For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్...ఈ నియమాలు పాటిస్తేనే...!

|

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్...కొన్ని నియమాలు పాటిస్తే!జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రపంచం మొత్తం ప్రజలతో నిండివుంది. వారు ఆరోగ్యకరంగా నివసించడానికి తగి మార్గాలను తెలుసుకొంటే చాలు వారి జీవితం కాలం బ్యూటిఫుల్ గా ఉంటుంది. అందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అందుకు ఏం చేయాలి, వారికి స్పూర్తి ఏమిటి?

సాధారణంగా చాలా మంది పూర్తి ఆరోగ్యంగా వారి జీవితాన్నిసక్సెస్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. అటువంటి వారిని చూస్తే వారు ఎంత అదృష్టవంతులు అనుకుంటాం. మరి మీరు కూడా అలా జీవించాలి. దీర్ఘకాలం పాటు సంతోషంగా..ఆరోగ్యం ఉండాలనుకుంటున్నారా?అవును, అదృష్టవంతులు మనం భావిస్తున్నామే వారు తమ జీవితం యొక్క విలువలు తెలుసుకొని ఉంటారు కాబట్టి. మనకు ఉన్నది ఒకేఒక జీవితం దాన్ని వృధా చేసుకోవడం ఎందుకు అనుకుంటారు. ఆ విలువైన జీవితం గురించి తగినంత శ్రద్ద తీసుకుంటారు. జీవితంలో విలువైన వాటి గురించి అన్నింటి గురించి ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి కూడా ఎక్కువ కేర్ తీసుకుంటారు. అందుకు ఇతరుల కన్నా వారు డిఫరెంట్ గడపగలుగుతారు. వారి జీవితం చాలా సంతోషకరంగా..ఆరోగ్యకరంగా ఉంటుంది. వారు ఎక్కువ కాలం జీవించడానికి వారు వ్యక్తిగతం మంచి మార్గాలను కనుగొంటారు.

అయితే, ఎక్కువ కాలం..సంతోషంగా జీవించడానికి కొన్ని ప్రాథమిక మార్గాలున్నాయి. అవి మీ ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించినట్లైతే సులభంగా..ఆరోగ్యంగా ఎక్కువగా కాలం జీవించవచ్చు. మరి ఎక్కువ కాలం ఆరోగ్యంగా మరియు బెటర్ గా జీవించడానికి మీరు పాటించాల్సిన 20 ప్రాథమిక మార్గాలు:

దీర్ఘకాలం జీవించడానికి 20 ప్రాథమిక మార్గాలు:

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

నవ్వు: నవ్వడం అనేది మనిషికి దేవుడు ఇచ్చిన ఓ వరం. ఎంత నవ్వితే అంత మంచిది. నవ్వు సర్వ రోగనివారిణి. నవ్వు అనేది మన ముఖాన్ని కాంతివంతము మరియు యవ్వనంగా కనబడేలా చేస్తుంది. ఈవిధంగా నవ్వు ను జీవితంలో భాగంగా చేసుకోవటం ఆరోగ్యంగానికి మంచిదని శాస్త్రీయంగా నిరుపితమైనది. ఒత్తిడి, బాధలు, అన్ని మరిపింపచేసే గుణం నవ్వుకు మాత్రమే ఉంది. కాబట్టి ఎప్పుడూ నవ్వుతుండటం వల్ల సంతోషంగా ఎక్కువ కాలం జీవించగలరు.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

ముందు చూపు: అవును, ఇది కరెక్ట్. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎలా బ్రతకదలుచుకుంటున్నారో మీకే తెలుసు కాబట్టి మీరు సాద్యమైనంత వరకూ ముందు చూపుతో బ్రతకడం నేర్చుకోవాలి. జీవితం చాలా పెద్దది అందులో బాధలు కష్టాలు, మంచి..చెడులు ఉంటాయి. అయితే మీకోసం ఏదో ఒకటి ఉండనే ఉంటుంది అన్న విషయం మర్చిపోకూడదు. మీ ప్రయత్నమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

ఎక్స్ ప్రెస్: నిజంతో జీవించండి. మీ ప్రేమను ఇతరుకు తెలియచేయండి. మీ ప్రేమను ఇతరులకు పంచండి. మీ కళలను నెరవేర్చుకోవడానికి అడుగుముందుకు వేసి మాట్లాడండి. డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం, మ్యూజిక్ వినడం అన్నీ మీ జీవితంలో ఒక భాగమే. ఇవి మీరు ఫాలో అయితే మీ సంతోషం మీ జీవితకాలం పాటు మీ వెంటే ఉంటుంది. మరియు మీ ఆయుష్యును పెంచుతుంది.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

ఫీలింగ్స్: మీ చుట్టూ చూడండి, ప్రపంచంలోని అందాలు, మరియు మంచి చెడులు ఎన్నో ఉన్నాయి. వాటిని గమనించండి. వాటిని చూసి అనుభూతి పొందండి. ఇతరుల యొక్క సమస్యలను మీరు అనుభూతి చెందగలిగితే మీరు బెటర్ గా ఫీల్ అవుతారు. కష్టాన్ని ఎంజాయ్ చేయండి మరియు ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి. బయట ప్రపంచలోని వింతలు చూడండి.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

ఫ్రెండ్స్ : మంచివారితో స్నేహం చేయడమే కాదు వారికి కంపెనీ ఇవ్వండి, వారికి సహాయం చేయండి, వారిని ప్రేమించండి, అప్పుడే మీరూ సంతోషంగా ఉండగలుగుతారు. మీకు మంచి స్నేహితులున్నట్లైతే వారితో ఎక్కువగా కాలం జీవించడానికి ప్రయత్నించండి.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

వ్యాయామం : మీరు ప్రతి రోజు ఉదయాన్నే మేల్కొని జిమ్ క్లాస్ కు వెళ్లి కండరాల వ్యాయామం చేసి వార్మ్ అప్ అయితే అది మిమ్మల్ని మరింత సౌకర్యవంతముగాను,సరళమైన చురుకైన జీవితాన్ని మనకు అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వ్యాయామం చేయటం జీవితంలో భాగం కావాలి. ప్రతి రోజు వ్యాయామం చేయండి. మీకు మంచి అనుభూతిని,మీరు మెరుగ్గా కనపడటానికి దోహదం చేస్తుంది.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

ఆహారం: ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు తినండి. ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు ముఖ్యమైన భాగంగా చేసుకోండి. ప్రతి రోజు 5 నుండి 9 సార్లు తీసుకోవటానికి ప్రయత్నించండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో హార్ట్, క్యాన్సర్, బీపి వంటి అనేక రోగాల బారిన పడకుండా మనల్ని మానం కాపాడుకోవచ్చు.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

ప్రతి క్షణం సంతోషంగా గడపండి: గతం గురించి అన్ని మర్చిపోయి...ప్రస్తుతం మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. ప్రజెంట్ ను ఎంజాయ్ చేయండి. మనసులో నుండి అసాద్యం అనే విషయాన్ని తుడిచేయండి. అన్నింటిని పాజిటివ్ గా తీసుకోవడం ఆరోగ్యానికే అందానికి మేలు చేస్తుంది. కష్టాలకు క్రుంగ కూడదు.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

మీఅంతకు మీరు మంచిగా ఉండండి: మీమ్మల్ని మీరు గౌరవించుకోండి. మిమ్మల్ని మీరు ఆరాధించుకోండి మరియు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకుమీరు గౌరవం కల్పించుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ మీ చుట్టూ ఉంటారు.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

ఆశావాదంతో ఉండాలి: మీ జీవితంలో ఎప్పటికి జరగనివి చూడండి. మీరు మీజీవితం అతి కష్టం మీద నడుస్తున్నా కూడా..సానుకూలంగా (పాజిటివ్ గా)ఉండడానికి ప్రయత్నించండి. మీరు పాజిటివ్ గా ఉన్నట్లైతే మీరు ఏ విషయంలోనైనా పోరాడగలరు. అదే మీ మంచి జీవితానికి ఉత్తమ మార్గాన్ని చూపెడుతుంది.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

లైంగిక జీవితం: మీరు మీ లైంగిక జీవితంలో క్రియాశీలంగా ఉండాలి. వారంలో రెండు మూడు సార్లు సెక్స్ లైఫ్ కలిగి ఉంటే, అది మీ ఆరోగ్యానికి అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఒత్తిడులనుండి ఉపశమనం కలిగిస్తుంది. మరియు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండటానికి, నిద్రబాగా పట్టడానికి దారితీస్తుంది.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

ధూమపానం మానేయాలి: ధూమపానం వల్ల అనేక విపత్తులు ప్రభావాలు ఉన్నాయి. పొగత్రాగడాన్ని సాధ్యమైనంత వరకూ మానుకోవాలి. ఎక్కవగా ధూమపానం చేసే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు లాంటివి అనేకం అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

బుక్స్ చదవండి: బుక్ రీడింగ్ అనేది చాలా మంచి పద్దతి మిమ్మల్ని ఎప్పుడూ పాజిటివ్ గా ఉండేలా చేస్తుంది మరియు సంతోషంగా ఉంచుతుంది. ఇది మిమ్మల్ని ప్రేరేపితులను చేస్తుంది మరియు ప్రతి కూలా ఆలోచనలు నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

దేవునిపై నమ్మకం ఉంచండి: దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. ఇలా ఉండటం వల్ల భావోద్వేగ సమస్యలతో పోరాడుతున్న ప్రజలకు ఇది సహాయపడుతుంది మరియు వాటిని నుండి మిమ్మల్ని సంరక్షితులను చేస్తుంది.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

పెంపుడు జంతువులు: ఎవరైతే ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటారో వారు ఇతరు కంటే యాక్టివ్ గా ఉంటారు. జంతువులు మన ఒత్తిడి తగ్గిస్తాయి. మీ నుండి చాలా నెగటివ్ ఆలోచనలు దూరం చేస్తాయి. మరియు ఎల్లప్పుడూ మంచి ఫ్రెండ్స్ గా మీతో జీవిస్తాయి. కాబట్టి మీరు మంచి ఫ్రెండ్స్ ను కోరుకొనేటప్పుడు ఇలా జంతువులకు కూడా స్థానం కల్పించండి.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి: ప్రశాంతంగా గడపడానికి చాలా చాలా మార్గాలున్నాయి. అందులో యోగా, మెడిటేషన్ మొ.. వంటివి మీరు ప్రయత్నించవచ్చు. ఇవి మీలో ఒత్తిడికి అనుసంధానం అయిన డిప్రెషన్ మరియు యాక్సైటీ మరియు ఒంటరితనాన్ని తగ్గిస్తుంది .

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

వైన్ : ప్రతి రోజూ ఒక గ్లాస్ వైన్ త్రాగండి. ఇందులో కొన్ని ఆరోగ్యపు ప్రయోజనాలున్నాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నుండి మిమ్మల్ని కాపాడుతాయి. మీ రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. మరియు ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

రెగ్యులర్ చెకప్: ఆరు నెలలకొకసారి డాక్టర్ ను సందర్శించడం తప్పనిసరిగా చేయండి. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఒక ఉత్తమమైన మార్గం మరియు మెడికల్ కండిషన్స్ ను నివారించడానికి కూడా ఒక ఉత్తమమైన మార్గం.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

నిద్ర : మన శరీరానికి మంచి నిద్ర అవసరం. ప్రతి రోజు 8 నుండి10 గంటల వరకు నిద్ర లభిస్తే మన శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. కాబట్టి నిద్రను దూరం చేసే కెఫిన్ మరియు చక్కెర ఉన్న శక్తి పానీయాలను తాగకూడదు.

ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!

చాక్లెట్ తినండి: చాక్లెట్ లో ఆరోగ్యానికి గొప్ప మేలు చేసే ఫ్లెవనాయిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చాక్లెట్స్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ కార్డియో వ్యాస్కులర్ ప్రాబ్లెమ్స్(గుండె సంబంధిత సమస్యలను) ను తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో డ్యామేజ్ అయిని సెల్స్ మరియు టిష్యులను నివారిస్తాయి.

English summary

20 Ways To Live A Longer Life | ఈ రూల్స్ తప్పక పాటిస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.!


 Life is beautiful though conditions do apply on it. World is full with people who enjoy their life to the fullest and make us all envy them. They know way to live longer because they want to live a healthy life. What do they do, what is their inspiration, what drives them to live life in an easy manner?
Story first published: Wednesday, May 29, 2013, 18:06 [IST]
Desktop Bottom Promotion