For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోరువెచ్చని నీళ్ళు-తేనె మిశ్రమతో ఆరోగ్యప్రయోజనాలు

|

సాధారణంగా తేనెను గొప్ప ఔషధగుణగణాలున్నదిగా చెబుతుంటారు. అయితే ఈ తేనెకు గోరువెచ్చని నీరుకూడా చేర్చితే మరిన్ని ఆశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే చాలా మంది ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళుకు 1 లేదా 2 చెంచా తేనె మిక్స్ చేసి తీసుకుంటుంటారు. ఇది బహు ప్రయోజనాలును అంధిస్తుంది. తేనె -గోరువెచ్చని నీటితో ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనం బరువు తగ్గిస్తుంది. బరువు తగ్గించుకోవడానికి గోరువెచ్చని నీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది .

సాధారణంగా, ఈ తేనె, గోరువెచ్చని నీటికి కొద్దిగా నిమ్మరసం కూడా చేర్చుతుంటారు. నిమ్మలోని సిట్రస్ ఆసిడ్స్ కూడా బరువు తగ్గించడంలో, మీ శరీరానికి ఎనర్జీ అంధించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఈ మూడింటి మిశ్రమంతో రోజూ ఉదయం పరగడపున తీసుకుంటే చాలా మంచిది. తేనె, గోరువెచ్చని నీళ్లు మిశ్రమం బరువు తగ్గించడంతో పాటు మరికొన్ని ఇతర ఆరోగ్యప్రయోజనాలను కూడ కలిగిస్తుంది. ఉదా: మీరు గొంతునొప్పితో బాధపడుతుంటే, తేనె జులుబు ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. గోరువెచ్చని నీరు మీ గొంతు నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవే కాకుండా, తేనె కలిపిన గోరువెచ్చని నీటితో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి . మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. చర్మానికి ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది మరియు ఆహారం తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. తేనె గోరువెచ్చని నీళ్లతో మరొకొన్ని ఆరోగ్యప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి...

1. జలుబు మరియు దగ్గు:

1. జలుబు మరియు దగ్గు:

తేనె జలుబు ఇన్ఫెక్షన్ ను నయం చేస్తుంది మరియు గోరువెచ్చని నీళ్ళు గొంతునొప్పి తగ్గిస్తుంది. ఇంకా గొంతులో ఎంగిలి మింగడానికి కష్టంగా ఉంటే, గొంతును స్మూత్ చేస్తుంది.

2. బరువు తగ్గుటకు:

2. బరువు తగ్గుటకు:

తేనె మరియు వేడినీళ్ళ మిశ్రమం బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాపడుతుంది. ఇది కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది . ఈరెండిటి మిశ్రమంతో ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు తీసుకుంటే బరువుతగ్గడమే కాదు, పొట్టకూడ కరుగుతుంది.

3. జీర్ణక్రియ:

3. జీర్ణక్రియ:

తేనె మరియు గోరువెచ్చని నీరు మిక్స్ చేసి త్రాగడం వల్ల రెగ్యులర్ బౌల్ మూమెంట్ క్రమంగా ఉండేలా చేస్తుంది . పెద్దప్రేగు శుభ్రం చేస్తుంది. దాంతో స్మూత్ బౌల్ మూమెంట్ ఉంటుంది.

4. ఎనర్జీలెవల్స్ ను పెంచుతుంది:

4. ఎనర్జీలెవల్స్ ను పెంచుతుంది:

తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాసు ప్రతి రోజూ త్రాగడం వల్ల మీలో ఫ్యాట్ చేరదు. అందువల్ల ప్రతి రోజూ ఉదయం దీన్ని తీసుకోండి. దాంతో పాటు ఎనర్జీని పెంచుకోండి.

5. చర్మాన్ని క్లియర్ చేస్తుంది:

5. చర్మాన్ని క్లియర్ చేస్తుంది:

తేనెలో అనేక యాంటీబ్యాక్టీరియ్ లక్షణాలు మరియు యాంటిఫంగల్ గుణాలున్నాయి. అందువల్ల తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాసు త్రాగడం వల్ల మొటిమలు మరియు మచ్చలను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. దాంతో క్లియర్ స్కిన్ మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందుతారు.

6. డిటాక్సిఫై:

6. డిటాక్సిఫై:

ఒక గ్లాసు తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లు ప్రతి రోజూ పరకడుపుతో తీసుకోవడం వల్ల ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది . శరీరంలో మలినాలను తొలగిస్తుంది .

7. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

7. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

ఒక గ్లాసు తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లు ప్రతి రోజూ పరకడుపుతో తీసుకోవడం వల్ల మీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో జలుబు, దగ్గు వంటివి మీ దరిచేకుండా సహాయపడుతుంది. ఎటువంటి వ్యాధులను మీకు సోకకుండా శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

 8. జీవక్రియలను పెంచుతుంది .

8. జీవక్రియలను పెంచుతుంది .

ఒక గ్లాసు తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లు ప్రతి రోజూ పరకడుపుతో తీసుకోవడం వల్ల మీ శరీరం యొక్క జీవక్రియలు వేగవంతం అవుతాయి. త్వరగా జీర్ణం అవ్వడం, రక్తంలో త్వరగా కలవడం, శక్తిని అంధించడం వంటివి జరుగుతాయి. ఫలితంగా మీకు బాగా ఆకలి అవుతుంది, బరువు తగ్గుతారు.

9. మిమ్మల్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది:

9. మిమ్మల్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది:

ఒక గ్లాసు తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లు ప్రతి రోజూ పరకడుపుతో తీసుకోవడం వల్ల రోజంతా మీరు ఉత్సాహంగా మరియు ఎనర్జీ కలిగి మీ చర్మ హైడ్రేషన్ (తేమ)కలిగి ఉంటుంది.

10. జీర్ణశక్తి:

10. జీర్ణశక్తి:

ఒక గ్లాసు తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లు ప్రతి రోజూ పరకడుపుతో తీసుకోవడం వల్ల, తేనెలో ఉండే ఎంజైములు, మీరు తిన్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా సహాయపడుతుంది. మరియు ఏ ఇతర జీర్ణ సమస్యలున్నా కూడా నయం చేస్తుంది అందుకే మీరు భోజనం చేసిన ప్రతి సారి మీరు గోరువెచ్చని తేనె కలిపిన నీరు త్రాగండి.

English summary

Benefits Of Having Honey With Warm Water

Having honey with warm water has many health benefits. Many people have a glass full of honey with warm water early in the morning. This has multiple purposes. You get the health benefits of honey combined with those of warm water.
Story first published: Saturday, December 7, 2013, 13:21 [IST]
Desktop Bottom Promotion