For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేక్ ఫాస్ట్ గా వీటిని తినడం ఆరోగ్యకరం కాదు

|

ప్రతి రోజూ మనం ఉదయం అల్పాహారం తీసుకొనే అలవాటు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి రోజూ మనం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఆరోజుకు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిన విషయమే. డాక్టర్లు, డైటీషియన్లు ఉదయం తీసుకొనే అల్పాహారాన్ని ఎక్కువ మోతాదు తీసుకోమని సలహాలిస్తుంటారు. అదే రోజంతా మీకు కావల్సిన శక్తిని అందిస్తుంది. ఉదయం తీసుకొనే ఆహారంతోనే శరీరంలోనికి అవసరమయ్యే పోషకాలు, న్యూట్రీషియన్స్, ప్రోటీనలు అందుతాయని చెబుతుంటారు. కానీ మనలో చాలా మంది బిజీ బిజీ జీవనశైలితో ఉండటం వల్ల చాలా మంది ఏదో ఒకటి కడుపులోకి తోసేస్తే చాలు అనుకుంటారు. దాని ప్రకారమే చాలా వరకూ అనారోగ్యకరమైన ఆహారాలను వారికి తెలియకుండానే తీసుకుంటుంటారు. మన ద్యాసంతా ఉదయం టైం అయిపోతుంది. సమయం లేదని ఏది త్వరగా, సులభంగా తయారవుతుందో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. వాటిని తయారు చేసి, అనారోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తింటుంటాం.

ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ తోనే మన శారీరానికి అవసరం అయ్యే క్యాలరీలు అందుతాయి. రోజంతా జీవక్రియలు క్రమంగా, ఉత్సాహంగా పనిచేయాలంటే, తప్పనిసరిగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అందుకు మంచి ఆహారాన్ని కానీ లో క్యాలరీ ఆహారాలను తీసుకోవాలి. ఉదా: వేగించిన బంగాళదుంప మరియు బర్గర్ వంటివి అధికంగా క్యాలరీలను అంధిస్తాయి. కానీ వీటిలో అతి తక్కువ ఎనర్జీ మాత్రమే కలిగి ఉంటాయి. అందువల్లే ఇవి ఉదయం తీసుకొనే అల్పాహారం కాదని చెప్పవచ్చు.

అనారోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా మిమ్మల్ని నిరుత్సాహపరచడమే కాకుండా, శక్తిలేకుండా ఉన్నట్లు అనుభూతిని కలిగిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారాలు ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఎసిడిటికి దారితీస్తుంది. ఇక రెండవది, అనారోగ్యకరమైన ఆహారాలను అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల అధిక మొత్తంలో క్యాలరీలను శరీరంలోని పంపడం జరగుతుంది. ఇక మూడవది, ఉదయం అల్పాహారంలో ప్రిజర్వర్డ్ మరియు స్టేల్ ఆహారాలను తినడాన్ని మానేయాలి. ఇటువంటి ఆహారాల తినడం వల్ల శరీరంలో శక్తి లేకుండా చేయడమే కాకుండా శరీరంలో అదనపు కొవ్వు, వ్యర్థాలను అధికం చేస్తుంది.

అటువంటి అనారోగ్యకరమై బ్రేక్ ఫాస్ట్ ఎంపికలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వీటిని ఉదయం అల్పాహారంగా తీసుకోవడం ఖచ్చితంగా మానేయాలి.

పాన్ కేక్:

పాన్ కేక్:

పాన్ కేక్స్ ను హెల్తీగా తయారు చేయడం చాలా కష్టంఅయిన పని. ఇందులో అధనపు కొవ్వు చేరడానికి అవసరం అయ్యే ఫ్యాటింగ్ ఫ్లోర్ కలిగి ఉంటుంది. బట్టర్ మరియు పంచదార కూడా ఎక్కువే. ఇది చాలా తియ్యగా ఉంటుంది. అదే విధంగా అధిక క్యాలరీలను శరీరానికి అంధిస్తుంది. దాంతో అదనపు కొవ్వు శరీరంలో చేరుతుంది.

స్వీట్ సిరియల్స్:

స్వీట్ సిరియల్స్:

ఉదయం అల్పాహారంగా సెరియల్స్ ను అనారోగ్యకరమైనది, సెరియల్స్ ప్యాకెట్ మీద ఉన్న పదార్థాల్లోని కంటెంట్ లిస్ట్ ను ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని సెరియల్స్ రుచి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాటి పంచదార మరియు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మిక్స్ చేయబడి ఉంటుంది.

వైట్ బ్రెడ్:

వైట్ బ్రెడ్:

ఉదయం అల్పాహారంలో వైట్ బ్రెడ్ తినడం చాలా అనారోగ్యకరమైన పద్దతి. ఇందులో చాలా తక్కువ న్యూట్రీషియన్ వ్యాల్యూస్ కలిగి మరియు ఈస్ట్ తో నింపబడి ఉంటుంది. అది మీకు ఉబ్బరాన్ని కలిగిస్తుంది.

కాఫీ మరియు బిస్కెట్స్:

కాఫీ మరియు బిస్కెట్స్:

కాఫీ మిమ్మల్ని మేల్కొల్పడానికి ఉపయోగపడుతుంది మరియు తాజాగా ఉంచుతుంది. అయితే, ఒక కప్పు కాఫీ, బిస్కెట్స్ తో బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకుంటే మాత్రం చాలా కొద్ది అల్పాహారం అంతే కాదు చాలా తక్కువ న్యూట్రీషియన్స్ మాత్రమే అంధిస్తుంది.

వేగించిన బంగాళదుంపలు:

వేగించిన బంగాళదుంపలు:

చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రైడ్ పొటాటో వెడ్జ్ లతో మొదలవుతుంది. కానీ, ఇది ఖచ్చితంగా అనారోగ్యకరమైనది. కాబట్టి, వేగించిన బంగాళదుంపల స్థానంలో హాష్ బ్రౌన్స్తో ప్రయత్నించండి.

ఇన్ స్టాంట్ నూడిల్స్:

ఇన్ స్టాంట్ నూడిల్స్:

ఉదయం చాలా మందికి ఆకలి వేస్తుంది. అదే సమయంలో తర్వాత తయారు చేసుకొని తినాలనించి అల్పాహారాలను ఇన్స్ స్టాంట్ నూడిల్స్ ను ఎంపిక చేసుకొని తింటారు. ఇందులో క్యాలరీలు జీరు మరియు సోడియం అధికం. కాబట్టి ఈ అనారోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ చాయిస్ ను అవాయిడ్ చేయండి.

ఫ్రైడ్ చికెన్:

ఫ్రైడ్ చికెన్:

ముందు రోజు రాత్రి డీప్ ఫై చేసి చికెన్, మిగిలిన దాన్ని మరుసటి రోజు ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఇది ట్రాన్స్ ఫ్యాట్ మరియు చికెన్ నుండి ప్రోటీనులు కోల్పోయిన వాటిని తినాల్సి వస్తుంది.

పాలు మాత్రమే:

పాలు మాత్రమే:

పాలు అల్పాహారంగా తిసుకోవడం ఆరోగ్యకరమే అయినప్పటికి ఇది ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు సరిపోతుది. మరియు ఉదయం కాలీ కడుపుతో పాలు మాత్రమే అల్పాహారంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.

దోనట్స్:

దోనట్స్:

బిజీ ఉండే చాలా మంది వ్యక్తులు దోనట్స్ ను రిఫ్రిజరేటర్ లో స్టోర్ చేసుకొని, ఉదయం వేడి చేసి అల్పాహారంగా తీసుకుంటారు.దోనట్స్ బేసిగ్గా డిజర్ట్ వంటివి మరియు ఇవి అధిక శాతంలో షుగర్ ను అంధిస్తుంది. వీటి వల్ల ఉదయం మీకు ఎటువంటి ఎనర్జీ లభించదు. కాబట్టి ఉదయం అల్పాహారంలో వీటికి చెక్ పెట్టండి.

అన్నం:

అన్నం:

చాలా మంది ఉదయం అల్పాహారంగా అన్నం, అన్నంతో పాటు కర్రీ, దాల్స్ తింటుంటారు. అన్నంలో చాలా వరకూ పిండిపదర్ధాలు కలిగి ఉండటం వల్ల అవి మిమ్మల్ని బద్దకస్తులుగా మార్చుతుంది. దాంతో నిద్రకు కూడా కారణం అవుతుంది. ఇది బ్రేక్ ఫాస్ట్ గా చాలా హెవీ అవుతుంది. కాబట్టి సాధ్యం అయినంత వరకూ అన్నం బ్రేక్ ఫాస్ట్ లో చేర్చకుండా చూసుకోండి

చీజ్ బిట్స్:

చీజ్ బిట్స్:

పెద్ద డోలప్స్ క్రీమ్ మరయు చీజ్ అనారోగ్యకరమైన అల్పాహార ఎంపిక. చాల తక్కువ మొత్తంలో చీజ్ తినడం ఆరోగ్యమే అయినప్పటికీ ఉదయం దానికి డబుల్ డోస్ లో సాండ్ విచ్ తినడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఊబకాయానికి దారితీస్తుంది.

బట్టరీ స్కూన్స్:

బట్టరీ స్కూన్స్:

బట్టర్ సాంప్రదాయకరంగా తీసుకొనే బ్రేక్ ఫాస్టే అయినా ఇంది చేర్చే ప్రతి ఒక్కటీ అనారోగ్యకరమే. స్కోన్స్ అధికంగా పాలిష్ చేయబడిన ఈస్ట్, అధిక బట్టర్ వినియోగించబడి ఉంటుంది. కాలరీలు అధికంగా ఉండటం వల్ల ఇటువంటి ఆహారాలను రేర్ గా తీసుకోవడం ఉత్తమం.

ముందే తయారు చేసి పెట్టిన జ్యూస్:

ముందే తయారు చేసి పెట్టిన జ్యూస్:

జ్యూసులు ఇంట్లో తయారు చేసినవైన సరే తాజాగా ఉండాలి. ఒక నెల ముందే తయారు చేసి దాన్నే నెలంతా లేదా వారం మొత్తం తాగడం వల్ల అనారోగ్యకరం. దాంతో మీరు తాజా పోషకాలను పొందలేరు.

ఫ్రైడ్ ఎగ్స్:

ఫ్రైడ్ ఎగ్స్:

గుడ్డు సాధారణంగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గానే తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు నూనెతో వేయిస్తారు అది ఎక్కువ కొలెస్ట్రాల్ మార్పు చెందుతుంది. కాబట్టి ఉడికించిన గుడ్డును తీసుకోండం బెటర్.

బర్గర్:

బర్గర్:

బర్గర్లతో ఉదయం అల్పాహారంతో కడుపు నింపుకోవడం బాగానే ఉంటుంది, కానీ అందులో చాలా తక్కువ న్యూట్రీషియన్ వ్యాల్యూస్ ఉంటాయి. మరియ ఖచ్చితంగా ఇవి ఫ్యాట్ ఎక్కువగా కలిగి ఉండి ఊబకాయానికి కారణం అవుతుంది.

పాస్ట్రీస్:

పాస్ట్రీస్:

దోనట్స్ వంటిదే ఈ డిజర్ట్. ఇవి ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల అధిక మోతాదులో షుగర్స్ తో శరీరానికి చేర్చుతుంది. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది.

ఫ్రోజోన్ కోల్డ్ కట్స్:

ఫ్రోజోన్ కోల్డ్ కట్స్:

కోల్డ్ కట్స్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం చాలా సులభం. కానీ వీటిని ఖచ్చితంగా వేడి చేయాల్సి ఉంటుంది. అయితే కోల్డ్ కట్స్ నిల్వ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. తాజావాటికి మాత్రమే ప్రాధాన్యం కల్పించాలి.

వేడి చేసిన వ్రాప్స్:

వేడి చేసిన వ్రాప్స్:

ప్రస్తుత ట్రెండ్ లో వీటికి చాలా గిరాకీ. బిజీగా ఉండేవారు. చికెన్ వ్రాప్, లేదా వెజిటేబుల్ వ్రాప్స్ తో అల్పాహారాన్ని సరిపెట్టేస్తుంటారు. ఈ వేడి చేసే ఆహారాలో డీజనరేటెడ్ మాంసాహారం మరియు వెజిటేబుల్స్ ఉండి ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తాయి.

గ్రేవీ బీన్స్:

గ్రేవీ బీన్స్:

వేగించిన బీన్స్ ఆరోగ్యానికి చాలా హెల్తీ బ్రేక్ ఫాస్ట్. కానీ గ్రేవీ బీన్స్ ఉపయోగం లేదు. గ్రేవీ బీన్స్ లో అధికంగా ఉప్పు ఉంటుంది. మరియు కారంతో ఉండటం వల్ల కాలీకడుపుతో తినడం అంత మంచిది కాదు.

ఫ్రెంచ్ టోస్ట్:

ఫ్రెంచ్ టోస్ట్:

ఫ్రెంచ్ టోస్ట్ చాలా అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్. కానీ అనారోగ్యకరమైనది. దీన్నిడీప్ ఫ్రై చేయడం వల్ల అవనవసరమైన క్యాలరీలను నిండి ఉంటుంది. అలాగే సాధారణంగా ఫ్రెంచ్ టోస్ట్ ను వైట్ బ్రెడ్ తో తయారు చేసి ఉంటారు. అది ఈస్ట్ మరియు ఎమ్టీ క్యాలరీలతో నిండి ఉంటుంది.

English summary

20 Unhealthy Breakfast Choices To Avoid

We all know that breakfast is the most important meal of the day. That is why, it is always advisable to have a heavy breakfast and start your day. But most of us are very busy in the mornings. Thus we end up making very unhealthy breakfast choices.
Desktop Bottom Promotion