For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

|

వేసవికాలం మొదలైంది. ఎండలు వేడి నుండి రక్షణ పొందడానికి సమ్మర్ స్పెషల్ కాస్టూమ్స్ మరియు కాస్మోటిక్స్ తో మీరు రెడీగా ఉండవచ్చు. అదే విధంగా కొంత మంది సమ్మర్ సీజన్ కు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ కూడా మార్చుకొంటారు. ఎండ వేడిమి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి, మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రయోగాలు చేసుకుంటాం. అదేవిధంగా మీ రెగ్యులర్ డైట్ లో కూడా మార్పులు చేసుకోవాలని మీకు తెలుసా..?

సమ్మర్ సీజన్ లో మన శరీరం వేసవి తాపానికి తట్టుకొనే విధంగా ఆహారాన్ని తీసుకొన్నట్లైతే మనకు కావల్సినంత శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. వేసవికాలంలో లభ్యం అయ్యే పండ్లు సీజనల్ ఫ్రూట్స్ అంటే ఒక్క వేసవిలో మాత్రమే దొరికే ఈ పండ్లు ఆరోగ్యానికి కూడా మంచిది. అలాంటి కొన్ని రకాల పండ్లు..ఈ సీజన్ లో మీకు అందుబాటులో ఉండే పండ్లులో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ తో పాటు ..ఈ వేసవి తాపానికి మన శరీరాన్ని చల్లగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ వేసవి కాలంలో మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి ఈ 25 రకాల సమ్మర్ ఫ్రూట్స్ మీద ఒక లుక్కేయండి. ఈ పండ్లను తినడం వల్ల మన శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది ఇంకా వేసవిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

పుచ్చకాయ: ఇంగ్లీషులో వాటర్ మెలోన్ అంటారు. వాటర్ మెలోన్ పేరులోనే ఉంది వాటర్, ఇందులో అధికంగా నీరు అంశం కలిగి ఉంటుంది. వేసవిలో ఈ పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని హైడ్రేషన్ లో(తేమగా) ఉంచుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. సన్ డ్యామేజ్ నుండి కాపాడే లైకోపిన్ అనే మూలకం పుష్కలంగా ఉంటుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

ఆరెంజ్: ఈ సిట్రస్ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. చెమట ద్వారా కోల్పోయిన పొటాషియంను ఆరెంజ్ ను తినడం వల్ల ఫుల్ ఫిల్ చేస్తుంది. వేసవిలో వీటిని తినడం వల్ల నరాలు పట్టేయడానికి నివారిస్తుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

ద్రాక్ష: ఆకలిని మరియు దప్పికను అరికట్టడంలో ద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాదు రక్తాన్ని శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ను , గుండె సంబంధిత సమస్యలను, జీర్ణకోస సమస్యలను నివారిస్తుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

పైనాపిల్: పైనాపిల్ ల్లో ఎంజైమ్స్ (బ్రొమోలియన్)పుష్కలంగా ఉండి, జీర్ణక్రియకు ఉపయోగపడే ప్రోటీనులు మరియు ఫ్యాట్స్ ను అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది . ఇంకా ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

మామిడి: సమ్మర్ హెల్తీ ఫ్రూట్ మామిడిపండు. ఇండియాలో మామిడి పండును పండ్ల రారాజుగా పిలుచుకుంటారు. మామిడిలో ఐరన్ మరియు సెలీనియమ్ పుష్కలంగా ఉంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

స్ట్రాబెర్రీ: బెర్రీస్ లో ఏవి తిన్నా మరీ ముఖ్యంగా స్ట్రాబెర్రీ తినడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను అతి సులభంగా నివారిస్తుంది. ఈ సమస్య సమ్మర్ లో చాలా మందిని బాధిస్తుంటుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

నిమ్మ: నిమ్మ మరో సిట్రస్ ఫ్రూట్ . ఈ సమ్మర్ లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. పేద..ధనిక అందిరళ్ళల్లో ఉండి దాహర్తిని తీరుస్తుంది . నిమ్మకాయ జ్యూస్ ను పంచదార లేదా ఉప్పు వేసి తయారు చేసి త్రాగవచ్చు. ఇది దాహాన్ని తీర్చి, మనశరీరానికి కావల్సినంత విటమిన్ సి అందిస్తుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

ఆప్రికాట్: ఆప్రికాట్ వసంతకాలం చివరిలో..వేసవికాలం మొదటలో అందుబాటులో ఉంటాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, ఐరన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

చెర్రీస్: బ్రట్ కలర్ లో ఉండే రెడ్ చెర్రీస్ రుచి అద్భుతం. అంతే కాదు న్యూట్రీషియన్స్ , ఎంజైమ్స్ మరిు విటమిన్స్ ఉండే ఫర్ ఫెక్ట్ సమ్మర్ ఫ్రూట్.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

అరటి పండు: అరటి పండు అధిక న్యూట్రీషియన్ ఫుడ్ అంతే కాదు ఇందులో పొటాషియం కూడా అధికం. ఇందులో ఉండే ఐరన్ మిమ్మల్ని చరుకుగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

పీచెస్: బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండే పండు పీచెస్ మరియు విటమిన్ సి పుష్కలం. ఈ సమ్మర్ ఫ్రూట్ తో స్కిన్ బెనిఫిట్స్ అధికం.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

ఉసిరికాయ: ఉసిరికాయను తినడకుండా నిరాకరించకండి . ఎందుకంటే విటమిన్ సి ,క్యాల్షియం, పొటిషియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

బ్లాక్ బెర్రీస్: ఈ హెల్తీ సమ్మర్ ఫ్రూట్స్ లో ఫోలిఫినాల్ యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉండి ఫీరాడికల్స్ తో పోరాడే గుణం కలిగి ఉంటుంది . వేసవికాలంలో ఇవి అతి సులభంగా అందుబాటులో ఉంటాయి.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

బొప్పాయి: ఈ బొప్పాయి తినడానికి రుచిగా ఉండటమే కాదు ఇందులో పుష్కలంగా ఎంజైమ్స్ మరియు పప్పైన్ మరియు చైమో పపైన్ అనేవి జీర్ణశక్తి యొక్క ప్రోటీనులకు సహాయపడుతుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

కర్బూజ: కర్బూజ మరో వండర్ ఫుల్ ప్రూట్. వేసవిలో సీజన్ లో ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి కలిగి పుష్కలమైన విటమిన్స్ శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

హానీడ్యూ మెలోన్: వేసవిలో తప్పకుండా తినేటటువంటి వాటిలో ఇదొక అద్భుతమైన పండు, ఇది అన్ని మెలోన్స్ లో కంటే అధిక రుచి కలిగి ఉండటంమే కాదు ప్రోవిటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం మరియు జింక్ పుష్కలం.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

జామకాయ: జామకాలో సోడియం ఫ్రీ ఫ్రూట్ మరియు లోఫ్యాట్ మరియు లో క్యాలరీస్ కలిగి ఉంటుంది. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్ సి దగ్గు. జలుబు, డయోరియా, డైసెంట్రీ, మొదలగు వ్యాధులను నివారించే శక్తి జామకాయలో పుష్కలంగా ఉన్నాయి .

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

కొబ్బరి బొండాం: వేసవిలో విరివిగా దొరుకుతుంది. ఇది వేసవి తాపంతో పాటు ఆకలిని హరించి వేస్తుంది. ఇందులో పుష్కలమైన మినిరల్స్, విటమిన్స్ మరియు ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కొబ్బరి బోండాం త్రాగడం వల్ల మీ శరీరం హైడ్రేషన్ లో ఉంచడంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

ఓజెన్స్ : దీన్ని ఎల్లో ఆరెంజ్ . ఇది ఆరోగ్యం మరియు టేస్టీ. ఈ ఓజెన్ ఫ్రూట్ హనీ ఫ్లేవర్ పుష్కలంగా ఉంటుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

ఫిగ్: ఫిగ్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ ఫ్రూట్ మీ ఆరోగ్యానికి బూస్ట్ వంటింది .

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

క్యానరీ మెలోన్: ఈ బ్రైట్ కలర్ క్యానరీ మెలోన్స్ ఇవి శరీరాన్ని తాజాగా ఉండటమే కాదు పొటాషియంను, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండటమే కాదు లోక్యాలరీస్ కలిగి ఉంటుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

లిచీ: సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ లో ప్రోటీన్, విటమిన్స్, ఫ్యాట్, సిట్రిక్ యాసిడ్స్, పెక్టిన్, ఫాస్ఫరస్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్రూట్ జ్యూసీగా ఉంటుంది.మరియు తియ్యగా ఉంటుంది. ఇంకా మంచి టేస్ట్ ను కలిగి ఉంటుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

ప్లమ్స్ : ప్లమ్స్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అతి సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఇంకా ఇందులో విటమిన్ సి ఫుష్కలంగా ఉండి వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. సమ్మర్ లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నిరారిస్తుంది.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

కివి: కివి పండ్లు ఇతర పండ్లలో కంటే మరింత తియ్యగా ఉంటుంది . అంతే కాదు ఇందులో విటమన్ సి కూడా పుష్కలంగా ఉంటి, ఆరెంజ్ లో కంటే యాంటీఆక్సిడెంట్స్ రెండింతలు ఉంటాయి.

ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

నెక్టేరినెస్: పీచెస్ లా ఉండే ఈ సమ్మర్ ఫ్రూట్ యాంటీఆక్సిడెంట్స్ యూవీకిరణాల వల్ల డ్యామేజ్ అయ్యే చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

English summary

25 Summer-Friendly Fruits To Eat | ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

It's the sunny summer season again. You are ready with your new summer costumes and cosmetics. Probably you might have done the home interiors also. But do you know that you have to make a change in your diet too?
Desktop Bottom Promotion