For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్ ఖరీదైనా..ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం డబుల్ గా ఉన్నాయి..

|

కూరగాయలలో తియ్యటి కూరగాయ క్యారెట్. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండి తే మాత్రం ఇష్టపడరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీర కంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపం లోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకు న్నట్ల యితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే పరిమాణములో క్యారెట్ విటమిన్ బి, సి, జి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది. అతి ఉత్తమమైన, సహజమైన కాల్షియం (సున్నం) చక్కటి సమతౌల్యాన్ని అద్భుతంగా ఇది ఇవ్వగలదు. ఇది మంచి పటిష్టమైన పళ్ళకూ ఎముకలకు, మంచి చర్మానికీ కావలసిన అత్యావశ్యకమైన పదార్ధం. అంతేకాదు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

చర్మానికి: ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్‌ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్‌ రసం తోడ్పడుతుంది. శరీరంలోని మృతకణాలను తిరిగి యాక్టివేట్‌ చేయ డం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్‌ జ్యూస్‌ తప్పక సేవించాలి.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

కేశాలకు: తాజా కారెట్‌ జూస్‌కు కొంచెం నీళ్ళు, పుల్ల పెరుగు, గుడ్డులో ఉండే తెల్లసొన కలిపి శిరోజాలకు పట్టించి కొద్దిసేపయ్యాక తలస్నా నం చేస్తే జుట్టురాలడం తగ్గడమే కాక, శిరో జాలు గట్టిగా వుంటాయి. వేసవిలో జుట్టు చివర్లు పగిలిపోయినట్లయితే.. క్యారెట్‌ ఆకులకు కాస్తంత నువ్వుల నూనె కలిపి మెత్తగా నూరి తలకు పూసుకుని పెసరపిండిని తలకు మర్దిస్తూ స్నానం చేసినట్లయితే.. జుట్టు చివర్లు తెగకుండా, జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

కళ్ళకు: క్యారెట్టులో విటమిన్ ఏ, బీ, ఈతోపాటు పలు మినరల్స్ ఉండటం మూలాన కళ్ళల్లో సాధారణంగా ఏర్పడే హ్రస్వ దృష్టి, దూరదృష్టి లోపాలను సరిదిద్దుకోవచ్చు. పైగా కంటి చూపు మెరుగుపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

రుతుక్రమ సమస్యలు: మహిళలలో నెలసరి సరిగా రాకపోతే కూడా క్యారెట్ జ్యూస్ క్రమబద్దీకరిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి రోజు ఓ గ్లాసు క్యారెట్ జ్యూస్ సేవించాలంటున్నారు వైద్యులు.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

మౌత్ అల్సర్: క్యారెట్ల జ్యూస్‌ వల్లా, క్యారెట్‌ను పచ్చిగా అలాగే తినడం వల్లా నోటి అల్సర్‌ నివారణ సాధ్య మవుతుంది. క్యారెట్‌, టవెూటా, బత్తాయి పండ్ల రసాలను సమపాళ్ళలో తీసుకుని రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వాడి నట్లయితే, నోటి అల్సర్‌నున పూర్తిగా నివారించవచ్చు.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

ఉదర సంబంధిత సమస్యలు: క్యారెట్టును నిత్యం సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం వంటి సమస్యలకు కూడా క్యారెట్‌ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

క్యాన్సర్: క్యారెట్, కాలిఫ్లవర్‌లోని ఎ విటమిన్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్ పెరుగుదలకు బ్రేక్ వేయడంతో సహా నియంత్రిస్తుందని స్టడీలో వెల్లడైంది.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

రక్తహీనత: క్యారెట్‌లో రక్తహీనతను పోగొట్టే గుణం ఉంది. రక్తహీనతకు కూడా క్యారెట్‌ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అధిక పోషక విలువలుండటం వల్ల క్యారెట్‌లో రోగ నిరోధక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఇందులోని రోగ నిరోధకశక్తి వలన కఠినమైన మొండి రోగాలు, దీర్ఘ వ్యాధులకు సైతం చెక చెప్పవచ్చునంటు న్నారు డాక్టర్లు.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

గుండె జబ్బులు: క్యారెట్ గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది. గుండెల్లో మంటగా ఉంటే క్యారెట్‌ను ఉడకబెట్టండి. దానిని చల్లార్చిన తర్వాత ఒక కప్పు రసంలో ఒక చెంచా తేనెను కలిపి సేవించండి. దీంతో గుండెల్లో మంటగా ఉంటే అది మటుమాయం అవుతుంది.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

వీర్య వృద్ధి: క్యారెట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది పురుషుల్లో వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. మహిళల గర్భధారణకు మరియు గర్భం ధరించిన తర్వాత శరీరానికి కావల్సిన విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి పిల్లలకోసం ప్లాన్ చేసుకొనే వారు స్త్రీ పురుషులిద్దరూ క్యారెట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవచ్చు.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

చెడు కొలెస్ట్రాల్ : రోజూ ఒక పచ్చి క్యారెట్‌ తినడం వల్ల శరీరంలోని చెడుకొవ్వు తగ్గి, రక్తపీడనం సరైన స్థాయికి చేరుకోవడమే కాక, తద్వారా గుండె జబ్బులు నివారింపబడతాయి.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

కిడ్నీ సమస్యకు: మూత్రపిండ సమస్యలకు కూడా క్యారెట్‌ జ్యూస్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని మంచి లక్షణాలున్న క్యారెట్‌ను రోజూ తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

నిద్రలేమి: నిద్రలేమి కి కూడా క్యారెట్‌ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవించండి. దీంతో మీకున్న నిద్రలేమి మటుమాయమవుతుంది. చిన్నారులకు కూడా రాత్రి పడుకోబోయే ముందు ఓ గ్లాస్‌ క్యారెట్‌ జ్యూస్‌ ఇచ్చి నట్లయితే వారు ఎంతో హాయిగా చక్కగా నిద్రిస్తారు.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

కాలిన గాయాలకు: క్యారెట్‌ ప్రకృతి సిద్ధమైన సహజ ఔషధంగా కూడా పనిచేస్తుంది. క్యారెట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరం ఎంతో చైతన్యవంతమవుతుంది. కాలిన గాయాలతో బాధపడేవారికి పచ్చి క్యారెట్‌ రసం గానీ, దాని పిప్పిగానీ కాలిన చోట రాసినట్లయితే, గాయం త్వరగా మానడమే కాక, చల్లగా ఉంటూ కాలిన గాయం బాధ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని కూడా కల్గిస్తుంది. కాలిన గాయాలు త్వరగా మానేందుకు దోహదపడు తుంది. అంతే కాక కాలిన గాయాల మచ్చలు కూడా క్యారెట్‌ రసం పూయడం వల్ల త్వరగా మానిపోతాయి.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

పిల్లలకు : ఇక చిన్నారులు ఈ క్యారెట్‌ జ్యూస్‌ను కొన్ని వారాలపాటు సేవించినట్లయితే వారికి కడుపునొప్పి సమస్య ఉండనే ఉండదు. ఎందుకంటే క్యారెట్‌ చిన్నారుల కడుపుల్లో ఉండే నులిపురుగులు మలం ద్వారా బయటికి వెళ్ళేందుకు దోహదపడుతుంది. క్యారెట్‌ జ్యూస్‌లోని పీచు పదార్థం ప్రేవుల గోడలను శుభ్రం చేసి, మలినా లను బయటికి పంపించివేస్తాయి.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

మెదడుకు : ఇక ఈ క్యారెట్‌ను క్రమం తప్పకుండా ఆహారంతోపాటు తీసు కుంటే, ఇందులోని అధిక కేలరీలు చిన్నారుల మేధోవికాసానికి ఎంత గానో దోహదపడతాయని పలు సర్వేలు పేర్కొన్నాయి. క్యారెట్‌ను తీసు కోవడం వల్ల, దాని ప్రభావం మెదడుపై పనిచేసి, మెదడును ఉత్తే జపర్చడమే కాక, ఆలోచనాశక్తి కూడా పెరిగేలా చేస్తుందంటు న్నారు నిపుణులైన వైద్యులు.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఇంటర్వ్యూ లకు వెళ్ళేవారు క్యారెట్‌ జ్యూస్‌ను తీసుకున్నట్లయితే, అది మంచి ఉత్ప్రేరకంగా పని చేసి, వాళ్ళను ఎంతో ఉత్సాహంగా, ఉత్తే జంగా ఉండేలా చేస్తుంది.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

క్రీడాకారులకు: క్రీడాకారులు కూడా ఆటల్లో రాణించేందుకు క్యారెట్‌జ్యూస్‌ను సేవిస్తుంటారు. ఇది వారికి ఓ మంచి టానిక్ లాగా ఉపయోగ పడుతుంది.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

మలబద్దకం: క్యారెట్లు రెగ్యులర్ గా తినడం వల్ల మలబద్దకం దూరం చేస్తుంది. ఇది ప్రేగుల్లో పేరుకుపోయిన మలాన్ని శుద్ధి చేస్తుంది. క్యారెట్‌ జ్యూస్‌లోని పీచు పదార్థం ప్రేవుల గోడలను శుభ్రం చేసి, మలినా లను బయటికి పంపించివేస్తాయి.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

ఒత్తిడి: మన జీవితం నిత్యం ఒత్తిడికి గురవుతుంది ముఖ్యంగా సాయంత్రం అయ్యేసరికి శరీరం, మనసూ రిలాక్స్ కావాలంటే ఒక గ్లాసు చల్లటి క్యారెట్ జ్యూస్‌ని తీసుకోవాలి.

English summary

20 Health Benefits of Carrot Juice...| క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

Carrot is a storehouse of many nutrients, vitamins and minerals. Listed here are some health benefits of drinking carrot juice regularly.
Desktop Bottom Promotion