For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలని కోరుకుంటున్నారా?

By Super
|

అందంగా ఉండాలి అనేది స్త్రీల మనసులో ఉండే శాశ్వతమైన కోరిక. సరైన చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ సరైన విధానంలో కలిసిపోయి శరీర సంరక్షణ అందాన్ని, మంచి ఆకర్షణని అందిస్తుంది. ఈ చిట్కాలను పాటించి, అద్దంలో ఉన్న మీ ప్రతిబింబాన్ని ప్రేమించి ... మళ్ళీ మళ్ళీ తిరిగి ఇలాగే చేయండి.

మీకైమీరు స్క్రబ్ చేసుకోండి

మీకైమీరు స్క్రబ్ చేసుకోండి

మీ శరీరానికి ప్రతిరోజూ స్క్రబ్ ని ఉపయోగించండి, ఇది డెడ్ సెల్స్ ని తొలగించి, మీ శరీరంలో పెరుగుదలను నిరోధిస్తుంది. ఒక సరైన చిట్కా, చర్మవ్యాధి నిపుణులు డాక్టర్. అప్రతిం గోయెల్ "స్నానం చేసిన ప్రతిసారీ, మీ శరీరం మొత్తానికి ఒక మంచి బాడీ మాయిశ్చరైజర్ అప్ప్లై చేయండి" అని చెప్పారు. మీ మాయిశ్చరైజర్ లో విటమిన్ E, ఇతర యాంటీ-ఆక్సిడెంట్లు మంచి మూలాన్ని కలిగి ఉండాలి. తేనె, పంచదార మిశ్రమం అందుబాటులో ఉండే ఉత్తమ సహజ స్క్రబ్.

ఎక్కువ నీరు తాగడం

ఎక్కువ నీరు తాగడం

మీరు ప్రతిరోజూ కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తీసుకోవాలని నిర్ధారించుకోండి. ఇది డిహైడ్రేషన్ ని నిరోధించడానికి సహాయపడుతుంది, మీ చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

మురికిని వదిలించుకోండి

మురికిని వదిలించుకోండి

మీకు చెమట ఎక్కువగా పట్టినట్లైతే, మీరు రోజుకు రెండుసార్లు స్నానం చేయాలనీ నిర్ధారించుకోండి. ఒక మంచి స్నానం మిమల్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది, మీ వ్యక్తిగత శుభ్రతకు కూడా పనిచేస్తుంది. మీ స్నానం తరువాత, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ఎంపిక చేసుకోండి, ఇవి మీ చర్మానికి గాలిని అందించడానికి సహాయపడతాయి.

మీ జుట్టుపై శ్రద్ధ తీసుకోండి

మీ జుట్టుపై శ్రద్ధ తీసుకోండి

పెరుగుతున్న ఉష్ణోగ్రత, కాలుష్యం మీ జుట్టు ఆరోగ్యంగా ఉంచడంపై ప్రభావం పడుతుంది. మంచి జుట్టును కలిగి ఉండాలి అంటే, మీ సౌలభ్యం ప్రకారం మీ జుట్టుకు షాంపూ పెట్టండి. "అలాగే షాంపూ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అదనంగా షాంపూ పెట్టడం వల్ల జుట్టు పొడిబారి, నిస్తేజంగా తయారవుతుంది. మీరు జుట్టుకు షాంపూ పెట్టేటపుడు, చిటికెడు బేకింగ్ సోడా కలపండి, ఇది మురుకిని, కాలుష్యాన్ని తొలగిస్తుంది."

సన్ ప్రొటెక్షన్ ని ఉపయోగించండి

సన్ ప్రొటెక్షన్ ని ఉపయోగించండి

మీరు మీ జీవితాంతం ఈ పద్ధతిని పాటించండి, ప్రతిరోజూ మంచి సన్ స్క్రీన్ ని వాడండి. మీ చర్మానికి సరిపోయే మంచి సన్ స్క్రీన్ ని ఎంచుకోండి, దీనివల్ల అలర్జీలు, స్కిన్ రాష్ లు తొలగిపోతాయి.

మీ కాలివేళ్ళను గాలి పారేటట్లు చేయండి

మీ కాలివేళ్ళను గాలి పారేటట్లు చేయండి

ఎప్పుడూ ఓపెన్ షూ ధరించండి, ఇది సరైన ప్రసరణను, పదాలు వాసన రాకుండా, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్ లు రాకుండా కాపాడుతుంది.

‘పెరుగు' ను మీ కొత్త మంచి-స్నేహితుడుగా తయారుచేసుకోండి

‘పెరుగు' ను మీ కొత్త మంచి-స్నేహితుడుగా తయారుచేసుకోండి

పెరుగును ఎక్కువగా తీసుకోండి, ఇది మీ చర్మాన్ని పునరుద్ధరించడమే కాకుండా వృద్ధాప్య ప్రక్రియను కూడా తగ్గిస్తుంది. పెరుగును చర్మం లేదా జుట్టు పాక్ గా కూడా ఉపయోగించవచ్చు, సన్ వల్ల పాడైన దాన్ని సున్నితం చేస్తుంది.

కొత్త షేవింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించండి

కొత్త షేవింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించండి

మీరు రేజర్ ఉపయోగించేవారైతే, మీరు స్నానం చేసే సమయంలో, మీ చేతులు, కాళ్ళపై వాటిని ఉపయోగించే ముందు కనీసం మూడు నిముషాలు ఆగండి. గోరువెచ్చని నీరు ఉపయోగిస్తే, మీ జుట్టు గట్టితనం పోయి సున్నితంగా తయారవడానికి సహాయపడుతుంది, ఇది దగ్గరగా, దీర్ఘకాలంలో సున్నితత్వాన్ని అందిస్తుంది. ఒకసారి చల్లని నీటిలో సహజ యాస్త్రింజేంట్ ని కొన్ని చుక్కలు జతచేసి చూడండి.

ఒక సిల్క్ నునుపైన దిండును ఉపయోగించండి

ఒక సిల్క్ నునుపైన దిండును ఉపయోగించండి

సిల్క్ దిండు కవర్ ను ఉపయోగించడం వల్ల, జుట్టు చర్మం పైపొర, దిండు కవరు మధ్య ఘర్షణను నిరోధించడానికి సహాయపడుతుంది, ఇది మీ జుట్టుకు మరింత హాని కలిగేటట్లు, చిక్కు చేయవచ్చు.

టాన్ కి గుడ్ బై చెప్పండి

టాన్ కి గుడ్ బై చెప్పండి

సులభంగా టాన్ పొందే వారందరి కోసం: మీ సమస్యను పరిష్కరించడానికి ఎల్లపుడూ సహజ పదార్ధాలనే వాడండి. ఎగ్ వైట్, కార్న్ ఫ్లోర్, నిమ్మ రసం మిశ్రమాన్ని ఉపయోగించండి లేదా టాన్ తొలగించడానికి చిన్న బంగాళదుంప లేదా నిమ్మరసాన్ని కొద్దిగా రబ్ చేయండి. ఇది సహాయపడక పోతే, వెంటనే చర్మవ్యాధి నిపుణుల సహాయం పొందండి.

మీ వీపుభాగంపై శ్రద్ధ తీసుకోండి

మీ వీపుభాగంపై శ్రద్ధ తీసుకోండి

మీ వీపు సెక్సీగా ఉండాలంటే, మీ వీపుని ప్రతిరోజూ శుభ్రంచేసుకోండి. బొప్పాయి గుజ్జును మీ చర్మంపై 5-10 నిముషాలు అప్ప్లై చేయండి. ఈ చికిత్స మీ వీపుభాగంపై ఉన్న మురికిని, డెడ్ సేల్స్ ని తొలగించడానికి సహాయపడుతుంది.

మీ తలను రక్షించుకోండి

మీ తలను రక్షించుకోండి

మీ జుట్టును టోపీతో కవర్ చేస్తే, ఈ చిట్కా మీ నుదుటిపై ఉన్న ఆక్నేకి కారణమైన చర్మంపై ఉన్న నూనెను తొలగిస్తుంది. దీనిని నిరోధించడానికి ఎల్లపుడూ ఒక మంచి క్లీనర్ తో తుడవాలి.

ఆరోగ్యకర పాదాల కోసం

ఆరోగ్యకర పాదాల కోసం

మీరు మూసుకుపోయే షూ ధరించే ముందు ఎప్పుడూ యాంటీ-ఫంగల్ పౌడర్ ని వాడండి. అంతేకాకుండా, సానపెట్టు రాయిని ఉపయోగించి డెడ్ సేల్స్ ని తొలగిస్తే, మీ పాదంపై చర్మం తిరిగి ఏర్పడుతుంది.

ప్రోటీన్ తో కూడిన ఆహారాన్ని తీసుకోండి

ప్రోటీన్ తో కూడిన ఆహారాన్ని తీసుకోండి

ఆరోగ్యకరమైన, కాంతితో కూడిన రంగుకోసం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే లీన్ మాంసం, గుడ్లు, ధాన్యాలు, పాలు, చీస్ మొదలైనవి ఎక్కువగా తీసుకోండి. ఈ ప్రోటీన్ సంపన్న ఆహరం ఎముకలు, పళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయపడతాయి.

తగినంత విశ్రాంతి తీసుకోవడం

తగినంత విశ్రాంతి తీసుకోవడం

అందంగా ఉండాలంటే, జీవితంలో తగినంత నిద్ర, నీరు అవసరం. ఈ రెండు ముఖ్యమైన విషయాలు మీ చర్మం ప్రకాశవంతమైన రంగును పొందడానికి సహాయపడతాయి, ఎరుపు, ఉబ్బిన కాళ్ళ నుండి రక్షించి, నిర్విషీకరణకు సహాయపడతాయి.

మేకప్ ఎక్కువగా వేసుకోకండి

మేకప్ ఎక్కువగా వేసుకోకండి

మీ ముఖానికి మేకప్ వేసుకునేటపుడు, తక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఎక్కువ మేకప్ వల్ల రంధ్రాలు మూసుకుపోయి, చర్మం ముడతలకు, పొరలుగా అవడానికి దారితీస్తుంది. అంతేకాకుండా, పడుకునేముందు, మీ ఫౌండేషన్ ని తొలగించుకోవాలని నిర్ధారించుకోండి.

CTM (క్లెంజింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్) ని ఎల్లపుడూ అనుసరించండి

CTM (క్లెంజింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్) ని ఎల్లపుడూ అనుసరించండి

మీ చర్మ తత్వాన్ని బట్టి క్లెంజర్, టోనర్ ని ఎంచుకోండి, ప్రతిరోజూ CTM విధానాన్ని అనుసరించండి. మంచి క్లెంజర్ డెడ్ సెల్ల్స్ ని తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, మీ చర్మం నుండి సహజ నూనెను దూరం చేస్తుంది కూడా, అందువల్ల మీ చర్మానికి మంచిది ఇవ్వడానికి, మంచి ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్ తో భర్తీచేస్తుంది.

ఎల్లపుడూ ఒక చేతి సానిటైజర్ ని ఉంచుకోండి

ఎల్లపుడూ ఒక చేతి సానిటైజర్ ని ఉంచుకోండి

మురికి చేతులతో తరచుగా మీ ముఖాన్ని తుడుస్తూ ఉంటే, పగుళ్ళు, యాక్నే సమస్యలు వస్తాయి. అందువల్ల, మీరు బైటికి వెళ్ళేటపుడు ఎప్పుడూ సానిటైజర్ లను ఉపయోగించండి, మీ చేతులను మీ ముఖం నుండి దూరంగా ఉంచండి.

మీ చర్మాన్ని శుభ్రం చేయండి

మీ చర్మాన్ని శుభ్రం చేయండి

కనీసం వారానికొకసారి ఎక్స్ఫోలియేటర్ ఉపయోగించ౦డి. ఇది మీ చర్మంపై ఉన్న మురుకిని, మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది, ఇది మీ చర్మానికి ఆరోగ్యవంతమైన కాంతిని ఇస్తుంది.

మీ జుట్టుకు కండిషనర్ పెట్టండి

మీ జుట్టుకు కండిషనర్ పెట్టండి

తలస్నానం చేసిన తరువాత, కాలుష్యం వల్ల వచ్చే జుట్టు రాలడం, చిక్కు నుండి రక్షణకు మంచి కండిషనర్ తో మీ జుట్టును శుభ్రం చేయండి. అంతేకాకుండా, తరచుగా మీ జుట్టుకు బ్లో-డ్రై పెట్టడం మానుకోండి.

English summary

20 Tips to Be Healthy and Beautiful

Being beautiful is a perennial wish women have in their minds. Proper skin care and hair care clubbed rightly with body care gives one beauty and good looks. Try these tips and fall in love with your reflection in the mirror… all over again.
Desktop Bottom Promotion