For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిస్మిస్ మంచి పోషకాహారమేకాదు, ఉత్తమ ఆహారం కూడా!

|

ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ది చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి.

ఎండిన పండ్లలో మనకు మహా అయితే ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర తెలుసు. కానీ... వాటి వల్ల ఒనగూరే ప్రయోజనాలపై పెద్దగా అవగాహన లేదు. అయితే ఎండిన పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి వల్ల అనేక వ్యాధులు నెమ్మదిస్తాయి. మరికొన్ని వ్యాధులకవి ఉపశమనంగానూ, నివారణ కోసం పనికి వస్తాయి. కొన్ని ఎండు పండ్లు... ఆరోగ్య పరిరక్షణలో, వ్యాధుల నివారణలో వాటి ప్రయోజనాలివి..

ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్ తయారీలో వాడుతారు. ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన, శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని జ్యూస్ తీసి వాడుకోవటానికి గాని వాడుతారు. మంచి పోషకాహర విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి. అదెలాగో పరిశీలించండి...

దంత రక్షణ :

ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బాక్టీరియా ను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది .

మలబద్దకం :

ఎండు ద్రాక్షలో ఫిబర్ పుష్కలముగా ఉన్నందున విరోచనము సాఫీగా జరుగును . మలబద్ద్కం ఉన్నవారు కిస్మిస్ తింటే సరిపోతుంది. మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది.

అనీమియా(రక్తహీనత):

మీరు అనీమియాతో బాధపడుతున్నట్లై ఈ హెల్తీ డ్రై ఫ్రూట్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ మరియు ఇతర పోషకాంశాలు బ్లడ్ కౌంట్ ను పెంచుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్త్రీలకు ఇది ఎంతో ఉపయోగం.

క్యాన్సర్ ను నివారిస్తుంది:

ఎండుద్రాక్ష వల్ల ఇది ఒక మంచి ఉపయోగం. ఎండు ద్రాక్షలో ఉండే ఫోలిఫినోలిక్ యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో కోలన్ క్యాన్సర్ కు కారణం అయ్యే టోమర్ సెల్స్ తో పోరాడే గుణాలు ఎండుద్రాక్షలో ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ఒక మోతాదులో ' ఐరన్‌ ' & బీకాంప్లెక్ష్ ,కాపర్ ... కిస్మిస్ లో ఉన్నందున రక్తహీనతను సరిచేయును.

కండ్ల కు మంచిది :

ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్శ్ మూలాన యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది . బీటాకెరొటీన్‌ , కెరొటనోయిడ్స్ కళ్ళకు మంచిది. ఫ్రీరాడికల్స్ వల్ల కంటి డ్యామేజ్ లను నివారిస్తుంది.

ఎముకులకు రక్షణ మరియు బలం :

ఎండుద్రాక్షలో కాల్సియం , బోరాన్‌ ఎముకలు తయారీకి , గట్టిపడడానికి ఉపయోగ పడుతుంది. శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటానికి సహాయపడటమే కాదు, మోనోపాజ్ దగ్గరగా ఉన్న లేదా మోనోపాజ్ లో ఉన్న స్త్రీలు ఖచ్చితంగా ఈ క్యాల్షియం రిచ్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

సెక్షువల్ వీక్నెస్ :

లిబిడో ను ఎక్కువ చేసే అమినో యాసిడ్ ఆర్జినిన్‌ ఇందులో ఉన్నది. దాంపత్య జీవితంలోని నిరాస నిస్ప్రుహలను తొలగించును .

కడుపును శుభ్రం చేస్తుంది:

ఎండు ద్రాక్షఓ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్న ఆహారం అతి సులభంగా జీర్ణం అవ్వడానికి, మరియు జీర్ణశయాంతర ప్రేగుమార్గం నుండి టాక్సిన్స్(విషాలను)మరియు వ్యర్థాలను తొలగించడానికి బాగా సహాయపడుతుంది.

శరీరం యొక్క శక్తిని పెంచుతుంది:

ఎండు ద్రాక్షలో గ్లూకోజ్ మరియు విటమిన్ల యొక్క శోషణ ప్రోత్సహించే ఫ్రక్టోజ్ ను కలిగి ఉంటుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

ఎసిడిటితో పోరాడుతుంది:

ఎసిడిటిని తగ్గించే పొటాషియం మరియు మెగ్నీషియం ఎండు ద్రాక్షలో పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు జీర్ణక్రియకు సహాయపడుతుంది.

జ్యరము :

ఫినోలిక్ ఫైటోన్యూట్రియంట్స్ జెర్మిసైడల్ గా పనిచేయును . మంచి యాంటీఅక్షిడెంట్ గా పనిచేయుటవల ఫీవర్ తగ్గే అవకాశము ఉంది. కిస్‌మిస్ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది.

ఎసిడోసిస్ :

ఇందులో ఉన్న పొటాసియం , మెగ్నీషియం పుష్కలముగా లబించును కావున ఎసిడోసిస్ రాకుండా నియంత్రించును . శరరంలో రక్తకణాలు, హిమో గ్లోబిన్‌ల శాతం పెరిగేలా చేస్తాయి. మెదడు, గుండె, నరాలు, ఎముకలు, కాలేయం చక్కగా పనిచేసేలా చేస్తాయి. కండరాలకు బలాన్నిస్తాయి.

శరీర బరువు :

కిస్మిస్ లో ఉన్న ఫ్రక్టోజ్ , గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువును పెంచే దిశగా శక్తి మూలకముగా పనిచేయును . తక్కువ బరువు గల వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ గా ఎండుద్రాక్షను తింటే మంచిది .

సంతానలేమి:

సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్:

మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్ పండ్లు తినుటవలన యూరినల్‌లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బిపి(రక్త పోటు):

200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్‌మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.

పిల్లలు పక్క తడుపుతుంటే:

పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రిపూట రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది.

గొంతు సమస్య:

గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది.

English summary

18 Health Benefits Of Raisins

Small dried black or green grapes are commonly known as raisins. You would be surprised to know that this tiny dry fruit is very healthy and nutritious. You might not like to eat this dry fruit simply because of its dark and wrinkled appearance. But, if you keep the look of the raisins aside, this dry fruit is loaded with numerous health benefits.
Desktop Bottom Promotion