For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్త్ తో పాటు బాడీబిల్డ్ ని ప్రోత్సహించే 30 బెస్ట్ ఫుడ్స్

|

ప్రస్తుత రోజుల్లో యవ్వనంగా ఉండే వారు, మరిన్ని వర్క్ అవుట్స్(వ్యాయామాలు)చేసి, ఫర్ ఫెక్ట్ బాడీ షేప్ ను కలిగి ఉండాలని కోరుకుంటున్నారు! బాడీ బిల్డింగ్ వ్యాయామాల ద్వారా శరీరంలోని కండరాలు బలపడుతాయి. బాడీ బిల్డింగ్ వర్క్ అవుట్స్ చేసేవారు, వ్యాయామాల తర్వాత ఖచ్చితంగా తీసుకోవల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఈ ఆహారాలను వారి వ్యాయామ కోర్సు మొత్తం తీసుకోవడం వల్ల బాడీ బిల్డ్ చేసుకోవడంతో పాటు, ఆరోగ్యంగా ఉండవచ్చు.

బాడీబిల్డ్ వ్యాయామాలు చేసే వారికోసం కొన్ని ప్రత్యేక ఆహారాలు క్రింది విధంగా లిస్ట్ ను తయారుచేశాం. వాటిని పరిశీలించి, మీరు రెగ్యులర్ గా తినాల్సిన ఆహారాల మీద అవగాహన చేసుకోండి . పోస్ట్ వర్క్ అవుట్స్ తర్వాత తీసుకొనే ఈ ఆహారాల్లో ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండి, మీకు అవసరం అయ్యే ఎనర్జీని అంధిస్తాయి. అయితే బాడీ బిల్డర్స్ తీసుకొనే ప్రతిదీ శరీర ఆరోగ్యానికి మంచిది కాదు, కొన్ని ఆహారాలను తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

బాడీ బిల్డ్ వ్యాయామాలు చేసే వారు హెల్తీ డైట్ తీసుకోకపోతే, వారు ఎర్ బ్రోన్ డిసీజెస్ కు కారణం అవుతుంది. దాంతో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. బాడీ బిల్డ్ చేసే విషయంలో మీరు ఒక మంచి శరీరాకృతి పొందడమే మీ లక్ష్యం మరియు మీ ద్రుష్టి మొత్తం వర్క్ అవుట్స్ మీద మాత్రమే ఉంటే అవి ఏ మాత్రం సరిపోవు. బాడీబిల్డర్స్ కు హెల్తీ డైట్ చాలా అవసరం. బాడీ బిల్డ్ చేయడానికి వ్యాయామాలు ఎంత అవసరమో, అంతకంటే ఎక్కువ వారు తీసుకొనే డైట్ మీద వారి ఆరోగ్యం, శరీరాకృతి మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ప్రతి బాడీ బిల్డర్ ఖచ్చితంగా తీసుకోవల్సిన కొన్ని ఆహారాల పట్టికను క్రింది విధంగా ఇచ్చాము. వాటిని పరిశీలించి మంచి ఆరోగ్యంతో పాటు, మంచి శరీరాకృతి పొందవచ్చు...

బాడీ బిల్డ్ చేయడానికి 30 బెస్ట్ ఫుడ్స్:

ఓట్స్ :

ఓట్స్ :

ప్రతి రోజూ ఓట్స్ తినడం చాలా ఆరోగ్యకరం. ముఖ్యంగా ఓట్స్ తో మీ దినచర్యను మొదలు పెడితే మరింత మంచిది. రోజూ ఒక కప్పు ఓట్స్ తినడం వల్ల శరీరంలో ఉత్ప్రేరకమైన ప్రక్రియను పెంచుతుంది . దాంతో జీవక్రియలక ఉపయోగపడే శక్తిని విడుదల చేయడానికి మరియు కొవ్వు నిల్వలను తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు బాడీబిల్డ్ కోరుకుంటున్నట్లైతే, మీరు తినే ఆహారంలో ఇది ఒక ఉత్తమ ఆహారం.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.

చీజ్:

చీజ్:

చాలా మంది ఈ చీజ్ ను తినడానికి ఇష్టపడరు. అయితే ఇందులో మజిల్ బిల్డ్ చేసే గుణాలు అద్భుతంగా ఉన్నాయి. జస్ట్ ఒక కప్పు కాటేజ్ చీజ్ లో 28గ్రాముల ప్రోటీనులు కలిగి ఉన్నాయి.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

గ్రీన్ వెజిటేబుల్స్ అన్నింటిలోకి, బ్రొకోలీలో బెస్ట్ న్యూట్రిషియన్స్ కలిగి ఉంటాయి. ఈ ఆహారం బాడీబిల్డర్స్ చాలా మంచిది. మరియు ఇది పుష్కలమైన విటమిన్ సి మూలకాన్ని శరీరానికి అంధిస్తుంది. దాంతో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పీనట్ బటర్:

పీనట్ బటర్:

ఇది ఒక ప్రోటీన్, ఇందులో అవసరమైన విటమిన్లు, మెగ్నీషియం, ఫైబర్, ఫోలేట్ మరియు అర్జినైన్ పుష్కలంగా ఉంటుంది. పీనట్ బటర్ కాయధాన్యాల కుటుంబానికి చెందినది కాబట్టి గింజల గుణాలు కలిగి వుంటుంది - చక్కటి చిరుతిండి కూడా. రెండు టీ స్పూన్ల పీనట్ బట్టర్ తరువాతి భోజన౦ దాకా మీ ఆకలిని ఆపుతుంది. దీన్ని పళ్ళు, కరకరలాడేవి, లేదా మెత్తగా వుండే వాటితో ఉపయోగించి కావలసినంత బరువు తగ్గవచ్చు. మరియు హృదయ ఆరోగ్య ప్రోత్సహిస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

క్రాబ్స్(పీతలు):

క్రాబ్స్(పీతలు):

(కింగ్ క్రాబ్ మీట్) సీఫుడ్ అంటే ఇష్టపడే వారందరికి, ఇది ఒక అద్భుతమైన బోన్ హెల్త్ ఆహారం. కండర పుష్టికి మరియు శరీరం యొక్క రోగనిరోధక శక్తి పెంపొంధించడానికి అవసరమైనటువంటి జింక్ మరియు కావల్సినన్ని యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

ఓయిస్ట్రెస్:

ఓయిస్ట్రెస్:

సముద్రంలో చేపల తర్వాత స్థానం ఓయిస్ట్రస్. వీటిలో జింక్ మరియు కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే వీటిని స్త్రీలు మరియు పురుషులు తీసుకోవడం చాలా అవసరం. పురుషుల సంతానోత్పతి, లైంగిక ఆరోగ్యానికి అవసరమైన జింక్ అత్యధికంగా కలిగి ఉన్నటు వంటి సహజ వనరు. జింక్ మగవారిలో ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిని నిర్వహించడమే కాకుండా ఆరోగ్యరమైన స్పెర్మ్(వీర్యం)వృద్ది చెందడానికి సహాయపడుతుంది. పురుషుల్లో జింక్ లోపించడం వల్ల అత్యధికంగా హెయిర్ ఫాల్ సంభవిస్తుంటుంది. కాబట్టి శరీరానికి ఎక్కువ మోతాదులో జింక్ ను అందించే ఓయిస్ట్రెస్. కాబట్టి పురుషు ఆరోగ్యాని, అందానికి అత్యంత ప్రయోజకారినిగా పనిచేస్తుంది ఓయిస్ట్రెస్.

అరటిపండు:

అరటిపండు:

పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు: మీ తీసుకొనే డైయట్ ఫుడ్ లో తప్పని సరిగా అరటిపండు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం అధిక శాతంలో ఉండి అత్యధికంగా శరీరానికి కావలసినన్ని మినిరల్స్ ను అంధిస్తుంది. ఇంకా చేసే పనిలో ఏకాగ్రత పెంచడానికి దృష్టి సారించడానికి కావల్సిన డొపమైన్ అనే రసాయనాలను ఇది విడుదల చేస్తుంది. నరాలను ఆరోగ్యంగా ఉంచే సెరోటినీన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులో ఉండే పుష్కలమైన పొటాషియం మరియు క్యాల్షియం బోన్ హెల్త్ కు చాలా సహాయపడుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఉన్నటువంటి పోషకాలు, న్యూట్రీషియలన్లు, మనిషికి కావల్సిన శక్తి సామర్థ్యాలను రెట్టింపుచేస్తుంది. ఇంకా ఆర్ బిసి కౌంట్ ను పెంచుతుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇంకా జీర్ణం నిధానంగా అయ్యి, ఆకలి పెంచదు. దాంతో రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ నిర్ధిష్టంగా ఉంచుతుంది.

రెడ్ చిల్లీ:

రెడ్ చిల్లీ:

ఇన్ఫ్లమేషన్ ను నివారించడంలో ఒక నేచురల్ రెడీ ఈ చిల్లీస్. చిల్లీస్ లో ఉండే క్యాప్ససిన్ అనే అంశం ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. జీవక్రియలను సక్రమంగా పనిచేయడానికి మరియు వేగంగా బరువు తగ్గడానికి అవసరం అయ్యే బీటా కెరోటిన్ ఇందులో పుష్కలంగా ఉంది.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్ లో ఫవర్ ఫుల్ న్యూట్రీషియన్ పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఇవి వ్యాధులను ధరిచేరనివ్వకుండా చేయడానికి మరియు వాంఛనీయ సెల్యూలార్ స్థితిస్థాపకత నిర్వహించడానికి సహాయపడుతాయి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ యొక్క గొప్పదనం, పేగు బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. వ్యాధినిరోధకతను ప్రోత్సహిస్తుంది. జీవక్రియలకు క్రమబద్దం చేస్తుంది. కొవ్వు కరిగిస్తుంది. ఎనర్జీని ఇస్తుంది.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

శరీరానికి అవసరమయ్యే న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ రుచికరమైన, శక్తినందించే స్వీట్ పొటాటోను మీ డైలీ డయట్ లో చేర్చుకోండి. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. దాంతో పాటు ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా అనిపిస్తుంది.

టమోటో:

టమోటో:

టమోటోను పండ్లులో ఒకటిగా అభివర్ణిస్తుంటారు. ఈ ఎర్రగా ఉండే టమోటోలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది కాబట్టి బాడీబిల్డర్స్ కు ఇది చాలా అవసరం. టమోటోలోని అత్యధికంగా లైకోపిన్ కంటెంట్ కలిగి ఉండటం వల్ల ఇది మస్కులర్ డీజనరేషన్ ను తగ్గిస్తుంది. కొవ్వు కరిగించే గుణగణాలు పుష్కలంగా ఉంటాయి.

ఫిగ్:

ఫిగ్:

ఫిగ్(అత్తి పండ్లు) ఒక కఠినమైన లేదా కండరాలు గట్టిగా ఉండే చేసే ఆహారాల్లో ఒకటి ఈ అత్తిపండు. కండర పుష్టికి మరియు శరీరం యొక్క క్షార సంతులనం కొనసాగించడానికి అవసరమయ్యే ఖనిజాలు ఇందులో పుష్కలంగా కలిగి ఉన్నాయి.

మష్రుమ్స్:

మష్రుమ్స్:

పుట్టగొడుగులను కండరము పుష్టికోసం ప్రోత్సహించే రుచికరమైన మరియు పుష్టికరమైన కూరగాయలతో సమానం. బాడీ బిల్డర్స్ కు ఆరోగ్యకరం. మష్రుమ్ లో బాడీబిల్డ్ చేయడానికి అవసరం అయ్యే పోషకాంశాలు పుష్కలంగా ఉంటాయి.

Quinoa బియ్యం

Quinoa బియ్యం

Quinoa బియ్యం మరియు పిండి మిశ్రమాలకు ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయం. ఇందులో పుష్కలమైన అమైనో యాసిడ్స్ ఉండి, ఇది కండర నిర్మాణం కోసం పరిపూర్ణ ఆహారం ఉంది.

మటన్:

మటన్:

రెడ్ మీట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ మీట్ ను తినడం ద్వారా బాడీని బిల్డ్ చేయవచ్చు. మటన్ లేదా బీఫ్ లో అమినో ఆసిడ్స్ అధికంగా ఉండటం వల్ల మట్టన్ లేదా బీఫ్ తరుచూ తీసుకొంటే మజిల్స్ త్వరగా ఏర్పడుతాయి. మటన్ లో కూడా అర్జినైన్ అనే విటమిన్ మజిల్స్ పెరగడానికి బాగా తోడ్పడుతుంది.

టోఫు:

టోఫు:

సోయాబీన్ తో తయారు చేస్తారు, టోఫులో పుష్కలమైన అమైనో ఆమ్లాలు మరియు ఐసోఫ్లవోన్లు ఉండి ఇవి వర్క్ ఔట్స్ తర్వాత తిరిగి పూర్వస్థితికి చేరుకోవడానికి బాగా సహాయపడుతాయి.

కాయధాన్యాలు:

కాయధాన్యాలు:

మీరు కండర నిర్మాణాన్ని పెంచుకోదలచుకుంటే కాయధాన్యాలను తీసుకుంటుండాలి. కాయధాన్యాలలో మినిరల్స్, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ కు బాగా సహాయపడుతుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ గుండెకు, కండరాలకు ఆక్సిజన్ చేరవేడయడంలో సహాయకారిగా ఉండి శరీరానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది. ఇందులో కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడే అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి.

పెరుగు:

పెరుగు:

కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వుండే పెరుగు తినడం కూడా ఆకలిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గమే. పెరుగులో ఇతర పోషక విలువలు కూడా వుంటాయి. ఇందులో పుష్కలంగా కాల్షియం, మాంసకృత్తులు, పొటాషియం వుంటాయి. ఇవి మంచి సూక్ష్మ క్రిములను ఉత్పత్తి చేసి జీర్ణ సంబంధమైన సమస్యలను ఎదుర్కొంతటాయి. మీరు బెర్రీలు, గ్రనోలా లాంటి వాటితో కూడా మీగడ వాడవచ్చు.

సాల్మన్:

సాల్మన్:

ఫిష్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి.

పైనాపిల్:

పైనాపిల్:

పైనాపిల్ జీర్ణవ్యవస్థకు సహాయపడే మంచి ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. దీన్ని వ్యాయామం తర్వాత తీసుకోవడం చాలా మంచిది. పైనాపిల్లో ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉండేందుకు సహాయపడే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

మీరు వంటలకు వెజిటేబుల్ ఆయిల్ ఉపయోగిస్తున్నట్లే, మీకు ఒక మంచి సలహా మీరు ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం ఒక ఉత్తమ మార్గం. ఎందుకంటే ఆలివ్ ఆయిల్లో బాడీబిల్డ్ ప్రోత్సహించే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ మరియు మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా కలిగి ఉంటాయి.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

చాక్లెట్ ఆరోగ్యానికి లాభదాయకం కాదని ఎవరు చెప్పారు?డార్క్ చాక్లెట్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక ఫ్లెవనాయిడ్ కంటెంట్స్ బ్లడ్ సర్కులేషన్ కు బాగా సహాయపడుతాయి. మరియు జీవక్రియలను మెరుగుపరుస్తుంది.

ప్లాక్సీడ్స్:

ప్లాక్సీడ్స్:

ఈ విత్తనాల్లో ప్రోటీనులు మరియు డైటరీ ఫైబర్ ఫుష్కలంగా ఉంది. బాడీబిల్డర్స్ వీటిని తీసుకోవడం వల్ల కార్డియోవ్యాస్కులర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతాయి మరియు అధికంగా జీవక్రియలను రేటు పెంచుతుంది.

బాదాం:

బాదాం:

బాదాంలో అధిక ప్రోటీనులు మరియు ఫ్యాట్ కలిగి ఉంటుంది. అంతే కాదు ఇందులో విటమిన్ ఇ ఉండి, మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పవర్ ఫుల్ యాంటీయాక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోడుతుంది. మీరు వర్క్ అవుట్ చేసిన వెంటనే మిమ్మిల్నీ తేరుకొనేలా చేస్తుంది.

రికొటా:

రికొటా:

ఇది పనీర్ కు ప్రత్యామ్నాయ ఆహారం. రికోటా, ఇటాలియన్ చీజ్. దీన్ని గొర్రెపాలతో తయారు చేస్తారు. రికొటా చీజ్ ను తీసుకోవడం వల్ల బాడీ బిల్డ్ కు బాగా సహాయపడుతాయి. మరియు బాడీబిల్డర్స్ లో ఎముకల పెరుగుదలకు, కండర నిర్మాణంకు బాగా సహాయపడుతుంది.

బీట్ రూట్:

బీట్ రూట్:

బీట్ రూట్ లో నైట్రేట్స్ ను కనుగొనబడింది. ఇవి బాడీబిల్డర్స్ యొక్క పనితనాన్ని మెరుగుపరచటానికి సహాయపడుతుంది. బీట్ రూట్ ను ఉడికించి తీసుకోవడం వల్ల ఇది ఒక ఆరోగ్యకరమైన స్నీక్ గా మంచిది.

బోక్ చోయ్:

బోక్ చోయ్:

బాడీబిల్టింగ్ కు మేలు చేసే ఈ ఆహారం గురించి మీరు విన్నారా?దీన్ని చైనీస్ క్యాబేజ్ అని పిలుస్తారు. బోక్ చోయ్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ పుష్కలం. మీ డైట్ లో కొన్ని బోక్ చోయ్ కొమ్మలను తీసుకుంటే, ఇది మంచి రక్త సరఫరాను ప్రోతహించడానికి మరియు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

English summary

30 Best Foods For Bodybuilding

Today, there are many youngsters who want to workout and have that perfect bod! Bodybuilding is a form of exercise which builds your muscles get a toned. When it comes to bodybuilding, there are many foods which you need to consume post workout session, and during the course of your schedule.
Desktop Bottom Promotion