For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ లో మామిడితో మజా చేయండి..సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి...!

మామిడిలో సాచ్యురేటెడ్ కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఇంకా ఆహార ఫైబర్ మరియు విటమిన్ B6 , విటమిన్ A మరియు విటమిన్ C వంటి అద్భుతమైన వనరులు ఉన్నాయి. అంతే కాకుండా పొటాషియం,

|

మామిడిలో సాచ్యురేటెడ్ కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఇంకా ఆహార ఫైబర్ మరియు విటమిన్ B6 , విటమిన్ A మరియు విటమిన్ C వంటి అద్భుతమైన వనరులు ఉన్నాయి. అంతే కాకుండా పొటాషియం, మెగ్నీషియం, రాగి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి.

సమ్మర్లో చర్మ సమస్యలు, స్కిన్ టాన్ నివారించే మ్యాంగో ఫేస్ ప్యాక్స్..!!

మామిడిలో కెర్చెతిన్, బీటాకెరోటిన్ మరియు అస్త్రగాలిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించడానికి ఉపయోగపడతాయి. గుండె వ్యాధి, అకాల వృద్ధాప్యం, క్యాన్సర్ మరియు ప్రమాదకరమైన వ్యాధుల వంటి సమస్యలలో కణాల నాశనం ఈ ఫ్రీ రాడికల్స్ కారణంగా ఉంటుంది. ఈ మాజికల్ మామిడికాయతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది: మామిడికాయలో అల్టిమేట్ విటమిన్ కంటెంట్ కలిగి ఉండుట వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. దీనిలో పొటాషియం (156 mg - 4%) మరియు మెగ్నీషియం (9 mg - 2%) సమృద్ధిగా ఉండుట వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

క్యాన్సర్ ప్రమాదాలు & కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది: మామిడిలో పెక్టిన్ అధిక మొత్తంలో ఉండుట వల్ల మరియు కరిగే పీచు పదార్థం ఉండుట వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గటానికి సమర్ధవంతంగా దోహదపడుతుంది. అంతే కాకుండా ఇంకా పెక్టిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి కూడా మిమ్మల్ని అడ్డుకుంటుంది.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

బరువు పెరగటానికి సహాయపడుతుంది: మామిడి వాడకం అనేది బహుశా బరువు పెరగటానికి సులభమైన మార్గంలా ఉంటుంది. ఎందుకంటే 150g మామిడిలో ఉన్న 86 కేలరీలను మన శరీరం సులభంగా గ్రహిస్తుంది. మామిడిలో ఉన్న చక్కెర పిండి పదార్ధాలుగా మారి బరువు పెరుగటానికి సహాయపడుతుంది.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

జీర్ణక్రియకు సహాయపడుతుంది: మామిడి అజీర్ణం మరియు ఆమ్లత వంటి సమస్యలను తొలగించుటలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అంతే కాకుండా మామిడిలో సహజంగా జీర్ణక్రియకు సహాయపడే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

రక్తహీనతను తగ్గిస్తుంది: మామిడికాయ రక్తహీనతతో బాధపడే వారికి చాల ఉపయోగకరంగా ఉంటుంది. మామిడిలో ఇనుము సమృద్దిగా లభిస్తుంది. మామిడి పండ్లను క్రమం తప్పకుండా తగినంత తీసుకోవడం వలన శరీరం లో బ్లడ్ కౌంట్ పెరిగి తద్వారా రక్తహీనత తగ్గటానికి మీకు సహాయం చేస్తుంది.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

గర్భధారణలో సహాయపడుతుంది: గర్భధారణ సమయంలో ఇనుము చాలా అవసరం కనుక అటువంటి పరిస్థితుల్లో మామిడి గర్భిణి స్త్రీ లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వైద్యులు తరచుగా గర్భధారణ సమయంలో ఇనుము టాబ్లెట్లు సూచిస్తారు. దానికి బదులుగా మీరు మామిడి జూస్ తో ఆరోగ్యవంతమైన ఇనుమును సమృద్ధిగా పొందవచ్చు.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

మోటిమలు నివారణ: చర్మంనకు అడ్డుపడే రంధ్రాలను తెరిచేందుకు సమర్థవంతంగా మామిడి పనిచేస్తుంది. రంధ్రాలు తెరుచుకోవటం వల్ల మోటిమలు ఏర్పడటాన్ని నిలిపివేస్తుంది. చర్మ రంధ్రాలు తెరుచుకోవటం అనేది మోటిమలను తొలగించడడానికి ఒక ప్రభావవంతమైన మార్గంగా ఉంటుంది. ఈ ప్రయోజనం ఆస్వాదించడానికి మీరు తరచుగా మామిడిపళ్ళు తినడం అవసరం. అంతే కాకుండా మీరు మామిడి గుజ్జు ను తీసుకుని ముఖానికి రాసి 10 నిముషాలు ఆగి ఆ తర్వాత ముఖం కడగాలి.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

వృద్ధాప్యంను నియంత్రిస్తుంది: మామిడికాయలో A మరియు C విటమిన్లు శరీరంలో అధిక మొత్తంలో కొల్లాజెన్ ప్రోటీన్ ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తాయి. కొల్లాజెన్ ప్రోటీన్ చర్మ వృద్ధాప్య ప్రక్రియను నిదానింపజేయడానికి, రక్త నాళాలు మరియు శరీర కనెక్టివ్ కణజాలాలకు సంరక్షించేందుకు సహాయం చేస్తుంది.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది: మామిడికాయలో మెదడు పని నిర్వహణ మరియు అభివృద్ధి కోసం కీలకమైన విటమిన్ B-6 అధిక పరిమాణాల్లో కలిగి ఉంటుంది.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

శరీర రోగనిరోధక శక్తి పెంచుతుంది: క్యారట్లు వలె మామిడిలో కూడా బీటా-కెరోటిన్ అనే కెరోటినాయిడ్ అధిక పరిమాణంలో సమృద్ధిగా ఉంటుంది. మామిడిలో ఉన్న ఈ మూలకం శరీర యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపర్చటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరాన్ని బలంగా చేస్తుంది.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

డయాబెటిస్ ఫైటర్: పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ కొన్ని అధ్యయనాలు ప్రకారం మామిడిపండు డయాబెటిస్ కు గొప్ప సహజ నివారణ మార్గంగా ఉందని తెలుస్తుంది. పూర్వం మధుమేహ రోగులు తప్పనిసరిగా తీపి రుచి కోసం మామిడిని మానివేయాలని అనేవారు. కానీ ఇప్పుడు పండు కంటే మామిడి ఆకులు కూడా మధుమేహం నివారణలో ఉపయోగపడుతుందని నిరూపన జరిగింది.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

కంటి ఆరోగ్యం: ఒక కప్పు మామిడికాయ ముక్కలు ప్రతిరోజు తీసుకుంటే 25శాతం విటమిన్ A లభిస్తుంది. తద్వారా రేచీకటి మరియు పొడి కళ్ళను నిరోధిస్తుంది. అలాగే కంటి చూపు మెరుగు అవుతుంది.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

మెరుగైన సెక్స్: మామిడికాయలో విటమిన్ E ఉంటుంది. సెక్స్ డ్రైవ్ మరియు విటమిన్ E మధ్య ఉన్న ప్రముఖ సంబంధం గురించి మొదట ఎలుకలో అధ్యయనాలు ఒక పొరపాటు సృష్టించినప్పటికీ, తదుపరి పరిశోధన సంతులిత ఆహారంలో కనుకోనటానికి సహాయపడింది.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

హీట్ స్ట్రోక్(వడదెబ్బ) నివారణకు: ఆకుపచ్చ మామిడి రసంలో నీరు మరియు కొంచెం పంచదార కలిపి త్రాగితే శరీరం అత్యంత చల్లగా మరియు శరీర వేడి ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడుతుంది. సూర్యుని వేడి వల్ల మన శరీరం వేడి స్ట్రోక్ తగ్గకపోతే మూత్రవిసర్జన ఆగి తద్వారా మూత్రపిండాలు విషపదార్థాలతో ఓవర్లోడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దానిని నివారించటానికి మామిడికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది.

మామిడిపండు అంధించే సంపూర్ణ ఆరోగ్యం..!

బాడీ స్ర్కబ్: బాగా పండిన మామిడిపండును గుజ్జులా తయారు చేసి అందులో తేనె మరియు పాలు మిక్స్ చేసి బాడీ స్ర్కబ్ గా ఉపయోగించవచ్చు . దాంతో మీ చర్మం మృదువైన అని అనుభూతిని పొందుతుంది.

English summary

15 Health Benefits of Mango

Mango is very low in saturated fat, cholesterol and sodium. It is also an excellent source of dietary fiber and vitamin B6, and a very good source of vitamin A and vitamin C. It is rich in minerals like potassium, magnesium and copper.
Desktop Bottom Promotion