For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన శరీర ఆరోగ్య స్థితిగతులను తెలిపే జుట్టు లక్షణాలు

By Super
|

మనం అందంగా కనబడాలంటే అందుకు ముఖం అందంతో పాటు, జుట్టు మరియు నెయిల్స్ అందంగా ఉండాలి . ఈ రెండు కూడా మన శరీరంల నిరంతరం పెరగుతుంటాయి. కొంతమంది కేశాలు మన శరీరంలో భాగం కాదు అనే అలోచనతో ఉంటారు. మన అందం విషయంలో అందమైన కేశాలు ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? మన అందం విషయంలో జుట్టుకు కూడా అధిక ప్రాధాన్యత ఉంది. మన అందంలో జుట్టు సంరక్షణ చాలా అవసరం. అయితే, మీ గోర్లు వలె, జుటటు కూడా మీ ఆరోగ్య స్థితిగతులను తెలియజేస్తుంది. జుట్టు మరియు ఆరోగ్యం ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంది. జుట్టుకు సంబంధించిన కొన్ని లక్షణాలు లేదా సంకేతాలు మీ ఆరోగ్యం యొక్క స్థితి గతులను తెలియజేస్తుంది .

మీరు మీజుట్టు నిర్మాణంలో గణనీయమైన మార్పులు గమనించినట్లైతే, అది మీకు ఒక క్లూ (సూచిక)వంటంది!మీ జుట్టు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది! దాంతో మీరు మీలో ఏం జరుగుతుంది కనుగొనేందుకు మరియు సరైన జాగ్రత్తలు మరియు మందులను తీసుకవడాని సహాయపడుతుంది. జుట్టులో మార్పులను గమనించండం చాలా సులభం. ముఖ్యంగా జుట్టుకు మరియు ఆరోగ్యం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండటం వల్ల మీ శరీరంలో ఏం జుగుతోందో గుర్తించడం చాలా సులభం. మీ పొడవైన మరియు నునుపైజ జుట్టు కోల్పోవడం మొదలైతే, అప్పుడు మీరు వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం . జుట్టు కోల్పోవడం వల్ల మీకు ఆరోగ్యానికి సూచిక వంటివి, ఇక్కడ కొన్ని మీకోసం ఇస్తున్నాం..వాటిని పరిశీలించండి.

 5 things your hair can say about your health

1. ఓహ్ నా మందపాటి జట్టు!

అకస్మాత్తుగా మీ పొడవైన, అందమైన మరియు మందపాటి జుట్టు పల్చగా మారడం మీరు గమనించినట్లైతే అందుకు కారణం ఏదో ఉండి ఉండవచ్చు. అది ఒక ఒత్తిడి వల్ల కావచ్చు. అది మీ ఉద్యోగం, లేదా మీ వివాహ జీవితం కావచ్చు. తర్వాత విషయం, మీ జుట్టు కోల్పోవడానికి మరో కారణం హార్మోనుల అసమతుల్యత కావచ్చు, పిసిఓయస్ లేదా హైపోథైరాయిడిజం కావచ్చు. ఒక రోజుకు 40నుండి 60 వరకూ ఉడిపోవడం చాలా సహజం . అయితే మీ జుట్టు ఎక్కువగా కోల్పోతున్నట్లు మీరు గమనించినట్లైతే , అది మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మీ జుట్టు గురించి మరియు ఆరోగ్యం గురించి శ్రద్ద వహించడానికి ఇది ఒక మంచి సమయం అని గుర్తించాలి.


2. వైట్ స్కేల్స్ :

చుండ్రు అనేది చాలా సాధారణం , చాలా మంది దీని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. మీకు చుండ్రు మరియు ఇతర పొంట్టువంటిది తలనుండి రాలడం మొదలవుతే, జాగ్రత్తగా ఉండాలి. మీరు చర్మరోగముతో బాధపడుతుండవచ్చు. మరియు ఇది మీరు క్రోన్ 'స్ వ్యాదితో బాధపడుతున్నట్లు సూచిస్తుంది ఇది జుట్టు, ఆరోగ్యాన్ని సూచిస్తున్నట్లు ఆధారం కాదా?

3. పొడిబారినట్లు భావన:

మీ జుట్టు ఉన్నట్లుండి పొడిబారడం, మీరు క్లోరినేటెడ్ వాటర్ లో ఎక్కువ సమయం స్విమ్మింగ్ చేయడం లేదా మీ జుట్టు డై వేయడం వల్ల ఇలా జరగవచ్చు. జుట్టు మరియు ఆరోగ్యం మీ సంక్షేమాన్ని గురించి చాలా తెలియజేయవచ్చు. మీజుట్టు పొడిబారడానికి మరో కారణం, హైపోథైరాయిడిజం. మీ జుట్టు గత కొన్ని నెలలుగా కోల్పుతున్నట్లైతే , మీరు మీ థైరాయిడ్ లెవల్స్ ను చెక్ చేయించుకోవడం మంచిది. హైపోథైరాయిడిజంకు మరో లక్షణం బరువు పెరుగుట, ఎక్కువ చలిని ఫీలవడం, మొదలగునవి. అందువల్ల మీరు జుట్టు మరియు ఆరోగ్యం గురించి తగినంత శ్రధ్దవహించడం మంచిది.

4. ఒక టెల్ టేల్ థైరాయిడ్ సమస్య

మీరు జుట్టు నిరంతరం బ్రేక్ అవుతున్నట్లైతే అందుకు ప్రోటీనుల లోపం. మీ జుట్టు మరియు ఆరోగ్యం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంది మరియు మీ తీసుకొనే ఆహారంలో సరిపడా ప్రోటీనుల అందకపతే, ఖచ్చితంగా మీ జుట్టు బ్రేక్ అవ్వడం జరగుతుంది. జుట్టు కెరోటిన్, ప్రోటీలను తో తయారుకాబడుతాయి. అందువల్ల మీరు హెయిర్ బ్రేకేజ్ తో బాధపడుతున్నట్లైతే, ఖచ్చితంగా అది థైరాయిడ్ కు సూచికగా సూచనలు ఉన్నాయి.

5. నా జుట్టు గ్రే కలర్ లోకి మారింది!

మీ జుట్టు గ్రే కలర్ లోకి మారే సమస్య ఉన్నప్పుడు మరియు ఈ సమస్య గురించి మీరు భయపడుతుంటే, అప్పుడు మీరు మీ శరీర ఆరోగ్య సమస్య ఏదో ఉన్నట్లు గుర్తించాలి. జుట్టు మరియు ఆరోగ్యం చాలా చెబుతాయి, మరియు గ్రేయింగ్ హెయిర్ మీ ఒత్తిడి స్థాయిలను సూచిస్తుంది . మీ అధిక ఒత్తిడి స్థాయిలు హార్మోనుల అసమతుల్యతకు కారణం కావచ్చు. కాబట్టి, జాగ్రత్తలు తీసుకోండి.

English summary

5 things your hair can say about your health

A perfect beauty is defined through the beauty of hair and nails and like nails, hair is an extension of our body. Some people consider hair as a separate part of the body, but in real it is not!
Story first published: Sunday, November 24, 2013, 10:32 [IST]
Desktop Bottom Promotion