For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిగరెట్ మానేయాలనుకొనే వారికి అద్భుత చిట్కాలు

By Super
|

పొగతాగడం మానేయడం అనేది మానవ నిగ్రహ శక్తికి ఉన్న పెద్ద సవాళ్లలో ఒకటి. ఇతర దురలవాట్ల లానే పొగతాగడం మానేయడం వలన శరీరంలో వాస్తవ భౌతిక, మానసిక ప్రతికూల చర్యలు కలుగుతాయి.

పొగ తాగడం మానేయడానికి మీకు అనేక పద్ధతులు ఉన్నాయి. నికోటిన్ ప్యాచులు, హిప్నాటిజం, డాక్టర్ సూచించిన మందుల వాడకం మొదలైనవి వీటిలో ఉన్నాయి. అయితే మనకు తెలియని విషయమేమిటంటే ప్రతి రోజు మనం ఈ దురలవాటుకు వ్యతిరేకంగా మందులు లేకుండా పోరాడవచ్చునన్నది.

ఒక ప్రణాళికను రచించండి

ఒక ప్రణాళికను రచించండి

పొగ తాగడం నుండి విజయవంతంగా వేరు పడటానికి, మీ పొగతాగే అలవాట్లు, నిజానికి మీరు ఆధారపడిన స్వభావాన్ని గుర్తించి మీకు ఏ పద్ధతి పని చేస్తుందో కనుగొని చెప్పాలి. మీరు ఏ రకమైన స్మోకరో తెలపడానికి సమయం తీసుకోండి. ఏ సందర్భంలో మీరు సిగరెట్ తాగుతారు? ఎందుకు? వీటి సహాయంతో మీకు ప్రయోజనకరంగా ఉండే చిట్కాలు, పద్ధతులు, చికిత్సలను గుర్తించగలరు.

వ్యాయామం / కోరికలను జయించడానికి

వ్యాయామం / కోరికలను జయించడానికి

నికోటిన్ కావాలనే కోరికను వ్యాయామం తగ్గిస్తుంది. మానేయడం వలన కలిగిన కొన్ని లక్షణాలను తగ్గిస్తుంది. మీకు సిగరెట్ కావాలని అనిపించినప్పుడు, దానికి బదులుగా షూ వేసుకొని రన్నింగ్ కు వెళ్ళండి లేదా ఉన్నచోటే కాసేపు పరిగెత్తండి. మీ కుక్కతో కలసి నడవడం, తోటలో కలుపు తీయడం వంటి చిన్న వ్యాయామం కూడా సహాయం చేస్తుంది. ఈ పనులకు మీరు ఖర్చు చేసే అదనపు క్యాలరీలు కూడ పొగ తాగడం మానేయడం వలన బరువు పెరగకుండా కాపాడతాయి.

మీ స్నేహితునితో పందెం వేయండి.

మీ స్నేహితునితో పందెం వేయండి.

మీ స్నిహితునితో పందెం కట్టి, పొగ తాగడం మానేయడానికి ఒక తేదిని నిర్ణయించుకోండి. దీనిలో నుండి బయట పడటానికి మీ స్నేహితుని మీకు చేయదగిన సహాయం చేయనివ్వండి

ఆల్కహాల్ ను, సోడా వంటి పానీయాలను నివారించండి

ఆల్కహాల్ ను, సోడా వంటి పానీయాలను నివారించండి

ప్రేరేపించేవాటిలో ఆల్కహాల్ అతి సాధారణమైనది. అందువల్ల పొగ తాగడం మానేసిన కొత్తలో తక్కువగా తాగడానికి ప్రయత్నించండి. సోడా, కోలా, టీ, కాఫీ అన్ని సిగరెట్ ను రుచికరంగా మారుస్తాయి. అందువలన, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా నీళ్ళు, జ్యూసులు తాగండి. కొంత మంది తమ డ్రింక్ ను మానేయడం వలన సిగరెట్ దగ్గరకు చేరాలన్న కోరిక మారుతుందని కనుగొన్నారు.

ఒత్తిడిని తట్టుకోండి

ఒత్తిడిని తట్టుకోండి

మగవారు సిగరెట్ తాగడానికి కారణం నికోటిన్ ఒత్తిడి నుండి విశ్రాంతిని కల్గిస్తుంది. ఒకసారి మీరు మానేసిన తర్వాత ఒత్తిడిని తట్టుకోవడానికి మీకు వేరొక మార్గం కావాలి. క్రమబద్ధమైన మర్దనలు, విశ్రాంతిగా సంగీతాన్ని వినడం, యోగా నేర్చుకోవడం, తై చి నేర్చుకోవడం వంటివి ప్రయత్నించండి. సాధ్యమైతే, మీరు పొగ తాగడం మానేసిన మొదటి కొద్ది వారాల వరకు ఒత్తిడిని కల్గించే సంఘటనల నుండి దూరంగా ఉండండి.

బేకింగ్ సోడాతో కాక్ టెయిల్

బేకింగ్ సోడాతో కాక్ టెయిల్

బేకింగ్ సోడా మూత్రంలో పి హెచ్ ను పెంచుతుంది. దీనివలన శరీరంలో అప్పటికే ఉన్న నికోటిన్ బయటకు వెళ్ళే ప్రక్రియ మెల్లగా జరుగుతుంది. దీని ఫలితంగా నికోటిన్ మీద పెద్దగ కోరిక పుట్టదు. ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడాను రోజుకు మూడు సార్లు తీసుకోండి. పొగ తాగడం మానేయడానికి బేకింగ్ సోడాను ఒక గ్లాసు నీళ్ళలో కలిపి ప్రతి సారి భోజనం చేసిన తర్వాత తీసుకోవడం మరొక మార్గం.

పళ్ళు, కాయగూరలు,

పళ్ళు, కాయగూరలు,

పళ్ళు, కాయగూరలు, పాలు, ఆకుకూరలు, క్యారెట్, పళ్ళు, కూరగాయలు పొగ తాగడానికి ముందు తీసుకున్నట్లయితే, చేదుగా ఉండే రుచితో అది నోటిలో వదిలే భయానక రుచి వలన పొగాతాగడాన్ని సగంలోనే వదిలేసేటట్టు చేస్తుంది.

ఒక స్నిహితునితో కలసి మానేయండి

ఒక స్నిహితునితో కలసి మానేయండి

స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మానేయదలచుకుంటే, కలసి మానేద్దామని సూచించండి. వారి ప్రోత్సాహం, సంఘీభావం వలన ఎంతో తేడా రావచ్చు.

విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం

విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం

ఉదాహరణకు నారింజ, నిమ్మ, ఉసిరి, జామ ఎక్కువగా తీసుకోవడం వలన పొగాతాగాలనే కోరికను తగ్గిస్తుంది. కారణం సిగరెట్ వలన మీరు విటమిన్ సి కు దూరంగా ఉండి ఉంటారు, నికోటిన్ మీలో నిండి మిమ్మల్ని, దీని లోపానికి గురి చేసి ఉంటుంది.

మిమ్మల్ని సత్కరించుకోండి

మిమ్మల్ని సత్కరించుకోండి

అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో బాటు మీరు సిగరెట్ మానేయడం వలన ఇతర లాభం మిగిలిన డబ్బు. వినోదంగా ఉండే దాని మీద ఈ మొత్తంలో కొంత భాగాన్ని ఖర్చు చేసి మిమ్మల్ని మీరు సత్కరించుకోండి.

జరిమానా చెల్లించండి

జరిమానా చెల్లించండి

ఒక స్నేహితునితో ఒప్పందం చేయండి దాని వలన, మీరు పొగ తాగిన ప్రతి సారి, దీనికి జరిమానా చెల్లించండి. ఇది పొగ తాగే అలవాటును వశం చేసుకోవడానికి సాయపడ్తుంది.

దాల్చినచెక్కను నమలండి

దాల్చినచెక్కను నమలండి

మీకు నికోటిన్ పై ఉన్న వాంఛకు ఇది సులువైన ఇంటి వైద్యం.

ఉప్పుతో కూడిన భోజనం

ఉప్పుతో కూడిన భోజనం

ఉప్పగా ఉండే చిప్స్, అప్పడాలు, పచ్చళ్ళ వంటివి మీకు పొగ తాగాలనే కోరిక పుట్టినప్పుడు తినవచ్చు. మీరు నాలుక కొన మీద కొంత ఉప్పును కూడా పెట్టుకోవచ్చు. మీ పొగతాగాలనే కోరికను ఇది చంపేస్తుంది.

ఎండు ఫలాలు

ఎండు ఫలాలు

ఎండు ఫలాలు రుచి పొగ తాగాలనే కోరికను తగ్గించడంలో సాయపడ్తుంది.

పొగ తాగని వారిని స్నేహితులుగా చేసుకోండి.

పొగ తాగని వారిని స్నేహితులుగా చేసుకోండి.

మీ చుట్టూ ఉన్న స్నేహితులు, కుటుంబసభ్యులు, తోటి-ఉద్యోగస్థులు పొగ తాగుతుంటే మానేయడం రెండింతలు కష్టం లేదా తిరిగి అదే స్థితికి వెళ్ళకండి. మీ చుట్టూ ఉన్న సమాజానికి మీరు మీ అలవాట్లను మానేస్తున్నారని తెలియడం అవసరం అందువలన ఈ నిర్ణయాన్ని తెలపండి.

పొగ తాగని వారు ఉన్న చోట చేరండి. వారు మీరు పొగ తాగడం మానేయడానికి మీకు సహాయం చేస్తారు.

చక్కెర లేని క్యాండి లేదా చూయింగ్ గమ్

చక్కెర లేని క్యాండి లేదా చూయింగ్ గమ్

చక్కెర లేని క్యాండి లేదా చూయింగ్ గమ్ వంటివి మీ నోటిని బిజీగా ఉంచి, మిమ్మల్ని పొగతాగాలనే కోరిక నుండి దూరంగా ఉంచుతాయి.

క్రమంగా సిగరెట్ లను తగ్గించండి ( మీరు క్రమంగా తగ్గించదలచుకొంటే మీరు పూర్తిగా మానేయవలసిన ఒక తేదిని ఖచ్చితంగా ఎంచుకోండి)- క్రమంగా తగ్గించడానికి కొన్ని మార్గాలు

మీరు సిగరెట్లు మానేసే తేది నాటికి రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు; కాని ఒక సారికి ఒక ప్యాకెట్ మాత్రమే కొనండి

ప్రతి రోజు మీరు తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించండి

ప్రతి రోజు మీరు తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించండి

ప్రతి రోజు మీరు తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించండి; బ్రాండ్లను మార్చండి, దీని వలన మీకు పొగ తాగడం పెద్దగా వినోదాన్నివ్వదు. మీ సిగరెట్లను ఇతరులకు ఇవ్వండి, దీని వలన మీకు పొగ తాగాలనిపించిన ప్రతిసారి వారిని అడగవలసి ఉంటుంది.

మీ పళ్ళను శుభ్రం చేయించుకోండి

మీ పళ్ళను శుభ్రం చేయించుకోండి

మీ పళ్ళను చూసి ఆనందించండి. వాటిని అలానే నిర్వహించుకొనేందుకు మిమ్మల్ని మీరు ప్రోత్సహించండి. ఒక పొగ తాగని వారిగా మారుతున్న మీ విధానాన్ని ఊహించుకోండి. ఒక పొగ - తాగని వారిగా మిమ్మల్ని మీరు ఊహించుకోవడానికి సమయం కేటాయించండి. మిమ్మల్ని మీరు నడక ద్వారా వినోదించడం, లేదా ఉదయాన్నే జాగింగ్ చేయడం వంటివి చేసినట్టుగా ఊహించుకోండి. మీ సిగరెట్లన్నీ బయట పారేసినట్లుగా చూడండి. ఇలా చేసినందుకు బంగారు మెడల్ పొందినట్టు ఊహించుకోండి. మీకు మీరుగా స్వంతంగా ఊహలను సృష్టించండి.

మిమ్మల్ని మీరు నమ్మండి

మిమ్మల్ని మీరు నమ్మండి

పొగతాగడం మానేయగలనని నమ్మండి. మీ జీవితంలో బాగా కష్టమైనవైనప్పటికి మీరు సాధించిన పనులను తలచుకోండి. మీలో పొగాతాగడ౦ మానేయడానికి సత్తా, సంకల్పం ఉందని తెల్సుకోండి. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది.

English summary

20 Tips for quitting smoking for men

To quit smoking is one of the biggest challenges to human willpower. Like any other addiction, the quitting smoking will cause actual physical and mental counter reactions to the body.
Desktop Bottom Promotion