For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైనాపిల్ ఆకారం..రంగు వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు..!

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనాస పండు(పైనాపిల్) ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇది గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువరోజుల నిల్వ ఉండదు. త్వరగా కుళ్లిపోతుంది. కాబట్టి కొన్న వెం

|

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనాస పండు(పైనాపిల్) ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇది గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువరోజుల నిల్వ ఉండదు. త్వరగా కుళ్లిపోతుంది. కాబట్టి కొన్న వెంటనే తినడమే మంచిది. చాలామంది పైనాపిల్‌ను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ అరటిపండ్లలానే దీనికి ఫ్రిజ్‌ పడదు. బయట ఉంచడమే మంచిది. తొక్కుతీసిన పైనాపిల్‌ను వెంటనే గాలి చొరని డబ్బా లేదా ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే నాలుగైదురోజుల పాటు నిల్వ ఉంటుంది. జ్యూస్‌ని ఫ్రిజ్‌లో పెడితే రుచి మారుతుంది. దానికన్నా ముక్కలుగా నిల్వ చేయడమే మంచిది. కేనింగ్‌ లేదా ప్రాసెస్‌ చేసినవయితే ఏడాది వరకూ నిల్వ ఉంటాయి.

తాజా పండ్ల రూపంలోనే కాకుండా స్క్వాష్‌లు, జామ్‌లు, సిరప్‌లు, కార్డియల్స్ రూపంలో దీనిని మార్కెట్ చేస్తున్నారు. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి.

పైనాపిల్ సీజన్ : పైనాపిల్లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

దీని నుండి తీసిన రసం పానీయంగా తాగుతారు. అనాస పండులో అనేక రకాలైన పోషక విలువలున్నాయి. ఆరోగ్య రక్షణకి అవసరమైన విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న పండు అనాస పండు. ఇది ఆయుర్వేదంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. వాతాన్ని, కఫాన్ని ఉపశమనం చేయడంలో ఇది ఉపయోగ పడుతుంది. చూడడానికి ముళ్లులాగా ఉండే పండు పైనాపిల్‌. ఆకారం బాగోకపోయినా దానిలో చాలా పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలేమిటో తెలుసుకుందామా!

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

జీర్ణక్రియ: పైనాపిల్‌లో బ్రొమిలైన్‌ అనే ప్రొటియోలిటిక్‌ ఎంజైమ్‌ ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని ప్రొటీన్లుగా జీర్ణం చేయడమే దీని పని. అందుకే అజీర్తికి ఇది మంచి మందు.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

కీళ్ళనొప్పులు: కీళ్లనొప్పులు, పైనాపిల్‌ తింటే ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. కారణం ఈ బ్రొమిలైన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా మెండు. అయితే దీన్ని ఉదయం భోజనం అయిన తరువాత అంటే మధ్యాహ్న సమయంలో తింటే మంచిది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

గాయాలను తగ్గిస్తుంది: ఇందులోని ఎంజైమ్‌ రుమటాయిడ్‌ ఆర్థ్రరైటిస్‌ కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని త్వరతిగతిన బాగుచేస్తుంది. మధుమేహం కారణంగా ఏర్పడే పుండ్లనీ ఇతరత్రా గాయాల్నీ కూడా త్వరగా తగ్గిస్తుంది. పచ్చి అనాసకాయ రసం తెగిన గాయాలపై వేస్తే రక్త స్రావం అరికడుతుంది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

మూత్రపిండాల శుభ్రత: అనాసలో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది.ఇది కడుపులోని పురుగుల్నీ చంపేస్తుంది. ఇందులోని రసాయనాలు మూత్రపిండాల్ని ప్రేరేపించి శరీరంలో మలినాలు తొలగిపోయేలా చేస్తాయి.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

గుండె సంబంధిత వ్యాధులను: హృద్రోగ బాధితులా...అయితే పైనాపిల్‌ను రోజూ రెండు ముక్కల చొప్పున తింటే బెస్ట్‌. ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకుంటుంది. అంటే రక్తనాళాల్లోంచి గడ్డల్ని తొలగించి ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. అయితే హీమోఫీలియా మూత్రపిండాలు, కాలేయ వ్యాధులతో బాధపడేవాళ్లు మాత్రం దీన్ని తినకపోవడమే మంచిది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడం దీని సహజ స్వభావం కదా. అందుకే.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

సైనసైటిస్‌, గొంతునొప్పి: గొంతునొప్పి, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ వ్యాధుల్నీ పైనాపిల్‌ తగ్గిస్తుంది. తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్‌ నివారణ అవుతాయి.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

రక్త హీనత: రక్తహీనతతో బాధపడేవాళ్లకి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

పంటి నొప్పులను నివారిస్తుంది- పంటి వ్యాధులతో బాధపడేవారిలో వాపులూ, మంటలూ నొప్పులూ ఎక్కువ. పైనాపిల్‌లోని సి-విటమిన్‌ బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యను నివారిస్తుంది. పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

కళ్ళు ఆరోగ్యానికి: వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలకు పైనాపిల్‌ను మించిన ఔషధం లేదు. ఇందులోని కొన్ని కణాలకి కేన్సర్‌లతోనూ పోరాడగల శక్తి ఉంది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

జ్వరం: జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాస పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే! కానీ అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఎక్కువగా ఉంది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

ఎముకల బలానికి: ఎముకలకు ఇది బలం. పెరిగే పిల్లలకూ, వృద్ధులకూ ఇది చాలా మంచిది. దగ్గుకీ, జలుబుకీ ఇది మంచి మందు. ఇందులో బ్రొమిలైన్‌ దగ్గు రాకుండా చేస్తుంది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

అందానికి: అనాసపండు రసాన్ని ముఖాని కి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

హైడ్రేషన్: బాగా పండిన అనాస రసం శరీర తాపాన్ని తగ్గిస్తుంది. అదనపు శక్తిని కూడా కలిగిస్తుంది. ఈ పండులో ఉన్న కొన్ని ఎంజైమ్స్‌ కారణంగా జీర్ణశక్తి పెరిగి జీర్ణాశయానికి చక్కగా పని చేస్తుంది. గ్లాసు అనాస పండు రసంలో పంచదార కలిపి సేవిస్తే వేసవిలో అతి దాహం అంతరించి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

మలబద్దకం: ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

రుతుక్రమ సమస్యలకు: ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

పొగత్రాగడం: పొగ తాగడం వల్ల శరీరానికి సంభవించే అనర్ధాలు తగ్గిపోతాయి.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

జాండిస్: అనా సరసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.

పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

మతిమరుపు: అనాస పండు తినడం వల్ల మతిమరపు, డిప్రెషన్‌లనీ తగ్గిస్తుంది.

English summary

18 Health Benefits of Eating Pineapples | పైనాపిల్ రంగు..రుచితో పాటు భారీ ప్రయోజనాలు కూడా..!

Pineapples are some of the most popular tropical fruits in the world. They are sweet, juicy, and delicious. More importantly, they are very healthy and nutritious. It is no wonder many people who want to have a healthy lifestyle include these fruits in their diets. To know more about them, here are some of the many health benefits of eating pineapples.
Desktop Bottom Promotion