For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ బీట్ రూట్ లోని టాప్ 15 హెల్త్ బెనిపిట్స్

|

రెడ్ బ్లడ్ బీట్ రూట్ కి ఇది ఒక మంచి సీజన్. బీట్ రూట్ ను చాలా తక్కువగా వినియోగిస్తారు. కారణం దాని ఆకారం, రంగు రుచి. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్ ఇది. మనకు సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్‌రూట్‌ ఒకటి. శక్తినిచ్చే శాకాహారదుంపల్లో బీట్‌రూట్‌ది మొదటి స్థానం.. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీట్‌ రూట్‌ లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌ లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.

బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. క్రీడాకారులు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్‌ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు. ఓ తాజా పరిశోధన ప్రకారం రోజుకి 400మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది. అంతే కాదు బీట్ రూట్ లోని పుష్కలమైన ఐరన్, వ్యాధినిరోధకతకు పెంచుతుంది, మరియు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరడాతుంది. బీట్ రూట్ జీరో ట్రాన్స్ ఫ్యాట్ మరియు సాచురేటెడ్స్ అస్సలు లేని ఈ దుంప ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మరియు డైటర్స్ కోసం ఇది ఒక ఉత్తం వెజిటేబుల్. అలాగే షుగర్ పేషంట్స్ కు తీపిమీద కోరికలను కంట్రోల్ చేసి ఒక ప్రత్యామ్నాయ ఆహారం ఇది. ఇది మీ కడుపును నింపడంతో పాటు, స్వీట్ తీనాలనే కోరికిన సాటిస్ఫై చేస్తుంది.

సౌందర్యానికి రూట్‌ విటమిన్‌ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను అంధించే బీట్ రూట్ లో మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలను క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి...

అనీమియా:

అనీమియా:

బీట్ రూట్ లో ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది అనీమియా పేషంట్స్ కు చాలా మేలు చేస్తుంది. రక్తహీనతకు బీట్‌రూట్ మంచిది. ఇందులోని పోషకాలు ఎర్రరక్త కణాలను వృద్ధి చేసి శరీరంలో రక్త శాతాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయి.

బ్లడ్ కౌంట్ పెంచుతుంది:

బ్లడ్ కౌంట్ పెంచుతుంది:

మహిళలకు బీట్ రూట్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం. బీటర్ రూట్ లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు మహిళల శరీరంకు అవసరం అయ్యే అన్ని రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రుతుసమస్యలతో బాధపడే మహిళలకు బీట్ రూట్ చక్కటి పరిష్కారం.

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది:

బీట్ రూట్ లో ఉండే సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తపోటుకు చెక్ పెట్టాలంటే రోజూ ఓ గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తీసుకోండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హైబీపీ గలవారు బీట్‌రూట్ జ్యూస్ సేవిస్తే వెంటనే నాలుగు నుంచి ఐదు పాయింట్ల వరకు రక్తపోటు తగ్గుతుందని ఆస్ట్రేలియన్ అధ్యయనంలో తేలింది. బీట్‌రూట్‌లో విటమిన్ సి, విటమిన్ కె, పీచు పదార్థాలుండటంతో పాటు నైట్రేట్ శాతం కూడా అధికంగా ఉండటంతో హైబీపి నియంత్రిస్తుంది.

వీర్యవృద్దికి సహాయపడుతుంది:

వీర్యవృద్దికి సహాయపడుతుంది:

వీర్యావర్తక మందుగా దీన్ని రోమన్స్ కాలం నుండి ఉపయోగిస్తున్నారు . ఇందులో బోరాన్ అధికంగా ఉండి, సెక్స్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది.

శరీరాన్నిశుభ్రం చేస్తుంది:

శరీరాన్నిశుభ్రం చేస్తుంది:

బీట్ రూట్ యొక్క ఒక ఉత్తమ ఆరోగ్యప్రయోజనం, శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా కాలేయం మరియు కోలన్ రెగ్యులర్ గా క్లీన్ చేయడానికి సహాయపడుతుంది మరియు రక్తాన్ని శుధ్ది చేస్తుంది.

మలబద్దకం:

మలబద్దకం:

బీట్‌రూట్‌లో విటమిన్ ‘ఎ' ‘బి' ‘సి' ఇంకా కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, బీటా కెరొటిన్, ఫోలిక్ ఆమ్లం, పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. బీట్‌రూట్‌లోని పీచు పదార్థాలు రక్తకణాలపై ఉండే అధిక కొవ్వును కరిగించి, మలబద్ధకం సమస్యను అదుపులోకి తీసుకువస్తాయి.

స్కిన్ రాషెస్:

స్కిన్ రాషెస్:

చర్మదద్దుర్లు, రాషెస్ మరియు డార్క్ స్పాట్స్ తో బాదపడుతున్నట్లైతే, బీట్ రూట్ ను తినడం ఉత్తమం. ఇది రక్తాన్ని శుధ్దిచేస్తుంది మరియు చర్మం సహజంగా కాంతివంతంగా మారడానికి సహాయపడుతుంది.

గుండెకు :

గుండెకు :

అధిక రక్తపోటుతో బాధపడుతుంటే అయితే బీట్‌రూట్‌ రసాన్ని ఒక గ్లాస్ రోజు తాగండి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీట్‌రూట్‌లో ఉండే ‘బిటైన్' అనే పదార్థం, శరీరంలో పేరుకుపోయే చెడు కొవ్వును కరిగించి, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

క్యాన్సర్ నిరోధిస్తుంది:

క్యాన్సర్ నిరోధిస్తుంది:

రోజూ ఒక కప్పు బీట్‌రూట్‌ రసం తాగితే మంచి ఆరోగ్యంతో ఉంటారు. బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ పుష్కలంగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం కూడా ఉంది. చర్మం, ఊపిరితిత్తులకు సంబంధించిన కేన్సర్‌లకు మూలకారణమైన నైట్రో సమైన్లను, బీట్‌రూట్‌లో ఉండే పోషకాలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.

మధుమేహగ్రస్తులకు తీపి తినాలనే కోరిక తగ్గిస్తుంది:

మధుమేహగ్రస్తులకు తీపి తినాలనే కోరిక తగ్గిస్తుంది:

ఇది మరోగ ఆరోగ్యకరమైన ప్రయోజనం ఇందులో ప్యాట్ లేకుండుట. ఇందులో జీర్ స్యాచురేటెడ్ ఫ్యాట్స్ ను కలిగి ఉంటి. ఇందులో చాలా తక్కు స్తాయిలో ఫ్యాట్స్ కలిగి ఉంటడం వల్ల స్వీట్స్ తినాలనే ఆలోచనలను తగ్గిస్తుంది. ఎవరైనీ డైయట్ పాటిస్తున్నట్లైతే బీట్ రూట్ తీసుకోవడం వల్ల స్వీట్ తీసుకొనే అవకాశం రాదు.

శక్తినివ్వడానికి బూస్ట్ వంటిది:

శక్తినివ్వడానికి బూస్ట్ వంటిది:

ఆరోగ్యంగా గడపడానికి శక్తిచాలా అవసరం. అటువంటి శక్తిని అందించడంలో బీట్ రూట్ బాగా సహాయపడుతుంది. ఇందులోని కార్బోహైడ్రేట్స్. మీకు లేజీగా, బద్దకస్తంగా అనిపిస్తుంటే...జస్ట్ బీట్ రూట్ చిన్న చిన్న స్లైస్ గా కట్ చేసి తినడమే. దాంతో తక్షణ శక్తిని పొందగలరు.

గర్భిణీలకు అవసరం అయ్యే ఫోలిక్ ఆసిడ్:

గర్భిణీలకు అవసరం అయ్యే ఫోలిక్ ఆసిడ్:

మహిళలకు ఫోలిక్ యాసిడ్ ఆవస్యకత చాలా ఉంది. ఎందుకంటే వారిలో ఫెర్టిలిటీని పెంపొదించుటలో అందుకు కావల్సిన సప్లిమెంట్స్ ను ఇది పుష్కలంగా అందిస్తుంది. ఫోలిక్ ఆసిడ్ కోసం పిల్స్ తీసుకోవడం కంటే నేచురల్ గా దొరికే ఈ బీట్ రూట్ ను తీసుకొండి. ఆరోగ్యంగా ఉండండి.

న్యూట్రీషియన్స్:

న్యూట్రీషియన్స్:

తల్లిదండ్రులు పిల్లలకు సరైన న్యూట్రిషియన్ ఫుడ్ ను అందించలేదని బాధపడుతూ ఉంటారు. అటువంటప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్ లో ఆహారంతో పాటు ఇటువంటి డార్క్ రెడ్ వెజిటేబుల్స్ ను చేర్చడం వల్ల వారి తగినంత శక్తి అందించి, మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇంకా ఇందులో విటమిన ఎ మరియు విటమిన్ సి, బీటైన్, క్యాల్షియం, మినిరల్స్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి బాగా సహయపడుతాయి.

డైటర్స్ కోసం:

డైటర్స్ కోసం:

నిత్యం వ్యాయామం చేసేవారు, అధికంగా శారీరక శ్రమ చేసేవారు ఉదయానే్న పరగడుపున ఒక గ్లాసు బీట్‌రూట్ రసం తీసుకుంటే మంచిది. శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్ సి, ఇనుము లభిస్తాయి.

స్ట్రెస్(ఒత్తిడి)తగ్గిస్తుంది:

స్ట్రెస్(ఒత్తిడి)తగ్గిస్తుంది:

బీట్‌రూట్‌తో అధిక వత్తిడిని దూరం చేయవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఎక్కువగా పని చేస్తూ అధిక వత్తిడికి గురైనవారు రోజూ రెండు పూటలా బీట్‌రూట్ రసం తాగితే ఉపశమనం పొందగలుగుతారు.

డైటర్స్ కోసం:

డైటర్స్ కోసం:

నిత్యం వ్యాయామం చేసేవారు, అధికంగా శారీరక శ్రమ చేసేవారు ఉదయానే్న పరగడుపున ఒక గ్లాసు బీట్‌రూట్ రసం తీసుకుంటే మంచిది. శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్ సి, ఇనుము లభిస్తాయి.

English summary

Beetroot Health Benefits To Know!

It is the season of the red blood beetroot. Often beets are considered in low strata due to its appearance and taste. However, beetroot is one of the vegetables that is loaded with numerous health benefits. From increasing blood count to proper skin care, beetroot can make you enjoy its benefits on health.
Story first published: Thursday, December 12, 2013, 15:25 [IST]
Desktop Bottom Promotion