For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెయిన్ స్ట్రోక్ కు 8 ప్రధాన హెచ్చరిక సంకేతాలు !!

By Super
|

మెదడుకు జరిగే రక్త సరఫరాలో అంతరాయం వల్ల మెదడు పనితీరు వేగంగా క్షీణించడాన్ని మెదడుకు వచ్చే పోటుగా పిలుస్తారు.

ఇది ఇష్కీమియా (రక్త ప్రసరణ లోపం) వల్ల కానీ లేదా ఏదైనా అవరోధం ఏర్పడడం వల్ల కానీ లేదా రక్త స్రావం వల్ల గానీ కావచ్చు. అయితే, మెదడు పోటు అంటే ఏమిటో, దాని లక్షణాలు ఎలా ఉంటాయో, వెంటనే తీసుకోవలసిన చర్యలు ఏమిటో, మెదడు పోటు వచ్చిన వారికి సపర్యలు ఎలా చేయాలో ఒక సాధారణ వ్యక్తికీ తెలియదు.

మధుమేహం, రక్త పోటు, పొగ త్రాగడం, ఊబ కాయం, అధిక కొలెస్టరాల్ స్థాయి, గుండె జబ్బులు ఇవన్నీ మెదడు పోటుకు దారితీసే ముఖ్యమైన ప్రమాద కారకాలు.

8 warning signs of brain stroke

మెదడు పోటు కు హెచ్చరిక సంకేతాలు :

1. ముఖం వేలాడి పోవడం : రోగి ముఖం ఒక వైపుకి వేలాడినా, లేదా ఒక వైపు మొద్దుబారి నట్టు అనిపించినా వెంటనే సహాయం కోసం అడగండి. ఇంతలో మీరు రోగిని నవ్వమని అడగండి, నవ్వలేకపోతే అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్ళండి.

2. చేతిలో బలహీనత : పోటు వచ్చిన రోగికి ఒకటి లేదా రెండు చేతుల్లో మొద్దుబారడం లేదా బలహీనంగా అనిపించడం జరుగుతుంది. అతని చేతిని ఎత్తమని చెప్పండి, పోటు రోగిలో చెయ్యి వెంటనే క్రిందికి పడి పోతుంది.

3. మాట్లాడడం లో ఇబ్బంది : పోటు వచ్చినప్పుడు రోగులు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. వారిని చిన్న చిన్న ప్రశ్నలు అడగండి, సాధారణంగా వారు దానికి సరిగ్గా సమాధానం చెప్పలేరు, కానీ వారికి పోటు వచ్చిందో లేదో తెలుసుకోడానికి పదేపదే ప్రశ్నలు అడగండి.

4. సమతౌల్యం సమతౌల్యం కోల్పోవడం : పోటు వచ్చిన రోగి తన శరీరం సమతౌల్యాన్ని కాపాడుకోలేడు, కదలిక లోనూ, సమన్వయ లోపం తోనూ అతను ఇబ్బంది పడవచ్చు.

5. తీవ్రమైన తలనెప్పి : కారణం లేకుండా ఎవరికైనా తీవ్రమైన తలనెప్పి వస్తే, ఇది సాధారణంగా రక్తస్రావం తో కూడిన పోటు వస్తుందని తెలియ చేస్తుంది.

ఇతర సంకేతాలు :

6. స్వల్పకాల జ్ఞాపక శక్తి తగ్గడం : జ్ఞాపక శక్తి తగ్గడం నుంచి కూడా బాధ పడవచ్చు. కొద్ది కాలంలోనే అతనికి ఏమీ గుర్తు ఉండకపోవచ్చు.

7. కళ్ళుకళ్ళు బైర్లు కమ్మడం లేదా చూపు తగ్గడం : హటాత్తుగా కళ్ళు బైర్లు కమ్మడం లేదా చూపులో ఇబ్బందులు కూడా మెదడు పోటుకు సంకేతాలే.

8. కళ్ళు తిరగడం / అసమతౌల్యం : మెదడు పోటు సమతౌల్యం కోల్పోయేలా చేస్తుంది. వాళ్ళు కారణం లేకుండానే హటాత్తుగా సమతౌల్యం కోల్పోవచ్చు.

English summary

8 warning signs of brain stroke

This could be either due to ischemia (lack of blood flow) due to 
 blockage or due to hemorrhage. However, an ordinary person is not aware 
 of what stroke is, what it's manifestations are, what the immediate 
 course of action should be and how stroke patients should be rehabilitated.
Story first published: Friday, November 1, 2013, 15:13 [IST]
Desktop Bottom Promotion