For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామెర్లను త్వరగా నయం చేసే 10 ఉత్తమ ఆహారాలు..!

|

జాండిస్‌ను ఆయుర్వేదంలో ‘కామలావ్యాధి' అని వర్ణించారు. ఇది యకృత్ (లివర్) కు సంబంధించిన వ్యాధి. లివర్‌ని కాలేయం అని కూడా అంటారు. శరీరంలో ఇది ఒక పెద్ద గ్రంథి. జీర్ణక్రియ మొదలుకొని ధాతు పరిణామం, వ్యర్థపదార్థాలను శుద్ధి చేయడం వంటి అత్యంత ముఖ్యమైన శరీర క్రియా కార్యకలాపాలను ఎన్నో ఇది నిర్వర్తిస్తుంటుంది. ఆహారంలోని నూనె (కొవ్వు)పదార్థాలను జీర్ణం చేయడానికి అవసరమయ్యే పిత్తాన్ని (బైల్) ఉత్పత్తి చేసి, పిత్తాశయం (గాల్‌బ్లాడర్)లో నిల్వ ఉంచుతుంది. కామలా వ్యాధిలో యకృత్ కార్యకలాపాలన్నీ దెబ్బతింటాయి. జాండిస్ వ్యాధి స్వభావం మూడురకాలుగా ఉంటుంది. 1. వైరల్ ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ 2. అవరోధజం(అబ్‌స్ట్రక్టివ్) 3. ఎర్తరక్తకణాలు అధిక స్థాయిలో బద్దలవడం (హీమోలైటిక్).

కారణాలు: కలుషితమైన ఆహారపదార్థాల సేవన, కలుషితమైన నీరు, ఇతర పానీయాలు, ఐస్‌క్రీములు, కూల్‌డ్రింకులు మొదలైనవి. వీటిద్వారా హానికరమైన కొన్ని రకాల వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి లివర్‌ని దెబ్బతీస్తాయి. దీనివల్ల లివర్‌కి వాపు కలిగి పరిమాణం పెరుగుతుంది. బైలురూబిన్ స్థాయి రక్తంలో అధికమై క్రమ క్రమంగా కళ్లు, గోళ్లు, మూత్రంలో పసుపు పచ్చని రంగు పెరుగుతుంది. ముందుగా ఆరంభంలో జ్వరం, వాంతి- భ్రాంతి ఉంటాయి. ఆకలి మందగించడమే కాకుండా మనం తినే కొవ్వు పదార్థాల జీర్ణక్రియకు కావలసిన బైల్ పేగులలోకి (అంటే ఆంత్రములు) రాదు. వ్యాధి తీవ్రతను బట్టి పొట్ట ఉబ్బరిస్తుంది. కామెర్ల రోగులలో కళ్లు, చర్మం పచ్చగా కనిపిస్తాయి. చర్మం దురదపెడుతుంది. మలం తెల్లగా, మూత్రం పసుపు రంగులో ఉంటాయి. రక్తస్రావం కనిపించొచ్చు. నూనె పదార్ధాలు గిట్టవు. జ్వరం, వాంతులు, వికారం, పొట్టలో బాధలు చోటుచేసుకోవచ్చు. ఇవన్నీ బాహ్యంగా కనిపించే లక్షణాలే.

జాండిస్ ప్రధాన చికిత్స మెడికేషన్ తర్వాత తీసుకొనే ఆహారం. జాండిస్ ఉన్న వారు సరైన డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా త్వరగా కోలుకొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నూనె పదార్థాలు తీసుకోవడం మానేయాలి. మీ లివర్ ఎప్పుడైతే వీక్ గా ఉంటుందో అప్పుడు ఆయిల్ ఫుడ్స్ జీర్ణం చేసుకొనే శక్తి తగ్గిపోతుంది. అయితే ఫ్యాట్ ఫుడ్స్ ను నివారించడం మాత్రమే కాదు. మంచి ఆహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యమే.

కొన్ని ఆహారాలు కాలేయాన్ని శుభ్ర పరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ డిటాక్స్ ఫుడ్స్ ను లివర్ సెల్స్ లో తిరిగి చైతన్యం నింపి, ఇన్ఫెక్షన్ ను నివారిస్తాయి. జాండిస్ నివారణకు రసాలు చాలా ప్రభావంతమైన ఆహారాలు. చెరకు రసం లివర్ ఆరోగ్యానికి చాలా సహాయకారిగా పనిచేస్తుంది. మరి జాండిస్ నివారణకోసం వ్యక్తిగతంగా చికత్స కోసం రెడీ అవుతున్నారా? కాలేయ సమస్యలను నయం చేయడానికి కొన్ని పేటెంట్ ఆహారాలున్నాయి. అవి కామెర్లను త్వరగా నయం చేస్తాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం..

ఎర్రముల్లంగి రసం:

ఎర్రముల్లంగి రసం:

ఎర్రముల్లంగి రసంలో రక్తంలోని అదనపు రేణువులను బయటకు ప్రవహించేలా చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి ఎర్రముల్లంగి రసంను 2-3గ్లాసులు ప్రతి రోజూ తీసుకోవాలి. ముల్లంగి ఆకుల రసం తాగితే జాండీస్‌ అదుపులోకి వస్తుంది. తాజా ముల్లంగి ఆకులను గ్రైండ్‌ చేసి తాగాలి. మూడు లేదా నాలుగు దఫాలుగా రోజు మొత్తంలో అరలీటరు రసం తాగితే పది రోజుల్లో లివరు పనితీరు పూర్తిగా మెరుగయ్యి జాండీస్‌ తగ్గుతుంది.

ధనియాలు:

ధనియాలు:

ధనియాలను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి, తర్వాత మరుసటి రోజు ఉదయం వీటిని పరగడుపున తాగాలి. ఈ నీరు కాలేయంలోని టాక్సిన్స్ (మలినాలు, వ్యర్థాలను) తొలగించడానికి బాగా సహాయపడుతుంది.

బార్లీ:

బార్లీ:

బార్లీలో మూత్రవిసర్జన ప్రేరక గుణాలు చాలా కలిగి ఉన్నాయి. మరియు ఇది శరీరం నుండి అన్ని అదనపు రేణువులను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది.

టమోటో జ్యూస్:

టమోటో జ్యూస్:

టమోటోలో విటమిన్ సి పుష్కలం. అందువల్లే ఇది లైకోపిన్ లో సమృద్ధిగా, శక్తివంతమైన ప్రతిపక్షకారినిగా ఉంది. ఈ టమోటో జ్యూస్ కాలేయ కణాలను చైతన్యం నింపడానికి సహాయపడుతాయి. ప్రతిరోజు ఒక గాస్లు తాజా టమాటారసం తాగాలి. ఒకగ్లాసు రసంలో చిటికెడు ఉప్పు, మిరయాల పొడి కలిపి పరగడుపున తాగాలి.

ఉసిరి:

ఉసిరి:

ఉసిరిలో కూడా విటిమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు పచ్చి ఉసిరికాయను. లేదా ఎండబెట్టిన ఉసిరి లేదా ఉసిరికాయ జ్యూస్ ను తాగడం వల్ల లివర్ సెల్స్ ను శుభ్రపరచడానికి బాగా సహాయపడుతాయి.

తులసి ఆకులు:

తులసి ఆకులు:

కాలేయ పనితీరు తిరిగి సాధారణ స్థితిలోనికి తీసుకురావడానికి తులసి ఆకులు ఒక సహజ పరిహారంగా ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం 4-5 తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకోవడం చాలా మంచిది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మ ఒక ఉత్తమ డిటాక్సిఫైర్స్ మనకు చాలా విరివిగా అందుబాటులో ఉండే నేచురల్ హోం రెమడీ. ఒక గ్లాసు నీళ్ళలో నిమ్మరసాన్ని పిండి ప్రతి రోజూ ఉదయం తాగడం వల్ల వల్ల మీ సిస్టమ్ ను శుభ్రపరచడానికి బాగా సహాయపడుతుంది. నాలుగు స్పూనుల తాజా నిమ్మరసంలో తగినంత నీటిని కలిపి తాగితే జాండీస్‌ తగ్గుతుంది. నిమ్మరసం లివర్‌ కణాలను రక్షిస్తుంది.

పైనాపిల్:

పైనాపిల్:

పైనాపిల్ మరో డిటాక్స్ ఫ్రూట్ . ఇది లివర్ సెల్స్ ను శుభ్రపరచడానికి బాగా సహాయపడుతుంది. జాండిస్ ను చాలా ప్రభావంతంగా నయం చేయడంలో పైనపిల్ ఒక చక్కటి పరిష్కార మార్గం.

చెరకు రసం:

చెరకు రసం:

జాండిస్ తో బాధపడుతున్న వారికి చెరకు రసం చాలా మంచి హోం రెమడీ. చెరకు రసం చాలా శక్తివంతమైన గుణాలు ఇందులో ఉన్నాయి. ఇది త్వరగా కోలుకోవడానికి సహాయపడుతాయి.

పెరుగు:

పెరుగు:

పెరుగు జీర్ణం అవ్వడానికి చాలా తేలికచేస్తుంది. పెరుగు మీ కడుపు లో మంచి బ్యాక్టీరియా వృద్ధి సహాయపడుతుంది.

English summary

Best Foods To Cure Jaundice Quickly

Jaundice is a disease that affects the liver. The levels of bilirubin in your blood goes up and this state is called jaundice. Treatment of jaundice cannot be done with medications only. The most important aspect of jaundice treatment is the right diet.
Story first published: Thursday, August 1, 2013, 13:02 [IST]
Desktop Bottom Promotion