For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండెలో మంట, ఎసిడిటి నివారణకు 15 సూపర్ ఫుడ్స్...

|

ప్రస్తుత రోజుల్లో వయస్సుతో పనిలేకుండా హఠాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అందులో గుండెకు సంబంధించిన సమస్యలే అధికం. గుండెల్లో మంట అనేక కారణాల వలన కలుగవచ్చు ప్రాథమిక నిర్థారణ అదనపు చిహ్నాలు, లక్షణాలమీద ఆధారపడి ఉంటుంది. గుండె మంట వలన వచ్చే చాతీ నొప్పి 'మండే' అనుభూతిని కలిగిఉంటుంది. బాగా వేయించిన ఆహారాలు అనేక సమస్యలు తెస్తాయి. వాటిలో గుండె మంట ఒకటి. తరచుగా వేపుడు ఆహారాలు తింటే ఛాతీలో కిందిభాగంలో మంట వస్తుంది. అది పొట్టకు కూడా వ్యాపిస్తుంది. దీనినే గుండెమంట అంటారు. గుండె మంట తరచుగా వస్తూంటే, సమస్యలు ఎక్కువవుతాయి. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు ఆహారాలు తగ్గించి, ఉడికించిన ఆహారం తినాలి. ఇది సాధారణంగా రాత్రి భోజనం తరువాత వస్తూ వుంటుంది. ఈ మంట పడుకున్నప్పుడు కానీ, వంగినప్పుడు కానీ ఎక్కువవుతుంది. ఇది గర్భవతి మహిళలలో కూడా సాధారణంగా వస్తూంటుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడంవలన, లేదా కొన్ని మసాలాలు, అధిక క్రొవ్వు శాతం లేదా అధిక ఆమ్ల శాతం కల ప్రత్యేక ఆహారపదార్థాలను తీసుకోవడంవలన కూడా వస్తుంది.

ఒకవేళ చాతీ నొప్పి గుండెల్లో మంటగా నిర్థారించబడితే అపుడు దానిని నిర్ధారించుకోవడం కోసం మరి కొన్ని పరీక్షలకు వెళ్ళవలసి ఉంటుంది. గుండెల్లో మంట లేదా చాతీ నొప్పి తిన్నా లేదా త్రాగిన తరువాత మింగడానికి ఇబ్బంది పడుతూవుంటే ఇది ఆహార గొట్టపు అసౌకర్యాన్ని సూచిస్తుంది. పైరోసిస్ లేదా ఆమ్ల అజీర్ణం గా పిలువబడే గుండెలో మంట అనేది గుండెలో, ఛాతి ఎముకకి సరిగ్గా వెనుక లేదా ఎపిగాస్ట్రియంలో మండే అనుభూతి వంటిది. ఈ నొప్పి తరచుగా ఛాతిలో మొదలయి మెడ, గొంతు, లేదా దవడ వైపుకి ప్రాకుతుంది. గుండెల్లో మంట సాధారణంగా గ్యాస్ట్రిక్ ఆమ్ల చర్యలతో కలిసి ఉంటుంది, ఇది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ప్రధాన లక్షణం. అలాగే ఇది ఇషేమిక్ గుండె జబ్బు యొక్క లక్షణం కూడా, అందుకే చివరకు చెప్పాలంటే గుండెల్లో మంట ఒక్కొక్కపుడు ప్రాథమికంగా తప్పుడు వ్యాధి నిర్థారణకి కూడా దారితీస్తుంది.

ఛాతీలో మంట పుడితే ఇది గుండెనొప్పి కావచ్చుననే సందేహాలతో సతమతమయ్యే వారూ ఎక్కువగానే ఉన్నారు. ఈ రెంటికీ తేడా తెలియక గాభరాతో ఇసిజి చేయించుకునే వారూ ఉన్నారు. ఈ బిజీలైఫ్‌లో ఒత్తిడి చాలా ఉంటోంది. దీనివల్ల వచ్చేదే ఛాతీలో మంట, గ్యాస్ట్రిక్ మరియు జీర్ణ వ్యవస్థ స్తంభింపచేస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా తెలిస్తే తగ్గించుకోవడం పెద్ద సమస్య కాదు. దీనికోసం కంగారుపడి డాక్టరు దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతోనే ఛాతిలో మంటను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. గుండె మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. సాధారణంగా ఈ సమస్యలను నివారించడానికి బొప్పాయి, అరటి, అలోవెరా జ్యూస్, మరియు కొన్ని ఆర్గాన్స్ బాగా సహాయం చేస్తాయి. అలాగే క్యాల్షియం రిచ్ ఫుడ్స్ కూడా హార్ట్ బర్న్ తగ్గిస్తాయి. మరి హార్ట్ బర్నింగ్ ను తగ్గించే మరికొన్ని ఆహారాలను ఉపయోగించి చూడండి. అప్పటికీ తగ్గకపోతే డాక్టరును సంప్రదించండి.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

పెరుగు: ఇది క్యాల్షియం రిచ్ ఫుడ్. ఇది ఛాతీలో మంటను తగ్గించి, తిన్న ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. అందుకు గట్టి పెరుగును ఒక చెంచా పంచదారను వేసి తినొచ్చు లేదా లస్సీ తయారు చేసి, లేదా మజ్జిగ తయారు చేసి రెండు మూడు గ్లాసులు ప్రతి రోజూ తీసుకోవచ్చు.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

బొప్పాయి: ఈ బొప్పాయిలో పప్పైన్ (ప్రోటియోలిక్ ఎంజైమ్ )ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం తీసుకొనే ఆహారంలోని ప్రోటీనులను జీర్ణం చేయడానికి మీరు తప్పనిసరిగా బొప్పాయిని తీసుకోవాలి. అది కూడా భోజనం అయిన ఒక గంట తర్వాత తీసుకోవాలి.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

ఆరెంజ్: మీరు తినేటటువంటి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు ఆరెంజ్, ఆపిల్స్, ద్రాక్ష, ఆప్రికాట్, లెమన్, రాస్ బెర్రీ మరియు స్ట్రాబెర్రీ అధికంగా తీసుకోవాలి. ఇవి హార్ట్ బర్నింగ్ ను తగ్గిస్తాయి. ఆరెంజ్ లో అసిటిక్ ఆమ్లం అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. దాంతో ఛాతీలో మంటను తగ్గిస్తుంది.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

లికోరైస్: ఈ మూలికలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది గుండెలో మంటను తగ్గించే సమర్థవంతమైన మందుగా పనిచేస్తుంది. లికోరైస్ కొలెస్ట్రాల్ తిరిగి ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. గాస్ట్రిక్ ఆమ్లం ఏర్పడకుండా నివారిస్తుంది.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

అలోవెరా జ్యూస్: చాల పరిశోధనల ప్రకారం, గ్యాస్ట్రిక్ ఆమ్లం ఏర్పడటానికి కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడానికి అలోవెరా బాగా సహాయపడుతుంది. అలోవెరాలో విటమిన్ ఎ, బి1, బి2, బి3, సి మరియు ఇ వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెల్లో మంటను తగ్గిస్తుంది.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

అరటి: అరటిపండులో అధికంగా పొటాషియంతో పాటు నేచురల్ ఆంటాసిడ్స్(సహజ ఆమ్లహారం) ఉండి గుండె మంటను నుండి ఉపశమన పొందడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణకోశం శుభ్రపరచడానికి మరియు మలబద్ధకం నివారికి బాగా సహయపడుతుంది.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

ఆపిల్: ఆపిల్స్ లో ఫినోలిక్ ఫైటోకెమికల్స్ (ప్రొకెనైన్, క్వర్సర్టైన్, ఎపిక్యాటకిన్ మరియు కార్బోహైడ్రేట్స్)వంటివి హార్ట్ బర్న్ ను ముఖ్యంగా పొత్తి కడుపు పైభాగంలో మంటను తగ్గిస్తాయి.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

సీఫుడ్స్: సీఫుడ్స్ ముఖ్యంగా చేపల్లో టోరిన్ అధికంగా ఉండి గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని తగ్గిస్తుంది.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

పాలు: గుండెల్లో మంటగా ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం పొందేందుకు పచ్చి పాలు తీసుకోవడం మంచిది. ఒక గ్లాసుపాలల్లో ఒక చెంచా తేనె చేర్చి తీసుకోవడం వల్ల క్యాల్షియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మంచిది. గుండెలో, కడుపు మంటను తగ్గించడానికి ఒక సంప్రదాయ ఔషధంగా పచ్చిపాలను ఉపయోగిస్తారు.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

నిమ్మకాయ: సిట్రస్ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది గుండెలో మంటను తగ్గిస్తుంది. అంతే కాదు నిమ్మకాయ, గ్యాస్ట్రిక్ సమస్యను మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

బెల్లం: భోజనం చేసిన వెంటనే చిన్న బెల్లం ముక్కను బుగ్గలో ఉంచుకొని నెమ్మదిగా ఆ రసాన్ని మింగాలి. కడుపులో ఎసిడిటీని తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

సోంపు గింజలు: కప్పు నీటిలో సోంపుగింజలు వేసి ఉడికించి రాత్రంతా వాటిని అలాగే ఉంచి, తెల్లవారి గింజలను వడకట్టి ముఖం కడుక్కున్న వెంటనే ఆ నీటిని తేనెతో కలిపి తీసుకోవాలి. ఎసిడిటీని తగ్గించుకోవడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

బ్రొకోలీ: బ్రకోలీ పచ్చిది తింటే కడుపులో మంట, ఎసిడిటీ నుంచి త్వరితగతిని ఉపశమనం పొందవచ్చు.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

ఎండు ద్రాక్ష: కడుపులో లేదా ఛాతిలో బాగా మంటగా ఉన్నప్పుడు కొన్ని కిస్మిస్‌లను నోటిలో వేసుకొని నమలకుండా వాటి రసాన్ని మింగాలి. వెంటనే పై బాధల నుంచి విముక్తి కలుగుతుంది.

గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

బాదాం: బాదంపప్పు గుండెలో మంటను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని బాదంపప్పులు తిని చూడండి.

English summary

15 Simple Foods To Cure Heartburn | గుండెలో మంట, ఎసిడిటిని తగ్గించే సూపర్ ఫుడ్స్

Heartburn is a medical condition that is caused due to gastritis. This condition is not just common among pregnant women but also among other million people. The gastric acid enters the esophagus and burns the epithelial lining thus causing an acid reflux. This causes heartburn and an uncomfortable feeling in the chest & stomach. It is often characterized by burn and pain in the stomach or chest, bloating, gastric problems, sour taste in the throat and nausea.
Story first published: Monday, February 4, 2013, 17:23 [IST]
Desktop Bottom Promotion