For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్త శుద్దీకరణకు సహాయపడే 14 సూపర్ ఫుడ్స్

|

రక్త శుద్ది శరీరంలో ఆరోగ్యకరంగా చాలా కీలకమైనది. శరీరం యొక్క మొత్తం పనితీరు రక్తసరఫరా మీద ఆధారపడి ఉంటుంది. శరీరలో టాక్సిన్స్ స్థాయిలు పెరిగినప్పుడు, శరీరంలో అవయావాలు క్రమంగా నాశనం అవుతాయి మరియు శరీరంలో అవయవాలు చురుకుగా పనిచేయడానికి కూడా మొరాయిస్తాయి. అలర్జీ, తక్కువ రోగనిరోధకశక్తి, స్థిరంగా తలనొప్పి, అలసట వంటి మరికొన్ని సాధారణ లక్షణాలు శరీరంలో మలినాలతో మరియు విషాన్ని కలిగి ఉన్నాయని చూపబడుతాయి.

మలినం కలిగిన రక్తం శరీరంలో అనేక ఆరోగ్య మరియు చర్మ సమస్యలకు దారితీస్తుంది. అనేక చర్మ సమస్యలు మొటిమలు, మచ్చలు, డార్క్ నెస్, నిస్తేజమైన చర్మం మరియు పొడి బారిన చర్మం వంటి అనేక చర్మ సమస్యలకు మలినరక్తం కారణం అవుతుంది. అందువల్లే, చాలా రకాల బ్లడ్ ప్యూరిఫికేషన్ సిరఫ్స్(రక్తం శుద్దిచేసి సిరఫ్ లు)మరియు టానిక్స్ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ సిరప్ లు వందకు వందశాతం ఫలితాలను ఇవ్వవు. మొటిమలు, మరియు డార్క్ నెస్ అనేవి ముఖంలో అలాగే నిలిచి ఉంటాయి. దీనికి ప్రధానంగా టానిక్స్ మరియు మందుల అన్నింటికి పనిచేయవు. కాబట్టి, మీరు ఎక్కువగా డిటాక్స్ డైట్ (రక్తం శుద్ది చేసే ఆహారాల)మీద ఎక్కువ శ్రద్ద చూపాలి.

కాలేయం, మూత్రపిండాలు, అలాగే శోషరస నాళాలు ప్రధానంగా రక్త నిర్విషీకరణలను పనిచేస్తుంది మరియు జీవక్రియలను నుండి మలినాలను మరియు విషాన్ని తీసివేయడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయకపోతే, మలినాలతో కూడిన రక్తం శరీరం అంత ప్రసరించి, అది చర్మ సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి శరీరంలో శుద్దమైన రక్తం ప్రవించాలంటే, రక్తం శుద్ది చేసుకోవాలంటే, కొన్ని డిటాక్సిఫైయింగ్ ఫుడ్స్ ఎక్కువగా మీ డైలీ డైట్ లో చేర్చుకోవాలి. దాంతో ఆరోగ్యపరంగా మూత్రపిండాలు మరియు కాలేయం వంటి ఆరోగ్యకరంగా ఉండటానికి సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ది చేసే కొన్ని ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, మచ్చలు లేని, మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

రక్తం శుద్దిచేసే ఆహారాలు:

బ్రొకోలీ:

బ్రొకోలీ:

ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి రక్తాన్ని శుద్ది చేయడంతో పాటు, శరీరంలో ఆరోగ్యానికి హానికలిగించే టాక్సిన్స్ మరియు మలినాలను తొలగిస్తాయి .

క్యాబేజ్:

క్యాబేజ్:

ఒక గ్లాస్ క్యాబేజ్ జ్యూస్ తాగడం వల్ల, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మరియు రక్తాన్ని శుద్ది చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

కాలీఫ్లవర్:

కాలీఫ్లవర్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ క్లోరిఫిల్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది రక్తంలోని మలినాలను తొలగిస్తుంది మరియు రక్తాన్ని శుద్ది చేస్తుంది.

కాకరకాయ:

కాకరకాయ:

చేదుగా ఉండే కాకరకాయలో అనేక ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉంటాయి. చేదుగా ఉండే ఈ కాకరకాయ డయాబెటిస్ తగ్గిస్తుంది మరియు రక్తాన్ని శుద్ది చేస్తుంది.

వేప:

వేప:

రక్తాన్ని శుద్ది చేయడంలో ఇది బాగా తెలిసిన ఒక నేచురల్ హోం రెమడీ. వేపఆకులను ఉడికించి, ఆ నీటితో ప్రతి రోజూ ఉదయం తాగాలి. ఇది చాలా స్ట్రాంగ్ మరియు నేచురల్ బ్లడ్ ఫ్యూరిఫైయర్ గా పనిచేస్తుంది.

వాటర్ క్రెస్:

వాటర్ క్రెస్:

రక్తశుద్ది కోసం వాటర్ క్రెస్ మరియు తేనె మిక్స్ చేసిన వాటర్ క్రెస్ తీసుకోవడం వల్ల రక్తం శుద్ది చేయడం లో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి యాంటీబయాటిక్ మాత్రమే కాదు, నేచురల్ బ్లడ్ ఫ్యూరియర్ హెర్బ్ కూడా. వెల్లుల్లి రక్తంను శుద్ది చేస్తుంది, శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. రక్తంలో కొవ్వును కరిగిస్తుంది.

క్యారెట్స్:

క్యారెట్స్:

చర్మ సౌందర్యానికి అద్భుతంగా సహాయపడే, క్యారెట్ కూడా రక్తం శుద్దిచేసే ఒక ఆహారపదార్థమే. ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం కాలీ కడుపుతో తాగడం వల్ల శరీరం శుభ్రపడుతుంది మరియు శరీలో హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. చర్మానికి హానిచేసే, డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో అద్భుతమైన డిటాక్సిఫైయింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే, ఇది రక్తం శుద్ది చేయడం మాత్రమే కాదు, బ్లడ్ షుగర్ లెవల్స్ ను కూడా నిర్వహిస్తుంది. ముఖ్యంగా నిమ్మరసం బరువును తగ్గిస్తుంది.

పైనాపిల్:

పైనాపిల్:

రక్త శుద్దీకరణ డైట్ లో ముఖ్యంగా చేర్చుకోవల్సిన పండు ఇది. తాజాగా ఉండే పైనాపిల్ ను కట్ చేసి తినడం వల్ల రక్త శుద్దికావడంతో పాటు కిడ్నీలను కూడా శుభ్రపరుస్తుంది.

అల్లం టీ:

అల్లం టీ:

ప్రతి రోజూ ఒక సారైనా అల్లం టీ తాగడం వల్ల రక్తం శుద్ది చేయబడుతుంది.

పార్ల్సే :

పార్ల్సే :

మూత్రపిండాలను శుభ్రపర్చడానికి సహాయపడే పోషకాంశాలను పార్ల్సే అందిస్తుంది. మరియు మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది. రక్తం శుద్ది చేయడంలో రక్తం వడపోత కోసం పార్ల్సే ను విస్తృతంగా ఒక ఔషధంగా ఉపయోగిస్తారు.

ఆమ్లా:

ఆమ్లా:

ఇండియన్ గూస్బెరీగా పిలవబడే ఉసిరికాయలో రక్తం శుద్ది చేయడం మరియు డిటాక్స్ ఫై చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు కనుగొన్నారు . ఇది రక్తంను శుద్దిచేస్తుంది, శరీరంను శుభ్రపరుస్తుంది మరియు రోగనిరోధక శక్తి పెంచుతుంది.

చిరాత:

చిరాత:

సాధారణంగా హిందీలో చిరాత అని పిలుస్తారు, swertia రక్తశుద్ది కోసం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎండిన చిరాత ను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఆ నీటిని ఉదయం పరకడుపు తాగింతే మంచి ఫలితం ఉంటేంది. ఈ నీళ్ళు తాగడానికి చేదుగా అనిపించినా, రక్తం శుద్ది చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

English summary

Blood Purifying Foods For The Skin

Purification of the blood is very crucial for the healthy functioning of the body. The whole body functioning depends on blood supply. When the toxin level increases, the body organs gradually damage and start to under-perform.
Desktop Bottom Promotion