For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జామకాయ పవర్ ఏంటో తెలుసా మీకు.....!?

|

మనం మన ఆరోగ్యాన్ని బలపరుచుకోవటానికి ఎంతో శ్రమ పడతాం. ఏన్నో ఆరోగ్య సూత్రాలను పాటిస్తాం. అందులో ఒకటి పండ్లు తినడం. ఐతే ఏ పండు తింటే మనం ఆరోగ్యాన్ని బలపరుచుకోవచ్చో మనకు ఖచ్చితంగా తెలియదు. మనకు నచ్చిన పండునో, లేక పలానా పండు ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబితేనో, ఎక్కడో చదివితేనో ఆ పండ్లను ఎక్కువగా తింటుంటాం. ఇక ముందు అలా చేయ వలసిన పనిలేదు. పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యాన్ని కాపడటానికి ఎంతో ఉపయోగపడుతుందని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు పండ్ల మీద చేసిన రీసెర్చ్ లో తెలిసింది.

READ MORE: జామ ఆకులో ఆశ్చర్యం కలిగించి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

ఈ సీజన్లో ఎక్కడ చూసినా జామకాయలే కనిపిస్తున్నాయి కాబట్టి. విరివిగా, చౌకగా దొరికే ఈ జామకాయలు విలువలేనివని అనుకోకూడదు. విలువైన పండ్లలో వుండే న్యూట్రీషియన్స్ ఈ జామలోనూ అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువకాలం దొరుకుతూ ఉంటాయి. అంతే కాకుండా వీటిని ఇండ్లలో కూడా పెంచుకునే చెట్టుగా ఎంతో పేరు తెచ్చుకున్నది. జామపండ్లు ఆరోగ్యానికీ అధిక లాభాన్ని చేకూరుస్తాయి. ఈ పండ్ల ముక్కలపై మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తింటే ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తాయి. కానీ ఎవరికి నచ్చిన విధంగా వారు వీటిని తింటూ ఉంటారు. వీటితో జామ్‌ లు ఐస్‌క్రీమ్స్ సలాడ్స్ వంటివి తయారు చేసుకోవచ్చు. జామపళ్ళలో ‘సి' విటమిన్ పుష్కలంగా వుంటుంది.

అపరిమిత పోషకాల నిలయం జామ. అనారోగ్యాన్ని దరిచేరనీయని జామ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కనుకనే దోరగా, దోరగా ఉన్న జామకాయను చూసిన వెంటనే తినేయాలనుకొనే వారుండరంటే అతిశయోక్తి కాదు. కొందరికి పచ్చి కాయలు నచ్చితే, మరి కొందరికి పండుపైనే మనసు. ఏదేమైనా పిల్లలనుండి పెద్దలవరకూ ఇష్టపడేది జామకాయనే.విటమిన్‌ సి ఎక్కుగా దొరికే వాటిలో ఉసిరికాయలకు ధీటుగా జామను చెప్పుకోవచ్చు. కమలాకన్నా ఐదు రెట్లు ఇందులో విటమిన్‌ సి ఉంటుంది. నిమ్మ, నారింజలలో కంటే నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా వుంటుంది. ఈ కాయ పండుతున్నకొద్దీ ‘సి' విటమిన్ శాతం అధికమవుతుంది. కేవలం విటమిన్‌ సి మాత్రమే కాదు. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, కేల్షియమ్‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి. అంతేకాదు, జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ ఇందులో నిండుగా ఉంది.

READ MORE: గర్భిణీస్త్రీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే జామకాయ..

జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల ప్రస్తుతం అందరికీ ఇది ప్రీతిపాత్రమై కూచుంది. ముఖ్యంగా దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. చివరకు ప్రపంచంలో పళ్లు అనేవి ఉన్నాయనే విషయాన్ని మర్చిపోండి అంటూ మధుమేహ రోగులకు చెబుతూ ఉండే వైద్యులు సైతం చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో చేర్చి చెబుతుంటారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు జామ పపర్ ఏమటో.. ఇక జామకాయలోని ఆ పవర్ఫుల్ ఆరోగ్య గుణాలేంటో తెలుసుకుందాం...

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

మధుమేహగ్రస్తులకు: చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో ఉంచబడింది. డయాబెటిస్ రోగులకు సంజీవనిలా ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం మరి.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

బరువు తగ్గడానికి: అన్నిటికన్నా ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునేవారికి జామ ఒక మంచి ఔషదంగా చెప్పవచ్చు. ఎందుకంటే, జామకాయను తింటే ఇట్టే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో ఎక్కువ ఆహారం తినలేరు. పోషకాలు ఎలాగూ ఉన్నాయి కనుక నీరసం రాదు. అందుకే ఒబేసిటీతో బాధపడేవారు తమ ఆహారంతోపాటూ ఒక జామకాయను తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. కొవ్వు మెటబాలిజంను ప్రభావితం జేసే " పెక్టిన్" జామలొ లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలొ కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

క్యాన్సర్ నివారిణి: శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

దంత క్షయం: జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. చిగుళ్ల వాపులను తగ్గించుకోవచ్చును. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. ధృడత్వం కూడా చేకూరుతుంది. దంతాలు కదలటం, చిగుళ్లనుంచి రక్తం కారటం వంటి సమస్యలను అరికడుతుంది.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

ఎసిడిటి: ఎసిడిటికి రోజుకో పండు తింటే మంచిది. కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశనం పొందేలా చేస్తుంది.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

కీళ్ల నొప్పులు: కీళ్లవాపు, నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్నచోట కట్టుకట్టుకోవాలి. కండరాలు గట్టిపడేలా చేస్తుంది. ఎముకల ద్రుడత్వనాకి జామకాయలో ఉండే మ్యాంగనీస్ బాగా సహాయపడుతుంది.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

జలుబు, దగ్గు, జ్వరం: ఐదు, ఆరు ఆకులు నీటిలో మరగబెట్టి డికాక్షన్‌ వాడితే దగ్గు, జలుబు పోతుంది. ఆకుల నుంచి లభించే తైలం యాంటీ ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తాయి.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

కంటి ఆరోగ్యానికి: జామకాయలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల ఈ న్యూట్రిషియన్ ఐ సైట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

సంతానోత్పత్తికి: జామకాయను బాగా నమిలి తినడం వల్ల శరీరంలో ఫిల్లెట్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ పోషకాంశాలు గల ఫిల్లెట్ సంతానోత్పత్తిని పెంచే హార్మోలను ఉత్పత్తి చేస్తుంది.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

థైరాయిడ్: జామకాయలో ఐయోడిన్ లేదు. అయితే ఇందులో ఉండే కాపర్, మరియు ఇతర మినిరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి, హార్మోనుల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

రుతుస్రావం: రుతుస్రావ సమస్యలను దూరం చేయడంలో, రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపర్చడంలో, స్కర్వీవ్యాధిని దూరం చేయడంలో, జలుబుకు విరుగుడుగా జామ సమర్థవంతంగాపనిచేస్తుంది.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

చర్మ సంరక్షణ: చర్మ సంరక్షణకు సైతం జామ తనవంతు కృషి చేసుందని వైద్య నిపుణుల చెబుతుంటారు. మొటిమలతో బాధపడేవారు జామ ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి లేపనం చేసుకుంటే కొద్దిరోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. జామపండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, అందంగా, ముఖ ఛాయ పెరుగుతుందని బ్యూటీషియన్లు చెబుతుంటారు. ముసలితనాన్ని(Early Aging)అరికట్టడంలో సహాయపడుతుంది.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

కాలిన గాయాలకు: కాలిన గాయాలకు గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

మెదడుకు: ఇందులోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలి ఫినాల్స్‌ మొదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి.

అది ‘జామకాయ’ పవర్ అంటే..!

మలబద్దకం: బాగా మిగలపండిన జామపండ్లకు కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మ రసం చిలకరించుకొని తింటే మలబద్ధకం దూరమవుతుంది.

English summary

15 Health Benefits of Guava | అది ‘జామకాయ’ పవర్ అంటే..!

Depending on the species, a guava’s flesh and seeds can be white, orange, pink or red. The skin is green before maturity and becomes yellow, maroon or remains green when ripe. They are best eaten when semi-ripe because they are crunchy. Guavas are a treasure-trove of nutrients. Their being high in antioxidants has made them known as one of the “superfoods.”
Desktop Bottom Promotion