక్షణాలు కనిపించక పోవచ్చు. అప్పుడు పరిస్థితులు ప్రాణాంతకం కావచ్చు కూడా. ఇది కుడి పక్క పక్కటెముకలలో కొద్దిగా కిందివైపు ఉంటుంది. ఒకటి పేగుల నుంచి వచ్చే పోర్టల్ రక్తనాళం ద్వారా మరోటి 20 హెపాటిక్ ఆర్టరీ ద్వారా దీనికి రెండు చోట్ల నుంచి రక్త సరఫరా జరుగుతుంది.

కాలేయం... మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర (గ్లూకోజ్), ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం (శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడం), రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

తృణధాన్యాలు: తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

ఆలివ్ ఆయిల్: ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

వెల్లుల్లి ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయాన్ని శుభ్రం చేసే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. దీన్ని నేరుగా వేయించకూడదు.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

యాపిల్స్: యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంది. యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

బ్రొకోలి: ఇది క్యాలీఫ్లవర్ లాగా ఉంటుంది. ఇందులో పోషక తత్వాలు విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్ ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు తొలగించడమే కాకుండా కాలేయాన్ని కాపాడుతుంది.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

బీట్ రూట్: బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంప వంటివి ఎక్కుగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కాలేయంలోని కణాలు పునరుత్పత్తిగికి బాగా సహాయపడుతాయి. డయాబెటిక్ లివర్ ను కాపాడును. కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది.ఈ ఆరోగ్యకరమైన దుంపలను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

అవోకాడో: ఈ పండులో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనో శాచ్యురేటెడ్ కొవ్వుపదార్థాలున్నాయి. దీనిలో ఫైటో కెమికల్స్ నోటి క్యాన్సర్ ను నివారిస్తాయి. ఇది కాలేయాన్ని శుభ్ర పచడమే కాకుండా కణజాలాలు మరియు కణాల పునరుద్దించడానికి బాగా సహాయ పడుతుంది. ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల కాలేయానికి మంచి ప్రయోజం చేకూర్చుతాయి.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కు ఉంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది. కాలేయానికి ముఖ్యంగా కాకరకాయ, ఆకుకూరలు, క్యాబేజి వంటి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

సిట్రస్ పండ్లు(ద్రాక్ష, ఆరెంజ్): సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ను కాపాడుటలో బాగా పనిచేస్తుంది. కాలేయ పనితీరును మెరుగు పరచుతుంది. ద్రాక్ష పండ్లలోని టన్నీస్‌, పాలిఫినాల్స్‌ క్యాన్సర్‌ సంబంధిత కారకాలపై పోరాడుతాయి. శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాదు..ద్రాక్ష గింజల్లో ఉండే ప్రొనాంథోసైనిడిన్‌ అనే పదార్థం కాలేయాన్ని సంరక్షిస్తుంది.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

ధనియాలు: రాత్రంతా పచ్చిధనియాలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని త్రాగాలి. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మరియు కాలేయంలోని వ్యర్థాలను బయటకు నెట్టివేయబడుతుంది.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

పసుపు: పసుపును ఇండియన్ మసాల దినుసుగా వ్యవహరిస్తారు. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కాలేయానికి ఇది చాలా ఆరోగ్యకరం. దీన్ని ప్రతి రోజూ మనం ఉపయోగించే వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించాలి.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

వాల్ నట్స్: కాలెయానికి అమ్మోనియా ద్వారా టాక్సిఫైడ్ చేరుతుంది. వాల్ నట్స్ లో ఉండే ఆర్జినైన్ ఆమ్లం అమ్మోనియా కణాలను విచ్చిన్న చేసి, కాలేయాన్ని శుభ్రం ఉంచుతుంది.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

గ్రీన్ టీ: టీ అన్నింటిలో గ్రీన్ టీ మాత్రమే అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా ఇందులోని 'ఇజీసీజి','కాటెచిన్స్' అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది. ఈ టీ తాగినవారిలో అన్నవాహిక క్యాన్సర్ తగ్గుతాయి. అందుకు యాంటీ ఆక్సిడేటివ్, యాంటి ప్రొలిఫరేటివ్ గుణాలే కారణం. రోజువారీగా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

నిమ్మకాయ: నిమ్మకాయలో అధిక శాతంలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ కాలేయాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగపడే గ్లూటాథియోన్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి నిమ్మరసంను ఒక గ్లాసు నీళ్ళతో కలిపి ఉదయం కాలీ కడుపుతో త్రాగాలి.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

డాండెలైన్: మనం ఇప్పటికి కాలేయం యొక్క పునరుత్పాదక శక్తి గురించి మాట్లాడుకున్నాం. డాండెలైన్ కాలేయం దాని కణాల పునరుత్పత్తికి సహాయపడే ఒక కూరగాయ వంటిది.


లివర్ సమస్యలు ఎప్పుడు ఎలా ఉంటాయి: కాలేయానికి వచ్చే వ్యాధులు స్వల్ప కాలికమైనవి కొన్నైతే దీర్ఘకాలికమైనవి కొన్ని. చాలా వరకు కాలేయానికి వచ్చే సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే దీర్ఘకాలిక సమస్యలు కొన్ని మాత్రం లివర్ సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్‌గా మారవచ్చు. ఏ కారణం వల్లనైనా కాలేయంలో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ను హెపటైటిస్ అంటారు. కాలేయానికి ముఖ్యంగా హెపటైటిస్, సిర్రోసిస్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, హీమోక్రొమటోసిస్, విల్సన్స్ డిసీజ్, ఫ్యాటీలివర్, క్యాన్సర్, పసిరికల వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

కాలేయ సమస్యలకు ముఖ్య కారణాలు: ఇన్ఫెక్షన్స్ మత్తు పదార్థాలు సేవించడం, పొగతాగడం కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం శరీరానికి వ్యాయామం ఇవ్వకపోవడం కలుషిత ఆహారం లేదా నీరు తీసుకోవడం రక్తమార్పిడి శరీరానికి హాని చేసే మందులను ఎక్కువ మోతాదులో వాడటం ఆటో ఇమ్యూన్ డిసీజెస్... అంటే మన రోగనిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేయడానికి అవకాశం ఉన్న వ్యాధులు రావడం, వీటితో పాటు వంశపారంపర్యంగాకూడా కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కొన్ని సాధారణ సమస్యలు: ఎటువంటి సాధారణ లక్షణాలు కనిపించకుండా ఉండే సమస్య ఫ్యాటీలివర్. అబ్డామిన్ అల్ట్రా సౌండ్ పరీక్షలు చేసినపుడు ఈ సమస్య బయటపడుతుంది. మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ వంటి జీవరసాయనాలు పెరగడం ఈసమస్యకు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. కొన్ని సార్లు హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ కూడా ఫ్యాటిలివర్‌కు కారణం కావచ్చు. లివర్ పనితీరును పరీక్షించినపుడు ఎజీపీటీ, ఎస్‌జీఓటీ వంటి లివర్ ఎంజైములు పెరిగితే దాన్ని స్టియటో హెపటైటిస్ అంటారు. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో చికిత్సతో పాటు ఆహారనియమాలు పాటించడం కూడా అవసరం. ఇప్పుడు సిర్రోసిస్‌కు ఇదీ ఒక కారణం అవుతోంది. ఈ సమస్య పరిష్కారానికి కావాల్సింది తగినంత వ్యాయామం, మంచి ఆహార నియమాలు పాటించడం. కాలేయం(లివర్)కు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా అతి సులువుగా పోగొట్టి, ఎల్లప్పుడు శుభ్రంగా ఉండేలా చేసే కొన్ని ఆహారాలను గురించి తెలుసుకుందాం...

English summary

15 Foods That Cleanse The Liver | లివర్ ను ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్

Liver is one of the vital organs in the body. It produces the essential enzyme called bile without which, our body cannot function. Liver damage is indicated by a blood component called bilirubin. This indicates that a person might have severe diseases like jaundice or fatty liver syndrome. This usually happens due to junk food, excessive fat intake and also due to consumption of alcohol.
Desktop Bottom Promotion