For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుఖంగా నిద్రపోతే అందం... ఆరోగ్యం రెండూ మీ సొంతమే

|

సాధారణంగా సుఖవంతమైన నిద్ర మనిషికి ఆరోగ్యంతోబాటు అందాన్నికూడా పెంచుతుందని కొంతమందికి మాత్రమే తెలుసు. ఇది అక్షరాల నిజం. మంచి నిద్ర ఎటువంటి అంతరాయం లేకుండా నిద్రపోగలిగినప్పుడు, మితంగా నిద్రపోయినప్పుడు అది సాధ్యం అవుతుంది. పగలంతా పని ఒత్తిడి వల్ల అలసిపోయి ఇంటికి చేరిన తర్వాత నిద్రకుపక్రమించడానికి శరీరం ప్రాకులాడుతుంది. గాఢమైన నిద్రలోకి జారుకుంటే మన ముఖంపై వచ్చే ఆ కళే వేరు.

ఈ రోజుల్లో మనిషి యాంత్రికమైన జీవితానికి అలవాటుపడి ఉదయం త్వరగా ఇంటినుండి బయలుదేరి రాత్రి పొద్దు పోయాకే ఇంటికి చేరుకునే స్థితికి వచ్చాడు. దాంతో నిద్రకు దూరమవుతున్నాడు. ఇంటికి రాగానే పడకవైపు నడక సాగిస్తున్నాడు. కొన్నిసందర్భాలలో పడుకున్నాకూడా నిద్ర సక్రమంగా రావట్లేదు. అందువల్ల రాత్రంతా జాగరణతోనే గడపాల్సిన పరిస్థితి ఎదురౌతోంది. ఈ సమస్య కేవలం ఏ ఒక్కరిదో కాదు. భారతదేశంలో 46 శాతం ప్రజలు నిద్రలేమితో బాధపడుతున్నారని ప్రాథమిక సర్వేలు తెలుపుతున్నాయి.

A good Sleep Can make You look Younger and Healthier

కొన్ని ఆహారపదార్థాలు తీసుకుంటే వాటివలన నిద్ర ముంచుకువస్తుంది. అదే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే నిద్రరాదు. వీటిని "స్లీపర్స్", "వేకర్స్" అని వైద్యులు నామకరణం చేశారు.

రాత్రులు ఎక్కువసేపు పని చేసేవారు వేకర్స్‌కు సంబంధించిన పదార్థాలను సేవించడంవల్లనే నిద్ర పోగొట్టుకుని పని చేస్తుంటారు. అవేంటో తెలుసుకుందాం.

ఒకవేళ మనిషి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు నిద్రపోతే పగలంతా హాయిగా పనిచేసుకుపోతాడు. బహుశా మనకు నిద్ర సరిపోకపోతే పగలంతా అలసటతో జబ్బుపడ్డవానిలా గడపడం తరచూ చూస్తుంటాం. మనం తీసుకునే ఆహారంపైనే మన నిద్ర ఆధారపడివుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

స్లీపర్స్ : కొన్ని ఆహారపదార్థాలను తీసుకుంటే మనకు నిద్రముంచుకువస్తుంది. వీటిని "స్లీపర్స్" అని అంటారు. ఆ ఆహార పదార్థాలు.. పన్నీర్, వెన్న, చేపలు, రొయ్యలు, పీతలు, పప్పుదినుసులు మొదలైనవి. వీటిని ఆహారంగా తీసుకుంటే నిద్రముంచుకొస్తుంది.

వేకర్స్ : కొన్ని ఆహారపదార్థాలు తీసుకుంటే నిద్ర దరిచేరదు, దీంతో మనిషి మేల్కొని పనిచేయడానికి ఉపక్రమిస్తాడు. ఆ ఆహారపదార్థాలనే "వేకర్స్" అని అంటారు. సహజంగా రాత్రిపూట మేల్కొని పని చేసేవారు టీ, కాఫీ, చాకొలేట్, కోలా, స్నాక్స్, ఇంకా చక్కెర అధిక శాతంవున్న పదార్థాలను తీసుకుంటే నిద్ర దరిచేరదు.

ట్రిప్టోఫేన్ అనేది ఒక అమినో ఆమ్లం. ఇది నిద్రకుపక్రమించే "మెలాటోనిన్‌"ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనకు నిద్ర ముంచుకువస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో "స్లీపర్స్‌"కు సంబంధించిన పదార్థాలను తీసుకుంటే నిద్ర త్వరగా వస్తుంది. దాంతో నిద్రలేమినుండి మనలను కాపాడుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. కాబట్టి సుఖవంతమైన నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో మీరూ తెలుసుకోండి.

English summary

A good Sleep Can make You look Younger and Healthier | సుఖంగా నిద్రపోవాలనుకుంటున్నారా...!?

Here’s what happens when you get enough sleep: everything improves. Your skin becomes firmer and better hydrated, so it has a youthful glow. Sleep enhances memory, so your mind stays quick and agile, and it reduces inflammation in the body, helping to fight age-accelerating conditions such as wrinkles, heart disease, diabetes, and arthritis.
Desktop Bottom Promotion