For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..లేదంటే?!

By Staff
|

అర్ధరాత్రి పూట వేసే ఆకలిని పిజ్జాలు లేదా చాక్లెట్ కేకు లతో సంతృప్తి పరచవచ్చు. కానీ అందువల్ల మన శరీరానికి కలిగే లాభం ఏమీ లేదు. వాటి వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంది.

ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి. వాటిలో కొన్ని మంచి అలవాట్లు ఉంటే మరికొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. చెడు అలవాట్లు ఇటు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి హాని చేస్తాయి. ఉదాహరణకు అతిగా తినడం, నిద్రలేమి లేదా ఎక్కువగా నిద్రపోవడం, లేదా మద్యం, పొగత్రాడం ఇటువంటి వన్ని జీవితానికి హాని కలించేవి..ఇటువంటి మరికొన్ని చెడు వ్యసనాలు లేదా అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పి మీ జీవితాన్ని ఆరోగ్యవంతంగా.. సంతోషకరంగా మార్చుకోండి...

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

నోట్లో లేదా ముక్కులో వేలు పెట్టుకోవడం:

ఇటువంటి అలవాటు చాలా చెత్త అలవాట్లలో ఒకటి. ఆరోగ్యానికి హానీకరమైన అలవాటే కాకుండా సామజిక మర్యాద పరంగా కూడా ఈ అలవాటు ఇబ్బంది పెట్టేటువంటిది. ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల అనేకరకమైన ఇన్ఫెక్షన్ ల బారిన పడే అవకాశం ఉంది. జలుబు కి సంబంధించిన వైరస్ శరీరంలోకి చేరి తద్వారా జలుబు మరియు ఫ్లూ వంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

అమితంగా మద్యం సేవించడం:

అమితంగా మద్యం సేవించడం వల్ల ఎన్నో మరణాలు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. అమితంగా మద్యాన్ని సేవించడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు, బరువు పెరగడం, కళ్ళు తిరగడం, అలసట వంటి దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. మితంగా తీసుకోవడం వల్ల వీటి నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

నిద్రలేమి సమస్య :

రోజుకి ఆరేడు గంటల నిద్ర ఆరోగ్యానికి అత్యవసరం. సరైన నిద్ర లేకపోతె శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇతర శరీర ప్రక్రియలు అలాగే వ్యవస్థల పద్దతులు పాడవుతాయి. నిద్రలేమి వల్ల, రోగ నిరోధక శక్తి బలహీనమవుతుంది. అందువల్ల, జెర్మ్ ఫైటర్స్ ని తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల రోగాల బారిన పడే అవకాశం కలదు.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

ఒంటరి తనం సమస్య:

మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనది ఆరోగ్యకరమైన మరియు ఉత్తేజకరమైన మనస్సు. మీ మనస్సు ఆరోగ్యకరంగా లేకపోతే దాని ప్రభావం మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిపై ఉంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మీ ఒంటరితనానికి సంబంధించి లేదా ఏదైనా సమస్యకి సంబంధించి మీరు తీవ్రంగా మదన పడుతున్నట్టైతే ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై పడుతుంది. మనుషులతో కలవలేకపోవడం మీ మనస్సుని అలాగే ఆరోగ్యాన్ని ఒత్తిడికి లోను చెయ్యడం ఈ కోవలోకే వస్తుంది.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

ఎక్కువ గంటలు హెడ్ ఫోన్స్ వాడడం :

హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ మనలో చాలా మందికి రోజు మొత్తంలో ఏకైక స్నేహితుడు. ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు సంగీతం వినడం ద్వారా టైం పాస్ చేస్తాము. కానీ ఇదే అలవాటు ఎక్కువ గంటలు నిర్విరామంగా కొనసాగితే మాత్రం మీరు ఈ అలవాటుని తగ్గించుకునే ప్రయత్నం ఆరంభించాలి.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

ఎక్కువ సేపు టీవీ చూడడం:

గంటల కొద్దీ టీవీ ముందు కళ్ళప్పగించి చూడడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి. ఎక్కువ సేపు టీవీ చూడడం వల్ల హార్ట్ అట్టాక్, స్ట్రోక్ మరియు ఊబకాయం వంటి సమస్యలు కలుగుతాయి.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

ఎత్తు చెప్పులు వేసుకోవడం:

రొజూ ఎత్తు చెప్పులు వేసుకునే మహిళలు వారి శరీరానికి తీరని హనీ కలిగిస్తున్నారు. ఎత్తు చెప్పులు వేసుకోవడం వల్ల కీళ్ళ పై ఎక్కువ ఒత్తిడి ఎక్కువవుతుంది. వెన్ను నొప్పి, కీళ్ళ వ్యాధి మరియు టెండర్ ఇంజురీలతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చు.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

బరువైన బాగ్ ని మోయడం లేదా షాపింగ్ చేయడం:

తీవ్రమైన వెన్ను నొప్పి, మెడ నొప్పి, అసౌకర్యమైన శరీర భంగిమలు వంటివి బరువైన బాగ్ ని మోయడం వల్ల కలుగుతాయి. అందువల్ల మీ శరీరాన్ని ఇబ్బంది కలగకూడదంటే మీ బాగ్ లో ఉన్న అనవసరమైన వస్తువులని తీసి వేసి తేలికపాటి బాగ్ ని వాడండి.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

మేకప్ తో నిద్రపోవడం:

ఎంతో మంది ఆడపిల్లలకి మేకప్ తో నిద్రపోయే అలవాటు ఉంది. మచ్చలు, కాంజేస్టెడ్ స్కిన్, చర్మ రంద్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటు, మస్కారా మరియు ఇతర మేకప్ ల వంటివి కంటి కి ఇబ్బంది కలిగించడమే కాకుండా దృష్టి కి సంబంధించిన సమస్యలు అందిస్తాయి.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

ఆకలి లేకపోయినా చిరు తిండ్లు తినడం:

రోజువారీ ఆహారపు అలవాట్లకు భంగం కలిగిస్తే మీ శరీరం మీకు ఆకలి వేస్తున్నదని మీకు ఇదివరకులా సంకేతాలు అందించదు. అందువల్ల మీరు ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. అమితంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోకి అనారోగ్యకరమైన పదార్ధాలతో పాటు అధిక మొత్తం లో కేలరీలు చేరతాయి. మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, అసిడిటీ వంటి దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

పొగ త్రాగకుండా ఉండలేరు:

రోజులో కేవలం ఒక్క సిగరెట్ తీసుకున్నా రక్తం గడ్డ కడుతుంది. రక్త ప్రసరణ సవ్యంగా జరగక ధమనులు మరియు రక్త నాళాళలో మురికి చేరుతుంది.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

తరచూ అబద్దం ఆడటం:

చిన్న చిన్న అబద్దాలే ఆరోగ్యానికి అమితంగా హనీ కలిగిస్తాయి. తరచూ అబద్దం చెప్పడం వల్ల మీకు నిజం బయటపడుతుందనే భయం ఒత్తిడి కలిగిస్తుంది.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

తరచూ ఔషదాలు సేవించడం:

అవసరం ఉన్న లేకపోయినా తరచూ ఔషదాలు సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

బ్రేక్ ఫాస్ట్ చెయ్యకపోవడం:

రోజులో బ్రేక్ ఫాస్ట్ కి ఉన్న ప్రాధాన్య ఎంతో ఎక్కువ. ఒక కప్పు కాఫీ ఇంకా బ్రెడ్ టోస్ట్ మీ బ్రేక్ ఫాస్ట్ అయితే మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థ మీద దుష్ప్రభావం చూపిస్తాయి. జీవక్రియ మీద ప్రతీకూల ప్రభావం తో పాటు మీ శరీరంలోని నిల్వ చేసుకున్న శక్తికి కూడా హనీ చేకూరుస్తాయి.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

జంక్ ఫుడ్ పై ప్రేమ:

ఫాస్ట్ ఫుడ్స్ ట్రాన్స్ కొవ్వులు, చక్కర, మసాలా దినుసులు, క్రుతిమమైన నిల్వ పదార్ధాలని కలిగి ఉంటాయి. పొట్ట పెరగడంతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలైన హై కొలెస్ట్రాల్, మదుమేహం మరియు గుండె జబ్బులకు కారణమవుతాయి. అందువల్ల, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల అధిక బరువు సమస్యతో పాటు వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలని నిర్మూలించవచ్చు.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

గోళ్ళు కొరకడం:

మీ చేతులు రోజులో ఎన్నో రకాల వస్తువులని తాకుతూ ఉంటాయి. అప్పుడు వాటిపైన ఉండే క్రిములు మీ చేతి వేళ్ళ గోరులోకి చేరతాయి. వాటిని మీరు నోట్లో పెట్టుకొని కొరకడం వల్ల జలుబు, ఫ్లూ వంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఈ అలవాటు నుండి బయటపడడం మంచిది.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

సెక్స్ అంటే అయిష్టత:

కామేచ్చ తక్కువుగా ఉండడానికి అధికమైన ఒత్తిడి లేదా ఎక్కువ పని లేదా వేరే ఇతర కారణమేదైనా కావచ్చు. సెక్స్ ని నెలల తరబడి చేసుకోకపోవడం మాత్రం ఆరోగ్యకరమైన విషయం కాదు. ఆరోగ్యకరమైన శరీరానికి అలాగే మనస్సుకి సెక్స్ అవసరం. మీ శరీరంలోని రోగ నిరోధక శక్తి ని మెరుగుపరచడంతో పాటు మీ సంబంధ బాంధవ్యాలని పెంపొందించేందుకు సెక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇటువంటి ఆనందకరమైన ప్రక్రియ మీకు నచ్చనట్లయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. హైపర్టెన్షన్, హార్మోన్ల అసమతుల్యత మరియు థైరాయిడ్ సమస్యలు కూడా సెక్స్ పైన ఆసక్తి కలగక పోవడానికి కారణాలు కావచ్చు.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

త్వరగా తినడం:

పని ఒత్తిడి మరియు సమయాభావం వల్ల ఆహారాన్ని త్వర త్వరగా భుజిస్తే మీ జీర్ణ వ్యవస్థ పాడయ్యే అవకాశం కలదు. భోజనం చెయ్యడానికి కనీసం 20 నిముషాల సమయం కేటాయించాలి. ఆహారాన్ని నమలకుండా మింగడం వల్ల అసిడిటీ, కడుపుబ్బరం, కడుపులో గ్యాస్ ప్రాబ్లం వంటి సమస్యలు వస్తాయి.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

అనారోగ్యకరమైన సంబంధాలు ఎక్కువ కాలం కొనసాగడం:

ఒకవేళ మీ సంబంధం మీకు ఆనందాన్ని లేదా సంతోషాన్ని ఇవ్వనట్లయితే ఆ ప్రభావం మీ శరీరం పై ఉంటుంది. అలా ఎక్కువ కాలం కొనసాగే కంటే విడిపించుకోవడం ఉత్తమం. అనారోగ్యకరమైన సంబంధం వల్ల అనవసరపు ఒత్తిడి కలగడంతో పాటు, రోగ నిరోధక శక్తి మరియు జీర్ణ వ్యవస్థపై దుష్ప్రభావం చూపెడుతుంది. అంతే కాదు, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది.

20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!

చర్మం గురించి చింత:

మీ ముఖం పై మొటిమల వంటి ఏదైనా చిన్న తేడా కనిపించినప్పుడు మీరు ఆ మొటిమని పదే పదే తడమడం వల్ల సమస్య ఇంకా జటిలమవుతుంది. ఘాట్లు, మచ్చలు మరియు వాపు ఏర్పడతాయి. అందువల్ల చర్మ సంబంధిత సమస్యలకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ పదే పదే వాటిని తాకి సమస్యని మరింత పెద్దది గా చేసుకోకూడదు.

English summary

20 bad habits you need to quit now | 20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!|

Satisfying late night cravings with pizzas and chocolate cake might be a tempting way to end each day, but it's not doing your body any favours. It can impact you and your overall health on a long term basis.
Desktop Bottom Promotion