For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 15 క్యాన్సర్లను నివారించే ఆహారాలు..!

|

క్యాన్సర్ ఇప్పుడు గతంతో పోలిస్తే అంత ప్రమాదకరమైన వ్యాధి కానేకాదు. అయినప్పటికీ ఏ వ్యాధికైనా చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. పైగా క్యాన్సర్ విషయంలో నివారించుకునే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా నివారించుకోవడం చాలావరకు సాధ్యమే.

పండ్లు... ఆకుకూరలు... ఆహారపదార్థాలు... ఇలా మనం రోజూ తినే పదార్థాలతోనే క్యాన్సర్లను నివారించుకోవడం సాధ్యమా? చాలా సులభంగా సాధ్యమనే అంటున్నారు ఆహారనిపుణులు. ఫలానా ఆహారంలోని నిర్దిష్టమైన పోషకాలు శరీరంలోని వివిధ అవయవాలకు చెందిన క్యాన్సర్ల నివారణకు ఎలా పనిచేస్తాయన్న అంశంపై ‘వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్' ఆధ్వర్యంలో ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని క్యాన్సర్ల నివారణకు కొన్ని ఆహారాలు సమర్థంగా పనిచేస్తాయని ఆ పరిశోధనల్లో తేటతెల్లమైంది. మనం రోజూ తినే ఆహారాలతోనే క్యాన్సర్లను సులభంగా, ఆరోగ్యకరంగా ఎలా నివారించగలమో తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక కథనం.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు: లైకోపిన్ అనే పోషకం ఎక్కువగా ఉండే టొమాటోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. అలాగే పాలీఫీనాల్స్ ఎక్కువగా ఉండే గ్రీన్-టీ, దానిమ్మ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల వ్యాప్తిని సమర్థంగా అదుపు చేస్తాయి. ఇక క్రూసిఫెరస్ జాతి శాకాహారాలైన బ్రొకోలీ, కాలీఫ్లవర్‌తో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించవచ్చుని చాలా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

ఎముక క్యాన్సర్ నివారణకు: యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు... ఉదాహరణకు బెర్రీలు, చెర్రీలు, టొమాటో, బ్రాకోలీతో పాటు ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలైన సాల్మన్ చేపలు, వాల్‌నట్‌లతోపాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, చేపలు, గుడ్లతోనూ ఎముక క్యాన్సర్ నివారితమవుతుంది.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

మెదడు క్యాన్సర్ నివారణకు: వెల్లుల్లి జాతికి చెందిన ఆహారాలతో పాటు ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్‌నట్, లిన్‌సీడ్ ఆయిల్‌తో మెదడు క్యాన్సర్‌లను నివారించవచ్చు. పైన పేర్కొన్న పదార్థాలు మనిషిలో సాధారణ రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

పెదవులు, నోరు, ఫ్యారింగ్స్ క్యాన్సర్ నివారణకు: బాగా ముదురురంగుతో ఉన్న అన్ని పండ్లు, ఆకుకూరలతో పాటు విటమిన్ ఏ ఎక్కువగా ఉండే బొప్పాయి, క్యారట్, మామిడి వంటి తాజాపండ్లతో నోరు, ఫ్యారింగ్స్, క్యాన్సర్లను నివారించవచ్చు. ఇక టొమాటోలోని లైకోపిన్ కూడా ఈ తరహా క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడుతుంది.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ల నివారణకు: క్రూసిఫెరస్ వెజిటబుల్స్ జాతిగా పేరుపడ్డ క్యాబేజీ, బ్రకోలీ వంటి శాకాహారాలతో దీన్ని సమర్థంగా నివారించవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌లోని యాండర్సన్ క్యాన్సర్ సెంటర్‌లో తేలిన అంశాలను బట్టి విటమిన్-ఇలోని ఆల్ఫాటోకోఫెరాల్ అనే రసాయనం... బ్లాడర్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. మిరియాలు, పాలకూర, బాదంలతో పాటు పొద్దుతిరుగుడునూనె, కుసుమ నూనెలోనూ విటమిన్-ఇ ఎక్కువ.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

తల, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్ నివారణకు: పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ, తెల్లటి తోళ్లు ఉన్న బాగా బ్రైట్ రంగుల్లో ఉండే పండ్లలో ఉండే ఫైటోకెమికల్స్ వల్ల ఈ క్యాన్సర్లు నివారితమవుతాయి. ఉదాహరణకు నారింజ, కివీ, జామ, పైనాపిల్ పండ్లతో తల, మెడ క్యాన్సర్లను నివారించవచ్చు.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

కంటి క్యాన్సర్ నివారణకు: ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు, వాల్‌నట్‌తో పాటు గ్రీన్-టీ, బెర్రీ పండ్లు, పసుపు, విటమిన్-ఇ, విటమిన్-సి, విటమిన్-ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో కంటి క్యాన్సర్లను సమర్థంగా నివారించవచ్చు. సెలీనియమ్, పీచుపదార్థాలు ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండే బ్రెజిల్-నట్స్ కూడా కంటి క్యాన్సర్ నివారణకు తోడ్పతాయి.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

పెద్దపేగు-మలద్వార (కోలో-రెక్టల్) క్యాన్సర్ నివారణకు: మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చేసుకోవడం వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఉదాహరణకు నిమ్మజాతి పండ్లు, బెర్రీ పండ్లు, ఎర్ర ఉల్లిగడ్డలు, నట్స్‌లో బాదంతో పాటు క్రూసిఫెరస్ జాతి శాకాహారాలైన క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీలతో దీన్ని సమర్థంగా నివారించవచ్చు. అలాగే ఉల్లి, వెల్లుల్లి కూడా పెద్దపేగు-మలద్వార క్యాన్సర్లను సమర్థంగా అరికడతాయి. విటమిన్-డి ఎక్కువగా ఉండే గుడ్లు, చేపలు కూడా ఇందుకు తోడ్పడతాయి.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

గాల్‌బ్లాడర్ క్యాన్సర్ నివారణకు: స్థూలకాయం రాకుండా ఆరోగ్యకరమైన పరిమితిలో బరువును నియంత్రించుకోవడం గాల్‌బ్లాడర్ క్యాన్సర్ నివారణకు తోడ్పడే అంశం. ఇలా చేయడం వల్ల ఒక్క గాల్‌బ్లాడర్ క్యాన్సర్‌ను మాత్రమే గాక పెద్దపేగు, ప్రోస్టేట్, ఎండోమెట్రియమ్, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్లను నివారించవచ్చు. ఇందుకోసం కొవ్వులు తక్కువగానూ, ఆకుకూరలు ఎక్కువగానూ తీసుకోవాలి.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

జీర్ణాశయ (స్టమక్) క్యాన్సర్ నివారణకు: కాప్సికమ్ (కూరగా వండటానికి ఉపయోగించే మిరప)లో ఉండే ఫైటోకెమికల్... స్టమక్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది. ఇక దీంతోపాటు పరిమితంగా మిరపకాయలు వాడటం, మిరియాల వాడకం కూడా స్టమక్ క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఆకుకూరలు, పొట్టుతో ఉండే ధాన్యాలు, తాజాపండ్లు కూడా నివారణకు తోడ్పడుతూ జీర్ణాశయ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. ఉప్పు బాగా తగ్గించడం కూడా అవసరం.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు: నారింజ రంగులో ఉండే కూరగాయలు (ఉదాహరణ క్యారట్)తో పాటు టొమాటో, అల్లం, ఆప్రికాట్... మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. బెర్రీ పండ్లు కిడ్నీల వాపును తగ్గిస్తాయి. పొట్టు తీయని ధాన్యాలు, బఠాణీ, చిక్కుళ్ల వంటి ఫైటైట్ అనే పోషకం ఉన్న ఆహారాలు మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

కాలేయ క్యాన్సర్ నివారణకు: పాలీఫీనాల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బ్లూబెర్రీ, విటమిన్-ఇ పుష్కలంగా ఉండే బాదం వంటి ఆహార పదార్థాలతో పాటు... నూనెల్లో పొద్దుతిరుగుడు, కుసుమనూనెలు కాలేయ క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

రొమ్ము క్యాన్సర్ నివారణకు: ఎలాజిక్ ఆసిడ్ అనే పోషకంలో ఉండే పాలీఫినాల్ ఎక్కువగా ఉండే దానిమ్మతో రొమ్ముక్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. కెరొటినాయిడ్ ఎక్కువగా ఉండే బ్రకోలీ, క్యారట్, పాలకూరలతో రొమ్ము క్యాన్సర్ నివారితమవుతుంది. ఇక ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే గ్రీన్-టీ కూడా రొమ్ము క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ నివారణకు: ఆహారంలో విటమిన్-ఇ, విటమిన్-సి ఎక్కువగా ఉండేలా చూసుకోవడం సర్విక్స్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఉదాహరణకు క్యారట్, చిలగడదుంప, గుమ్మడి వంటి ఆహారాలతో దీన్ని సమర్థంగా నివారించవచ్చు. ఎలాజిక్ ఆసిడ్స్ అనేవి క్యాన్సర్ పెరుగుదలను అరికడతాయి కాబట్టి ఈ పోషకం ఎక్కువగా ఉండే స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ, వాల్‌నట్, దానిమ్మ, ద్రాక్ష, ఆపిల్, కివీ పండ్లతో దీన్ని నివారించవచ్చు. అయితే చక్కెర పాళ్లు తక్కువగా ఉండే ‘లో-గ్లైసీమిక్ పండ్లు, ఆహారాలతో దీని నివారణ మరింత సులభమవుతుంది.

15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!

ఒవేరియన్ క్యాన్సర్ నివారణకు: క్యారట్, పసుపు రంగులో, నారింజరంగులో ఉండే శాకాహారాలతో (ఉదాహరణకు బెల్‌పెప్పర్) ఒవేరియన్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. కెరొటినాయిడ్స్ ఎక్కువగా ఉండే క్యారట్ వంటివి రోజూ అరకప్పు మోతాదులో రెండుసార్లు తీసుకోవడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయానాల్లో తేలింది.

English summary

15 Foods That Prevent 15 Different Cancers..! | 15 రకాల క్యాన్సర్లకు నివారణ ఈ ఆహారాలే...!


 We know that the function of food is to give us energy, but there are certain foods that can actually protect our bodies from serious diseases such as cancer and heart conditions. approximately one-third of all cancers are directly related to diet. To help prevent cancer, try making some of these foods that fight cancer a regular part of your diet.
Story first published: Friday, May 3, 2013, 12:08 [IST]
Desktop Bottom Promotion